మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా!
తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.
పచ్చి పాలను కాటన్ బాల్‌తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.
చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్‌ని ఉపయోగించాలి.
ఓట్‌మీల్‌లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్‌ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.
ప్రతిరోజూ కలబంద జెల్‌ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది.
టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.
సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.
కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment