
గంగయ్య(ఫైల్)
చంద్రగిరి: వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురం హరిజనవాడకు చెందిన గంగయ్య(62) ఎండ వేడిమిని తట్టుకోలేక మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు లోనై విరోచనాలు, వాం తులతో ఆసుపత్రి పాలయ్యారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు పలుచోట్ల చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి వద్ద ఆయన మరోసారి అస్వస్థతకు గురై మృతి చెందాడన్నారు.