Hail
-
వడదెబ్బ... 108 డిగ్రీల జ్వరం
న్యూఢిల్లీ: ఢిల్లీని చుట్టుముట్టిన వడగాలులు ఒక మధ్యవయస్కుడి ప్రాణం తీశాయి. వడదెబ్బతో ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి వైద్యులు హుతాశులయ్యారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఘటన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు. ‘‘ బిహార్‌లోని దర్భాంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీ ఫారన్‌హీట్‌కు చేరుకోవడం చూసి ఆందోళనకు గురయ్యాం. ఆయనను ఎలాగైనా కాపాడాలని శతథా ప్రయతి్నంచాం. కానీ శరీరంలో అతివేడి కారణంగా ఆయన మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయి. ఇలా వెంటవెంటనే పలు అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన కన్నుమూశారు’ అని డాక్టర్ వివరించారు. ఒకే ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మరణాలు పట్నా: ఉగ్ర ఉష్ణోగ్రత బిహార్‌లోని ఒకే ఆస్పత్రిలో 16 మంది ప్రాణాలను బలితీసుకుంది. గురువారం ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అక్కడ 44, బుధవారం 48.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వేడికి తాళలేక జనం పిట్టల్లా రాలిపోయారు. చాలా మంది అక్కడి జిల్లా ఆస్పత్రిలో చేరగా గురువారం రెండు గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. -
వరికి వడగళ్ల దెబ్బ
డొంకేశ్వర్ (ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్మి, కోటగిరి, పొతంగల్, బోధన్, మోస్రా, చందూర్ మండలాల్లో మొత్తం 2 వేల ఎకరాల వరకు వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కోతకు వచ్చిన వడ్లు పొలాల్లోనే నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి పంటనష్ట లెక్కలను బుధవా రం వెల్లడించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో అరకిలో సైజులో వడగళ్లు పడటంతో మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 15 నిమిషాల్లోపే కళ్ల ముందు పంట నేల రాలిపోయిందని రైతులు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్‌హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్‌బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్‌కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. -
50 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది. రోడ్డెక్కిన రైతులు వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు. -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్‌డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్‌డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
వడగళ్లు.. ఈదురుగాలులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం సైతం అకాల వర్షాలు కురిశాయి. చాలా జిల్లాల్లో వడగళ్ల వాన కురవగా కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం వందనం గ్రామంలో వర్షానికి తెగిపడిన కరెంటు తీగలు తగిలి వృద్ధ దంపతులు మృతిచెందగా పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నేలరాలిన పంటలు.. జనగామ జిల్లా కొడకండ్ల, దేవరుప్పుల, జనగామ, భూపాలపల్లి జిల్లా గణపురం, మొగుళ్లపల్లి, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, తొర్రూరు మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి వరి పైరు నేలకొరగగా, మామిడి, ఇతర తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం మంచినీళ్లబావిలో నిమ్మతోటలు వేర్లతో సహా కూలిపోయాయి. సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌లో వరిపైరు నెలకొరిగింది. తిరుమలగిరి మండలంలో కురిసిన వడగళ్లకు పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న చేలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గద్వాల జిల్లా గట్టు, ధరూర్ మండలంలో వడగండ్ల వానకు వందల ఎకరాల్లో పొగాకు, మామిడి, ఆముదం పంటలు నాశనమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్, కోస్గి మండలంలో మునగ, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు పాన్‌గల్, చిన్నంబావి, ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, రేవల్లి మండలాల్లో కురిసిన గాలివానకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దాదాపు 365 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దంపతుల మృతి ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన దంపతులు బానోతు రాములు (65), రంగమ్మ (62) ప్రతిరోజు మాదిరిగానే మేకలను మేపేందుకు శనివారం ఉదయం పొలాలకు వెళ్లి సాయంత్రం తిరిగొస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కొదుమూరు గ్రామానికి చెందిన రైతు తాళ్లూరి వెంగళరావు సుబాబుల్ తోటలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాటిపై రాములు, రంగమ్మ కా లుపెట్టడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. 4 మేకలు కూడా మృతిచెందాయి. గ్రేటర్లో దంచికొట్టిన వాన.. భాగ్యనగరంలో శనివారం సాయంత్రం సుమా రు అరగంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫి క్ స్తంభించింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా పంజగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, సైదాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్‌లను భారీ వర్షం ముంచెత్తింది. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కుషాయిగూడ, టోలిచౌకీ, బేగంపేట, సికింద్రాబాద్‌ల పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యధికంగా గాజులరామా రంలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురవగా జీడి మెట్లలో 4.2, రామచంద్రాపురంలో 4.0, చర్లపల్లిలో 3.6 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. నేడు అక్కడక్కడా తేలికపాటి వానలు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదు గా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో శనివారం అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
30 కేజీల వడగండ్లు
కర్ణాటకలోని కోలారు జిల్లాలో శనివారం, ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్లు కురిసి పంటలను దెబ్బతీశాయి. 20–30 కేజీల బరువున్న భారీ మంచుగడ్డలు వర్షంతో పాటు పడటంతో పాలీహౌస్‌లు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. వంకాయ, బెండకాయ, క్యాప్సికం, టమాటా వంటి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. –కోలారు -
కొమరోలు, రాచర్లలో వడగండ్ల వాన
కొమరోలు, రాచర్ల మండలాల్లో ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది. గాలి బీభత్సం సృష్టించడంతో పలు చోట్లు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేలకొరిగాయి. భారీ సైజులో వడగండ్లు పడటంతో జనం ఇళ్లలోకి పరిగెత్తారు. -
హైదరాబాద్ లో వడగండ్ల వాన
హైదరాబాద్ నగరాన్ని బుధవారం సాయంత్రం వడగండ్లు, వర్షం అతలాకుతలం చేశాయి. నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 5 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వాన మొదలైంది. అంబర్పేట్, నల్లకుంట ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్, కొత్తపేట, దిల్షుక్నగర్, చైతన్యపురి ప్రాంతాల్లోనూ వడగండ్ల వాన పడింది. రాజేంద్రనగర్‌లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడు కావటంతో చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లోని ఈసేవారోడ్డులో చెట్టు కూలి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడ, దమ్మాయిగూడ, నాగారం, కీసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. -
కరీంనగర్లో భారీ వర్షం
వేసవి తాపంతో విలవిలలాడుతున్న జిల్లా ప్రజలపై వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా...బుధవారం భారీ వర్షం కురిసింది. రామడుగు, గంగాధర ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన పడింది. దౌల్తాబాద్ మండల పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. -
సీలేరులో భారీ వడగండ్ల వాన
విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురుగాలులతో జనం భయాందోళన లకు గురయ్యారు. అంతర్రాష్ట్ర ర హదారిపై దాదాపు గంటన్నరపాటు కురిసిన వానతో చెట్లు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద సైజు వడగండ్లు పడుతుండటంతో జనం బయటకు రావటానికే భయపడిపోయారు. సీలేరులో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. -
కరీంనగర్లో వడగండ్ల వాన
- భారీగా పంట నష్టం తిమ్మాపూర్ (కరీంనగర్) ఉరుములు మెరుపులతో కురిసిన వడగండ్ల కరీంనగర్ రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో పంటనష్టం సంభవించింది. జిల్లాలో పలు చోట్ల వడగండ్లతో కూడిన వాన పడింది. ఈ వానతో చేతికి అందివచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
వడగండ్ల వాన బీభత్సం
ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్‌లో పాతబస్తీ, ఎల్బీనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌తో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. మెదక్ జిల్లా దుబ్బకలో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో రెండ్రోజులు వడగండ్లు
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవహించిన ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో మరో రెండ్రోజులపాటు ఉరుములతో కూడిన వడగండ్ల వాన పడుతుందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా పిడుగులు పడే అవకాశాలున్నాయని, నిమిషానికి 25 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తాయన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అలుముకున్నందున వడగండ్ల వానలు పడతాయని చెప్పారు. 29వ తేదీ వరకు సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా గీసుకొండలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వడగండ్ల బాధితులకు ఇన్పుట్ సబ్సిడీ: పోచారం
నిజామాబాద్: వడగండ్ల వర్షాల వల్ల తెలంగాణ రాష్ర్టంలో పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరంలో పంటలు నష్టపోయిన బాధిత రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమయ్యే రూ.8 కోట్ల 4 లక్షలకు గాను ప్రస్తుతం రూ.4 కోట్లు ప్రభుత్వ ఖాతాలో సిద్ధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా 2009 నుంచి 2013 వరకు కూడా వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులకు రూ.74 కోట్ల నిధులను కూడా వీలైనంత త్వరలో అందజేస్తామన్నారు. పోలవరంపై వెనక్కి తగ్గం: పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి పోచారం అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క సెంటిమీటరు భూమి లేదా ప్రాంతం కాని ఏపీలో కలిపితే ఊరుకోబోమన్నారు. ఏడు మండలాలను సాధించుకోవడానికి తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
బీభత్సం
జిల్లాలో మంగళవారం వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లదెబ్బలకు ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు తండాకు చెందిన భూక్యా సత్తి వడగండ్ల వర్షం నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. గూడూరు మండలం మచ్చర్లకు చెందిన పశవుల కాపరి ఆవుల పద్మ, ఊట్ల గ్రామానికి చెందిన లింగాల కొమ్మమ్మ వ్యవసాయ బావుల వద్ద వడగండ్ల దెబ్బకు మృతిచెందారు. చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చంద్రుగొండ, దీక్షకుంట, సూరిపెల్లి, లింగగిరి తదితర ప్రాంతాల్లో గొర్రెల మందలు, బర్రెలు పెద్దసంఖ్యలో మృత్యువాతపడ్డాయి. వడగండ్లవానతో పదుల సంఖ్యలో గాయపడినవారు స్థానికంగా చికిత్స పొందుతున్నారు. పది మందిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. కాగా, పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మిర్చి, మొక్కజొన్న, వరి పంటలతో పాటు మామిడితోటలు దెబ్బతిన్నాయి. గాలిదుమారం, వడగండ్ల వర్షం బీభత్సంతో 16 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్గడ్, మద్దూరు, చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట, నెక్కొండ, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి, దుగ్గొండి, చెన్నారావుపేట, గూడూరు, సంగెం, కేసముద్రం, ఆత్మకూరు మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్నాయి. సంగెం మండలం లోహిత, రాంచంద్రపురం, తీగరాజుపల్లి, షాపూర్, కొత్తగూడ, కేసముద్రం మండలం కాట్రపల్లి, అర్వపల్లి, ఉప్పరపల్లి, గూడూరు, చెన్నారావుపేట, నెక్కొండలో భారీ వడగండ్లు పడ్డాయి. 21వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పలుచోట్ల పూరిళ్ళు, హోర్డింగ్‌లు పడిపోయాయి. ఇటుకబట్టీలు బాగా దెబ్బతిన్నాయి. ఆకస్మికంగా కురిసిన వడగండ్లతో వ్యవసాయ పనులకు వెళ్లిన వారు పలువురు గాయాలపాలయ్యారు. పెద్ద వడగళ్ళు పడడంతో గూడూరు మండలంలో వణికిపోయారు. మోరంచ వాగు పొంగడంతో ధర్మరావుపేట-కొనాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యావన శాఖ అధికారులు ప్రాథమిక స్థాయి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. -
‘అనంత’ బీభత్సం
అనంతపురం : కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి ప్రకోపించింది. గాలి, వాన బీభత్సం సృష్టించింది. రైతులకు కన్నీరు మిగిల్చింది. కన్నకొడుకులాగా పెంచుకున్న తోటలు క్షణాలలో తుడిచిపెట్టుకుపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. లక్షలు పెట్టుబడి పెట్టిన తోటలు చూస్తుండగానే నాశనం కావడంతో లబోదిబోమన్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. అలా ఇలా కాదు.. ఇదివరకెన్నడూ లేని విధంగా వడగండ్ల వర్షం.. పెనుగాలులతో అతలాకుతలం చేసింది. నగరంలో సాయంత్రం 5 గంటల నుంచి అరగంటపాటు అసలు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. చిరు వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల పైకప్పులు, హోర్డింగులు గాల్లో ఎగిరిపోయాయి. పెలపెలమంటూ పడ్డ వడగండ్ల దెబ్బకు చాలామంది స్వల్పంగా గాయపడ్డారు. కొందరైతే భయంతో వణికిపోయారు. విద్యుత్ స్తంభాలు నేలవాలిపోయి.. కరెంటు తీగలు తెగిపడ్డాయి. భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నగరంతో పాటు అనంతపురం రూరల్, కూడేరు, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో అంధకారం నెలకొంది. ట్రాన్సకోకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. మరమ్మతులు చేపట్టేందుకు కనీసం రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ట్రాన్సకో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, నగర ఏడీఈ లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి సాయంత్రం తన చాంబర్లో కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన చే పట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో నార్పల బస్ పాయింట్ వద్ద షెడ్డు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రమాదవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ ఆపేశారు. బెళుగుప్ప మండలంలో పెనుగాలులు, వడగళ్ల వర్షం కారణంగా భారీ నష్టం సంభవించింది. బెళుగుప్ప, దుద్దేకుంటలో 20 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. వెంకటాద్రిపల్లి, శీర్పి, కోనాపురం, శ్రీరంగాపురం, నక్కలపల్లి గ్రావూల్లో ఉల్లి, మిరప పంటలు 50 ఎకరాల్లో దెబ్బతిన్నారుు. నార్పల మండలంలో పెను గాలులకు 500 ఎకరాల్లో అరటితోటలు నేలకూలాయి. వైఎస్సార్సీపీ కాలనీలో ఎర్నాగప్ప కట్టెల డిపోలో రేకుల షెడ్ కూలింది. పాత రామస్వామి వీధిలో రేకుల షెడ్లు గాలిలో ఎగిరి కిందపడ్డాయి. కూడేరులో వడగండ్ల వర్షానికి శంకర్ నాయక్, నందకుమార్‌లకు చెందిన నర్సరీలు దెబ్బతిన్నాయి. పురాతన వేపచెట్లు విరిగిపడటంతో సుంకులమ్మ దేవాలయం దెబ్బతింది. కూడేరు, రామచంద్రాపురం, అరవకూరు, పి.నారాయణపురంతో పాటు మరికొన్ని గ్రామాల్లో అరటి, మిరప, దోస, కళింగరతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. కూడేరులో కుమ్మర రమేష్‌కు చెందిన సిమెంట్ రేకుల షెడ్ కూలింది. షెడ్లోని 150 వినాయక విగ్రహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఏ.నారాయణపురం, నరసనాయునికుంట, నాగిరెడ్డిపల్లి, కొడిమి, సోములదొడ్డి తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం అకాల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వందల ఎకరాల్లో పండతోటలు నేలమట్టమయ్యాయి. దాదాపు రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లి, వడియంపేట, పొడరాళ్ల, బీకేఎస్ తదితర గ్రామాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతింది. దాదాపు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. పెనుగాలుల బీభత్సానికి అనంతపురంలోని తాజ్‌మహల్ ఎగ్జిబిషన్ చెల్లాచెదురైంది. భారీ సెట్టింగులు ఎగిరిపోయాయి. ఎగ్జిబిషన్ ప్రదేశంలో వడగళ్లు అక్కడక్కడా పడి ఉండటం కనిపించింది. జన సమ్మర్ధనం లేకమునుపే బీభత్సం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. కాకపోతే ఎగ్జిబిషన్లో కోటి రూపాయల మేర నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు.