
డొంకేశ్వర్ (ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వర్మి, కోటగిరి, పొతంగల్, బోధన్, మోస్రా, చందూర్ మండలాల్లో మొత్తం 2 వేల ఎకరాల వరకు వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
కోతకు వచ్చిన వడ్లు పొలాల్లోనే నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి పంటనష్ట లెక్కలను బుధవా రం వెల్లడించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో అరకిలో సైజులో వడగళ్లు పడటంతో మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 15 నిమిషాల్లోపే కళ్ల ముందు పంట నేల రాలిపోయిందని రైతులు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు.