విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురుగాలులతో జనం భయాందోళన లకు గురయ్యారు. అంతర్రాష్ట్ర ర హదారిపై దాదాపు గంటన్నరపాటు కురిసిన వానతో చెట్లు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద సైజు వడగండ్లు పడుతుండటంతో జనం బయటకు రావటానికే భయపడిపోయారు. సీలేరులో ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది.
సీలేరులో భారీ వడగండ్ల వాన
Published Tue, May 3 2016 8:08 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement