ఉరుములు మెరుపులతో కురిసిన వడగండ్ల కరీంనగర్ రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది.
- భారీగా పంట నష్టం
తిమ్మాపూర్ (కరీంనగర్)
ఉరుములు మెరుపులతో కురిసిన వడగండ్ల కరీంనగర్ రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో పంటనష్టం సంభవించింది. జిల్లాలో పలు చోట్ల వడగండ్లతో కూడిన వాన పడింది. ఈ వానతో చేతికి అందివచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.