మరో రెండ్రోజులు వడగండ్లు | Another two days hailstone | Sakshi
Sakshi News home page

మరో రెండ్రోజులు వడగండ్లు

Published Sat, Apr 25 2015 12:39 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

Another two days hailstone

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవహించిన ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో మరో రెండ్రోజులపాటు ఉరుములతో కూడిన వడగండ్ల వాన పడుతుందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా పిడుగులు పడే అవకాశాలున్నాయని, నిమిషానికి 25 కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తాయన్నారు.

శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అలుముకున్నందున వడగండ్ల వానలు పడతాయని చెప్పారు. 29వ తేదీ వరకు సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా గీసుకొండలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement