30 కేజీల వడగండ్లు
కర్ణాటకలోని కోలారు జిల్లాలో శనివారం, ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్లు కురిసి పంటలను దెబ్బతీశాయి. 20–30 కేజీల బరువున్న భారీ మంచుగడ్డలు వర్షంతో పాటు పడటంతో పాలీహౌస్‌లు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. వంకాయ, బెండకాయ, క్యాప్సికం, టమాటా వంటి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. –కోలారు