Kolar
-
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
ఆ సీటుకు కాంగ్రెస్ Vs కాంగ్రెస్?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా కోలార్ సీటు విషయంలో పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కోలార్ సీటును ఆ మాజీ ఎంపీ అల్లుడికి ఇస్తే రాజీనామా చేస్తామంటూ ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని బెదిరించారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి కె. హెచ్.మునియప్ప అల్లుడు చిక్క పెద్దన్నకు లోక్‌సభ ఎన్నికల్లో కోలార్ నుంచి టికెట్ ఇస్తే రాజీనామా చేస్తామంటూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కోలార్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప గెలుపొందారు. ఆయన ఇప్పుడు తన అల్లుడు చిక్కా పెద్దన్నకు ఈ ప్రాంతపు టిక్కెట్ అడుగుతున్నారు. పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యులు, ఒక మంత్రి తదితరులు చిక్కా పెద్దన్నకు టిక్కెట్ ఇస్తే తాము పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. పెద్దన్నకు టికెట్ ఇస్తే షెడ్యూల్డ్ కులాల వామపక్ష వర్గానికి ప్రాతినిధ్యం దక్కుతుందని పార్టీ భావిస్తోంది. అయితే కోలార్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోలార్ కొత్తూర్జి మంజునాథ్, కే. వై. నంజేగౌడ, ఎంసీ శాసనమండలి సభ్యులు అనిల్‌కుమార్, నసీర్ అహ్మద్ తదితరులు ఈ సీటును షెడ్యూల్డ్ కులానికి చెందిన రైట్‌వింగ్ అభ్యర్థికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోతున్నదని సమాచారం. -
Karnataka Assembly Election: ముక్కోణపు పోరులో విజేత ఎవరో ?
సాక్షి, బెంగళూరు: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలోనే కాంగ్రెస్ పార్టీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన స్వాతంత్య్ర సమర యోధుడు పట్టాభిసీతారామన్, దున్నే వాడిదే భూమి నినాదంతో పోరాటానికి ప్రాతినిధ్యం వహించిన పి వెంకటగిరియప్ప ప్రాతినిధ్యం వహించిన కోలారు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గుర్తింపు పొందింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు గట్టి పునాదులు కలిగిన నియోజకవర్గం. ఇంతవరకు జరిగిన 15 శాసనసభ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే. నియోజకవర్గంలో ఇంతవరకు కమలం వికసించలేదు. ప్రస్తుత ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. జేడీఎస్ నుంచి సిఎంఆర్ శ్రీనాథ్, కాంగ్రెస్ నుంచి కొత్తూరు మంజునాథ్, బీజేపీ నుంచి వర్తూరు ప్రకాష్ పోటీ చేస్తున్నారు. వర్తూరు ప్రకాష్ గత మూడు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. కాంగ్రెస్‌లో చేరడానికి విఫల యత్నం చేసిన వర్తూరు ప్రకాష్ చివరికి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. మాజీ సీఎం సిద్దరామయ్య కోలారు నుంచి పోటీ చేయకపోవడంతో ఆ స్థానంలో కాంగ్రెస్ టికెట్‌ను పార్టీ కొత్తూరు మంజునాథ్‌కు ఇచ్చింది. గెలుపోటములపై గంపెడాశాలు ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంది. తమదే విజయని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. జేడీఎస్ ఒక్కలిగ సముదాయాన్ని, పార్టీ ఓట్లను నమ్ముకుంటే బీజేపీ కురుబ సముదాయంతోపాటు సాంప్రదాయ ఓట్లను నమ్ముకుంది. జాతి ఓట్ల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువగా దళిత, మైనారిటీ ఓట్లపై ఆధారపడి ఉన్నారు. నియోజకవర్గంలో దళిత, మైనారిటీ ఓట్లే కీలకం కాగా దళితుల ఓట్లు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్‌లు పంచుకునే అవకాశం ఉంది. ఇక జయాపజయాలను మైనారిటీ ఓట్లే నిర్ణయించనున్నాయి. మొత్తం ఓటర్లు 2,40,000 మంది కాగా పురుషులు 1.19000 మంది, మహిళలు 1.21,000 మంది ఉన్నారు. కులాల వారీగా ఎస్సీలు 70వేలు, మైనారిటీలు 60వేలు, ఒక్కలిగులు 35వేలు, కురుబలు 25వేలు, బ్రాహ్మణ, వైశ్య, లింగాయత ఓటర్లు 15వేల మంది ఉన్నారు. స్టార్ ప్రచారకుల అబ్బరం కోలారు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జేడీఎస్ తన పంచరత్న రథయాత్రను కోలారు జిల్లా నుంచే ప్రారంభించింది. బీజేపీ తరపున దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. -
రాహుల్ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ రేపు కర్ణాటకలో Karnataka Elections పర్యటించనున్నారు. కోలార్(కర్ణాటక)లో ఆదివారం నిర్వహిస్తున్న జై భారత్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ.. ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఎందుకంటే.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇదే కోలార్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. 2019 ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కోలార్‌లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నేరపూరితమైన పరువు నష్టం దావా, ఈ కేసులో దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడడం.. ఇదంతా తెలిసిందే. దీంతో.. ఎంపీ పదవిపై వేటు పడిన అనంతరం అదే కోలార్‌లో ఆయన ప్రసంగిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఆచితూచీ మాట్లాడతారా? లేదంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అక్కడి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారా? అనేది చూడాలి. వాస్తవానికి ఈ ర్యాలీని తొలుత ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, ఎన్నికల సన్నాహాకాలు, అభ్యర్థుల ఎంపికతో పాటు రాహుల్ గాంధీ కోర్టును ఆశ్రయించడం.. తదితర కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్‌కు కోలార్ ఎంతో ముఖ్యమైన స్థానం. ఇక్కడి నుంచి పోటీ చేయాలని(రెండో స్థానంగా) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వరుణ(మైసూర్)స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైంది. అయితే కాంగ్రెస్ మాత్రం కోలార్‌లో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆదివారం ఉదయం బెంగళూరుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ.. నేరుగా కోలార్‌కు వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ జై భారత్ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో కొత్తగా నిర్మించిన ఇందిరా గాంధీ భవన్‌ను ప్రారంభిస్తారు. 750 మంది కూర్చునేలా ఆఫీస్ కమ్ ఆడిటోరియంగా దీనిని నిర్మించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక జనరల్ సెక్రెటరీ ఇంఛార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కర్ణాటక ఎన్నికలు.. మిత్రపక్షం హ్యాండిచ్చిందిగా! -
మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి వివాదంలో చిక్కుకున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంపీని చిక్కుల్లో పడేశాయి. అసలేం జరిగిందంటే.. ఎంపీ మునిస్వామి మహిళా దినోత్సవం రోజు కోలార్ జిల్లాలో ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్లోని దుకాణాలను పరిశీలిస్తున్న ఎంపీ.. ఓ వస్త్ర దుకాణంలోని మహిళా వ్యాపారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళను నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. మీ భర్త బతికే ఉన్నారుగా అని అంటూనే అ అమ్మాయికి బొట్టు ఇవ్వండి అని ఇప్పిస్తాడు. ‘నీ పేరేంటి? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ స్టాల్‌కు వైష్ణవి అని పేరు పెట్టి, బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీకు కామన్ సెన్స్ లేదా? మీ భర్త ఇంకా బతికే ఉన్నారు కదా. ముందు బొట్టు పెట్టుకోండి’ అంటూ దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంపీ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళా దినోత్సవం నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. బీజేపీ దుర్మార్గపు సంస్కృతికి ఈ వీడియో అద్దం పడుతోందని విమర్శించింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పీ చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ భారత్‌ను హిందూత్వ ఇరాన్‌గా మారుస్తుందని మండిపడ్డారు. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? "Wear a Bindi first. Your husband is alive, isn't he. You have no common sense" says this #BJP MP #Muniswamy to a woman vendor.#Karnataka #Kolar #WomensDay pic.twitter.com/YSedSDbZZB— Hate Detector 🔍 (@HateDetectors) March 9, 2023 -
బుద్ధి మారని ఉపాధ్యాయుడు.. వాట్సాప్‌లో హనీమూన్ గురించి విద్యార్థినితో..
సాక్షి, బెంగళూరు: ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి బుద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తరచూ విద్యార్థినుల వద్ద అశ్లీలంగా ప్రవర్తించడం అతనికి అలవాటుగా మారింది. ఉన్నత పాఠశాల విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఇంటి ముఖం పట్టాడు. ఈ ఘటన కోలారు తాలూకాలోని నరసాపురం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. హనీమూన్ గురించి చర్చ విద్యార్థిని మొబైల్‌కు అశ్లీల మెసేజ్‌లు పంపాడని ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్దకు వచ్చి కన్నడ ఉపాధ్యాయుడు సిఎం ప్రకాష్‌ను నిలదీశారు. బీఈఓ ఎదుట ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. వాట్సాప్‌లో హనీమూన్ గురించి తమ కూతురితో చర్చలు చేశాడని వారు ఆరోపించారు. ఈ ఉపాధ్యాయుడు 2010లో కూడా ఇదే పాఠశాలలో ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండు అయ్యాడు. అప్పుడు అక్కడి బదిలీ అయ్యి తిరిగి ఇదే పాఠశాలకు తిరిగి వచ్చాడు. తాజా సంఘటన నేపథ్యంల ఈ టీచర్‌ను బీఈఓ కన్నయ్య సస్పెండు చేశారు. చదవండి: (వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య) -
ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి
సాక్షి, కర్ణాటక: కోలార్ జిల్లా ముల్బాగల్లో దారుణం జరిగింది. ఇద్దరు కుమార్తెలపై తల్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్తతో గొడవలు కారణంగా తన ఇద్దరు పిల్లలకు తల్లి జ్యోతి నిప్పంటించింది. తన ఇద్దరు పిల్లలకు ముందుగా నిప్పంటించి.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఘటన స్థలం నుంచి మండుతున్న వాసనను గమనించిన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ప్రేమపేరుతో టీవీ యాంకర్‌కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్‌కు తీసుకెళ్లి.. -
Bengaluru: రైడ్ ఫర్ ఎ కాజ్! రైడింగ్‌తోనే సేవ.. ఆ ఊరిలో వెలుగులు నింపింది!
కొంతమంది దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేందుకు రాత్రనక పగలనకా ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. వారు అక్కడ నిద్రాహారాలు మాని, కుటుంబ సంతోషాలను త్యాగం చేయబట్టి మనం ఇంత సురక్షితంగా జీవించగలుగుతున్నాము... అని ఎందరికి తెలుసు? ఒకవేళ తెలిసినా ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమైనా చేయగలుగుతున్నామా? అయితే బెంగళూరుకు చెందిన హర్షిణి అలా కాదు... వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఏకంగా ఓ ఎన్జీవోను ఏర్పాటు చేసింది. మహిళా బైక్ రైడర్స్‌తో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తూ సమకూరిన నిధులతో జవాన్ల కుటుంబాల అవసరాలు తీరుస్తోంది. హర్షిణి వెంకటేష్‌కు చిన్నప్పటినుంచి ఇతరులకు సాయం చేయలన్న ఆలోచనలు ఎక్కువ. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీతో బట్టలు, కార్డ్స్ మీద ప్రింట్స్ డిజైన్ చేయడం, పుట్టగొడుగుల పెంపకం వంటివి చేపట్టి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో ఇతరులకు సాయం చేసేది. 1998లో హర్షిణికి పెళ్లి అవ్వడం, వెంటవెంటనే ఇద్దరు కొడుకులు పుట్టడంతో తన సమయం అంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల పెంపకంతో సరిపోయింది. కొంతకాలానికి భర్త ప్రోత్సాహంతో ముంబై వెళ్లి బేకింగ్, చాక్లెట్ తయారీ కోర్సులు చేసింది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా చాక్లెట్, కేక్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో పదికేజీల ఆర్డర్లు ఉండేవి. ఏడాది తరువాత వంద కేజీల ఆర్డర్లు ఇచ్చే స్థాయికి హర్షిణి వ్యాపారం విస్తరించింది. అయితే బేకింగ్ కు కావాల్సిన పదార్థాల నుంచి మార్కెటింగ్, సప్లై వరకు అన్నీ తనే చూసుకోవడం కష్టంగా అనిపించేది. ఇదే సమయంలో ముంబైలో జరిగిన మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రెండు వేల మందిలో హర్షిణి సెలెక్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలోనే వదిలేసింది. ఇదే సమయంలో అంధ విద్యార్థులు చదివే ఓ స్కూలు గురించి తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి విద్యార్థులతో కొంత సమయం గడపడం, వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తూ సామాజిక సేవను ప్రారంభించింది. రైడింగ్‌తోనే సేవ పెళ్లి అయిన తరువాత బండి నడపాలన్న ఆసక్తితో హర్షిణి టూవీలర్ నడపడం నేర్చుకుంది. 2017లో ఓ మహిళా రైడర్స్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి, రైడింగ్‌ను బాగా సాధన చేసి చీరకట్టులో బైక్ ర్యాలీలో పాల్గొంది. అప్పుడు హర్షిణి రైడ్ చేస్తోన్న ఫోటోతో సహా ఓ వార్తా పత్రిక మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దానికి లభించిన ప్రోత్సాహంతో రైడింగ్‌తోనే సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలనుకుంది. ఇండియన్ ఆర్మీ దేశానికి, సమాజానికి ఎంతో సాయం చేస్తోంది. కానీ మనం ఆర్మీకి తిరిగిచ్చింది చాలా తక్కువే. అందుకే వాళ్ల కుటుంబ సభ్యులకు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అమర జవాన్ల్ల కుటుంబాల్లో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్సకు డబ్బులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, వారికోసం విరాళాలు సేకరించేందుకు ‘షీ ఫర్ సొసైటీ, రైడ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా మహిళా బైకర్స్ అందర్ని ఒకచోటకు చేర్చి బైక్ రైడింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్న ఆర్మీ కుటుంబాలకు ఇచ్చింది. ఈవెంట్ విజయవంతమవడంతో తర్వాత కూడా బైక్ రైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చిన విరాళాలతో అవసరం అయిన వారికి సాయం చేయడం కొనసాగించింది. ఊరిలో వెలుగులు నింపింది బెంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలార్ అనే గ్రామానికి ఎలక్ట్రిసిటీ సదుపాయం సరిగా లేదు. ఐదువేలమంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఆర్మీలో పనిచేసిన నాలుగు తరాలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. అయినా వీళ్లకి సరైన విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేదు. వీరికి విద్యుత్‌ను అందించేందుకు మూడువందల మంది మహిళా రైడర్స్‌తో కలిసి బెంగళూరు నుంచి కోలార్‌కు ర్యాలీ నిర్వహించింది. అందుకు స్పందనగా మాజీ సైనికులు వందమంది కలిసి సోలార్ కిట్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎలక్ట్రిసిటి నిరంతరాయంగా అందుతోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చే రెండు కంప్యూటర్ సెంటర్స్‌ను ఏర్పాటుచేసింది. భవిష్యత్‌లో మరిన్ని నిధులు సేకరించి బెంగళూరులోనేగాక, మైసూర్, థార్వాడ్‌లలో కూడా తన సేవలను విస్తరించనున్నట్లు హర్షిణి చెబుతోంది. చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని.. -
15 కేజీల టమాటా రూ.వెయ్యి..
సాక్షి, కోలారు: జిల్లావ్యాప్తంగా కొన్నిరోజులుగా కురుస్తున్న వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. టమాటకు అతి పెద్ద విపణి అయిన కోలారు ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. 15 కేజీల టమోటా బాక్సు రూ.వెయ్యికి వేలం పాడడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వానల కారణంగా టమాట దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు సరుకు కోసం కోలారు మార్కెట్‌కు వస్తున్నారు. దీంతో టమాట లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల కిందట వరకు టమాట బాక్స్ రూ.250 కంటే తక్కువగానే ఉండేది. గిరాకీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక బయట కూరగాయల మార్కెట్లలో కేజీ ధర నాణ్యతను బట్టి రూ.70– 80 వరకూ ఉంటోంది. -
నా చెల్లికి కూడా తాళి కట్టాల్సిందే: సుప్రియ
కోలారు: నాటకీయ పరిణామాల మధ్య అక్కా చెల్లెళ్లను ఒక్కరే పెళ్లాడడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఇటువంటి వింతలు నిజజీవితంలో అరుదుగా జరుగుతుంటాయి. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో ఇది జరిగింది. తన చెల్లిని కూడా వివాహం చేసుకోవాలని అక్క కాబోయే భర్తను పట్టుబట్టి ఒప్పించడం విశేషం. వివరాలు.. తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చెల్లెలు లలిత మూగ–బధిర. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రియ బాధపడేది. పెళ్లిపీటలపై మెలిక ఈ తరుణంలో సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 7వ తేదీన పెళ్లి మండపంలో వరుడు తాళి కట్టబోతుండగా సుప్రియ తన ఆలోచనను చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని మొండికేయడంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా సోషల్ మీడియాలో ఇద్దరు భామల ముద్దుల మొగుడు వైరల్ అవుతున్నాడు. మరోవైపు వధువు లలితకు ఇంకా 18 ఏళ్లు దాటలేదని తెలియడంతో శిశు సంక్షేమ, పోలీసు అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
‘విస్ట్రాన్’లో వేలాది ఐఫోన్లు లూటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నరసాపురాలోని ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్లో అత్యంత విలువైన వేలాది ఐఫోన్లు లూటీకి గురయ్యాయి. ఉద్యోగుల హింసాకాండ వల్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు విస్ట్రాన్ ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విస్ట్రాన్ ప్లాంట్‌లో ఉద్యోగులు శనివారం తీవ్ర బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ప్లాంట్ చాలావరకు ధ్వంసమైంది. విలువైన యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆçహుతయ్యాయి. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు హింసాకాండకు పాల్పడ్డారని విస్ట్రాన్ ప్రతినిధి టీడీ ప్రశాంత్ చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు, కర్ణాటక కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు 149 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విస్ట్రా కంపెనీలో దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం: రాజకీయ ప్రకంపనలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక కోలార్ జిల్లాలోని ఆపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగుల విధ్వంసం ప్రకంపనలు రేపుతోంది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్ పై దాడిచేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (రూ. 440 కోట్లు నష్టం : వేలాది ఐఫోన్లు మాయం) కోలార్ సమీపంలో ఆందోళనకారులపై విస్ట్రాన్ ప్లాంట్ యాజమాన్యం హింసాత్మకంగా దాడి చేయడం దురదృష్టకరమని, చాలా కంపెనీలు తమ పెట్టుబడులను చైనా నుండి దేశానికి తరలిస్తున్న సమయంలో, ఇటువంటి దాడులు రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తాయంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఇది మంచి పరిణామం కాదని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.ఆర్. సుదర్శన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లాంట్ మళ్లీ పని ప్రారంభించే వాతావరణాన్ని సృష్టించేందుకు వీలుగా, యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరగాలని, ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐటీ మంత్రి ప్రియాంక్ ఖార్గే కూడా విస్ట్రాన్ ఫ్యాక్టరీ విధ్వంసం రాష్ట్ర ప్రతిష్టకు భంగకరమని ట్వీట్ చేశారు. తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ ప్లాంట్‌లోని కార్మికులు జీతం, ఓవర్ టైం వేతనాలు చెల్లించడంలో ఆలస్యం జరిగిందనే ఆరోపణలతో ప్లాంట్‌ఫై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన తైవాన్ టెక్దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్ డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసంలో తమకు 437 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తాజాగా ప్రకటించింది. దీనిపై విచారణకు అదనపు ఆపిల్ జట్టు సభ్యులను, ఆడిటర్ల బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపింది. అలాగే వేలకొద్దీ కొత్త మొబైల్ ఫోన్ యూనిట్లు, ల్యాప్‌టాప్‌లు , మానిటర్లు మాయమ్యాయని కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తమను తీవ్ర షాక్‌కు గురిచేసిందని, తమ ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే తమకు ప్రధానమని పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తునకు స్థానిక అధికారులతో సహకరిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (టీఐసీసీ) డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ నేతృత్వంలోని తైవాన్‌కు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పతో శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా విస్ట్రాన్‌కు తమ ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుందని పరిశ్రమల శాఖామంత్రి జగదీష్ శెట్టర్ చెప్పారు. కాగా ఉద్యోగుల నిరసన సంద్భంగా చెలరేగిన హింసను ఖండిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. హింసకు కారణమైన, ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ ఇన్చార్జి సీఎన్ అశ్వత్ నారాయణ్ ప్రకటించారు. దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైందని, కార్మికులకు జీతం చెల్లింపులపై ఫిర్యాదులను కూడా పరిశీలిస్తామన్నారు. విస్ట్రాన్ ప్లాంట్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమనీ, ఆమోదయోగ్యం కాదని మంత్రి వ్యాఖ్యానించారు. It is unfortunate that Wistron manufacturing plant was violently attacked by agitating workers near Kolara. At a time when many companies are shifting base from China to India, such attacks give a bad name for the State. I request CM @BSYBJP to order a probe into this incident. — C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) December 13, 2020 -
నడిరోడ్డుపై యువతి కిడ్నాప్
సాక్షి, కోలారు(కర్ణాటక): పట్టపగలే కారులో యువతిని కిడ్నాప్ చేసుకుని వెళ్లిన ఘటన గురువారం నగరం నడి బొడ్డులో చేసుకుంది. కిడ్నాప్ దృశ్యం రోడ్డు పక్కనే ఉన్న ఓ దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైంది. కిడ్నాప్ దృశ్యం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నగరంలోని ఎంబి రోడ్డులో ఇద్దరు యువతులు నడుచుకుని వెళుతున్నారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం ఇదే సమయంలో ఎదురుగా ఇన్నోవా కారులో వచ్చిన కోలారు నగరంలోని దేవాంగపేటకు చెందిన శివు (23) యువతి(21)ని కారులో కిడ్నాప్ చేసుకుని వెళ్లాడు. సోదరి కిడ్నాప్‌ను అడ్డుకోవాలని ఆమె సోదరుడు ప్రయత్నించినా ఫలించలేదు. తమ ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదనే కోపంతో శివు ఈ కిడ్నాప్‌కి పాల్పడినట్లు భావిస్తున్నారు. యువతి సోదరి గల్‌పేట పోలీస్ స్టేషన్లో శివుపై ఫిర్యాదు చేయగా పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిందని, త్వరలోనే తీసుకువస్తామని పోలీసులు అంటున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం
కోలారు : ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సోదరులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. ఇద్దరూ కలిసి బైక్‌పై వెళ్తూ అకాల మరణం పొందారు. దీంతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బంగారుపేట తాలూకా మురగల్ గ్రామానికి చెందిన సోదరులు నూర్‌బాషా (60) జమీల్ పాషా(58)లు శుక్రవారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా తాలూకాలోని దింబ గేట్ వద్ద ఎదురుగా మరో బైక్ వచ్చింది. ఈ క్రమంలో బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో నూర్‌బాషా, జమీల్‌పాషాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఘటనపై కోలారు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘కె.జి.యఫ్’ అసలు కథ ఏంటంటే.. ఆ గనులు ఇప్పుడెక్కడ?
కేజీఎఫ్ అంటే అందరికీ తెలిసిందే.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కోలారు బంగారు గనులు). కర్ణాటక రాష్ట్రంలో ఇవి బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడా ఇక్కడా అని తేడాలేకుండా వీటి గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కన్నడ సినీ పరిశ్రమలో కోలార్ గనుల నేపథ్యంలో తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రమే ఇందుకు కారణం. అయితే సినిమా లైన్‌ను సింగిల్ లైన్లో చెప్పాలంటే.. పెదరికంలో పుట్టిన హీరో.. అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం.. మహారాజులా చనిపోవాలి అనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం.. డబ్బు కోసం ఏపనైనా చేసే ఓ వ్యక్తి కథ. అయితే ఇలాంటి ఓ సాధారణమైన లైన్‌కు కోలార్ గనులను జోడించడంతో.. భారీ స్థాయిలో హైప్ వచ్చి.. ఇండియన్ సినిమాగా రూపొందింది. అయితే సినిమాలో చూపించిన మాదిరి ఇది నిజంగానే జరిగిందా అంటే.. పూర్తిగా చెప్పలేం. సినిమాలో చూపించిన బానిస బతుకులు మాత్రం కల్పితమనే తెలుస్తోంది. సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసమే అలాంటి కల్పితాన్ని జోడించారు. కానీ ఈ గనుల పుట్టుక వెనకు చారిత్రక నేపథ్యం మాత్రం చాలా పురాతనమైనది. నిజంగా కోలార్ గనుల్లో అంతటి క్రూరత్వం ప్రదర్శించారా.. కేజీఎఫ్ చిత్రం చూసిన తరువాత సగటు ప్రేక్షకుడికి కలిగే ఆలోచన ఇదే. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నెటిజన్లు యూట్యూబ్, గూగుల్‌లో శోధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో కుప్పలుతెప్పలుగా కేజీఎఫ్పై వీడియోలు ఉన్నాయి. దాదాపు రెండో శతాబ్దపు నాటికే ప్రజలు అక్కడి మట్టిలో బంగారం ఉందని తెలుసుకున్నారు. అయితే అప్పటి కాల పరిస్థితులకనుగుణంగా.. మట్టితో దాన్ని వేరుచేయగా.. చాలా తక్కువ మొత్తంలో బంగారం దొరికేది. అయితే ఇది చోళుల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అటు తర్వాత ఎన్నో రాజవంశాలు(పల్లవులు, చోళులు, హొయసాలులు..) ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. ఇక చివరగా ఇది బ్రిటీష్ వారి కంటపడింది. అప్పట్లో బ్రిటీష్ వారు చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో నివసించేవారు. అయితే అప్పటి లావెల్లె అనే రిటైర్డ్ బ్రిటీష్ అధికారి బెంగళూరులో నివసించేవారు. పుస్తకాలు చదివే అలవాటున్న ఈయనకు ఓరోజు లావెన్ అనే వ్యక్తి కోలార్ గనులపై రాసిన ఓ ఆర్టికల్ కంటపడింది. రెండు సంవత్సరాలపాటు పరిశోధన చేసి 1871లో మైసూర్ రాజుకు కోలార్ ప్రాంతాన్ని లీజుకు ఇవ్వమని ఓ లేఖ రాశారు. అయితే అందులో బంగారాన్ని వెలికితీయడం కంటే బొగ్గును వెలికితీయడమే లాభాదాయకమని కావాలంటే బొగ్గును తీసుకోడానికి లీజుకు ఇస్తానని మహారాజు అన్నాడు. కానీ అతను బంగారాన్నే వెలికితీయడం పనిగా పెట్టుకున్నాడు. కానీ అదంతా నష్టాలతో నడిచేది. బంగారం వెలికితీత వల్ల వచ్చే ఆదాయం కంటే కార్మికులకు చెల్లించే వేతనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక నష్టాలతో నడుపలేమని తెలిసిన అతను ఓ కంపెనీకి అమ్మేశాడు. అయితే ఈ కంపెనీ మాత్రం సాంకేతికతకు ఉపయోగించడం ప్రారంభించింది. పెద్ద పెద్ద యంత్రాలతో పనులు ప్రారంభించారు. దీంతో వెలికితీతకు తక్కువ మొత్తంలో ఖర్చు కాగ, ఎక్కువ లాభాలు వచ్చాయి. అక్కడికి ఎంతోమంది బ్రిటీష్ అధికారులు వచ్చి స్థిరపడిపోయారు. అక్కడ కేజీఎఫ్ అనే టౌన్షిప్ కూడా ఏర్పడింది. అయితే నిరంతరం విద్యుత్ దీపాల వెలుగులో ఉండే బ్రిటీష్ వారికి అక్కడ ఉండటం, పనిచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ విద్యుత్ ప్రసారాన్ని ప్రారంభించాలనుకున్నారు. కోలార్‌కు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరి నదిపైన హైడ్రోఎలక్ట్రిక్ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. దాదాపు 150కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. అప్పటికి(1901-02) అదే అతిపెద్ద లైన్. అయితే ఆసియాలో అప్పటికీ రెండే దేశాల్లో విద్యుత్ ఉండేది. జపాన్‌లో ఉండగా.. భారత్‌లో కోలార్ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే అప్పటికీ బంగారానికి ఉన్న విలువ అలాంటింది. అయితే కాలక్రమంలో కోలార్‌లో నిల్వలు తగ్గడంతో దాని ప్రాబల్యం తగ్గిపోయింది. అయితే నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రపంచబ్యాంకును అప్పు అడగ్గా.. మీ దగ్గర సెక్యూరిటీగా ఏముందని ప్రశ్నించారట. ‘మా దగ్గర అతివిలువైన సంపద ఉంది. అదే కేజీఎఫ్’ అని చెప్పి.. కేజీఎఫ్‌ను సెక్యూరిటీగా చూపి అప్పు తెచ్చారట. అప్పట్లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 95శాతం కేజీఎఫ్ నుంచే ఉత్పత్తి అయ్యేదట. కానీ రానురాను అది పూర్తిగా తగ్గిపోయి 0.7శాతానికి పడిపోవడంతో 2001లో భారత ప్రభుత్వం గనుల తవ్వకాన్ని ఆపేసింది. ఇదీ కేజీఎఫ్ కథ. సినిమాలో కల్పితాలు చొప్పించి కోలార్ నేపథ్యంలో సినిమా తీయడం.. అది సెన్సేషన్ సృష్టించడంతో కోలార్ చరిత్రపై అందరి దృష్టిపడింది. మీరు కూడా వీటిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే.. యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు, గూగుల్‌లో బోలెడన్ని పేజీలు దర్శనమిస్తున్నాయి. -
గో హంతకులకు ఉరి శిక్ష విధించాలి
కోలారు: గో హత్యలు చేసే వారికి మరణ దండన వంటి కఠిన శిక్షలు విధించాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అప్పుడే ఆ హత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని గంగాపుర గ్రామంలో అభయ మంగళ గో యాత్ర ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. గోహత్యలు మానవ హత్యలతో సమానమైనవి కావడం వల్ల వీటి హంతకులకు కూడా మరణ శిక్షలు విధించాలని, ఇందుకు తగినట్లు చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు. దీనిపై తాను పార్లమెంట్లో త్వరలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టబోతున్నానని వెల్లడించారు. గో రక్షణ నిధుల కోసం 1 శాతం సెస్సు విధించాలని, గోవులకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. చైనాలో గోవధ వల్ల గో సంతతి తగ్గి నేడు సోయాబీన్స్‌తో తయారు చేసిన పాలను ఉపయోగిస్తున్నారని, ఈ పరిస్థితి మన దేశంలో రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఈ సందర్భంగా గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ప్రధానికి అభయ మంగళ గో యాత్ర కార్యకర్తలు రక్తాక్షరాలతో లేఖలు రాశారు. -
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నేరం అవుతుంది: యడ్యూరప్ప
'సాక్షి, కోలారు : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది నేరం అవుతుంది.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజల విశ్వాసం కోల్పోయారు.. గత ఐదేళ్లుగా ప్రజలను వంచించింది మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. శ్రీనివాసపురం పట్టణంలో పరివర్తన యాత్రలో భాగంగా శనివారం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తినహొళె పథకంలో యంత్ర పరికరాలను, పైప్లైన్లను కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు ప్రజలను మోసం చేసి మభ్యపెడుతున్నారని, ఈ పథకాన్ని పూర్తిగా మూలన పడేశారని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రమేష్‌కుమార్ సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో సౌలభ్యాలు కరవయ్యాయన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో మామిడి అభివృద్ధి మండలికి నిధులు మంజూరు చేస్తే వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలో ఇప్పటి సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు. దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, కర్నాటకలో కూడా పుట్టగతులుండవని యడ్యూరప్ప హెచ్చరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, ఆర్.అశోక్, లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్, కేజీఎఫ్ ఎమ్మెల్యే వై.రామక్క, హెబ్బాళ ఎమ్మెల్యే వై.ఎ.నారాయణస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.పి.వెంకటమునియప్ప, మాజీ ఎమ్మెల్యేలు వై సంపంగి, ఎం.నారాయణస్వామి పాల్గొన్నారు. -
కోతుల మారణ హోమం.. సామూహిక ఖననం
సాక్షి, కోలారు: కోతులను సామూహికంగా చంపేసి మూటల్లో కట్టి శ్రీనివాసపురం తాలూకాలోని యర్రకొండ పర్వత ప్రాంతంలో పడేసిన హృదయ విదాయక ఘటన గురువారం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 30కి పైగా కోతులను చంపేసి మృత దేహాలను సంచులలో నింపి తాలూకాలోని రాయల్పాడు సమీపంలోని యర్రకొండ పర్వత ప్రాంతానికి తీసుకు వచ్చి పడేశారు. ఉదయం స్థానికులు కొండపైకి వెళ్లిన సమయంలో ఈ దారుణ విషయం వెలుగు చూసింది. వెంటనే విషయాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు. కోతులను ఎవరు, ఎందుకు, ఎలా చంపారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. సామూహిక ఖననం : పెద్ద సంఖ్యలో ఉన్న కోతుల మృత దేహాలను స్థానికులు మానవత్వం కనబరచి వాటిని సామూహికంగా ఖననం చేశారు. కోతులను చంపిన వారిని కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
30 కేజీల వడగండ్లు
కర్ణాటకలోని కోలారు జిల్లాలో శనివారం, ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్లు కురిసి పంటలను దెబ్బతీశాయి. 20–30 కేజీల బరువున్న భారీ మంచుగడ్డలు వర్షంతో పాటు పడటంతో పాలీహౌస్‌లు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. వంకాయ, బెండకాయ, క్యాప్సికం, టమాటా వంటి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. –కోలారు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోలారు(కర్ణాటక): స్థానిక జాతీయ రహదారిపై ఉన్న పవన్ కళాశాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన షేక్ అఫీజా (44)ది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఉస్మాన్‌నగర్. రాజంపేటకు చెందిన వీరు చెన్నై నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా తిరగడంతో ఢీకొంది. ఘటనలో షేక్ అఫీజా మరణించగా, భర్త జిలాని తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు తీసుకున్న సీఐ
బెంగళూరు: కర్ణాటకలో మరో పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ పోలీస్ స్టేషన్ లో రాఘవేంద్ర(44) అనే సర్కిల్ ఇన్స్ పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నానేది వెల్లడి కాలేదు. ఆయనకు కూతురు ఉంది. అవినీతి ఆరోపణలతో 2012లో ఆయనపై లోకాయుక్త నిఘా పెట్టింది. కర్ణాటకలో పోలీసు అధికారుల ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కేజే జార్జ్‌తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్ వేధింపులు తట్టుకోలేక గత జూలైలో మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి మూడు రోజుల ముందే డీఎస్పీ కాలాప్ప హందీబాగ్ ఆత్మహత్య చేసుకున్నారు. -
పడగవిప్పిన పాతకక్షలు
కోలారు(బెంగళూరు): పాతకక్షలు పడగవిప్పి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కీలుకోట ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు.. కీలుకోటలోని కుమార్ అనే వ్యక్తి కుమార్తెను ట్యాంకర్ డ్రైవర్ అభి ప్రేమించాడు. విషయం తెలుసుకున్న కుమార్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆరు నెలలక్రితం అభిని విశ్వేశ్వరయ్య స్టేడియం వద్ద హత్య చేశారు. ఘటనలో కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసు అరెస్టు చేశారు. ఏ3 గా నిందితుడిగా ఉన్న కుమార్ ఇటీవలే బెయిల్‌పై విడుదల కాగా మరో ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అభి వర్గానికి చెందిన వారు నగరంలోని కీలుకోట సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కాపుగాసి కుమార్(55)పై కొడవళ్లతో దాడి చేశారు. ఘటనలో కుమార్ కుడిచేయి తెగిపోగా మొడపై తీవ్రంగా గాయమైంది. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆర్ఎల్ జాలప్ప మెడికల్ కళాశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన అనంతరం కుమార్ సంభంధీకులు కీలుకోట వద్ద ఏర్పాటు చేసిన నగర సభ మాజీ సభ్యుడు దివంగత నిరంజన్ శిలాఫలకాన్ని, వార్డుల వివరాలు తెలియజేసే బోర్డును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. జిల్లా ఎస్పీ దివ్య గోపినాథ్, బెంగళూరు ఏఎస్పీ నారాయణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. ఘటనకు సంభందించి నగరసభ కౌన్సిలర్ కాశీ విశ్వనాథ్, గోపాల్, నరసింహమూర్తిలను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన నిందితులున అరెస్ట్ చేయాలని భారతీయ అస్పృశ్యతా నిర్మూలనా పోరాట సమితి కార్యకర్తలు ధర్నా చేశారు. -
జల సాధనే ధ్యేయం
శాశ్వత నీటి పారుదల పోరాట వేదిక ప్రారంభోత్సవంలో సినీనటుడు శివరాజ్‌కుమార్ నీటి పోరాటానికి శాండిల్‌వుడ్ బాసట కోలారుకు కదలి వచ్చిన సినీ ప్రముఖులు కోలారు : ప్రపంచానికి బంగారాన్ని అందించిన కోలారు జిల్లా నేడు తాగు, సాగునీటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఈ ప్రాంతానికి శాశ్వత జలాల సౌలభ్యాలు అందాలంటే నిరంతర పోరాటాలే శరణ్యమని సినీ నటుడు శివరాజ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజలు చేపట్టే ఆందోళనలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. బయలుసీమ జిల్లాలకు శాశ్వత నీటి పారుదల సౌలభ్యాల కోసం ఏర్పాటు చేసిన శాశ్వత నీటిపారుదల పోరాట వేదికను ఆదివారం ఆయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి కోలారులో ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న సినీ ప్రముఖులు శివరాజ్‌కుమార్, యశ్, సాధుకోకిల, పూజాగాంధీ, రాగిణి ద్వివేది, పద్మావాసంతి, చిరంజీవి సర్జా, రాక్‌లైన్ వెంకటేష్, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు థామస్ డిసౌజా, సారా గోవిందు, ఆది లోకేష్, ప్రముఖ నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్, చలన చిత్ర రంగానికి చెందిన కార్మిక, నిర్మాపక, దర్శక సంఘాల ప్రముఖులు ఐషర్ వాహనంలో ర్యాలీగా సర్వజ్ఞ పార్కు వద్ద ఏర్పాటు చేసిన శాశ్విత నీటిపారుదల పోరాట వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శాశ్వత నీటి పారుదల పోరాట వేదికను జ్యోతి వెలిగించి ప్రారంభించిన శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పోరాట వేదికలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నీటి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమించాలన్నారు. ఈ పోరాటంలో తాము కూడా పాలు పంచుకుంటామన్నారు. జిల్లాకు తాగునీటిని అందించే విషయంలో తాము ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమన్నారు. నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పశ్చిమ కనుమల నుంచి 250 నుంచి 300 టీఎంసీల వరకు నీరు సముద్రంలో కలుస్తోందని, అందులో నుంచి 25 టీఎంసీలను బయలు సీమ జిల్లాలకు అందిస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందన్నారు. అనంతరం నటులు యశ్, చిరంజీవి సర్జా, సాధుకోకిల, పూజాగాంధీ, రాగిణి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘటనల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సినీ నటుల రాకతో కోలారు జనసంద్రమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వారికి నీరాజనం పలికారు. -
రాధమ్మ వండిన వంట తినరంట!
బెంగళూరు: ఇప్పటికే వందమంది విద్యార్థులు ఆ ప్రభుత్వ బడి నుంచి వేరే పాఠశాలకు మారారు. కేవలం 18 మంది విద్యార్థులు ఇప్పుడు ఆ బడిలో చదువుతున్నా.. అందులో ఐదుగురే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అందుకు కారణం రాధమ్మ మధ్యాహ్న భోజనాన్ని వండటమే. రాధమ్మ దళిత మహిళ కావడంతో ఆమె వండిన వంటను తినడానికి విద్యార్థులు నిరాకరిస్తున్నారు. ఆమె వండిన మధ్యాహ్న భోజనాన్ని తినలేమంటూ మరో పాఠశాలలో వెళ్లి చేరుతున్నారు. ఇది కర్ణాటక కొలార్ జిల్లాలోని కగ్గనహళ్లి గ్రామంలో మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితి. ఈ అనాగరిక పరిస్థితిపై పాఠశాల కూక్ రాధమ్మ విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. '2014 ఫిబ్రవరిలో నేను పాఠశాలలో చేరిననాటినుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నేను ఇచ్చిన పాలు కూడా విద్యార్థులు తాగరు. నేను వండిన వంటను తినరు. వాళ్ల తల్లిదండ్రులే నా వంట తినొద్దని విద్యార్థులకు నూరిపోస్తున్నారు. ఇంకా నేను వాళ్లకు ఏం చెప్పేది' అంటూ ఆమె బాధపడ్డారు. నిజానికి ఈ పరిస్థితి మార్చడానికి గతంలో జిల్లా అధికారులు ప్రయత్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామవాసులతో సమావేశం నిర్వహించి.. ఇలా చేయకూడదని చెప్పిచూశారు. దీంతోపాటు గత నెలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు పాఠశాలలో సామూహిక భోజనాలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. అయితే రాధమ్మ వండిన వంట తినకపోవడానికి కారణం కులవివక్ష కాదని, ఈ పాఠశాలలో చదివే చాలామంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలే అయినప్పటికీ.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయ కక్షలతోనే వాళ్లు పాఠశాల మారుతున్నారని స్కూల్ ఇన్చార్జి వైఎం వెంకటచలపతి చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరిచాలని, తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని, దాంతోపాటు దళిత మహిళా కూక్‌ను మార్చితేనే.. తమ పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చుతామని స్పష్టం చేస్తున్నారు. -
ఏడాది తర్వాత సొంత గూటికి..
కోలారు (కర్ణాటక): ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ దేశంలోని పలు రాష్ట్రాలను చుట్టి సినిమా ఫక్కీలో సొంత ఇంటికి చేరింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా పెమ్మశెట్టిహళ్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. పెమ్మశెట్టి గ్రామానికి చెందిన సురేష్ భార్య వేదవతి మానసిక రుగ్మతతో బాధపడుతుండగా భర్త సురేష్, సోదరుడు ముళబాగిలోని ఓ దర్గాలో చికిత్స చేయించడానికి తీసుకు వెళ్లారు. అదే రోజు రాత్రి వేదవతి తప్పించుకుపోయింది. నాటి నుంచి భర్త సురేష్ , సోదరుడు వేదవతి కోసం వెదకడం ప్రారంభించారు. మతిస్థిమితం కోల్పోయిన ఆమె పలు రాష్ట్రాల్లో తిరిగి ఎలాగో సమీపంలోని సిర్సా వెళ్లే మార్గాన ఉన్న ఓ మోరి వద్ద ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో ఆమె ధీన పరిస్థితిని గమనించిన సిర్సాలోని బాయికణ్ణయ్య ఆశ్రమ నిర్వాహకుడు గురు దేవేందర్ అశ్రయమిచ్చాడు. దాదాపు నాలుగు నెలలు చికిత్స చేయించి మామూలు మనిషిని చేశారు. కోలుకున్న వేదవతి తన చిరునామాను వారికి తెలియజేసింది. సిర్సా జిల్లా ఎస్పీ అశ్విన్ శన్వి కన్నడిగుడే కావడంతో కోలారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దాంతో రూరల్ పోలీసులు వేదవతి సోదరుడికి ఫోన్‌చేసి సిర్సాలోని ఆశ్రమంలో ఉన్నట్లు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో వెంటనే హర్యానాలోని సిర్సా జిల్లాకు చేరుకున్న వేదవతి సోదరుడు అక్కడి ఎస్పీ సహకారంతో తన వెంట తీసుకువచ్చారు.