సాక్షి, కోలారు: కోతులను సామూహికంగా చంపేసి మూటల్లో కట్టి శ్రీనివాసపురం తాలూకాలోని యర్రకొండ పర్వత ప్రాంతంలో పడేసిన హృదయ విదాయక ఘటన గురువారం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 30కి పైగా కోతులను చంపేసి మృత దేహాలను సంచులలో నింపి తాలూకాలోని రాయల్పాడు సమీపంలోని యర్రకొండ పర్వత ప్రాంతానికి తీసుకు వచ్చి పడేశారు.
ఉదయం స్థానికులు కొండపైకి వెళ్లిన సమయంలో ఈ దారుణ విషయం వెలుగు చూసింది. వెంటనే విషయాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు. కోతులను ఎవరు, ఎందుకు, ఎలా చంపారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
సామూహిక ఖననం : పెద్ద సంఖ్యలో ఉన్న కోతుల మృత దేహాలను స్థానికులు మానవత్వం కనబరచి వాటిని సామూహికంగా ఖననం చేశారు. కోతులను చంపిన వారిని కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment