సాక్షి, కోలారు(కర్ణాటక): పట్టపగలే కారులో యువతిని కిడ్నాప్ చేసుకుని వెళ్లిన ఘటన గురువారం నగరం నడి బొడ్డులో చేసుకుంది. కిడ్నాప్ దృశ్యం రోడ్డు పక్కనే ఉన్న ఓ దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైంది. కిడ్నాప్ దృశ్యం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నగరంలోని ఎంబి రోడ్డులో ఇద్దరు యువతులు నడుచుకుని వెళుతున్నారు.
సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం
ఇదే సమయంలో ఎదురుగా ఇన్నోవా కారులో వచ్చిన కోలారు నగరంలోని దేవాంగపేటకు చెందిన శివు (23) యువతి(21)ని కారులో కిడ్నాప్ చేసుకుని వెళ్లాడు. సోదరి కిడ్నాప్‌ను అడ్డుకోవాలని ఆమె సోదరుడు ప్రయత్నించినా ఫలించలేదు. తమ ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదనే కోపంతో శివు ఈ కిడ్నాప్‌కి పాల్పడినట్లు భావిస్తున్నారు. యువతి సోదరి గల్‌పేట పోలీస్ స్టేషన్‌లో శివుపై ఫిర్యాదు చేయగా పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిందని, త్వరలోనే తీసుకువస్తామని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment