పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు తీసుకున్న సీఐ
బెంగళూరు: కర్ణాటకలో మరో పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ పోలీస్ స్టేషన్ లో రాఘవేంద్ర(44) అనే సర్కిల్ ఇన్స్ పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నానేది వెల్లడి కాలేదు. ఆయనకు కూతురు ఉంది. అవినీతి ఆరోపణలతో 2012లో ఆయనపై లోకాయుక్త నిఘా పెట్టింది.
కర్ణాటకలో పోలీసు అధికారుల ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కేజే జార్జ్తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్ వేధింపులు తట్టుకోలేక గత జూలైలో మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి మూడు రోజుల ముందే డీఎస్పీ కాలాప్ప హందీబాగ్ ఆత్మహత్య చేసుకున్నారు.