shoots himself
-
రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్ రివాల్వర్‌తో సబ్ ఇన్స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్‌ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్‌కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది. చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు తీసుకున్న సీఐ
బెంగళూరు: కర్ణాటకలో మరో పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ పోలీస్ స్టేషన్ లో రాఘవేంద్ర(44) అనే సర్కిల్ ఇన్స్ పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నానేది వెల్లడి కాలేదు. ఆయనకు కూతురు ఉంది. అవినీతి ఆరోపణలతో 2012లో ఆయనపై లోకాయుక్త నిఘా పెట్టింది. కర్ణాటకలో పోలీసు అధికారుల ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కేజే జార్జ్‌తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్ వేధింపులు తట్టుకోలేక గత జూలైలో మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి మూడు రోజుల ముందే డీఎస్పీ కాలాప్ప హందీబాగ్ ఆత్మహత్య చేసుకున్నారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
న్యూయార్క్: ఫేస్బుక్, సెల్ఫీ.. జీవితంలో ఓ భాగమయ్యాయి. ఇవి ఎంత అవసరమో అంతే వరకే ఉపయోగించాలి. వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఫేస్బుక్లో స్నేహితులను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యక్తి దుస్సాహసానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఆస్కార్ ఒటిరో అనే యువ వెటర్నరీ డాక్డర్ బుల్లెట్లు నింపిన తుపాకీ దగ్గరగా పెట్టుకుని ఫొటో దిగాలని సరదాపడ్డాడు. తుపాకీని తలకు దగ్గర పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ (తమను తామే ఫోటొ) తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో తలలోకి బుల్లెట్ తీసుకెళ్లింది. అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఆస్కార్‌కు అందమైన అమ్మాయిలను కొగిలించుకోవడం, మోటార్ బైక్‌లపై విన్యాసాలు చేయడం, వేగంగా వెళ్తున్ కార్ల ముందు ఫొటోలు దిగడం సరదా. ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాడు. ఈ సరదానే అతని ప్రాణం తీసింది. -
కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్