మృతులు నూర్‌బాషా, జమీల్‌పాషా (ఫైల్)
కోలారు : ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సోదరులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. ఇద్దరూ కలిసి బైక్‌పై వెళ్తూ అకాల మరణం పొందారు. దీంతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బంగారుపేట తాలూకా మురగల్ గ్రామానికి చెందిన సోదరులు నూర్‌బాషా (60) జమీల్ పాషా(58)లు శుక్రవారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా తాలూకాలోని దింబ గేట్ వద్ద ఎదురుగా మరో బైక్ వచ్చింది. ఈ క్రమంలో బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో నూర్‌బాషా, జమీల్‌పాషాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఘటనపై కోలారు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment