
ఏక్‌నాథ్ ఖడ్సే
జల్‌గావ్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే అధినాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ‘అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో నా కుమార్తెతో పాటు మరికొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై ఆధారాలు చూపాను. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కోరాను’అని తెలిపారు. ‘పార్టీని వీడి వెళ్లాలనుకోవడం లేదు. పార్టీలో ఇవే రీతిగా అవమానాలు కొనసాగుతుంటే మరో మార్గం ఆలోచిస్తా’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment