![Salman Khan was threatened by Lawrence Bishnoi gang once again](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/5/RERE.jpg.webp?itok=qNVvCJiX)
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్‌లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
షూటింగ్‌లో ఉన్న ఇతర సిబ్బంది అతడిని బంధించారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment