ముంబై: సీనియర్ సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం ముగిశాయి. జాతీయ పతాకం, పూలమాలలతో కప్పిన ఆయన పారి్థవ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు త్రీ గన్ సెల్యూట్ అనంతరం విద్యుత్ దహన వాటికలో దహనం చేశారు.
అనంతరం పూజారులు పూజలు చేశారు. బెనగళ్‌కు కడసారి వీడ్కోలు పలికిన వారిలో భార్య నీరా, కుమార్తె పియాతోపాటు సినీ రంగానికి చెందిన నసీరుద్దీన్ షా, రంజిత్ కపూర్, కుల్‌భూషణ్ కర్బందా, ఇలా అరుణ్, గుల్జార్, జావెద్ అక్తర్, బొమన్ ఇరానీ, కునాల్ కపూర్ ఉన్నారు. ఈ సందర్భంగా నటుడు నసీరుద్దీన్ షా..‘శ్యామ్ సాహబ్, నేను, నా సర్వస్వం మీవే. మీకు రుణపడి ఉన్నాను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను’అంటూ ఉది్వగ్నం చెందారు. సినీ నిర్మాత గోవింద్ నిహలానీ కూడా తనేమీ మాట్లాడలేకపోతున్నానన్నారు. ‘14న 90వ బర్త్‌డేనాడు బెనగళ్ సార్ ఆఫీసుకు వెళ్లి బర్త్‌డే పాట పాడాం.
గతంలో ఎప్పుడూ మేం ఆయనకు పుట్టిన రోజు వేడుక చేయకపోవడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. త్వరలోనే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే ఆయన చివరి చూపవుతుందని అస్సలు ఊహించలేదు’అని దర్శకుడు శ్యామ్ కౌశల్ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ రంగంలో బెనగళ్ విప్లవం సృష్టించారు. మళ్లీ మరొకరు అలాంటిది చేయలేకపోయారు’అని సినీ రచయిత గుల్జార్ పేర్కొన్నారు. శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment