అండర్‌ వరల్డ్‌ నుంచి సల్మాన్‌కు వార్నింగ్స్‌.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ | Salman Khan Connected With Underworld Reveal His Ex Girlfriend Somy Ali | Sakshi
Sakshi News home page

అండర్‌ వరల్డ్‌ నుంచి సల్మాన్‌కు వార్నింగ్స్‌.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ

Published Sat, Nov 2 2024 3:04 PM | Last Updated on Sat, Nov 2 2024 3:29 PM

Salman Khan Connected With Underworld Reveal His Ex Girlfriend Somy Ali

బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి సల్మాన్‌ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను సల్మాన్‌ తీవ్రంగా కొట్టాడని కూడా ఆమె పేర్కొంది.  అండర్‌ వరల్డ్‌ నుంచి సల్మాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని  ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.

బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో  దావుద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుతుండేవారని ఆమె చెప్పింది. అయితే, వారి పేర్తు ఎత్తకుండా 'అండర్‌ వరల్డ్‌' అని చెప్పేవారు. సల్మాన్‌తో సుమారు మూడేళ్ల పాటు గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్‌లో తాను ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని గుర్తుచేసుకుంది.  ఓసారి అండర్‌ వరల్డ్‌ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్‌ వచ్చినట్లు సోమీ అలీ తెలిపింది. అయితే, ఆ ఫోన్‌ కాల్‌ తానే లిఫ్ట్‌ చేసినట్లు ఆమె చెప్పింది. ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం తనకు తెలయదని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. 

ఫోన్‌లో ఇలా వార్నింగ్‌ ఇచ్చాడు. 'సల్మాన్‌కు పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఆయన ప్రియురాలిని కిడ్నాప్‌ చేయబోతున్నామని.' అన్నారు. ఆ కాల్‌ కట్‌ అయిన తర్వాత ఆమె చాలా భయపడిపోయినట్లు తెలిపింది. 'ఫోన్‌ కాల్‌ గురించి వెంటనే సల్మాన్‌తో చెప్పాను. నేను చాలా భయపడుతున్నానని చెప్పడంతో ఆయనలో కూడా కాస్త భయం మొదలైంది. అయితే, రెండురోజుల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని సల్మాన్‌ తెలిపారు. మరోసారి వార్నింగ్‌ ఫోన్‌ కాల్‌ రాలేదు. కానీ, ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే.. సల్మాన్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.' అని సోమీ అలీ చెప్పింది.

సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్‌ నటి అని తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్లుగా సల్మాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారని సమాచారం. పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం అక్కడ పెద్దగా ఛాన్సులు రావడంలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement