under world
-
అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు వార్నింగ్స్.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి సల్మాన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను సల్మాన్ తీవ్రంగా కొట్టాడని కూడా ఆమె పేర్కొంది. అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుతుండేవారని ఆమె చెప్పింది. అయితే, వారి పేర్తు ఎత్తకుండా 'అండర్ వరల్డ్' అని చెప్పేవారు. సల్మాన్‌తో సుమారు మూడేళ్ల పాటు గ్యాలెక్సీ అపార్ట్మెంట్లో తాను ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని గుర్తుచేసుకుంది. ఓసారి అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్ వచ్చినట్లు సోమీ అలీ తెలిపింది. అయితే, ఆ ఫోన్ కాల్ తానే లిఫ్ట్ చేసినట్లు ఆమె చెప్పింది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం తనకు తెలయదని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఫోన్లో ఇలా వార్నింగ్ ఇచ్చాడు. 'సల్మాన్‌కు పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఆయన ప్రియురాలిని కిడ్నాప్ చేయబోతున్నామని.' అన్నారు. ఆ కాల్ కట్ అయిన తర్వాత ఆమె చాలా భయపడిపోయినట్లు తెలిపింది. 'ఫోన్ కాల్ గురించి వెంటనే సల్మాన్‌తో చెప్పాను. నేను చాలా భయపడుతున్నానని చెప్పడంతో ఆయనలో కూడా కాస్త భయం మొదలైంది. అయితే, రెండురోజుల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని సల్మాన్ తెలిపారు. మరోసారి వార్నింగ్ ఫోన్ కాల్ రాలేదు. కానీ, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే.. సల్మాన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.' అని సోమీ అలీ చెప్పింది.సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి అని తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్లుగా సల్మాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నారని సమాచారం. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం అక్కడ పెద్దగా ఛాన్సులు రావడంలేదు. -
ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడు!
సాక్షి, న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలపై తీహార్ జైలు డీజీ, ఎయిమ్స్ అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, చోటా రాజన్ బ్రతికే ఉన్నాడని స్పష్టం చేశారు. తీహార్ జైలులో ఖైదీగా ఉన్న రాజేందర్ సదాశివ్ నికల్జే అలియాస్ చోటారాజన్‌కు గత నెల 22వ తేదీ కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయనను 24వ తేదీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు డీజీ తెలిపారు. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడని, ఎయిమ్స్‌లో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్ అధికారులు ట్విటర్ వేదికగా స్పష్టత నిచ్చారు. కాగా, అండర్ వరల్డ్ డాన్‌గా పేరు బడ్డ చోటా రాజన్ మొదట ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా ఉండేవాడు. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. -
కబ్జా చేస్తా
అండర్ వరల్డ్ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. అందుకోసం కత్తి పట్టుకొని రెడీ అయిపోయారు కూడా. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
బాలీవుడ్‌కి సినిమా చూపిస్తున్న మాఫియా
బాలీవుడ్ ఇండస్ట్రీ, భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న సినీరంగాల్లో ఒకటి. లోబడ్జెట్ హిట్ చిత్రాల నుంచి వందల కోట్లు కొల్లగొట్టగలిగే బడా బడా స్టార్ హీరోల వరకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు బాలీవుడ్లో చేతులు మారతాయి. అందుకే ముంబై మాఫియా కూడా బాలీవుడ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. సినిమాలకు ఫైనాన్స్ చేయడం దగ్గర నుంచి చాలావరకు సినీ రంగంలో తలెత్తున్న వివాదాలను సెటిల్ చేయటం, సినీ తారలతో ప్రేమాయణాలు కొనసాగించటం వరకు బాలీవుడ్- మాఫియాది విడదీయరాని సంబంధం. తాజాగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్ట్‌తో మరోసారి బాలీవుడ్ ఉలిక్కిపడింది. రాజన్‌తో ప్రేమ వ్యవహారాలు నడిపిన అందాలభామలతో పాటు రాజన్ సాయంతో సినిమాల్లో ఎదిగిన వారు టెన్షన్ పడుతున్నారు. బాలీవుడ్‌తో ముంబై మాఫియా సంబంధాలు ఇప్పటివేం కాదు. ఇండస్ట్రీ కమర్షియల్‌గా బలపడుతున్న సమయం నుంచే ఇవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దావుద్ నేరసామ్రాజ్యం విస్తరించిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు తమకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోలు దావుద్‌తో కలిసిన దిగిన ఫొటోలు కూడా బయటికి రాగా, సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలుపాలయ్యాడు. స్టార్ హీరోలు మాఫియా డాన్లతో సంబంధాలు కొనసాగించటానికి చాలా కారణాలే ఉన్నాయి. తమ సినిమాలకు ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా అండగా ఉంటారనే ఆలోచన కొందరిదైతే, వాళ్లతో సరిగా లేకపోతే ఏవైనా ఇబ్బందులు కలిగిస్తారేమో అన్న భయం మరికొందరిది. కేవలం హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు కూడా అండర్ వరల్డ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ లిస్టులో అందరికంటే ముందున్న హీరోయిన్ సోనా. హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకోకపోయినా.. మాఫియా డాన్ హాజీ మస్తాన్‌తో ఉన్న సంబంధాల కారణంగా సోనా మంచి పాపులారిటీ సాధించింది. తరువాత తరంలో కూడా ఈ సంబంధాలు కొనసాగాయి. బోల్డ్ యాక్ట్రెస్ మందాకినికి కూడా మాఫియాతో మంచి సంబంధాలే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీంతో కలిసి చాలా ప్రైవేట్ ఫంక్షన్స్‌లో కనిపించిన ఈ పిల్లికళ్ల సుందరి.. తర్వాత అతడితో కలిసి దుబాయ్‌లో సెటిల్ అయ్యింది. కొంత కాలం తరువాత దావూద్‌కు దూరమైన ఈబోల్డ్ బ్యూటీ.. 'మేం జస్ట్ ఫ్రెండ్స్' అంటూ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పేసింది. మరో హాట్ బ్యూటీ మమతా కులకర్ణి కూడా విక్కీ గోస్వామితో పాటు ఛోటా రాజన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది. ఈ రిలేషన్ల వల్లే మమతకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయన్న టాక్ కూడా ఉంది. ఈ జనరేషన్లో బాలీవుడ్‌ను షేక్ చేసిన మాఫియా రిలేషన్ మోనికా బేడీ- అబూ సలేంలది. నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ భామ, నటనకు గుడ్ బై చెప్పి అబూసలేంతో కలిసి ఫారిన్లో సెటిలైంది. తర్వాత పోర్చుగల్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో మోనికా, అబూ సలేంల ప్రేమ వ్యవహారం మరోసారి బాలీవుడ్, మాఫియా సంబంధాలను తెరమీదకు తీసుకువచ్చింది. వీళ్లే కాదు ఈ తరం హీరోయిన్లతో కూడా మాఫియా సంబంధాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ప్రీతీ జింటా, నెస్ వాడియాల వివాదంలో మాఫియా బెదిరింపులకు దిగిందంటూ వచ్చిన వార్తలతో ప్రీతి జింటాకు మాఫియా డాన్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపించాయి. తెర వెనక కథలు నడపటమే కాదు. బాలీవుడ్లో ముంబై మాఫియా ప్రత్యక్ష దాడులకు దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని చాలామంది హీరోలు, నిర్మాతల సినిమాలను ఓవర్ సీస్లో రిలీజ్ కాకుండా మాఫియా అడ్డుకుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది స్టార్లు మాఫియాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక తాజా ఉదాహరణల విషయానికి వస్తే, హృతిక్ రోషన్ హీరోగా పరిచయం అయిన 'కహోనా ప్యార్ హై' సినిమా ఓవర్ సీస్ రైట్స్ విషయంలో తలెత్తిన వివాదం రాకేష్ రోషన్‌పై కాల్పులు జరిపేవరకు వెళ్లింది. కేవలం మాఫియా చెప్పు చేతల్లో ఉండటం లేదన్న ఒక్క కారణంతో బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్, టీ - సిరీస్ అధినేత గుల్షాన్ కుమార్‌ను హత్య చేసింది మాఫియా. ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మంది హీరోలకు, హీరోయిన్లకు, నిర్మాతలకు ముంబై అండర్ వరల్డ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వాదన ఉంది. వీటిలో నిజానిజాలెంతో తెలియదు గానీ, అరెస్ట్ అయిన ఛోటారాజన్ నోరువిప్పితే మాత్రం బాలీవుడ్ లో చాలా మంది పేర్లు బయటి వస్తాయన్నది ఎవరూ కాదనలేని నిజం. -
దొంగ నుంచి మాఫియా డాన్ వరకు..
చీకటి నేరసామ్రాజ్యపు డాన్‌గా ఎదిగిన ఛోటా రాజన్ ఒకప్పుడు మాములు దొంగ. మొదట ముంబైలో చిన్నచిన్న నేరాలు చేస్తూ అతడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కొంతకాలం నమ్మిన బంటుగా మెలిగాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇప్పుడు దావూద్‌కు బద్ధ శత్రువుగా మారాడు. మొదట చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ.. బడా రాజన్‌గా పేరొందిన రాజన్ నాయర్ గ్యాంగ్ తరఫున ఛోటా రాజన్ చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడు. అతని అసలు పేరు రాజేంద్ర సదాశివ నికాల్జే. ముంబైలోని దిగువ మధ్య తరగతి కుంటుంబలో పుట్టిన అతన్ని అందరూ 'నానా' అని ముద్దుగా పిలుచుకునేవారు. బడా రాజన్ హత్యకు గురికావడంతో ఆ గ్యాంగ్ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత దావూద్ గ్యాంగ్‌లో చేరి ఛోటారాజన్ అనేక నేరాలకు పాల్పడ్డాడు. దావూద్‌తో శత్రుత్వం పెరుగడంతో 1988లో ఇండియా నుంచి దుబాయ్‌కి పారిపోయాడు. బలవంతపు వసూళ్లు, హత్యలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల సరఫరా, సినిమాలకు ఫైనాన్సింగ్ వంటి నేరాలతో అతను ముంబైను, ప్రపంచ దేశాలను హడలెత్తించాడు. అతడిపై భారత్‌లో 17 హత్య కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మలేషియాలో అతన్ని ఇంటర్ పోల్ అరెస్టుచేయడం.. ఈ కేసుల దర్యాప్తులో కీలక ముందడుగుగా భావించవచ్చు. దావూద్‌తో విభేదాలు! 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్లతో దావూద్-ఛోటా రాజన్ మధ్య విభేదాలు వచ్చాయి. అదే సమయంలో దావూద్ నేర సిండికేట్ అయిన డీ కంపెనీని నిర్వహిస్తున్న సత్య, ఛోటా షకీల్, శారదషెట్టి.. ఛోటారాజన్‌కు వ్యతిరేకంగా దావూద్‌కు అనేక కథనాలు వండివార్చారు. దీంతో ఇద్దరి మధ్య వైరం పెరిగి ఇరు గ్యాంగ్‌లు పరస్పరం తలపడటం మొదలుపెట్టాయి. మతకారణాలతో జరిగిన ముంబై పేలుళ్లను వ్యతిరేకించిన ఛోటా రాజన్.. దావూద్ నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంతో తన మకాం ముంబై నుంచి మొదట మలేషియాకు, ఆ తర్వాత దుబాయ్‌కి మార్చాడు. ఈ నేపథ్యంలో రెండు గ్యాంగుల మధ్య పలుసార్లు దాడులు జరిగాయి. హత్యాయత్నాలు ఛోటా రాజన్‌పై కసి పెంచుకున్న దావూద్ 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో అతనిపై హత్యాయత్నం చేయించాడు. బ్యాంకాక్‌లోని ఓ హోటల్లో ఉన్న రాజన్‌పై దావూద్ అనుచరుడు ఛోటా షకీల్ దాడి చేశాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా వచ్చిన షకీల్ కాల్పుల్లో ఛోటారాజన్ అనుచరులు రోహిత్ వర్మ, అతని భార్య చనిపోయారు. ఛోటా రాజన్ మాత్రం తెలివిగా ఈ దాడి నుంచి తప్పించుకొని హోటల్ ఫైర్ ఎస్కేప్ రూట్ నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ఈ దాడికి ప్రతీకారంగా ఛోటా రాజన్ అనుచరులు 2001లో దావూద్ అనుచరులు వినోద్ షెట్టి, సునీల్ సోన్పై దాడిచేసి చంపేశారు. వినోద్ షెట్టి అంతంతో ముంబైలో నేర ప్రపంచంలో దావూద్ పట్టు సడలిపోయింది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే ఛోటారాజన్‌కు భార్య అంకితా నికాల్జే, కూతుళ్లు నికిత, ఖుషి ఉన్నారు. -
నిర్మాత ఇంటిపై మాఫియా కాల్పులు!!
బాలీవుడ్ నిర్మాత, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని అలీ మొరానీ ఇంటిపై ముంబై మాఫియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితమే మొరానీకి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి డబ్బులు పంపాలని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఆయన వాటిని అంతగా పట్టించుకోలేదు. దాంతో రవి పూజారి గ్యాంగుకు చెందిన ఇద్దరు షూటర్లు జుహు ప్రాంతంలోని మొరానీ ఇంట్లోకి ప్రవేశించి, ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఎవరినీ చంపాలని గానీ, గాయపరచాలని గానీ ఆ గ్యాంగ్ సభ్యులు రాలేదని, కేవలం బెదిరించాలన్నదే వాళ్ల లక్ష్యంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు కరీం మొరానీ, మహ్మద్ మొరానీల సోదరుడే అలీ మొరానీ. వీళ్లు సినీయుగ్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను నడిపిస్తున్నారు. -
దావూద్ ఇబ్రహీం.. నువ్వెక్కడ?
ముంబైలో ఓ సామాన్య పోలీసు కానిస్టేబుల్ కొడుకు.. కట్ చేస్తే, 1993 నాటి ముంబై పేలుళ్ల సూత్రధారి!! చీకటి సామ్రాజ్య అధినేత. ఎన్నెన్నో మాఫియా సినిమాలకు స్ఫూర్తిదాయకుడు. అతడు ఇంకెవరో కాదు.. దావూద్ ఇబ్రహీం కస్కర్. ఎంతోమంది మాఫియా డాన్లను తయారుచేసి వాళ్లందరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది కూడా దావూద్ ఇబ్రహీమే. ఒకప్పుడు ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మీర్జా, వరదరాజన్ మొదలియార్, అబ్దుల్ కరీం లాలా, బాషూ దాదా.. వీళ్లే ఉండేవాళ్లు. ఇలాంటి కరడుగట్టిన వాళ్ల మధ్య ఓ నిజాయితీ గల కానిస్టేబుల్.. ఇబ్రహీం కస్కర్. అతడి రెండో కుమారుడే దావూద్ ఇబ్రహీం కస్కర్. చదువు వంటబట్టక.. పెడదోవ పట్టాడు. చిన్న చిన్న గొడవలతో మొదలుపెట్టి, అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి ఎదిగాడు. పోలీసులు కూడా.. నగరంలో డాన్లను అణిచేయడానికి ఇతడి సాయం తీసుకున్నారు. కానీ దావూద్ వాళ్ల చేయి దాటిపోయి, తానే ఒక డాన్‌గా ఎదిగాడు. భారతదేశంలో ఉంటే ఇబ్బంది అవుతుందని దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచే కొన్ని ఆపరేషన్లు చేసిన తర్వాత.. కరాచీకి తరలిపోయాడు. అప్పటినుంచి పాకిస్థాన్‌లోనే దాక్కున్న దావూద్ ఇబ్రహీంను మన దేశానికి తెచ్చుకోవడం మనవాళ్లకు తలకు మించిన పని అవుతోంది. గతంలో ఓసారి తాను లొంగిపోతానంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీకి దావూద్ కబురు పంపగా, మనవాళ్లు అతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకొనేది లేదంటూ జారిపోనిచ్చారు. ఆ తర్వాత నకిలీనోట్ల చెలామణి లాంటి వ్యాపారాలతో మరింత బలం పెంచుకున్న దావూద్.. ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1980లలో దావూద్ ఇబ్రహీం ఇలా ఉండేవాడు (కుడి వైపు నుంచి రెండో వ్యక్తి) ఇన్నాళ్ల బట్టి పాకిస్థాన్‌లో ఉంటూనే ముంబై నేర సామ్రాజ్యాన్ని శాశిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో సగానికి పైగా అతడి డబ్బులతోనే రూపొందుతున్నాయన్న విషయం కూడా బహిరంగ రహస్యమే. అలాంటి దావూద్ ఇబ్రహీం.. అసలు తమ దేశంలోనే లేడని తాజాగా పాకిస్థాన్ కొత్త పల్లవి అందుకుంది. పాక్ ప్రధానికి అంతర్జాతీయ వ్యవహారాలలోను, జాతీయ భద్రత విషయంలోను సలహాదారుగా వ్యవహరిస్తున్న సర్తాజ్ అహ్మద్ వాషింగ్టన్లో ఈ విషయం సెలవిచ్చారు. దావూద్ ఎక్కడున్నాడో భారత్ తమకు సమాచారం ఇస్తే, అతడిని పట్టుకోడానికి తాము కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. దుబాయిలో దావూద్ సామ్రాజ్య విస్తరణ, తనకు అడ్డువచ్చిన వారినల్లా మట్టుపెట్టడం, బాలీవుడ్లో హంగామా, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మారణహోమం, ఆపై జరిగిన బొంబే స్టాక్ ఎక్స్చేంజి పేలుళ్లు, దావూద్ కరాచికి మకాం మార్చటం, ఛోటా - దావూద్ మధ్య విద్వేషాలు, వాటి ఆధారంగా మన పోలీసులు పరోక్షంగా రాజన్‌కు సహకరించడం, 9/11 తర్వాత దావూద్ ఇబ్రహీంకు అల్‌ఖైదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా “మోస్ట్ వాంటెడ్”గా అతడిని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఇన్ని జరుగుతున్నా మన దేశం మాత్రం ఇంతవరకు అతడిని పట్టుకోలేకపోవడం గమనార్హం. లాడెన్ కూడా ఎక్కడున్నాడో తమకు తెలియదని పాక్ చెప్పిన తర్వాతే అమెరికా నేవీ సీల్స్ స్వయంగా ఆ దేశంలో ప్రవేశించి లాడెన్‌ను మట్టుబెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి!!