హైదరాబాద్‌లో ఫుల్‌ సెక్యూరిటీతో సల్మాన్‌ ఖాన్‌.. కారణం ఇదే..! | Salman Khan Will Come Hyderabad With Full Security | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఫుల్‌ సెక్యూరిటీతో సల్మాన్‌ ఖాన్‌.. కారణం ఇదే..!

Nov 3 2024 3:35 PM | Updated on Nov 3 2024 3:58 PM

Salman Khan Will Come Hyderabad With Full Security

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సికందర్‌’. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. ఈమేరకు సల్మాన్‌ భాగ్యనగరానికి వచ్చారు. ఈ మూవీకి సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాతగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో  సికందర్‌గా సల్మాన్‌ ఖాన్‌ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.

'కిక్‌' సినిమా తర్వాత సాజిద్, సల్మాన్‌ కలయికలో రానున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి బెదిరింపుల కాల్స్‌ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికెళ్లినా ఫుల్‌ సెక్యూరిటీతోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇప్పుడు షూటింగ్‌ కోసం ఇలాంటి పరిస్థితిల్లో  హైదరాబాద్‌కు సల్మాన్‌ రావడంతో అందరిలోనూ ఆసక్తిగా ఉంది.

హైదరాబాద్‌లో  రాయల్ ప్యాలెస్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సికిందర్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించనున్నారు. నవంబర్‌ 7వరకు సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి 'సికందర్‌' సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌కు ఎలాంటి డూప్‌ సాయం లేకుండా సల్మాన్‌ నటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement