సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే | Unknown Person Demand Rs 2 Crores From Salman Khan | Sakshi
Sakshi News home page

Salman Khan: మొన్న రూ.5 కోట్లు.. ఇప్పుడేమో రూ.2 కోట్లు డిమాండ్

Published Wed, Oct 30 2024 11:56 AM | Last Updated on Wed, Oct 30 2024 12:33 PM

Unknown Person Demand Rs 2 Crores From Salman Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.

(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)

ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్‌ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్‌కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.

అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్‌ఖాన్‌ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement