సల్మాన్‌ ఖాన్‌ హత్యకు ప్లాన్‌.. షార్ప్‌ షూటర్‌ అరెస్ట్‌ | Lawrence Bishnoi Gang Shooter Arrested By Mumbai Police In Salman Khan House Firing Case | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ హత్యకు ప్లాన్‌.. షార్ప్‌ షూటర్‌ అరెస్ట్‌

Published Thu, Oct 17 2024 10:40 AM | Last Updated on Thu, Oct 17 2024 11:31 AM

Lawrence Bishnoi Gang Shooter Arrested by Mumbai Police

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్‌ 14న కాల్పులు జరిపిన వారిలో మరోకరిని తాజాగా ముంబై పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.  హరియాణాలోని పానిపట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన  ఒక షార్ప్‌ షూటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు అతన్ని కోర్టులో హజరుపరచనున్నారు.


ఈ ఏడాది ఏప్రిల్‌లో  ముంబైలోని సల్మాన్‌  గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌  వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ ​సైకిల్​ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు నాటి నుంచి ఆ గ్యాంగ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు  దర్యాప్తు చేస్తున్న క్రమంలో జూన్‌లో కూడా మరోసారి సల్మాన్‌ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు తెలిపారు. సల్మాన్‌కు సంబంధించిన పన్వేల్ ఫామ్‌హౌస్‌ నుంచి  ఇంటికి వెళ్తున్న మార్గంలో ఆయనపై దాడి చేయాలని ఈ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

అయితే, ఈ కేసులో తాజాగా అరెస్ట్‌ అయిన వ్యక్తి షార్ప్‌ షూటర్‌ అని తెలుస్తోంది. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో చాలా కీలకంగా ఉన్నట్లు సమాచారం. సల్మాన్‌ను అంతం చేసేందుకు ఆయన కదలికలను పర్యవేక్షించడానికి దాదాపు 60 నుండి 70 మంది ఈ గ్యాంగ్‌లో భాగం అయ్యారని పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్‌ సిద్ధూమూసేవాలా హత్య మాదిరే.. కారులోనే సల్మాన్‌ను హత్య చేయాలని ఈ గ్యాంగ్‌ స్కెచ్‌ వేసినట్లు  పోలీసులు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement