బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు చంపుతామని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ కాస్త ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ అసలేం జరుగుతోంది?
కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. సల్మాన్‌కి స్నేహితుడు అయినందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా సల్మాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
ఈ మెసేజ్ ఎవరు పంపించారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 1999లో కృష్ణ జింకల్ని వేటాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సల్మాన్ జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటనతో సల్మాన్‌పై బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ పగ పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
2022లోనూ బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో ఉత్తరం దొరికింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స్వయంగా సల్మాన్‌కే మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాబా సిద్దిఖీని చంపేయడంతో సల్మాన్‌కి పోలీసులు మరింత భద్రత పెంచారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కానీ!)
Comments
Please login to add a commentAdd a comment