Maharashtra Assembly Election 2019
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో యూపీ సీఎం నినాదం!
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున వాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వేడెక్కిన మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆదిత్యనాథ్ స్లోగన్ పోస్టర్లు దర్శనం ఇవ్వడం ప్రారంభమయ్యాయి. హిందుత్వ అజెండాతో ఓటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నంలో ఈ నినాదాన్ని వాడుకుంటున్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల మధ్య, మైనారిటీ హిందువులపై అఘాయిత్యాల అంశంపై సీఎం యోగి గతంలో చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.సీఎం యోగి ప్రకటనపై తొలుత ఇటీవల హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బటేంగే తో కటేంగే’ అంటూ పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నినాదంతో హిందువులను ఏకం చేయడంతో పాటు తమ ఓటుబ్యాంకును ఏకతాటిపై తెచ్చేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విపక్షాల వ్యూహరచనమరోవైపు బీజేపీపై విజయం సాధించేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. కుల సమీకరణను ప్రధాన అంశంగా చేసుకొని అధికార వ్యతిరేకత నడుమ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న కులాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విపక్షాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హరియాణాలో జాట్ ఓటు బ్యాంకును ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయత్నించినప్పటికీ బీజేపీ వ్యూహం ముందు అది ఫలించలేదు. ‘బటేంగే తో కటేంగే’ నినాదంతో హరియాణా ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ .. జాట్లు మినహా ఇతర ఓటు బ్యాంకులను తమవైపు తిప్పుకోగలిగింది.కాగా గతంలో ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందరూ ఐక్యంగా ఉండాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ జాతీయ సమైక్యతా సందేశాన్ని ఇచ్చారు. అందరం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం బలపడుతుందని.. విభజిస్తే విడిపోతామని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తప్పులు ఇక్కడ జరగరాదని యోగి పిలుపునిచ్చారు. చదవండి: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల -
కొత్తమలుపులో శివసేన రాజకీయం
బాల్ థాక్రే 1966లో శివసేనను స్థాపించి మహారాష్ట్రలో దాన్ని ఒక గొప్పశక్తిగా మలిచారు. బొంబాయి దేశ ఆర్థిక రాజధానిగా ఉండటంతో ఈ పరిణామం భారత రాజకీయాలపై కూడా ప్రభావితం చూపింది. బాల్‌థాక్రే బలంగా ఒక విషయాన్ని నమ్మేవారు. థాక్రే కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా ఎన్నికల్లో ఎన్నటికీ పోటీ చేయరు అన్నదే ఆ నమ్మకం. బాల్‌థాక్రే జీవించి ఉన్నంతవరకు శివసేన ఆ నియమాన్ని గౌరవిం చింది. నిజానికి ఆయన పెద్ద కోడలు అప్పట్లోనే బాంబే మేయర్ కావాలని కోరుకున్నారు. కానీ బాల్‌థాక్రే ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆయన పెద్దకుమారుడు ఇంట్లోంచి వెళ్లిపోయారు. థాక్రే మరణం తర్వాత ఉద్ధవ్‌థాక్రే ఆ నియమాన్ని బద్దలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ద్వారా ఉద్ధవ్‌థాక్రే తండ్రి అంతరాల్లోంచి వచ్చిన ఆ నిబంధనను ఉల్లంఘించారు. తన కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పడంలో బాల్‌థాక్రే తర్కం చాలా సులువైనది. వ్యక్తిగత వైభవం కోసం లేదా పదవికోసం, తన కుటుంబం రాజకీయాల్లో పాల్గొంటోందని ప్రజలు తమ గురించి అనుకోకూడదని థాక్రే భావించేవారు. శివసేన అంటే 80 శాతం సామాజిక సేవ, 20 శాతం రాజకీయాలు అని పదే పదే చెప్పేవారు. ఆయన గొప్ప చింతనాపరుడు. ఒక నాయకుడు ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు అతడు ప్రజలవద్దకు వెళ్లి ఓట్ల కోసం అడుక్కోవాలని, అలాంటి వైఖరి శివసేనను దెబ్బతీస్తుందని థాక్రే చెప్పేవారు. ఎందుకంటే శివసేన విభిన్నమైన పార్టీ అని థాక్రే విశ్వాసం. కాబట్టి మహారాష్ట్రలో ఇప్పుడు రెండు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. శివసేన పూర్తిగా సాధారణ రాజకీయ పార్టీగా మారవచ్చు లేదా అది పతనం కావచ్చు. థాక్రే గొప్ప నియమం బద్దలైపోయింది. శివసేన ప్రస్తుత పాత్రను గుర్తిస్తున్నప్పుడు ఈ అంశాన్ని మనసులో ఉంచుకోవాల్సిందే. ఒక శివసైనికుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నది బాల్ థాక్రే చివరి కోరిక అని శివసేన నేత సంజయ్ రౌత్ ఇప్పుడు చెబుతున్నారు. కానీ తన కుటుంబ సభ్యుడొకరు సీఎం కావాలని థాక్రే ఎన్నడూ భావించలేదు. ఈ వాస్తవం ప్రస్తుత శివసేన నాయకత్వాన్ని విచ్ఛిన్న పరుస్తుంది. బాల్‌థాక్రే రాజరికపాలనపై, కాంగ్రెస్ పార్టీపై పదే పదే దాడిచేసేవారు. రాజరికపాలన క్రమక్రమంగా అంతరించిపోతుందని థాక్రే చెప్పేవారు. శివసేన మిలిటెంట్ పార్టీగానే తప్ప అధికారంపై ఆసక్తి లేకపోవడాన్ని కొనసాగించాలని ఆయన హెచ్చరించేవారు. 1994లో తొలిసారిగా మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చినప్పుడు బాల్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ మనోహర్ జోషిని సీఎంగా నియమించిన థాక్రే తాను మనోహర్ జోషీ రిమోట్ కంట్రోల్‌గా ఉంటానని బహిరంగంగా చెప్పారు. శివసేన ప్రస్తుత స్థితిని అంచనా వేసేటప్పుడు ఈ నేపథ్యాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఉద్దవ్ థాక్రే దివంగత బాల్‌థాక్రే మూడవ కుమారుడు. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న బీజేపీని తుంగలో తొక్కి మరీ సీఎం అయ్యారు. భారత రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. అయితే శివసేన నైతికతపై చర్చించటం కంటే అధికారం చేజిక్కించుకోవడం ద్వారా శివసేన ఎదుర్కోనున్న బలమైన సవాళ్లను అంచనా వేయడం అవసరం అని నా భావన. శివసేన ఒక పార్టీగా 1999 నుంచి పతనమవుతూ వస్తోంది. బీజేపీ–శివసేన పొత్తులో ప్రధాన భాగస్వామిగా ఉంటున్న స్థితి నుంచి సేన జూనియర్ భాగస్వామిగా పడిపోయింది. తన ఈ పతనానికి బీజేపీనే వేలెత్తి చూపుతున్న శివసేన తన నాయకత్వ శైలిగురించి ప్రశ్నించుకోవడం లేదు. మహారాష్ట్ర శాసనసభలోని 288 సీట్లలో 124 స్థానాల్లో పోటీ చేసిన శివసేన కేవలం 58 సీట్లను గెల్చుకుంది. మిగిలిన 164 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. ఈ లెక్కలకు సంబంధించిన తేడాను ఉపయోగించుకున్న శివసేన.. బీజేపీని విడిచి, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. థాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే శివసేనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రధానంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉనికిలో ఉన్న పార్టీగా పతనమైన శివసేన ముఖ్యమంత్రి పదవి ద్వారా పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చని ఆశిస్తోంది. సీఎంగా ఉద్దవ్ ప్రతిచోటా ఆదేశించే స్థాయిలో ఉంటారు కాబట్టి ఇతర పార్టీల్లోని నేతలను, కార్యకర్తలను కూడా పార్టీలోకి ఆకర్షించవచ్చు. ఉనికిలేని ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. తాను కోల్పోయిన గౌరవాన్ని ముఖ్యమంత్రి పదవి ద్వారా తిరిగి పొందవచ్చని, పార్టీ నాయకులు, కార్యకర్తులు మునుపటిలా పార్టీని వదలకపోవచ్చని థాక్రే కుటుంబం ఆశిస్తోంది. అధికారం దన్నుతో పునర్వైభవాన్ని పొందవచ్చన్నది వీరి ఆశ. ఇప్పుడు కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నుంచి మద్దతు ద్వారా బాంబే కార్పొరేషన్లో ఆధిక్యత సాధించవచ్చని శివసేన నాయకత్వం భావిస్తోంది. 2019లో కంటే 2024 ఎన్నికల్లో మరిన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి పదవిద్వారా పొందవచ్చు. శివసేన గత ముఖ్యమంతి నారాయణ్ రానేతో సహా ఇతర పార్టీల్లోకి వెళ్లిన శివసైనికులను అధికార బలంతో తిరిగి ఆకర్షించడమో లేక ప్రతీకారంతో దెబ్బతీయడానికి సీఎం పదవి ఆస్కారం ఇవ్వనుంది. అలాగే చక్కెర ఫ్యాక్టరీలలో, కో ఆపరేటివ్స్‌లో వాటాను పెంచుకోవచ్చు. పైగా శివసేనకు జాతీయ స్థాయిలో ప్రతిష్ట కూడా పెరగనుంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధానిని కలిగిన మహారాష్ట్రపై పట్టు సాధించడం ద్వారా జాతీయ రాజకీయాలను శాసించవచ్చని శివసేన అంచనా. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే మంచి పాలనను అందిస్తే, సమర్థతను నిరూపిస్తే భవిష్యత్తులో తాను గొప్ప రాజకీయవేత్తగా కావచ్చు. 1999 నుంచి 2014 వరకు 15 సంవత్సరాలపాటు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అనుభవించిన అధికారాన్ని శివసేన సమర్థపాలన ద్వారా అందుకోవచ్చు. అన్నిటికంటే మించి మహారాష్ట్రలో వైఫల్యం నుంచి బీజేపీ గుణపాఠం తీసుకుని దిద్దుబాట పట్టకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావడానికి నరేంద్రమోదీ చిక్కు సమస్యలు ఎదుర్కోవచ్చు. మహారాష్ట్రను కోల్పోవడం భారీ నష్టమని బీజేపీకి అర్థమైంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలు తిరిగి చేపట్టడానికి మోదీ, అమిత్ షాలు పథకాలు ఏమేరకు ఫలిస్తాయన్న అంశంపైనే శివసేన భవిష్యత్తు, ప్రస్తుత అధికార పొత్తు భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్ధవ్ పోటీ?
సాక్షి ముంబై : శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో సభ్యత్వం లేకపోయినా రాజకీయ పరిస్థితులు, అవసరాల దృష్ట్యా శివసేన చీఫ్ ఉద్ధవ్ మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఆరునెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకుండా మరెలాంటి ఎన్నికలూ లేకపోవడంతో ఈ దఫా ఎమ్మెల్సీగా శాసనమండలికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో శివసేన నుంచి ఎమ్మెల్సీగా నీలం గోర్హే పదవీ కాలం ముగియనుండటంతో ఆ స్థానంలో శివసేన అధినేత మండలికి వెళ్లు అవకాశాలు మెండుగా ఉన్నాయి. 26 మంది విరమణ.. నూతన సంవత్సరంలో శాసన మండలిలోని 26 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ సభ్యులలో 10 మంది ఎన్సీపీకి చెందినవారే ఉన్నారు. దీంతో నూతన సంవత్సరంలో జరగబోయే శాసన మండలి ఎన్నికలపై అందిరి దృష్టి కేంద్రికృమైంది. అయితే బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి మహావికాస్ ఆఘాడి ఏర్పాటవడంతో మెజార్టీ మహాఆఘాడికే ఉంది. దీంతో మహావికాస్ ఆఘా డికి నూతన సభ్యుల ఎన్నికలో పెద్దగా ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. శాసన మండలిలోని 78 మంది సభ్యులలో 26 మంది పదవీకాలం ముగియనుండగా వీరిలో ఎన్సీపీకి చెందిన పది మంది, కాంగ్రెస్ ఏడుగురు, బీజేపీ ఐదుగురు, ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులుండగా శివసేన, పీఫుల్స్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక్కో సభ్యుడున్నారు. కూటమికి బలం ఉండటంతో.. శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే నేపథ్యంలో ఆరు నెలల లోపు శాసన సభ లేదా శాసన మండలి సభ్యత్వం పొందాల్సి ఉంది. దీంతో ఆయన శాసన సభకు పోటీ చేస్తారా లేదా శాసన మండలికా అనేది కార్యకర్తలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శాసన సభ సభ్యత్వం పొందాలంటే ఆయన కోసం ఎవరో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిరానుంది. కానీ, శాసన మండలి అయితే నూతన సంవత్సరంలో పలువురి సభ్యుల పదవీ కాలం ముగియనుంది. మహావికాస్ ఆఘాడి సభ్యులు మళ్లీ సునాయాసంగా విజయం సాదించేందుకు అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పదవి కాలం ముగియనున్న శాసన మండలి సభ్యుల వివరాలు.. ఎన్సీపీ: విద్యా చవాన్, సతీష్ చవాన్, హేమంత్ టకలే, ఆనంద్ ఠాకూర్; కిరణ్ పావస్కర్, ఖాజా బేగ్, జగన్నాథ్ శిందే, ప్రకాష్ గజబియేలున్నారు. రామరావ్ వడకుతే, రాహుల్ నార్వేకర్‌లు రాజీనామా చేశారు. కాంగ్రెస్: అనంత్ గాడ్గిల్, హుస్న్‌బాను ఖాలేఫస్త్ర, జనార్దన్ చందూర్కర్, ఆనందరావ్ పాటిల్, హరిభావు రాఠోడ్, రామహరి రూపనవార్‌లున్నారు. చంద్రకాంత్ రఘువంశి రాజీనామా చేశారు. బీజేపీ: అరుణ్ ఆడసూడ్, పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్, స్మీతా వాఘ్, అనీల్ సోలేలున్నారు. చంద్రకాంత్ పాటిల్ శాసన సభకు ఎన్నిక కావడంతో ఆయన పదవి ముగిసింది. శివసేన: నీలం గోరే. పీపల్స్ రిపబ్లికన్: జోగేంద్ర కవాడే. ఇండిపెండెంట్: శ్రీకాంత్ దేశ్‌పాండే, దత్తాత్రేయ సావంత్. -
బీజేపీ అధినాయకత్వంపై ఏక్నాథ్ ఖడ్సే కినుక
జల్గావ్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అధినాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ‘అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో నా కుమార్తెతో పాటు మరికొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై ఆధారాలు చూపాను. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కోరాను’అని తెలిపారు. ‘పార్టీని వీడి వెళ్లాలనుకోవడం లేదు. పార్టీలో ఇవే రీతిగా అవమానాలు కొనసాగుతుంటే మరో మార్గం ఆలోచిస్తా’అని తెలిపారు. -
బీజేపీ మహిళా నేత అనూహ్య పోస్ట్..!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక, భవిష్యత్ కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ నాయకురాలు పంకజ ముండే ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. గత బీజేపీ సర్కార్‌లో పంకజ (40) గ్రామీణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన కజిన్ సోదరుడు ధనుంజయ్ ముండే చేతిలో 30వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పంకజ ముండే తాజాగా పెట్టిన పోస్టు ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. ‘రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత భవిష్యత్తేమిటనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో నేను చర్చించుకోవడానికి 8 నుంచి 10 రోజుల సమయం కావాలి’ అని తెలిపారు. తన తండ్రి, బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే 60వ జయంతి సందర్భంగా డిసెంబర్ 12లోపు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆమె తెలిపారు. బీడ్ జిల్లాలోని తన తండ్రి స్మారక కేంద్రం గోపీనాథ్ ఘాట్ వద్దకు 12వ తేదీన తమ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఈ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తన కజిన్ ధనుంజయ్ ముండేతో తీవ్ర రాజకీయ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో పంకజ ముండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం పెద్ద డ్రామా..!
బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించేందుకే ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారంటూ విస్మయపరిచే వ్యాఖ్యలు గుప్పించారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈ కర్ణాటక ఎంపీ.. శనివారం తన నియోజకవర్గం ఉత్తర కన్నడలోని యెల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులను సురక్షితంగా మళ్లీ కేంద్రానికి చేర్చడానికి ఫడ్నవిస్‌కు 15 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ‘మహారాష్ట్రలో మా పార్టీ వ్యక్తి కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజారిటీ లేదని మాకు తెలిసినా.. ఆయన ఎందుకు సీఎం అయ్యారు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి కారణం రూ. 40వేల కోట్లే. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ 40వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కాకుండా దుర్వినియోగమయ్యేవి. అందుకే పక్కా ప్లానింగ్‌తో ఏదైతే అదయిందని పెద్ద డ్రామాకు తెరతీశాం. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 15 గంటల్లో ఫడ్నవిస్ డబ్బులు తిరిగి సురక్షితంగా ఉండోచోటుకు పంపించారు. అవి కేంద్రానికి వెళ్లిపోయాయి. అవి ఉన్నచోటే ఉంటే తదుపరి సీఎం ఆ నిధులను ఏం చేసేవారో మనందరికీ తెలిసిందే’ అని అనంత్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇటు బీజేపీని, అటు ఫడ్నవిస్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. నిజానికి ఇలా జరగడానికి ఆస్కారం లేదు. కావాలంటే ప్రభుత్వ ఆర్థిక విభాగం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టవచ్చు’అని ఫడ్నవిస్ స్పష్టంచేశారు. -
పాలిటిక్స్ : 4జీ స్పెక్ట్రమ్
మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపా లన చేస్తున్న రోజులు. ప్రజల స్థితిగతులను స్వయంగా తెలుసుకోవడానికి భీమసేనుడు దేశాటనకు బయల్దేరా డట. అంతకుమునుపు తానెప్పుడూ కనీవినీ ఎరుగని వింతలూ, విడ్డూరాలు మనుషుల ప్రవర్తనలో భీమసేను డికి కనిపించాయట. ఎందుకిలా జరుగుతున్నదో తెలుసు కోగోరి అన్నగారి చెంతకు చేరుకున్నాడట. తమ్ముడి సందేహం విన్న ధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ‘నాలుగు మహాయుగాల్లో మూడవదైన ద్వాపర యుగంలో మనం జీవిస్తున్నాము. మొదటిదైన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేది. మన యుగంలో అది రెండు పాదాల మీద నడుస్తున్నది. ఇక ఒంటిపాదంపై నడిచే కలియుగం రానున్నది. నువ్వు చూసిన వింతలన్నీ ఆ నాలుగో యుగం ప్రవేశ సంకేతాలే’నని వివరించాడట. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి ప్రజాస్వామ్య పరిపాలన చేపట్టిన తర్వాత రాజకీయ రంగంలో ఇప్పుడు నాలుగో తరం ప్రవేశించింది. తొలితరం రాజకీయాల్లో నాలుగు ప్రధాన లక్షణాలు కనబడేవి. ఒకటి: రాజ్యాంగ విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోవడం, రెండు: పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండడం. మూడు : ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కానీ, వారి జయాపజయాల్లో కానీ ధన ప్రమేయం లేకపో వడం. నాలుగు: పేద, దళిత, గిరిజన వెనుకబడిన వర్గా లను రాజకీయ నాయకత్వ శ్రేణిలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించడం. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యానికి రాజ్యాంగమే సీట్లను రిజర్వు చేసింది కనుక ఆ సంఖ్య మేరకు మాత్రం ప్రజా ప్రతినిధులు ఎన్నికవుతున్నారు. తొలితరంలోనే శిఖర సమానులైన నాయకులను అందించిన దళితుల్లోంచి ఇప్పుడు ఆ స్థాయి నాయకత్వం ఎదగకపోవడానికి కారణ మేమిటో ఆలోచించాలి. చట్టసభల్లో సీట్ల రిజర్వేషన్ లేన ప్పటికీ ఆరోజుల్లోనే అగ్రశ్రేణి బీసీ నేతలు ఎదిగారు. తమి ళనాడు బీసీ నాయకుడైన కామరాజ్ నాడార్ ఒక్కముక్క ఇంగ్లీషూ, హిందీ రానప్పటికీ జాతీయ కాంగ్రెస్‌లో చక్రం తిప్పగలిగాడు. తెలుగు రాష్ట్రాల్లో తొలితరం నాయకులైన గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, ధర్మభిక్షం, ప్రగడ కోటయ్యల స్థాయిని ఆ తర్వాతి తరాల బీసీ నేతలు అందుకోలేకపోయారు. గడిచిన నెల రోజులుగా జరుగుతున్న మహారాష్ట్ర పరిణామాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవేశించిన 4జీ (నాలుగో తరం) స్పెక్ట్రమ్ లక్షణాలకు అద్దం పడు తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రదమైన తొలి తరం నాలుగు సూత్రాలూ కరిగిపోతున్న దశ ఇది. మహా రాష్ట్ర పరిణామాలను రెండు భాగాలుగా మనం పరిశీలిం చాలి. ఒకటి: ప్రజల తీర్పులోని ఆంతర్యం. రెండు: ఎన్ని కల తర్వాత పార్టీలు వ్యవహరించిన తీరు. రాష్ట్రంలోని ప్రధానమైన నాలుగు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందే రెండు కూటములుగా ఏర్పడి పోటీచేశాయి. బీజేపీ–శివసేన ఒక జట్టు. రెండు పార్టీలకూ భావసారూ ప్యత ఉంది. రెండూ హిందూత్వ ఎజెండా కలిగిన పార్టీలే. కాంగ్రెస్ – ఎన్సీపీలు ఒకే తాను ముక్కలు. సిద్ధాంత విభే దాలు ఏమీ లేవు. ఎన్నికల ఫలితాలు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఈ కూటమి 161 సీట్లు గెలిచి 288 మంది సభ్యులున్న సభలో అవసరమైన మెజారిటీని సంపాదించింది. 42 శాతం మంది ఈ కూట మికి ఓటేశారు. ప్రధాన ప్రత్యర్థి అయిన ఎన్సీపీ– కాంగ్రెస్ కూటమికి 99 సీట్లు 33 శాతం ఓట్లు లభించాయి. తీర్పు సుస్పష్టం. మరింత స్పష్టత కావా లంటే నాలుగు పార్టీలు విడివిడిగా సంపాదించిన ఓట్లను, సీట్లను పరిశీలించాలి. బీజేపీ 150 సీట్లకు పోటీచేసి 105 సీట్లు గెలిచింది. అంటే దాని స్ట్రయిక్ రేటు 70 శాతం. ఈ స్ట్రయిక్ రేటును మొత్తం అసెంబ్లీ సీట్లకు వర్తింపచేస్తే 200 సీట్లు గెలవాలి. ప్రీ పోల్, పోస్ట్–పోల్ సర్వేలన్నీ దాదాపు ఇదే సంఖ్యను కూటమి కోటాలో వేయడం గమనార్హం. 25.7 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. ఈ స్ట్రయిక్ రేటును మొత్తం అసెంబ్లీ సీట్లకు వర్తింపజేస్తే బీజేపీ ఓట్లు 47 శాతంగా వుండేవి. శివసేన సాధించిన సీట్లు 56. పోటీచేసిన స్థానాల్లో దాని స్ట్రయిక్ రేటు 45 శాతం. సాధించిన ఓట్ల స్ట్రయిక్ రేటు 35 శాతం. ఎన్సీపీకి లభిం చిన సీట్లు 54. ఓట్లు, సీట్లలో దాని స్ట్రయిక్ రేటు దాదాపు శివసేనతో సమానం. ఓట్లలోనూ, సీట్లలోనూ 30 శాతం స్ట్రయిక్ రేటుతో కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 50 శాతం సీట్ల స్ట్రయిక్ రేటు లేని మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 70 శాతం స్ట్రయిక్ రేటు ఉన్న బీజేపీ ప్రతిపక్షంగా మిగిలింది. ఇదో విచిత్ర పరిణామం. ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ నాలుగు పార్టీల వ్యవహారం కూడా ప్రజాస్వామ్యాన్ని నగుబాటు చేసే దిశగానే సాగింది. శివసేన విడాకులిచ్చి పక్కకు జరిగిన తర్వాత, దొడ్డిదారిన అధికార పీఠమెక్కడానికి బీజేపీ ప్రయత్నించింది. ఇతర పార్టీలను చీల్చడానికి ప్రణాళిక వేసుకున్నది. గవర్నర్ వ్యవస్థను నగ్నంగా దుర్వినియోగ పరిచింది. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం రాష్ట్రపతి పాలన ఎత్తివేయడానికి మంత్రిమండలి సమావేశాన్ని హాజరుపర చాలని బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖా తరు చేసి రాత్రికి రాత్రే ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాలాసాహెబ్ తన జీవిత కాలంలో ఏనాడూ అధికారం కోసం అర్రులు సాచలేదు. ఆయన తనయుడు మాత్రం పదవీ వ్యామోహంతో పార్టీ మౌలిక సిద్ధాంతాలను తాకట్టుపెట్టి శత్రుపక్షాల పంచన చేరడం విలువల పతనానికి పరాకాష్ట. ఎన్సీపీ నాయ కుడు అజిత్ పవార్ బీజేపీ చెంతకు చేరడం, తెల్లవారు ఝామున ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తనపై వున్న అవినీతి కేసులను ఎత్తివేయించు కోవడం, ఒక్కరోజు గడవగానే పిన్నిగారి పిలుపుమేరకు మళ్లీ సొంత పార్టీలో చేరడం వింతగా లేదా?. నిజంగా పార్టీని చీల్చాలని వుంటే పదిమందినైనా వెంట తీసుకుపో లేనంత అర్భకుడు కాదు అజిత్ పవార్. చిన్నాన్న ఆజ్ఞమే రకే అజిత్ పవార్ గడప దాటాడనీ, ఆ తర్వాత వ్యూహం మార్చుకున్న మరాఠా బాస్ తన అన్నకొడుకును మళ్లీ అక్కున చేర్చుకున్నాడని అభిజ్ఞులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లౌకికత్వ వలువలను పూర్తిగా విప్పేసి హిందూత్వ శివసేనతో జట్టుకట్టడానికి సిద్ధపడింది. అధికారంలో చోటిస్తానంటే బీజేపీ చంకనెక్కడానికి కూడా కాంగ్రెస్ వెనకాడదని ఈ ఉదంతం చాటిచెప్పింది. తొలి నాటి కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో ముఖ్యమైనది సెక్యులరిజం. భారతీయ జనతా పార్టీ పునాది హిందూత్వ. దేశంలో బీజేపీ ఆదరణ కొంత పెరగగానే కాంగ్రెస్ పార్టీ తన లౌకికవాదాన్ని పక్కన పడేసి మెతక హిందూత్వను రుద్దుకునే ప్రయత్నంలో అభాసుపాలవు తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ వేసిన బ్రాహ్మణ గోత్ర యుక్త శివభక్త వేషాన్ని జనం లైట్‌గా తీసుకున్నారు. జమ్ము–కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాఖ్‌ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన గళాన్ని గట్టిగా వినిపించకపోవడాన్ని బట్టి ఇక లౌకిక వేషధారణను ఆ పార్టీ పూర్తిగా వది లేసినట్టేనని భావించవలసి ఉంటుంది. దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ నిష్క్రి యాపరత్వం కూడా ఒక ఉదాహరణ. 1951 జనాభా లెక్కల ప్రకారం దేశంలో నాటి అక్ష రాస్యుల సంఖ్య 18 శాతం. 2011లో అది 75 శాతానికి చేరుకున్నది. చదువుకున్న వారి సంఖ్య ఐదింతలు పెరి గింది కనుక ఆమేరకు మన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంప్రదాయాలు బలపడి ఉండాలి. కానీ, అందుకు భిన్నంగా దిగజారుతున్నాయి. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు ప్రజాస్వామ్య ప్రక్రి యలో క్రియాశీలక పాత్ర లేకపోవడం విలువల పతనా నికి ప్రధాన కారణం. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ఇంకా మెరుగపడని సామాజిక వెనుకబాటుతనం మెజా రిటీ ప్రజల ప్రేక్షక పాత్రకు కారణం. ఆర్థిక సరళీకరణ మొద లైన తర్వాత దేశంలో కొంతమంది సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గతంలో మాదిరిగా పేదవర్గాల్లో ఇప్పుడు తిండి దొరకని దుస్థితి లేకపోవచ్చు కానీ, గతం కంటే కొన్ని వందల రెట్లు ఆర్థిక అంతరాలు పెరిగాయి. పెరిగిన శ్రీమంతుల సంపదతో లెక్కిస్తే పేదరికం గతం కంటే ఎన్నోరెట్లు పెరిగినట్టు లెక్క. క్రెడిట్ స్విస్ అనే ప్రతిష్ఠాత్మక సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ఈ దేశ సంపదలో 51.5 శాతం కేవలం ఒక్క శాతం శ్రీమంతుల చేతిలోనే ఉంది. మరో నాలుగు శాతం మంది చేతిలో 17.1 శాతం సంపద వుంది. ఇంకో ఐదు శాతం మంది చేతిలో 8.8 శాతం సంపద పోగుబడింది. అంటే మనదేశ జనాభాలో పదిశాతం సంపన్నులు 77.4 శాతం సంప దను అనుభవిస్తున్నారు. మరోపక్క 60 శాతంమంది పేదల చేతిలో కేవలం 4.7 శాతం సంపద మాత్రమే వుంది. ఈ అరవై శాతం మంది ప్రజలకు ప్రధాన రాజ కీయ స్రవంతిలో భాగస్వామ్యం లభించనంతవరకు మన ప్రజాస్వామ్యం ధనం కొరకు, ధనం చేత, ధనవంతులు ఆడే క్రీడగానే దిగజారుతుంది. ఇప్పుడు దేశంలో నెలకొని వున్న దుస్థితి ఇదే. డబ్బున్నవాడికే రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి. డబ్బు ఖర్చుపెట్టినవాడే గెలవగలు గుతున్నాడు. ధనార్జనకోసమో లేక పలుకుబడికోసమో వీరు పదవులను వాడుకుంటున్నారు. వీరికి పార్టీ సిద్ధాం తాలు, కట్టుబాట్లు ఉండే అవకాశం లేదు. అధికారంలోకి ఎవరు వస్తే వారి గూటిలోకి చేరడానికి సిద్ధంగా వుంటు న్నారు. అరవై శాతం నిరుపేదల గురించి వీరు ఆలోచిం చేది పోలింగ్ ముందురోజు మాత్రమే. ఈ 60 శాతం పేదల్లో అత్యధికులు దళితులూ, గిరిజనులూ, వెనుకబడి నవారు, అగ్రవర్ణ నిరుపేదలు. ‘‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలె పుడో... అన్నార్తులు, అభాగ్యులుండని ఆ నవయుగమ దెంత దూరం’’ అంటూ స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో మహాకవి దాశరథి ప్రశ్నించారు. ఆ దూరం ఇంకా తగ్గలేదు. దూరం తగ్గాలంటే సంపన్నులతో సమానంగా పేదలకూ అన్ని అవకాశాలు లభించాలి. సంపన్నుల బిడ్డలతో సమానమైన విద్యాబుద్ధులు పేద బిడ్డలు నేర్వాలి. డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువూ ఆగి పోగూడదు. ప్రభుత్వ వనరులూ, ప్రభుత్వం కల్పించే మర్యాదలూ సంపన్నుల సహపంక్తినే పేదలకు లభిం చాలి. డబ్బును కాకుండా సేవాతత్పరతను గుర్తించి టిక్కెట్లు ఇచ్చే రాజకీయ పార్టీలు కావాలి. అర్హతలున్న బలహీనవర్గాల నేతలను గుర్తించి ఉన్నత పదవులిచ్చి ప్రోత్సహించే గుండె కలిగిన రాజకీయ నాయకత్వం కావాలి. అప్పుడే పేదవర్గాల్లోంచి సంపన్న వర్గాలతో సమానంగా రాజకీయ నాయకత్వం ఎదుగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఈ వర్గాల్లో పెరుగుతారు. అప్పుడు ఓట్ల కొనుగోలు–అమ్మకాల అంగడి ఉనికి కోల్పోతుంది. క్రమంగా రాజకీయ విలు వలు పునఃప్రతిష్టితమవుతాయి. ఇటువంటి చర్యలు చేప ట్టడానికి రాజకీయ నాయకత్వానికి సంకల్ప బలం కావాలి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, పట్టుదల కావాలి. ఈ తరహా నవ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్నికలకు ముందు టిక్కెట్ల కేటాయిం పులో ధనాన్ని గీటురాయిగా తీసుకోలేదు. గెలిచిన అనం తరం మంత్రి పదవుల్లో 60 శాతం వరకు దళిత–గిరిజన –బీసీ–మైనారిటీలకు కేటాయించారు. ప్రగతిశీల పథకా లతో సామాజిక విప్లవానికి తెరతీశారు. వైఎస్ జగన్ ఆరుమాసాల పాలన దళిత–బహుజన–అగ్రవర్ణ పేదల్లో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పింది. ఈ స్ఫూర్తితో మరికొందరు నాయకులు పేదల అనుకూల విధానాలను అనుస రిస్తే నాలుగో తరం రాజకీయం ధర్మరాజు చెప్పిన కలి యుగంలాగా ముగియకుండా ఐదోతరం నాటికి కొత్త కాంతులతో ఉదయిస్తుంది. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ప్రభుత్వం ఏర్పడినా.. వీడని ఉత్కంఠ
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నూతన ప్రభుత్వంలో కొలువుతీరింది. ఠాక్రేతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి దక్కనున్నాయి. అయితే ఎన్సీపీ తరఫును ఆ పదవిని ఎవరు స్వీకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్‌లు ఇదివరకే మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో పార్టీపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికే చేరుకున్న నాయకుడు అజిత్ పవార్ పరిస్థితి పార్టీలో ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేల అండ లేకపోవడం, పవార్ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్ శరద్ పవార్ కూడా క్షమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఠాక్రే ప్రభుత్వంలో అజిత్‌కు చోటుదక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీలో అజిత్‌ను అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. వీటన్నిటిని గమనించే.. శరద్ ఇప్పటి వరకు అజిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకుకోలేదు. అయితే జయంత్ పాటిల్‌ను కాదని డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై శనివారం జయంత్ పాటిల్ స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకే దక్కినా ఆ పదవిని ఎవరు చేపడతారు అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉందన్నారు. దీనిపై పార్టీ చీఫ్ శరద్ పవార్ తుది నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. మరోవైపు పదవి కోసం అజిత్ పవార్ రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పార్టీలోకి తిరిగి వచ్చని అజిత్.. వారితోనే పదవి కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 22 తరువాత అజిత్ ఆ పదవిని చేపడతారని తెలిసింది. అయితే పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్‌ను శరద్ మరోసారి నమ్ముతారా లేదా అనేది వేచిచూడాలి. -
బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కార్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షలో విజయం సాధించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ దిలీప్ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుతీరింది. కాగా సభ ప్రారంభమైన అనంతరం శాసససభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను నూతన ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కనీసం వందేమాతరం కూడా ఆలపించలేదని ప్రభుత్వంపై పఢ్నవిస్ విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్ కోరారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మొత్తం 288 స్థానాలకు గత మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సభ్యుల మద్దతు ఉంది. 29 మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నిలబడాలంటే 145 మంది సభ్యులు మద్దతు కావాలి. అయితే తమకు 170 మంది సభ్యులకు పైగా మద్దతు ఉందని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం సభలో ప్రకటించింది. అనంతరం ఇటీవల మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఉద్ధవ్ సభకు పరిచయం చేశారు. కాగా కీలకమైన బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు సభ్యులకు విప్ జారీచేశాయి. -
నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమయ్యారు. నవంబర్ 30 మధ్యాహ్నం అసెంబ్లీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది. రాజకీయ, రాజ్యాంగ నైతికతలు వేరువేరు: సుప్రీంకోర్టు ఇతర రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన, బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యులుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని పిటిషన్‌దారు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది బీకే సిన్హా తెలిపారు. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆయన వాదించగా తమ పరిధిలోకి రాని ఎన్నికల అనంతర పొత్తుల్లోకి లాగవద్దని దర్మాసనం తెలిపింది. మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది. మహారాష్ట్ర తరువాత గోవానే! మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) నేతలతో శుక్రవారం రౌత్ చర్చలు జరిపారు. పైన పేర్కొన్న రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం. జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయితో భేటీ అనంతరం రౌత్ మాట్లాడుతూ.. ‘త్వరలో పెద్ద భూకంపం రానుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడే ఉన్నారు. గోవాలో బీజేపీకి మద్దతిస్తున్న మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర తరువాత గోవానే. ఆ తరువాత వేరే రాష్ట్రాలపై దృష్టి పెడతాం’ అని రౌత్ తెలిపారు. -
కమలం ఓడినా.. హిందుత్వదే గెలుపు
ఇందిరతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రాభవం లోక్‌సభ ఎన్నికలకే పరిమితమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అనేక రాష్టాల్లో గత రెండేళ్లలో బీజేపీ ప్రభావం 71 నుంచి 41 శాతానికి పడిపోయింది. అయినా సరే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ప్రాతిపదికన బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావం చూపుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో సమాఖ్యతత్వం నిజమైన అర్థంలో అమలువుతున్నట్లు ప్రస్తుతం కనిపిస్తున్నా హిందుత్వకు జాతీయ స్థాయిలో సమర్థన లభిస్తోంది. ఆరెస్సెస్/బీజేపీల గుత్త హక్కుగా కనిపించిన ఆర్టికల్ 370, రామాలయ వివాదం, ఉమ్మడి పౌరస్మృతి వంటివాటిపట్ల దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధ్యమవుతోంది. ఇది భావజాలపరంగా ఆరెస్సెస్ విజయమే. అందుకే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పుట్టి మునుగుతున్నా, హిందుత్వ మాత్రం నేటికీ గెలుస్తూనే ఉంది. అటు నిరాశావాదం.. ఇటు ఆశావాదం.. అనే పాత సామెత ప్రకారం, 2017 నుంచి ఇప్పటిదాకా భారత రాజకీయ పటంలో కాషాయ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోందని గ్రాఫిక్స్ ఆధారిత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ప్రకారం గత రెండేళ్లలో భారతీయ రాష్ట్రాలలో బీజేపీ పాలన 71 నుంచి 40 శాతానికి పడిపోయింది. కాషాయపార్టీ ప్రజాదరణ శిఖరస్థాయికి చేరిందని, నరేంద్రమోదీ ఆధిపత్యం తిరుగులేనిదని అందరూ భావిస్తున్న సమయంలోనే బీజేపీ పరిస్థితి ఇలా దిగజారిపోవడం గమనార్హం. అయితే ఇది నిరాశావాదం దృక్పథానికి సంబంధించింది. ఆశావాద దృక్పథంతో చూసినట్లయితే ఈ సంవత్సరం మే నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత చూస్తే బీజేపీ ఒక బలమైన రాజకీయ వాస్తవంగా కనిపిస్తుంది. తూర్పున హిందీ ప్రాబల్య ప్రాంతం నుంచీ ఈశాన్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో, పశ్చిమ తీర ప్రాంతాల్లో బీజేపీ పాలన అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు తాజాగా ఎన్నికలు జరిగినా 2019 మేలో వెల్లడయిన ఫలితాలకు భిన్నంగా రాకపోవచ్చు. మరి మోదీ విమర్శకులు ఇప్పుడెందుకు పండుగ చేసుకుంటున్నట్లో? అయితే, రాజకీయ వాస్తవం సంక్లిష్టమైంది. కాషాయ పార్టీకి చెందిన అనేక ఛాయలను ఇది ప్రతిబింబిస్తుంది. వీటిలో కొన్నింటిని చూద్దాం. నరేంద్రమోదీ ఎంత మహామూర్తిమత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఇందిరాగాంధీ కాదు. ఇందిర శకం నుంచి భారతీయ వోటర్ పరిణితి చెందుతూ వచ్చాడు. లోక్‌సభ, విధాన సభకు మధ్య వోటింగ్ ఎంపికల గురించి ఆమె స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రదర్శించేవారు. ఇందిరాగాంధీకిలాగే మోదీ కూడా లోక్‌సభ ఎన్నికల సందర్భంలో అనామకుడికి సీటు ఇచ్చినా గెలిపించుకునే స్థితిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. కానీ ఇందిరాగాంధీకి మల్లే రాష్ట్లాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు మోదీ ఈ మ్యాజిక్‌ను పునరావృతం చేయలేరు. దీనికి స్పష్టమైన ఉదాహరణగా మహారాష్ట్రను చూపవచ్చు. అలాగే హరియాణా కూడా. లోక్‌సభ ఎన్నికలు ముగి సిన అయిదు నెలలలోపే ఈ రాష్ట్రంలో బీజేపీ ఓటు దాదాపు 22 శాతం పాయింట్లను పోగొట్టుకుంది. అంటే 58 నుంచి 36 శాతానికి పడిపోయింది. హరియాణాలో విజయదుందుభిని మోగిస్తామని పార్టీ పూర్తిగా అంచనా వేసుకున్న చోట మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయింది. ఆర్టికల్ 370ని రద్దుచేసిన 11 వారాల్లోపు బీజేపీకి హరియాణాలో ఇంత గట్టిదెబ్బ తగిలింది. 2014లో ఘనవిజయం సాధించిన తర్వాత కూడా మోదీ ఒక నిర్దిష్ట రాష్ట్రంలో గెలుపు సాధించలేదు. 2017లో ఉత్తరప్రదేశ్, హరి యాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం వంటి కొన్ని చిన్న రాష్ట్రాలు దీనికి మినహాయింపు. ఇక్కడ కూడా 2015లో ఢిల్లీలో ఘోర పరాజయం చవిచూశారు. తర్వాత పంజాబ్లోను అదే జరి గింది. ఇక 2017లో ఘనవిజయం తప్పదని భావించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీస విజయం వద్దే ఆగిపోయారు. దానికి సైతం మోదీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, బళ్లారి బ్రదర్స్‌తో అసాధారణ స్థాయిలో రాజీలు కుదుర్చుకున్నప్పటికీ బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించలేకపోయింది. తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్ర్లాల్లో ఏకంగా ఓటమినే చవిచూసింది. ఇప్పుడు ఈ సంఖ్యలను కాస్త తిరగేయండి. పంజాబ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపి అధికారం కోల్పోయింది లేక నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైంది. అయితే ఇదే రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఇక ఢిల్లీలో, రాజస్తాన్‌లో, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ఆప్, కాంగ్రస్ చేతుల్లో ఓడిపోయింది. ఈ ఫలితాలను మదింపు చేస్తే, ఒకేపార్టీ ఆధిపత్యం రాజ్యమేలిన ఇందిరాగాంధీ శకంలోలాగా కాకుండా, నేడు భారత్ మరింత ఎక్కువగా సమాఖ్య దేశంగా పరిణమించింది. లోక్‌సభ, శాసససభల ఎన్నికల్లో ఓటరు పూర్తి వ్యత్యాసం ప్రదర్శించినట్లయితే, బీజేపీ పట్ల శత్రుభావం కలిగి ఉండని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమ పట్టు సాధించుకున్నాయి. నవీన్ పట్నాయక్, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బహుశా డీఎంకే కూడా ఈ కోవకు చెందుతారు. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రత్యర్థులకు సంతోషం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ఘర్షణ పడిన మమతా ఆరునెలల్లోపే ఈవారంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో విజయ కేతనం ఎగరేశారు. మరీ రెండు స్థానాల్లో అఖండ విజయం సాధించారు. ఇక్కడ కూడా ఓటర్ ప్రదర్శించిన వ్యత్యాసం కనబడుతుంది. ఇక నవ్వులు చిందిస్తున్న మూడో రకం ప్రాంతీయ నేత నితీశ్ కుమార్. ఈయన స్వయానా బీజేపీ భాగస్వామి. బిహార్ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక అసోంలో జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకత తెలుపుతున్న ప్రపుల్ల కుమార్ మహంతా తన స్థానాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ చేతిలో 17 రాష్ట్రాలు ఉంటున్నప్పటికీ దీన్ని అర్ధసత్యంగానే చెప్పాలి. వీటిలో బిహార్, హరియాణాల్లో కాషాయపార్టీకి పూర్తి భిన్నమైన సైద్ధాంతిక దృక్పథం ఉన్న మిత్రపక్షాలతో బీజేపీ భాగస్వామ్యం పంచుకుంది. ఇక మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలు ఎల్లప్పుడూ రాజకీయ బేరసారాలకు లోనై స్థానాలు మార్చుకుంటుంటాయి. సిక్కిం, మిజోరంలు ఎన్డీయేలో ఉంటున్నాయి తప్పితే అవి బీజేపీ పాలనలో లేవు. మరోవైపున బీజేపి ఇంతవరకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అనే మూడు ప్రధాన రాష్ట్రాల్లోను మాత్రమే తన చేతిలో పెట్టుకుని ఉంది. చివరిదైన కర్ణాటకలో అస్థిరత్వమే కొనసాగుతోంది. మోదీ–షా వైభవం ప్రభవిస్తున్నందున, బీజేపీ ఒకే ఒక సులభమైన ఫార్ములాను అనుసరించింది. హిందూ ప్రాబల్య ప్రాంతాన్ని, రెండు పశ్చిమ భారత రాష్ట్రాలను చుట్టేయడం. వీటిలో కీలక విజయం ద్వారా మాత్రమే బీజేపీ ఇతరప్రాంతాల్లో చిన్నా చితకా విజ యాలు సాధిస్తూ భారతదేశాన్ని ఏలుతోంది. రాష్ట్రాల్లో ఇది ప్రతిఫలించకపోతే మీరు తప్పకుండా సమానత్వానికి కట్టుబడి ఉండవచ్చు. దీనర్థం ఏమిటంటే, రాష్ట్రాల సీఎంలతో బీజేపీ చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మమతా వంటి ముఖ్యమంత్రులయితే మీరు ప్రవేశపెట్టే ఆయుష్మాన్ భారత్ వంటి మంచి, భారీ ప్రణాళికలను ముందుకు తీసుకుపోవడానికి కూడా తిరస్కరించవచ్చు. ఇలాంటివారు మీ ఆదేశాలకు ఇకపై తలొగ్గరు. మీరు వారిపట్ల గౌరవం ప్రదర్శించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వారిని సమానులుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాని పదే పదే చెబుతున్న సహకారాత్మక సమాఖ్య తత్వం అనేది ఇక మాటలలో కాక చేతల్లో చూపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రను తీసుకోండి. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనతో ఎందుకు కలిశాయి. తొలి రెండు పార్టీలు అక్కడ ఉనికి, అధికారాలకోసం పోట్లాడుతున్నాయి. కానీ శివసేన ఎందుకు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు? సైద్ధాంతికంగా తమకు పట్టున్న చోట బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. ఏకైక పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శివసేన నేరుగా ప్రదర్శించిన స్వీయరక్షణా ప్రతిస్పందనగానే దీన్ని చూడాలి. భావసారూప్యం కూడా ఇక్కడ పనిచేయలేదు. ఇక కేంద్ర–రాష్ట్రాల సమీకరణాలు 1989–2014కి సంబంధించి 25 సంవత్సరాల చరిత్రకు మళ్లీ దగ్గరవుతోంది. దీనికి సంబంధించి మహారాష్ట్రలో వస్తున్న సవ్వడి ప్రత్యేకమైనది. ప్రధాని మానస పుత్రిక అయిన బుల్లెట్ రైలును వీరు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఆర్టికల్ 370, అయోధ్య ఆలయ సమస్యవంటివి భారత రాజకీయాలనే విడదీస్తూ బీజేపీ/ఆరెస్సెస్‌కు అనుకూలతను సృష్టిం చేవి. కానీ ఇప్పుడు కశ్మీర్, రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి వంటివి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని కూడగడుతున్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం కూడా శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేకపోతోంది. రాహుల్ గాంధీ తరచుగా ఆలయాలను సందర్శిస్తూ, తన బ్రాహ్మణ గోత్రాన్ని చెప్పుకోవలసి వస్తోంది. భారత రాజకీయ చిత్రపటంపై ఎలాంటి రాజకీయ క్రీనీడలు కనిపిస్తున్నప్పటికీ, ఆరెస్సెస్/బీజేపీ భావాలకు సంబంధించినంతవరకు అది కాషాయ రంగును పులుముకుంది. ఆరెస్సెస్ కానీ, బీజేపీ కానీ ఇప్పుడు సులభంగా విజయాన్ని ప్రకటించవచ్చు. హెగ్డేవార్, గోల్వాల్కర్, సావర్కార్ వంటివారు దీనికి అంగీకరిస్తారు కూడా. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్ !
సాక్షి, ముంబై : విధాన్ సభ, విధాన పరిషత్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర ఎలాంటి సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. ఇదివరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో బారిస్టర్ ఏ.ఆర్.అంతులే, వసంత్‌దాదా పాటిల్, శివాజీరావ్ పాటిల్–నిలంగేకర్, శంకర్రావ్ చవాన్, శరద్ పవార్, సుశీల్‌కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఆరు నెలల్లో.. నియమాల ప్రకారం సభాగృహంలో ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలవ్యవధిలో విధానసభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ, అదృష్టవశాత్తు ఇంతవరకు ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. 1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ వసంత్‌దాదా పాటిల్, ఎమ్మెల్యే ప్రతిభా పాటిల్ పేరు చర్చల్లో ఉన్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వసంత్‌దాదా పాటిల్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావించారు. కానీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యే పదవి లేని కాంగ్రెస్ నేత బారిస్టర్ ఎ.ఆర్.అంతులేకు కట్టబెట్టారు. ఉభయ సభలో ఎలాంటి పదవులు చేపట్టకపోయినా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా అంతులేకు ఘనత దక్కింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి సభాగృహం సభ్యుడయ్యారు. 1982 జనవరి 12వ తేదీ వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1982 జనవరి 21వ తేదీన బాబాసాహెబ్ బోస్లే ముఖ్యమంత్రి అయ్యారు. ముంబైలోని కుర్లా నియోజక వర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత 1983 ఫిబ్రవరి రెండో తేదీన ఎంపీ వసంత్ దాదా పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి విధాన్ పరిషత్ ద్వారా మంత్రివర్గంలోకి వచ్చారు. 1993లో పవార్.. 1985 జూన్ మూడో తేదీన శివాజీరావ్ పాటిల్– నిలంగేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన విధాన పరిషత్‌కు ఎన్నికయ్యారు. అనంతరం నిలంగా అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికలో విజయఢంకా మోగించారు. కేంద్ర మంత్రిగా ఉన్న శంకర్రావ్ చవాన్ 1986 మార్చి 12వ తేదీన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. విధాన్ పరిషత్ ఎన్నికలో గెలిచి సభాగృహం సభ్యుడయ్యారు. 1993లో శరద్ పవార్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ముంబైలో అల్లర్లు జరిగిన తరువాత సుధాకర్‌రావ్ నాయిక్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1993 మార్చి ఆరో తేదీన శరద్ పవార్ ముఖ్యమంత్రి అయ్యారు. సభాగృహం సభ్యుడయ్యేందుకు విధాన్ పరిషత్ మార్గాన్ని ఎంచుకున్నారు. 2003 జనవరి 18వ తేదీన రాష్ట్ర పగ్గాలు సుశీల్‌కుమార్ షిండే చేతిలోకి వెళ్లాయి. అదికూడా ఢిల్లీ వదిలి వచ్చిన తరువాత షోలాపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీలోకి వెళ్లారు. అలాగే ఆదర్శ్ సొసైటీలో జరిగిన కుంభకోణం కారణంగా అశోక్ చవాన్ రాజీనామా చేయడంతో పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన విధాన్ పరిషత్‌కు ఎన్నికయ్యారు. తాజాగా 2019 నవంబర్ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఉభయ సభల్లో ఎలాంటి పదవుల్లో లేరు. -
ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు
నాగ్‌పూర్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు స్థానిక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవీస్ తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనలేదంటూ దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు అందజేశారు. నాగ్‌పూర్ ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్‌పై 1996, 1998లలో ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో ఈ రెండు కేసులను వెల్లడించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్ ఊకె కేసు వేశారు. దీనిపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సతీశ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో స్థానిక న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను గురువారం పోలీసులు ఆయన నివాసంలో అందజేశారు. -
కొలువుతీరిన ఠాక్రే సర్కార్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: అనేకానేక ఉత్కంఠభరిత మలుపుల అనంతరం, మహారాష్ట్ర రాజకీయ డ్రామా ప్రస్తుతానికి ముగిసింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్ ఆఘాడి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శివాజీ పార్క్ గ్రౌండ్లో భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానుల మధ్య, అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ, తన తండ్రి బాల్ ఠాక్రేలను స్మరిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం అనంతరం శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్‌లతో మంత్రులుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు ఉద్ధవ్ శిరసు వంచి నమస్కరించారు. తర్వాత తల్లి మీనాతాయి సొంత చెల్లెలు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తల్లి కుందాతాయి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్, మహా వికాస్ ఆఘాడి ఏర్పాటు సూత్రధారి శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కపిల్ సిబల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ నేత అజిత్‌పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్∙ముకేశ్ అంబానీ, భార్య నీతా, కొడుకు అనంత్ వచ్చారు. బంతిపూల రహదారి ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో ప్రమాణ స్వీకారం కోసం శివాజీ పార్క్‌లో భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికపైననే కీలక నేతలు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే భారీగా హాజరైన శివసైనికులు నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీగా బాణాసంచా పేల్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ నుంచి శివాజీపార్క్ వరకు రహదారి పొడవునా బంతిపూలు చల్లి శివసేన అభిమాని ఒకరు తన అభిమానం చాటుకున్నాడు. మోదీ, సోనియా అభినందనలు మహారాష్ట్ర కొత్త సీఎం ఉద్ధవ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్ధవ్ అవిరళ కృషి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ చీఫ్ లేఖ పంపించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలను సైతం ఆమె అభినందించారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరుకాలేకపోయిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నానన్న రాహుల్.. ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన కొత్త బాధ్యతల ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఎదుర్కొని మహా వికాస్ ఆఘాడీని ఏర్పాటు చేసినందుకు మూడు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయకుడికి విశేష పూజలు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఠాక్రే భార్య రష్మీ, వారి ఇద్దరు కుమారులు కూడా పూజల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ విషయంలో ఉత్కంఠ ఉద్ధవ్‌తో పాటు ఎన్సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారని గురువారం ఉదయం వరకు అంతా భావించారు. అయితే, తాను ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల తరఫున ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారని అజిత్ గురువారం ఉదయం మీడియాకు చెప్పారు. అయితే, త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. తొలి కేబినెట్ భేటీ ప్రమాణ స్వీకారం తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే గురువారం రాత్రి తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నూతన మంత్రులు సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌కు అజిత్ పవార్ కూడా రావడం విశేషం. ఉద్ధవ్ నంబర్ 8 మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్ ఠాక్రే 8వ నేత. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు ఏఆర్ ఆంతూలే, వసంతదాదా పాటిల్, శివాజీరావు నిలాంగేకర్ పాటిల్, శంకర్రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్‌లు కూడా ఏ సభలోనూ సభ్యులు కాకుండానే సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత ఎన్సీపీ చీఫ్, అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన శరద్‌పవార్ కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న శరద్ పవార్‌ను 1993లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పంపించారు. ముంబై అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం సుధాకర్ రావు నాయక్‌ను తొలగించి శరద్ పవార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అజిత్ అసమ్మతికి ‘పవార్’ కారణమా? వారం రోజుల క్రితం శుక్రవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ‘మహారాష్ట్ర వికాస్ ఆఘాడీ(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్)’ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చర్చించేందుకు సమావేశమయ్యేంత వరకు అంతా బాగానే ఉంది. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మొహంలో మారుతున్న రంగులను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సమావేశం నుంచి హఠాత్తుగా అజిత్ వెళ్ళిపోయిన సంగతిని కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెల్లవారాక కానీ గత రాత్రి అజిత్‌పవార్‌లో కనపడిన అసహనానికి పర్యవసానం ఏమిటో వారికి అర్థమైంది. శనివారం తెల్లవారుజామున.. దేశమింకా పూర్తిగా నిద్రలేవకముందే.. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుంచి అజిత్ పవార్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిపై నోరు విప్పని శరద్ శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలను కున్నప్పుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతనైన తనకు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని అజిత్ ఆశించారు. అయితే, కూటమి చర్చల్లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఈ విషయం లేవనెత్తక పోవడం అజిత్‌ని బాగా గాయపరిచింది. అయితే వీరిద్దరి మధ్యా కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. 2009లో మహారాష్ట్రకు అశోక్ చవాన్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు పవార్ల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 82, ఎన్సీపీకి 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకునే అవకాశం శరద్ పవార్‌కి వచ్చింది. అయితే అనూహ్యంగా, అజిత్‌ను కాదని డిప్యూటీ సీఎం పదవిని చగన్ భుజ్బల్కి శరద్ కేటాయించారు. ఇప్పుడు, 2019లో కూడా అదే పరిస్థితి ఎదురవనుందా? అనే అనుమానమే అజిత్ పవార్‌ను బీజేపీకి దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆర్ఆర్ పాటిల్, జయంత్ పాటిల్, ధనుంజయ్ ముండే, సుప్రియాసూలే వంటి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమానంగా అజిత్ పవార్‌ని చూశారు. దీంతో ఎన్సీపీలో తాను నంబర్ 2 కావడంపై అజిత్ పవార్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అజిత్ కుమారుడికి ఇస్తానన్న ఎంపీ సీటు ఆలస్యంగా ఇవ్వడం, ఆ తరువాత అతను ఓడిపోవడం కూడా అజిత్‌లో అసహనానికి మరో కారణంగా భావిస్తున్నారు. కాషాయం మసకబారుతోంది! న్యూఢిల్లీ: కాషాయ వికాసం క్రమేపీ మసకబారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠం కూడా ప్రతిపక్షం చేతుల్లోకి వెళ్లిపోవడంతో దేశంలో బీజేపీ పాలిత ప్రాంతం మరింత తగ్గిపోయింది. 2018 మార్చిలో బీజేపీ పలుకుబడి పతాకస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలోని 76 శాతం భూభాగాన్ని, 69 శాతం ప్రజలను పరిపాలించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. తాజాగా, 2019 నవంబర్‌లో మహారాష్ట్రలోనూ కాషాయ దళం అధికారానికి దూరమయింది. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతం దేశంలో వైశాల్యం రీత్యా 37.4 శాతం, జనాభాపరంగా చూసుకుంటే 45.6 శాతానికి పడిపోయింది. -
‘మహా’ డెమోక్రసీ గెలిచిందా, ఓడిందా !?
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారంతో ఓ రాజ్యాంగ సంక్షోభానికి తెరపడింది. కానీ మొత్తం మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందా, పతనమైందా? ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ–శివసేన ఉమ్మడిగా హిందూత్వ ఎజెండాపై పోటీ చేశాయి. మొత్తం రాష్ట్రంలోని 288 అసెంబ్లీ సీట్లకుగాను 160 సీట్లను ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 145 సీట్లు అవసరం కాగా, ఏకంగా 160 సీట్లను గెలుచుకున్నాయి. 152 సీట్లకు పోటీ చేయడం ద్వారా బీజేపీ 105 సీట్లను, అంటే 70 శాతం విజయాన్ని, 124 సీట్లకు పోటీ చేయడం ద్వారా 56 సీట్లను, అంటే 40 శాతం సీట్లను శివసేన గెలుచుకుంది. అంతేకాకుండా ఈ రెండు పార్టీల కూటమి 42 శాతం ఓట్లను దక్కించుకున్నాయి. రెండు కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడిగా 32.6 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఏవిధంగా చూసినా రాష్ట్ర ఓటర్లు బీజేపీ–శివసేన పార్టీల సంకీర్ణానికి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా ఈ రెండు పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి పీఠం విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా అలా జరగలేదు. ఒకప్పుడు శివసేనకు చిన్న భాగస్వామ్య పార్టీగా బీజేపీ పోటీ చేయగా, ఇప్పుడు బీజేపీకి చిన్న భాగస్వామ్య పార్టీగా శివసేన పోటీ చేసింది. అంటే బీజేపీ ప్రాబల్యం పెరిగిపోయి శివసేన ప్రభవం పడిపోయింది. ఈ దశలో తామే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భావించి ఉంటారు. అందుకే పొత్తు పొసగలేదు. ‘రాజకీయాలు సాధ్యమయ్యే ఓ కళ’ అని ఎప్పుడూ చెప్పే ఎన్సీపీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఇంతకంటే మరో అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు కలిపింది. హిందూత్వ సిద్ధాంతానికి బద్ధ వ్యతిరేకులుగా చెప్పుకుంటున్న రెండు కాంగ్రెస్ పార్టీలు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా శివసేనతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసం? దేశంలో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు జైలుకు పంపిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సవాల్ చేసిన బీజేపీయే అజిత్ పవార్‌కు గాలం వేయడం ఏమిటో, శివసేనను ‘హఫ్తా వసూల్ పార్టీ’ అంటూ విమర్శించిన సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అదే పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఏమిటో, 1961 నాటి చట్టం కింద సంక్రమించిన విశేషాధికారాలను అసాధారణంగా ఉపయోగించి ప్రధాని, రాష్టపతి పాలన ఎత్తివేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటో! వారికే తెలియాలి. బహుళ పార్టీ ప్రజాస్వామిక వ్యవస్థ కలిగిన భారత్‌లో నేడు విలువలెక్కడ ‘సోనియా’! -
తరలి వచ్చిన అంబానీ కుటుంబం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు కొలువు దీరినట్టయింది. ముంబై శివాజీ పార్క్‌లో గురువారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబానీతోపాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్ కుమార్ షిండే, ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సుమారు నెల రోజుల తరువాత అనేక అనూహ్య పరిణామాల మధ్య చివరికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడి కూటమి ఆధ్వర్యంలో సర్కార్ కొలువు దీరింది. చదవండి : మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం -
మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నూతన శకం మొదలైంది. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చోబెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్నాథ్ ముండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు ప్రమాణం చేశారు. దీంతో నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలుతీరింది. మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ సేవలు అందించనున్నారు. గత నెల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలపై విభేదాలు రావడంతో వారి కూటమి విచ్ఛిన్నమైంది. ఈ నేపథ్యంలో అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయాలు చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది. సరిపడ బలం లేనికారణంగా బలపరీక్షకు ముందే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. అనంతరం రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేను కూటమి నేతగా ఎన్నుకున్నాయి. ఉద్ధవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్ కుమార్ షిండే, ఎంకే స్టాలిన్లు పాల్గొన్నారు. -
ఠాక్రే తొలి కేబినెట్ మంత్రులు వీరే..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమం కోసం ముంబైలోని శివాజీ మైదానం ముస్తాబవుతోంది. గురువారం సాయంత్రం 6:40 గంటలకు రాష్ట్ర నూతన సీఎంగా ఉద్ధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఠాక్రేతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మహా వికాస్ ఆఘడి నేతలు సమావేశం నిర్వహించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్నాథ్ ముండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు. దీని అనంతరం మంత్రిమండలి తొలిసారి భేటీ కానున్నట్లు తెలిసింది. దీంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌కు ఠాక్రే మంత్రివర్గంలో చోటు లేనట్లేనని స్పష్టమవుతోంది. డిసెంబర్ 3న తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరుగునుందని సమాచారం. దీని అజిత్‌తో పాటు మరికొందరికి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?
సాక్షి, ముంబై: నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతుంది. ఈరోజు (గురువారం) సాయంత్ర 6:40 గంటలకు ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ పాటు ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన మరికొంత మంది కీలక నేతలకు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, శివసేన నేతలు సుభాష్ దేశాయ్, ఏక్నాథ్ షిండేలు ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే, ఎన్సీపీ సీనియర్ నేత, తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడితే సీఎం పదవి ఆదిత్యాకు ఇవ్వాలని శివసేన నేతలు ఎన్నికల ముందు నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వంలోనా.. పార్టీలోనా? ఆదిత్యా ఠాక్రేకు మంత్రివర్గం చోటు దక్కడం ఖాయమనీ, కీలక శాఖనే అప్పగించే అవకాశం ఉందని సేనలో జోరుగా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్యాను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా అనేది పూర్తిగా ఉద్ధవ్ నిర్ణయమని అన్నారు. ఠాక్రే ఆదిత్యాకు తండ్రి మాత్రమే కాదని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా అని వ్యాఖ్యానించారు. దీంతో నూతన ప్రభుత్వంలో ఆదిత్యా స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన ఉద్ధవ్ సీఎం పదవిని చేపట్టబోతుండటంతో, ఆదిత్యా పూర్తిగా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటారని సేన వర్గాల సమాచారం. ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడం, పదవులు చేపట్టిన అనుభవం లేకపోవడంతో మంత్రివర్గంలో చోటు దక్కకపోచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ ఐదేళ్ల పాటు సీఎం పదవికే పరిమితమై ఉంటారని, పార్టీ బాధ్యతలను ఆదిత్య చూసుకుంటారని ఓ సీనియర్ నేత వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేలా చేయడం ద్వారా ఆదిత్యాను రాజకీయాల్లో రాటుదేలేలా చేయాలన్నదే శివసేన తాజా ఆలోచనగా చెబుతున్నారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించేందుకు స్యయంగా ఆదిత్యను ఉద్ధవ్ పంపడం కూడా ఈ ఆలోచనలో భాగంగానే చెబుతున్నారు. అయితే దీనిపై ఠాక్రేనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. (అజిత్ చుట్టూ హైడ్రామా?) ప్రమాణం చేయటం లేదు: అజిత్ ఇక ఎన్సీపీపై తిరుగుబాటు చేసి బీజేపీతో చెతులు కలిపి విఫలమై, తిరిగి ఎన్సీపీ గూటికి చేరిన అజిత్ పవార్ దారెటనేది ప్రశ్నార్థాకంగా మారింది. గురువారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఇదివరకే ప్రకటించారు. అజిత్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ అధినేత శరద్ పవార్ ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వంలో చేరే అంశంపై అజిత్ పవాద్ స్పందించారు. తాను ఎలాంటి పదవులు స్వీకరించడంలేదని, ప్రస్తుతానికి ఎన్సీపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం అజిత్‌ను ప్రభుత్వంలోకి తీసుకుంటారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. దీనిపై శరద్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
అజిత్ చుట్టూ హైడ్రామా?
ముంబై : పార్టీపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికే చేరుకున్న నాయకుడు అజిత్ పవార్. ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేల అండ లేకపోవడం, పవార్ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్ శరద్ పవార్ కూడా క్షమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ ఏమేరకు సర్దుకుపోతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఆయన సీఎం పదవిపై కన్నేసినట్టు వార్తలు వస్తుండటంతో హైడ్రామా నెలకొంది. సంకీర్ణ పొత్తుల్లో భాగంగా రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని తమకు అప్పగించాలని ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ కామెంట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే అజిత్ పవార్ ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో హైడ్రామా నెలకొంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైన వేళ అజిత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అజిత్ ప్రస్తుతం తమకు అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. తరచూ కాల్స్ వస్తుండటంతో ఫోన్ స్విచ్చాప్ చేశారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అజిత్ సొంత నియోజకవర్గమైన బారామతిలో వెలిసిన పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భావి ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ ఆయన మద్దతుదారులు బారామతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయడం గమనార్హం. మరోవైపు ఉద్ధవ్ సర్కార్‌లో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్‌కు దక్కవచ్చునని వినిపిస్తోంది. పదవుల పంపకాలు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి నాయకుడైన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశముందని తెలుస్తోంది. పదవుల పంపకంలో భాగంగా ఎన్సీపీకి డిప్యూటీ చీఫ్ మినిష్టర్, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవులు ఖరారైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పీకర్ పృథ్వీరాజ్ చౌహాన్, ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు నేడు మంత్రులుగా ప్రమాణం చేస్తారని కూటమి వర్గాలు తెలిపాయి. -
ఉద్ధవ్-ఆదిత్యల అరుదైన ఘనత
ముంబై: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన చరిత్రను సృష్టించబోతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేడు పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఆయన శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసనసభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించబోతున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంతవరకు ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి. ‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్ కల్సే తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే, సోదరుడు రాజ్ ఠాక్రే ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక, తండ్రీకొడుకులైన కాంగ్రెస్ నేతలు శంకర్రావు చవాన్, అశోక్ చవాన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి మహారాష్ట్రకు ఎక్కువమంది సీఎంలు పనిచేశారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి శివసేన నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు ఉద్ధవ్ శివసేన నుంచి సీఎం అయిన మూడో నేత కానున్నారు. ఇక, ఎన్సీపీ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ సీఎం పగ్గాలు చేపట్టలేదు. -
సర్వాంగ సుందరంగా శివాజీ పార్క్
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం జరగనున్న శివాజీ పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైనే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతోపాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను కూడా శివసేన ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్‌లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుపై వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి భారీ బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరాదని కోరుకుంటునట్టు పేర్కొంది. -
ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్‌కు స్పీకర్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే(59) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి లభించనున్నట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఉద్ధవ్‌తో పాటు మూడు పార్టీలకు చెందిన ఒకరిద్దరు ముఖ్యులూ ప్రమాణం చేస్తారు. ఉద్ధవ్ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో బుధవారం కూటమి ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. మంత్రిమండలిలో ఒక్కో పార్టీకి లభించే ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత వారితో కాంగ్రెస్ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఖర్గే కలిశారు. శివసేనకు సీఎం సహా 15, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 15, కాంగ్రెస్‌కు స్పీకర్ కాకుండా 13 మంత్రి పదవులు ఇవ్వాలనే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సేన వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఉదయం గవర్నర్ భగత్ కోశ్యారీని ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 20 ఏళ్ల తరువాత శివసేన నేత సీఎం అవుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా 1995లో మనోహర్ జోషి బాధ్యతలు చేపట్టగా, 1999లో నారాయణ రాణె శివసేన తరఫున సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు మహారాష్ట్రలో తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్‌లో నేటి సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైననే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.కాంగ్రెస్ చీఫ్ సోనియాను ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను శివసేన ఆహ్వానించిందని సమాచారం. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. అజిత్‌కు డిప్యూటీ సీఎం? అజిత్ పవార్‌కి ఇచ్చే పదవిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్‌ను మరోసారి ఎన్నుకుంటారని, ఉప ముఖ్యమంత్రి పదవీ రావొచ్చని తెలుస్తోంది. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్‌లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ వెంటే.. బీజేపీకి మద్దతునివ్వడం ద్వారా నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగి ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణం చేశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి నేను కొత్తగా చెప్పడానికేమీ లేదు. సమయమొచ్చినపుడు చెప్తాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు’ అని చెప్పారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే తాను నిర్ణయం మార్చుకొని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని అజిత్ పవార్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అజిత్ పవార్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయనకు సముచిత స్థానమే లభిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం చేపట్టనున్న శివసేన భవిష్యత్తులో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని రౌత్ వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా శివసేన తరఫున వ్యూహకర్తగా, మీడియా ప్రతినిధిగా వ్యవహరించిన రౌత్.. ఇకపై తాను పార్టీ పత్రిక ‘సామ్నా’ పనుల్లో నిమగ్నమవుతానన్నారు. అజిత్‌కు సుప్రియా ఆత్మీయ ఆహ్వానం మహారాష్ట్ర నూతన ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 285 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కొలంబ్కర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన అజిత్ పవార్‌కు అనూహ్యమైన రీతిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఆయన సోదరి, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే, అజిత్ పవార్‌కు ఎదురై నవ్వుతూ పలకరించి, ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే విధాన సభ ముఖద్వారం దగ్గరే నిల్చొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్వాగతం పలికారు. రాజకీయ ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల మరాఠాయోధుడు ఛత్రపతి గుర్తుగా శివాజీ పార్కు రాజకీయ ఉద్దండులెందరినో పరిచయం చేసిన వేదికది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ఆశలకూ, ఆకాంక్షలకూ ఊతమిచ్చిన క్రీడాప్రాంగణమది. యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను అనునిత్యం గుర్తుచేసే మరాఠాల పోరాటాలకు పురిటిగడ్డ కూడా అదే ప్రాంతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే అంతిమ సంస్కారాలకు వేదికగా నిలిచింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతోన్న ఉద్ధవ్ ఠాక్రే నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిటీలోనే అతిపెద్ద పార్కు ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్కు సిటీలోనే అతిపెద్ద పార్కు. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పార్కు వైశాల్యం దాదాపు 28 ఎకరాలు. ఈ పార్కు క్రికెట్ క్రీడాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 1927 వరకు బ్రిటిష్ ఇండియాలో 1925లో ప్రారంభించిన ఈ పార్కు అనంతర కాలంలో ముంబైలోని ఎన్నో స్వాతంత్య్రోద్యమాలకు కేంద్రబిందువైంది. 1947 స్వాతంత్య్ర కాలం నుంచి సంయుక్త మహారాష్ట్ర చాల్వాల్ (మహారాష్ట్ర ఏకీకరణ) ఉద్యమానికి ఇదే పార్కు వేదికయ్యింది. ప్రముఖ పాత్రికేయులు, నాటకరచయిత, కవి, సామాజిక నేత ఆచార్య ప్రహ్లద్ కేశవ్ అత్రే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం 1960 మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఆ తరువాత శివసేన నడిపిన ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఈ వేదికగా ప్రారంభించారు. మహిమా పార్కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ కాలంలో ఈ పార్కుని ఏర్పాటు చేశారు. 1927 వరకు ఈ పార్కుని మహిమా పార్కుగా పిలిచేవారు. మున్సిపల్ కౌన్సిలర్ అవంతీ గోఖలే ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ పేరుని పెట్టారు. పార్కులోపలి వైశాల్యం 1.17 కిలోమీటర్లు. మొత్తం మైదానం 112,937 చదరపు మీటర్లు. ఈ ప్రాంగణంలో టెన్నిస్ కోర్టు, వ్యాయామశాల, పిల్లల, వృద్ధుల పార్కులు, లైబ్రరీలు ఉన్నాయి. సైలెన్స్ జోన్‌గా ప్రకటించిన కోర్టు నిత్యం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఈ పార్కు వల్ల ధ్వని కాలుష్యం ఎక్కువైందంటూ స్థానికులు 2009లో కోర్టుకి వెళ్ళారు. దీంతో మే, 2010లో బాంబే హైకోర్టు ఈ ప్రాంగణాన్ని సైలెంట్ జోన్‌గా ప్రకటించింది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్‌ను ఆత్మీయంగా పలకరిస్తున్న సుప్రియా సూలే. -
‘మహా’ కేబినెట్; శివసేనకే ఎక్కువ
ముంబై: మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. పదవులు పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శివసేనకు ముఖ్యమంత్రితో పాటు 15 మంత్రి పదవులు లభించాయి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 13 కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌తో పాటు 13 మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. వైబీ చవాన్ భవన్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, మాణిక్‌రావ్ ఠాక్రే పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా గురువారం శివాజీ పార్క్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివర్ తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని తమ ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. 400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేకూ ఆహ్వానం పంపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. (చదవండి: సుప్రియ.. తండ్రికి తగ్గ తనయ) -
సుప్రియ చాణక్యం సూపర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మలుపులతో నెల రోజులుగా ‘మహా’ పొలిటికల్ ఎపిసోడ్ థిల్లర్ సినిమాను తలపించింది. అపర చాణక్యుడు శరద్ పవార్ సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మహా వికాస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరబోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శరద్ పవార్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ‘మహా’ పర్వంలో పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి తండ్రి తనయ అనిపించుకున్నారు. ఎన్సీపీని చీల్చడానికి సోదరుడు అజిత్ పవార్ ప్రయత్నించినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల కంటే బంధాలే ముఖ్యమని నచ్చజెప్పి అజిత్‌ను తిరిగి పార్టీలోకి తీసుకురావడంతో సుప్రియ చూపిన చాకచాక్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడంలోనూ ఆమె ప్రదర్శించిన హుందాతనం ప్రశంసనీయం. ఎమ్మెల్యేలందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఐక్యతను నూరిపోశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల కుట్రలో పడకుండా తండ్రి పవార్‌తో ఆమె కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండి మంత్రాంగం నడిపించారు. ఇక బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా సుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీలోకి తిరిగి వచ్చిన సోదరుడు అజిత్ పవార్‌ను ఆత్మీయ ఆలింగం చేసుకుని స్వాగతం పలికారు. అసెంబ్లీకి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేందరినీ దగ్గరుండి మరీ స్వాగతించారు. కరచాలనం చేసి, వెన్ను తడుతూ శాసనసభ్యులందరినీ ప్రోత్సహించారు. తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా అంతే అభిమానంతో స్వాగతించి అందరి మన్ననలను చూరగొన్నారు. లోక్‌సభ సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లో రాణిస్తూనే మహారాష్ట్రలో తనదైన ముద్ర వేసిన సుప్రియ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటారని ఆమెను దగ్గరగా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆమె పాత్ర ఎనలేనిదని ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: శరద్ పవార్ క్షమించేశారు!!) -
శరద్ పవార్ క్షమించేశారు!!
ముంబై: ఎన్సీపీ రెబల్ నేత, శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎన్సీపీతోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ‘నేను పార్టీని ఎప్పుడూ వీడలేదు. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అలాంటిదేమీ లేదు కదా. మీడియా నా విషయంలో తప్పుగా కథనాలు రాసింది. వాటిపై సరైన సమయంలో స్పందిస్తాను’ అని అజిత్ బుధవారం మీడియాకు తెలిపారు. సోదరుడిని ఆలింగనం చేసుకున్న సుప్రియా పార్టీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా అజిత్ పవార్ తిరుగుబాటు లేవనెత్తిన సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ సిద్ధమవుతుండగా అనూహ్యంగా చివరినిమిషంలో అజిత్ ప్లేటు ఫిరాయించి బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ ఇచ్చి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్‌కే పూర్తి అండగా నిలువడం.. తన వర్గం ఎమ్మెల్యేలు కూడా ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో అజిత్ వెనుకకు తగ్గారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కూడా దిగిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ తిరిగి ఎన్సీపీ గూటికే చేరుకున్నారు. ఈ తిరుగుబాటు విషయంలో పవార్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు కూడా సమసిపోయినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్‌ను సుప్రియా సూలె ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. తద్వారా తమ మధ్య విభేదాలు లేవని చాటారు. చదవండి: అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా క్షమించేసిన శరద్ పవార్! తిరుగుబాటు లేవనెత్తి బీజేపీకి సపోర్ట్ చేసిన అజిత్ పవార్‌ను పార్టీ అధినేత శరద్ పవార్ క్షమించేశారట. ఈ విషయాన్ని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ మీడియాతో తెలిపారు. ‘చివర్లో అజిత్ తన తప్పు తాను తెలుసుకున్నారు. తప్పు చేసినట్టు అంగీకరించారు. ఇది కుటుంబ వ్యవహారం. పవార్ సాహిబ్ అజిత్‌ను క్షమించారు. ఆయన పార్టీలోనే ఉన్నారు. పార్టీలో ఆయన స్థానం ఏమాత్రం మారలేదు’ అని నవాబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం!
ముంబై: మహారాష్ట్ర 14వ శాసనసభ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కోలంబర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మాజీ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ (ఎన్సీపీ), హరిభావు భగడే (బీజేపీ) తదితరులు ప్రమాణం చేశారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే, ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయకముందే అసెంబ్లీ కొలువుదీరి.. ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేస్తుండటం గమనార్హం. ‘గత కొన్ని దశాబ్దాలుగా అసెంబ్లీలో మొదట ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేసేవారు. ఆ వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి లేరు. సీఎం ప్రమాణం చేయకుండానే ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది అరుదైన దృశ్యం’ అని మహారాష్ట్ర అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి రాజేంద్ర భగవత్ మీడియాకు తెలిపారు. -
గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే దంపతులు!
ముంబై: శివసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ బుధవారం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. ఒకవైపు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు ఉద్ధవ్ రాజ్‌భవన్ వెళ్లి.. మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. గురువారం ముంబైలోని శివాజీ పార్కులో అట్టహాసంగా జరగనున్న కార్యక్రమంలో మహా వికాస్ అఘాది (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి) తరఫున ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం భేటీ అయి.. ఉద్ధవ్ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మూడు పార్టీల నేతలు బృందంగా వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. తమ కూటమికి 166మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిపారు. ఇందుకుప్రతిగా ఉద్ధవ్‌కు లేఖ రాస్తూ.. డిసెంబర్ 3లోగా అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు లేఖ ఇవ్వాల్సిందిగా సూచించారు. మరోవైపు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో కొత్త మార్పు రాబోతోంది. మిషన్ కంప్లీట్ అయింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారు’ అని పేర్కొన్నారు. -
మూడున్నర రోజుల ముఖ్యమంత్రి!
సాక్షి ముంబై: ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ వినూత్న రికార్డులు సాధించారు. వీటిలో ఒకటి అత్యధిక కాలం(ఐదేళ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగడం మరొకటి అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం. రెండో సారి ఫడ్నవిస్ మూడున్నర రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ రెండు రికార్డులతోపాటు సుమారు 20 రోజులలోపాటు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరో రికార్డు కూడా సృష్టించారు. మహారాష్ట్ర అవతరించిన అనంతరం ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. గతంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్ అయిదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అనంతరం 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ అయిదేళ్ల పాలన పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా రికార్డు సాధించారు. ఇలాంటి రికార్డు సృష్టించిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన అనంతరం మళ్లీ నవంబర్ 23వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా అయితే ప్రమాణస్వీకారం చేసి 80 గంటలు (మూడున్నర రోజులు)లోనే దేవేంద్ర ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ రికార్డు కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్ కన్నంవార్ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇద్దరిదీ ఒకే తీరు.. దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వీరిద్దరి జన్మదినం ఒకే రోజు కావడం విశేషం. దేవేంద్ర ఫడ్నవీస్ జన్మదినం 1970 జూలై 22 కాగా, అజిత్ పవార్ జన్మదినం 1959 జూలై 22. దీంతో ఒకే తేదీన జన్మించిన వీరిద్దరు 2019 నవంబర్ 23వ తేదీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా నవంబరు 26వ తేదీన ఇద్దరూ రాజీనామాలు చేయడం విశేషం. మహారాష్ట్రలో ఎప్పుడేం జరిగిందంటే.. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తరువాత రోజురోజుకు మారిన రాజకీయ పరిణామ క్రమం ఇలా.. అక్టోబర్ 21, 2019: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. అక్టోబర్ 24: ఎన్నికల ఫలితాల ప్రకటన. బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు. నవంబర్ 9: ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించిన గవర్నర్. మెజారిటీ నిరూపణకు 48 గంటల సమయం. నవంబర్ 10: ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ప్రకటించిన బీజేపీ. శివసేనను ఆహ్వానించిన గవర్నర్. నవంబర్ 11: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనన్న శివసేన. బల నిరూపణకు 3 రోజుల గడువు కోరింది. తిరస్కరించిన గవర్నర్. ఎన్సీపీకి ఆహ్వానం. నవంబర్ 12: తమ వినతిని గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన నవంబర్ 22: శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 23: రాష్ట్రపతి పాలన ఎత్తివేత. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం నవంబర్ 23: గవర్నర్ నిర్ణయంపై మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నవంబర్ 24: రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గవర్నర్ కోరిన లేఖను సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం ఆదేశం నవంబర్ 26: నవంబర్ 27న బలనిరూపణ చేపట్టాలని గవర్నర్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు అజిత్‌పవార్ రాజీనామా, దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా. నవంబర్ 27: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం -
అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కోలాహలం నెలకొంది. ముందుగానే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలె పలువురు నేతలకు సాదర స్వాగతం పలికారు. మొదట శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు ఆమె స్వాగతం పలికారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎన్సీపీ సీనియర్ నేత, తన సోదరుడు అజిత్ పవార్ వచ్చారు. అజిత్‌ను కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికారు. పార్టీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ చివరినిమిషంలో మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఫడ్నవిస్‌తో మర్యాదపూర్వకంగా సుప్రియా సూలె కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సుప్రియా సూలె మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలంతా తమకు అండగా నిలబడ్డారని అన్నారు. చదవండి: ఉద్దవ్ ఠాక్రేకే పీఠం.. -
పొలిటికల్ సూపర్ స్టార్..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో సతారాలో భారీ వర్షంలో తడుస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ప్రసంగం ప్రజలతో ఆయన ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటుకు బాటలు వేసింది. అప్పుడే చాలా మంది కొత్త ప్రభుత్వంలో పవార్‌దే కీలకపాత్రని భావించారు. బాలీవుడ్ అతిరథ మహారథులంతా ముంబైలోనే ఉన్నప్పటికీ మహారాష్ట్ర సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే ఇప్పుడు అందరూ శరద్ పవార్ పేరే చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు తెరలేచిన దగ్గర్నుంచి పవార్ కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. నీటిపారుదల శాఖలో అవినీతికి సంబంధించి పవార్‌పై ఈడీ కేసుల్ని నమోదు చేసినప్పటికీ అదరలేదు, బెదరలేదు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లపై నిప్పులు చెరిగినా, రాష్ట్రంలో కుస్తీ ఫెడరేషన్ ఒక్కటే ఉందని, అది తనదేనని ఫడ్నవీస్‌కు నవ్వుతూనే చురకలంటించినా ఆయనకే చెల్లింది. పవార్ ఎత్తులకు షా చిత్తు ఎన్సీపీని చీల్చేందుకు ప్రయత్నించిన అమిత్ షా ఎత్తులకు పై ఎత్తులు వేసి కేవలం 78 గంటల్లోనే కౌంటర్ ఇచ్చారు శరద్ పవార్. పార్టీ ఎమ్మెల్యేలు తన వెంట నడిచేలా చూసుకోవడంతో పాటు అజిత్‌ను బుజ్జగించడంలో సఫలమయ్యారు. రెండు వారాలుగా ఉత్కంఠంగా సాగుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ప్రధాని మోదీని కలుసుకోవడంతో అందరూ ఆయన వైపు అనుమానంగానే చూశారు. అజిత్ పవార్ చీలిపోయి బయటకు వచ్చాక కూడా ఆయన వెనుక శరద్ పవార్ ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ ‘సంఖ్యా బలం లేకపోయినా ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అమిత్ షాకే చెల్లింది. మహారాష్ట్రలో ఆయన ఏం చేస్తారో చూడాలని ఉంది’’అంటూ సవాల్ విసిరారు 54 అంకెతో నేటికీ లింకు ప్రధాని కావాలని కలలు కన్న శరద్ పవార్‌కు 1991లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. రాజీవ్‌గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజకీయాలపై ఆసక్తి లేదంటూ సోనియా అధికారానికి దూరంగా ఉండిపోయారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న శరద్ పవార్‌కు 54 మంది ఎంపీల మద్దతు ఉంది. వారి మద్దతుతో ప్రధాని పీఠం అధిరోహించాలని భావించారు. కానీ అర్జున్ సింగ్ వర్గం అనూహ్యంగా పీవీ నరసింహారావుకి మద్దతు పలకడంతో ప్రధాని పీఠానికి పవార్ చేరువ కాలేకపోయారు. ఇప్పుడు అదే 54 మంది ఎమ్మెల్యేలతో ఆయన కింగ్ మేకర్‌గా మారారు. ఇక చక్రం తిప్పేది పవారే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో శరద్ పవార్ ప్రజల మూడ్ ఎలా ఉందో గ్రహించి, ఎన్నికల తర్వాత దానికి అనుగుణంగానే అడుగులు వేశారు. గద్దెనెక్కనున్న ఉద్ధవ్ ప్రభుత్వం కూడా పవార్ కనుసన్నల్లోనే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
‘మహా’ గుణపాఠం!
మహారాష్ట్రలో దాదాపు నెలరోజులుగా ఎడతెగకుండా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి, ప్రత్యేకించి చివరి మూడురోజుల్లోనూ చోటుచేసుకున్న చిత్ర విచిత్ర నాటకీయ మలుపులకు సర్వోన్నత న్యాయ స్థానం మంగళవారం సరైన ముగింపు పలికింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా ముగిసి, ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్దేశించింది. ఆ ఆదేశాలొచ్చిన కొద్ది సేపటికి ఏం జరగాలో అదే జరి గింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదవి నుంచి వైదొలిగారు. ‘స్వగృహ ప్రవేశం’ చేశారు. రాజ్యాంగ దినోత్సవం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదని చెప్పాలి. ఒక పార్టీకి లేదా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పర్చగల సత్తా ఉన్నదో లేదో తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాదని 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని ఈ తప్పిదాలను సరిచేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడిచ్చిన ఆదేశాలు కూడా ఆ కోవలోనివే అయినా...తక్షణం బలనిరూపణ జరగాలని నిర్దేశించిన తీరు అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదో లేదో నిర్ధారించడం తక్షణావసరమని ధర్మాసనం భావించింది. చట్టవిరుద్ధమైన రాజకీయ బేరసారాల వంటివి చోటు చేసుకోకుండా అడ్డుకోవడానికి, ఏ రకమైన అనిశ్చితికి తావీయకుండా ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి ఇది తోడ్పడుతుందని తెలిపింది. బలపరీక్షకు అధిక సమయం ఇవ్వడం విష యంలో న్యాయమూర్తులకున్న అనుమానాలే దేశంలో చాలామందికి ఉన్నాయి. ఫడ్నవీస్‌తో సీఎంగా ప్రమాణం చేయించాక, బల నిరూపణకు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి ఆయనకు 14 రోజుల సమయం ఇచ్చారు. ఇంత ఎక్కువ వ్యవధి నిస్సందేహంగా రాజకీయ బేరసారాలకు తావిస్తుంది. వివిధ పార్టీలను సంక్షోభంలో పడేస్తుంది. అన్నిటికీమించి రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఆ రాష్ట్రం ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదో అడపా దడపా మీడియాలో కథనాలు వెలువడు తూనే ఉన్నాయి. మరఠ్వాడా ప్రాంతంలో ఈ నెల రోజుల్లోనే 68మంది అన్నదాతలు బలవన్మరణా లకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో అవసరమైనకంటే ఒక్కరోజు కూడా అదనంగా అవకాశం ఇవ్వకూ డదు. కనుకనే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు అన్నివిధాలా కొనియాడదగ్గవి. అయితే మహారాష్ట్రలో సాగిన రాజకీయ డ్రామా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనా, భిన్న రాజ కీయ సిద్ధాంతాలపైనా విశ్వాసమున్న కోట్లాదిమందిని సంశయాల్లో పడేసింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి రెండు కూటములు చెరోవైపూ మోహరించాయి. హిందూత్వ సిద్ధాంతాన్ని ఆచరించే పార్టీలుగా బీజేపీ, శివసేనలు ఒక కూటమిగా... ఆ సిద్ధాంతాన్ని ప్రతిఘటించే పార్టీలుగా కాంగ్రెస్, ఎన్సీపీలు మరో కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు చూస్తే అంతా తారు మారైంది. సిద్ధాంతాల రాద్ధాంతం లేకుండా, ఎన్నికల ముందు కూటములతో సంబంధం లేకుండా పార్టీలన్నీ రంగులు మార్చాయి. ఇందులో ఎవరు దోషులు, ఎవరు కాదన్న విచికిత్సకు తావులేదు. అందరూ అందరే అని నిరూపించుకున్నారు. కనీసం తమ వెనకున్న లక్షలాదిమంది కార్యకర్తలు, తమను నమ్మి సమర్థిస్తూ వస్తున్న కోట్లాదిమంది ప్రజానీకం ఏమనుకుంటారోనన్న కనీస ఆలోచన కూడా వారికి లేకపోయింది. బీజేపీ–శివసేన కూటమి అయిదేళ్ల పాలన చూశాక జనం ఆ కూటమికి మెజారిటీనిచ్చారు. అంతక్రితంతో పోలిస్తే ఆ కూటమి మెజారిటీ తగ్గిన మాట వాస్తవమే అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఆ కూటమికి మాత్రమే ఉంది. కానీ ఆ రెండు పార్టీల మధ్యా ముఖ్య మంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలొచ్చి అవి విడిపోయాయి. పర్యవసానంగా తాము ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేమని బీజేపీ చేతులెత్తేసింది. ఇంతవరకూ అంతా పద్ధతిగానే సాగింది. కానీ శివసేన హఠాత్తుగా ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చర్చోపచర్చలు సాగించి ఆ రెండు పక్షాలతో కలిసి కొత్త కూటమికి సిద్ధపడి సర్కారు ఏర్పాటు కోసం సన్నాహాలు చేసుకుంది. దాంతో బీజేపీ మొన్న శుక్రవారం రాత్రంతా మేల్కొని తెల్లారేసరికల్లా మరో కొత్త కూటమికి ప్రాణప్రతిష్ట చేయడమే కాదు... ఏకంగా అధికార పగ్గాలే చేతుల్లోకి తీసుకుంది. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని రెండు కాంగ్రెస్ లతో శివసేన కూటమి కట్టడం ఎంత తప్పో, నేషనలిస్టు కరప్ట్ పార్టీగా అభివర్ణించిన ఎన్సీపీతో బీజేపీ ఆదరాబాదరాగా చేతులు కలపడం కూడా అంతే తప్పు. పైగా తాము చేతులు కలిపింది ఎన్సీపీ తోనా, ఆ పార్టీలో శరద్ పవార్ ఆశీస్సులు లేకుంటే గుండు సున్నాగా మిగిలే అజిత్ పవార్తోనా అన్నది కూడా అది చూసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రపతి మొదలుకొని ప్రధాని, రాష్ట్ర గవర్నర్ వరకూ అందరికీ మరక అంటింది. రాష్ట్రపతి పాలన ఎత్తేయడానికి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అధికార వ్యవస్థలో పైనుంచి కిందివరకూ అందరికందరూ చూపిన తొందరపాటుతనం మన గణతంత్రాన్ని నవ్వులపాలు చేసింది. కనీసం సమర్థించుకోవడానికి కూడా తడబడే దుస్థితికి బీజేపీని దిగజార్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికైతే అంతా సర్దుకుంది. అంతా సవ్యంగా జరిగితే గురువారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ అఘాదీ’ అధికార పగ్గాలు చేపట్టాలి. అయితే పరస్పరం పొసగని మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం సుస్థిర పాలన అంది స్తుందా, సజావుగా మనుగడ సాగిస్తుందా అన్నది చూడాల్సివుంది. కనీసం మహారాష్ట్ర అనుభవంతో నైనా గవర్నర్లు రాజకీయ డ్రామాల్లో తలదూర్చకుంటే అదే పదివేలు. -
ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మరో ముందడుగు వేసింది. కూటమి తరుఫున నేతగా మూడు పార్టీల సభ్యులు (ఎమ్మెల్యేలు) శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా అనంతరం ముంబైలోని ఓ హోటల్లో సమావేశమైన మూడు పార్టీల నేతలు ఉద్ధవ్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 1న ముంబైలోని శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ కూడా ప్రమాణం చేయనున్నారు. (అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆదేశం) ఠాక్రేకు మద్దతుగా ఎమ్మెల్యేలంతా సంతకాలు పెట్టిన లేఖను గవర్నర్‌ను కలిసి అందజేయనున్నారు. కాగా రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణంతో సభ ముగియనుంది. కాగా అసెంబ్లీలో సరిపడ బలం లేనందున సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. (సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా) -
మహారాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ రాజీనామా అనంతరం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ బలపరీక్ష చేపట్టేందుకు గవర్నర్ చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్వీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ శాసనసభ్యుడు కాళిదాస్ కోలంబకర్‌ను నియమించారు. నిబంధనలు ప్రకారం సభలో సీనియర్ సభ్యుడైన ఎమ్మెల్యేను ప్రొటెం స్వీకర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు సభకు ఎనిమిది సార్లు ఎన్నికయిన కాళిదాస్‌కు గవర్నర్ ఆ బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, బలపరీక్షను నిర్వహించనున్నారు. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆలోపే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమయింది. కూటమి నేతగా ఉద్దవ్ ఠాక్రేను ఎన్నుకునేందుకు మూడు పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలువనున్నారు. -
‘మహా’ రాజకీయం: ఎప్పుడు ఏం జరిగిందంటే..
ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడినప్పటీ నుంచి మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా నిలువడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. రాత్రికి రాత్రే మహా రాజకీయంలో కీలక పరిణామలు చోటుచేసుకోవడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ‘మహా సంక్షోభం’లో ఎప్పుడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే.. అక్టోబర్ 21 : గత నెల 21వ తేదీన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగగా, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేశాయి. అక్టోబర్ 24 : మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలుబడ్డాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా 161 స్థానాలో విజయం సాధించిన బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అక్టోబర్ 25 - నవంబర్ 9 : ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, బీజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి. సీఎం పదవిని ఇరు పార్టీలు పంచుకోవాల్సిందేనని శివసేన డిమాండ్ చేసింది. అయితే శివసేన డిమాండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ తమ డిమాండ్‌పై సానుకూలంగా లేకపోవడం శివసేన నేతలు తెరవెనక ఎన్సీపీతో మంతనాలు జరిపారు. ఓవైపు శివసేన కూటమి ధర్మాన్ని విస్మరించిందని బీజేపీ నాయకులు, మరోవైపు బీజేపీనే మాట తప్పిందని శివసేన నాయకులు విమర్శలకు దిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, బీజేపీల మధ్య సయోధ్య కుదర్చడానికి ఆరెస్సెస్‌తో పాటు పలువురు బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి. చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన నిర్ణయించుకుంది. ఆ మేరకు చర్చలను ముమ్మరం చేసింది. నవంబర్ 9 : మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో.. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించారు. నవంబర్ 10 : గవర్నర్ ఆహ్వానంపై స్పందించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు పూర్తి స్థాయిలో మెజారిటీ లేదని తెలిపింది. దీంతో గవర్నర్ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో పాటు మెజారిటీ నిరూపించుకునేందుకు 24 గంటల గడువు విధించారు. నవంబర్ 11 : గవర్నర్ పిలుపుపై స్పందించిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు 3 రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే సేన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు. అనంతరం మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. అందుకోసం వారికి 24 గంటల సమయం ఇచ్చారు. నవంబర్ 12 : తమ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడాన్ని శివసేన సుప్రీం కోర్టులో సవాలు చేసింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నవంబర్ 13-21 : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు తప్పుబట్టారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన నేతలు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా శివసేనకు మద్దతిచ్చే అంశంపై పలుమార్లు చర్చలు జరిపాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై మోదీతో పవార్ చర్చించినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 22 : ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. మహా వికాస్ అఘాడిగా ఏర్పడిన మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. నవంబర్ 23 : బీజేపీ తెరవెనక జరిపిన మంతనాలతో మహారాష్ట్రలో రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో ఉదయం 5.47 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపత్తి పాలన ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామాలు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. అజిత్ పవార్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శరద్ పవార్ మాత్రం తమ మద్దతు శివసేనకే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరు అజిత్ వెంట లేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా అజిత్ పవార్‌ను ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా తొలగించారు. అలాగే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 24 : శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. విశ్వాస పరీక్షపై వెంటనే ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్, ఫడ్నవీస్ లేఖలను ముందుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మహారాష్ట్రలోని పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ ఎమ్మెల్యేలను వివిధ హోటల్స్‌లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించాయి. అలాగే ఉద్దవ్, శరద్‌పవార్‌లు శిబిరాల్లో ఉన్న తమ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. కచ్చితంగా తాము ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 25 : శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం అసెంబ్లీ బలపరీక్షకు సంబంధించిన తీర్పును 26వ తేదీ ఉదయం 10.30 వెలువరించనున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో మహా వికాస్ అఘాడి బలప్రదర్శనకు దిగింది. తమ వెంట 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు. కచ్చితంగా తామే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 26 : మహారాష్ట్ర అసెంబ్లీలో 27వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు తరువాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మరిపోయాయి. సుప్రీం తీర్పును శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఇదిలా ఉంటే సుప్రీం తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన సీఎం ఫడ్నవీస్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు. -
‘మహా’ సెంటిమెంట్..
ముంబై: భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ అన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అందుకే మనోళ్లను సెంటిమెంటల్ ఫూల్స్ అని వెక్కిరిస్తుంటారు. సెంటిమెంట్‌కు ఆయింట్మెంట్ కూడా లేదని సరదాగా అంటుంటారు. ఈ మాటకేమో గానీ సెంటిమెంట్‌తో రాజకీయాల్లోనూ ‘మహ’ బాగా నెగ్గుకురావొచ్చని తాజాగా నిరూపితమైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఒక్క సెంటిమెంట్ సీన్‌తో సమసిపోయిందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వ్యూహాలు-ప్రతివ్యూహాలు, ఎత్తులు-పైఎత్తులతో నెలరోజులుగా వేడెక్కిన మరాఠ రాజకీయాలు చివరకు సెంటిమెంట్ సీన్‌తో కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలిసి రాకపోవడంతో బీజేపీ తెలివిగా ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా ఉన్న అజిత్ పవార్‌ను తనవైపు తిప్పుకుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి ఎన్సీపీలో చీలిక తేవాలని కుట్ర చేసింది. వెంటనే అప్రమత్తమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా మంత్రాంగం నడిపారు. అజిత్ పవార్‌ను శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తనతో పాటు మిత్రపక్షాల ద్వారా అజిత్‌ను వెనక్కి పిలిచారు. ఇన్ని చేసినా అజిత్ పవార్ కమళ దండును వదిలి వెనక్కు రాలేదు. ఈలోగా మూడు రోజులు గడిచిపోయాయి. తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ‘పెద్దాయన’ తన సతీమణి ప్రతిభ పవార్‌తో అజిత్‌కు రాయబారం పంపారు. బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి వస్తే పవార్ పరివారంలో కలతలు సమసిపోతాయని, శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి వస్తుందని అజిత్‌ను స్వయంగా కలిసి చిన్నమ్మ బుజ్జగించారు. చెల్లెలు సుప్రియా సూలే కూడా అన్నయ్యకు నచ్చజెప్పారు. వీరిద్దరి మాటలతో మెత్తబడ్డ అజిత్ వెంటనే బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి సొంతగూటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తున్నాయి. సినిమాల్లోనే కాదు సెంటిమెంట్ సీన్ ఎక్కడైనా పండుతుందని మరోసారి రుజువైందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. (రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య) -
అజిత్ పవార్ దారెటు..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సంక్షోభానికి మూల కారణమైన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మూడు రోజుల వ్యవధిలోనే సంచలనంగా మారారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన తరుణంలో బీజేపీకి మద్దతు ప్రకటించి రాజకీయాలను ఊహించని మలుపు తిప్పారు. అనంతరం తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా వస్తారని భావించిన అజిత్.. అత్యాశకు పోయి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం, వ్యూహ చతురతలో దిట్టగా పేరొందిన శరద్ పవార్ ముందు అజిత్ కుప్పి గంతులు ఏమీ పనిచేయలేదు. అజిత్ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు అందరినీ సమీకరించుకోవడంలో శరద్ విజయం సాధించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్ చివరికి ఒంటరిగా మిగిలారు. (సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా) అజిత్‌ను శరద్ నమ్ముతారా? ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి.. ఆయనతో చర్చలు జరిపారు. అంతకీ అజిత్ వెనక్కితగ్గకపోవడంతో శరద్ పవార్ భార్యను రంగంలోకి దింపి చివరికి విజయం సాధించారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరమే సీఎం పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా తప్పుకోక తప్పలేదు.అయితే శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన అజిత్ భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తదుపరి ఏర్పడే శివసేన ప్రభుత్వంలో ఆయనకు స్థానం లభిస్తుందా? లేక పార్టీని చీల్చినందుకు పక్కన పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ శాసనసభాపక్ష పదవి నుంచి ఇప్పటికే తొలగించిన శరద్.. మరోసారి అజిత్‌ను నమ్ముతారా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కూటమి నేతను ఎన్నుకునేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. సాయంత్రం 6 గంటకు ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అజిత్ భవితవ్యంపై కూడా చర్చించే అవకాశం ఉంది. (పదవికి అజిత్ పవర్ రాజీనామా) అయితే సంజయ్ రౌత్ లాంటి వాళ్లు మాత్రం అజిత్ ఎన్సీపీలోనే ఉంటారని ఇది వరకే ప్రకటించారు. బీజేపీతో చేతులు కలిపిన అనంతరం అజిత్‌తో రాయబారం నడిపిన ఎన్సీపీ నేతలు తిరిగి రావాల్సిందిగా కోరారని, శివసేన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా అప్పగిస్తామని భరోసా ఇచ్చినట్లు ఎన్సీపీ వర్గాల సమాచారం. వారి ప్రతిపాదనలకు ఒప్పుకున్న తరువాతనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే అజిత్ రాజీనామాపై శరద్ ఇంకా స్పందించలేదు. శివసేన, కాంగ్రెస్ నేతలు కూడా ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. -
సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా
సాక్షి, ముంబై: అసెంబ్లీ బలపరీక్షకు ముందే బీజేపీ వెనక్కితగ్గింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే ఫడ్నవిస్ కూడా వైదొలిగారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 79 గంటల్లోనే ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు ముంబైలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను పోత్సహించే తత్వం తమది కాదని, ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసం ఏర్పడిన శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మధ్యలోనే కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రలోగా ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీపీపై తిరుగుబాటు చేసేలా అజిత్‌ను ప్రోత్సహించిన బీజేపీ.. డిప్యూటీ సీఎంగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే అజిత్ వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని భావించిన ఫడ్నవిస్ అంచనాలు తలకిందులయ్యాయి. శరద్ పవార్ చాతుర్యంతో అజిత్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గుకురాలేమని భావించిన ఫడ్నవిస్ రాజీనామాను ప్రటకించారు. రాజీనామా సందర్భంగా మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. శివసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న శివసేన ఆ తరువాత దారుణంగా మోసం చేసింది. అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. ఓ వైపు మాతో మాట్లాడుతూ.. విపక్షాలతో చర్చలు జరిపింది. ప్రజల తీర్పుకు విరుద్ధంగా శివసేన వ్యవహరించింది. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే బేరాలకు దిగారు. ఎన్నికల్లో బీజేపీని అతిపెద్ద పార్టీగా మరాఠా ప్రజలు నిలిబెట్టారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటా. అసెంబ్లీలో బలం లేనందును సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు. -
‘మహా’ ట్విస్ట్; బీజేపీ ఖేల్ ఖతం
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ఆట ముగిసిందని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రంలోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని బీజేపీని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మాలిక్ స్పందించారు. ‘సత్యం గెలిచింది. బీజేపీ ఆట ముగిసింద’ని హిందీలో ట్వీట్ చేశారు. అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు అందరూ తిరిగొచ్చారని అంతకుముందు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి సంతృప్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్విరాజ్ చవాన్ అన్నారు. రాజ్యాంగం దినోత్సవం నాడు రాజ్యాంగాన్ని గౌరవించే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ కూటమి అసెంబ్లీలో బలం నిరూపించుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అసలు రంగు రేపు బయట పడుతుందని అన్నారు. తమ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించాయి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని, హోటల్లో కాదని బీజేపీ నాయకుడు రాంమాధవ్ వ్యాఖ్యానించారు. (చదవండి: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవర్ రాజీనామా) -
అజిత్ పవార్ సంచలన నిర్ణయం.. రాజీనామా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. అసెంబ్లీలో బుధవారం సాయంత్రంలోగా బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ తాజా నిర్ణయంతో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీలో సగం మంది ఎమ్మెల్యేలతో ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్.. వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అజిత్ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు 52 మంది సభ్యులు తమతో ఉన్నారని శరద్ ప్రకటించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్ చివరికి ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి.. ఆయనతో చర్చలు జరిపారు. అంతకీ అజిత్ వెనక్కితగ్గకపోవడంతో శరద్ పవార్ భార్యను రంగంలోకి దింపారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బలపరీక్షలో ఫడ్నవిస్ ప్రభుత్వం నెగ్గుకురావడం సవాలుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ బలంలేని నేపథ్యంలో సీఎం పదవికి ఫడ్నవిస్ కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ శిబిరంలో సంతోష వాతావరణం నెలకొంది. -
రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బలపరీక్షను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు వేగంగా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్ ట్రీ హోట్‌లో శివసేన నేతలు, మరియట్ హోటల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అజిత్ పవార్‌పై ఎన్సీపీ ఒత్తిడి శివసేన, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్సీపీకి ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ చివరిక్షణంలో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్.. రేపటి బలపరీక్షలో కీలకం కానున్నారు. అజిత్ పవార్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అజిత్‌ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అజిత్ పవార్‌తో మంగళవారం శరద్ పవార్ కుటుంబసభ్యులు మంతనాలు జరిపారు. శరద్ పవార్ భార్య రంగంలోకి దిగి.. అజిత్‌తో మాట్లాడారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. తిరిగి ఎన్సీపీ గూటికి వస్తే.. శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అజిత్‌కు వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఎన్సీపీ నేతలు ఒత్తిడి.. అటు బీజేపీ నేతలు ఆశల నేపథ్యంలో అజిత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. బుధవారం నాటి బలపరీక్షలో అజిత్ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అజిత్ బీజేపీ సర్కారును కూల్చుతారా? లేక నిలబెడతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. -
కీలక మలుపు.. ఎమ్మెల్యేలతో బలప్రదర్శన
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మరోసారి హైడ్రామా నెలకొంది. రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పరేడ్ (బలప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 7గంటల తరువాత 162 మంది ఎమ్మెల్యేలతో ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌కు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా ఒకదగ్గరకు చేరుకున్నాక వారందరితో పరేడ్ (బలప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. పరేడ్‌గా వెళ్లి ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కలువనున్నారు. దీని కోసం ఇప్పటికే సభ్యులంతా సిద్ధమయ్యారు. సభ్యులంతా మా బలం 162 మంది అంటూ ప్లేకార్డులు ప్రదర్శిస్తున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, శరద్ పవార్, సుప్రియా సూలే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదివరకే అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి సవాలు విసిరారు. ప్రస్తుతం తమ వద్ద 162 మంది శాసనసభ్యులు ఉన్నారని, అవసరమైతే స్వయంగా వచ్చి చూసుకోవాలని అన్నారు. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు పూర్తి మెజార్టీ ఉందని, కానీ బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదని రౌత్ పేర్కొన్నారు. దీంతో బహిరంగ బలప్రదర్శనకు దిగుతున్నట్లు వెల్లడించారు. తాజా పరిణామంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత మరింత వేడెక్కాయి. -
మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్ వర్గం) బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అజిత్ పవార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత శరద్ పవార్‌తో మాట్లాడించినట్టు సమాచారం. అజిత్‌ను బుజ్జగించి తిరిగి తనవైపు తిప్పుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ అజిత్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. శరద్ పవార్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతునివ్వబోరని ఛగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిన అజిత్‌కు ఎమ్మెల్యేలెవరూ మద్దతునివ్వడం లేదని, ఎన్సీపీకి 54మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 53మంది శరద్ పవార్ వెంటే ఉన్నారని, స్వయంగా ఎమ్మెల్యే అయిన అజిత్ ఒక్కడే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. -
మాకు 162మంది ఎమ్మెల్యేల మద్దతుంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్సీపీ ముఖ్య నేత అజిత్ పవార్ ఒక్కసారిగా తిరుగుబాటు చేసి.. బీజేపీతో చేతులు కలుపడంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహరాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష విషయమై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించనుండగా.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు సోమవారం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 162మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు ఉదయం 10 గంటలకు నేను, షీండే, చవాన్, వినాయక్ రావత్ తదితర నేతలతో కలిసి గవర్నర్‌ను కలిశాం. మా కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ తరఫున లేఖ ఇచ్చాం. గవర్నర్ ఎప్పుడు కోరితే అప్పుడు 162 మంది ఎమ్మెల్యేలను ఆయన ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు. తప్పుడు పత్రాలతో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైందని, కానీ తమ కూటమికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్రలోని రాజకీయ డ్రామాపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. బీజేపీకి మెజారిటీ లేదనే విషయం అందరికీ తెలిసిందేనని, గతంలో తమకు మెజారిటీ లేదనే విషయాన్ని అంగీకరిస్తూ బీజేపీ గవర్నర్‌కు లేఖ కూడా రాసిందని గుర్తు చేశారు. ఇక, అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ విషయమై పార్టీ నేతలు తగిన సమయంలో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు అజిత్ వర్గం ఎమ్మెల్యేలు క్రమంగా తమవైపు చేరుతున్నారని, ప్రస్తుతం 53మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తెలిపారు. -
వెంటనే బలపరీక్ష జరగాలి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుబట్టాయి. బీజేపీ ఉద్దేశపూరితంగానే బలపరీక్షను జాప్యం చేయాలని చూస్తోందని, ఈ రోజు లేదా రేపటిలోగా బలపరీక్షకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాయి. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా శివసేన పార్టీ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మహారాష్ట్రలో హడావిడిగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారని సింఘ్వీ దుయ్యబట్టారు. అజిత్ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు ధ్రువీకరిస్తూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వారు లేఖ ఎంతమాత్రం ఇవ్వలేదని సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అజిత్ వద్ద ఉన్న లేఖతో బీజేపీ అతి తెలివి ప్రదర్శించిందని, గవర్నర్ ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన అఫిడవిట్లను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, విచారణ పరిధిని పెంచడం ఇష్టంలేని సుప్రీంకోర్టు ఈ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరించింది. ఉద్ధవ్ ఠాక్రేకు 48మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 56మంది శివసేన ఎమ్మెల్యేలు, 44మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతునిస్తున్నారని సింఘ్వీ స్పష్టం చేశారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు, బేరసారాలను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష జరగాలని, 24 గంటల్లో అసెంబ్లీ బలనిరూపణ చేసుకునేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సింఘీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇవ్వవద్దని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం శివసేన కూటమికి ఉందని తెలిపారు. బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ కూడా పేర్కొంటున్నదని, ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా జాప్యమెందుకని, వీలైనంత త్వరగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బలపరీక్ష జరగడం ముఖ్యమని, గెలుపోటములు కాదని అన్నారు. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! శివసేన తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందన్న అజిత్ పవార్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఏదని ప్రశ్నించారు. తమ వద్ద 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి అఫడవిట్లు ఉన్నాయని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం శాసనసభాపక్ష నేత అజితే ఫిరాయించారని ఆరోపించారు. సభలో బలముంటే నిరూపించుకోవడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని సిబల్ నిలదీశారు. తెల్లవారుజామునే హడావిడిగా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేశారని, చడీచప్పుడు లేకుండా హడావిడిగా ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని విమర్శించారు. సభలో వీడియో రికార్డింగ్ ద్వారా బలపరీక్ష జరగాలని కోరారు. ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన తీరుగానే మహారాష్ట్రలోనూ బలపరీక్ష జరగాలని కోర్టును కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా ఉండి కలిసి పోటీ చేసిన శివసేన.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించిందని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. శివసేన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శివసేన తీరుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, అనంతర పరిణామాల్లో ఒక పవార్ బీజేపీతో ఉండగా.. మరొక పవార్ శివసేనతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న శివసేన కూటమే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలపై గవర్నర్‌ను అనుమానించాల్సిన అవసరం లేదని, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ కలిసి సమావేశమైన తర్వాతే గవర్నర్‌కు లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారని చెప్పారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. ఫడ్నవిస్‌కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? అంటూ ప్రశ్నించింది. దీనికి రోహత్గి స్పందిస్తూ.. అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఫడ్నవిస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ విచణతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకలో యెడియూరప్ప సర్కారు ఏర్పాటు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఎప్పటిలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలో సుప్రీంకోర్టు చెప్పజాలదని రోహత్గి వాదించారు. చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి? ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ తరఫు లాయర్ మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. తమదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని చెప్పుకొచ్చారు. ఎన్సీఎల్పీ నాయకుడిగా తమ పార్టీకి చెందిన 54మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు ఇచ్చానని తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు లేఖ ఇచ్చానని సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పార్టీలోనే పరిష్కరించుకుంటామని, వెంటనే ఈ పిటిషన్‌పై విచారణ నిలిపివేయాలని అజిత్ లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
బీజేపీ టార్గెట్ 180.. ఆ నలుగురిపైనే భారం!
ముంబై : బలపరీక్షలో తన ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బంపర్ మెజారిటీతో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినట్టు తెలుస్తోంది. మీడియా కంటపడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 145. కానీ, బీజేపీ 170 నుంచి 180 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. ఇటీవలికాలంలో బీజేపీలో చేరిన నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్లకు ‘ఆపరేషన్ ఆకర్ష’ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో వీరికి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇక, గణేశ్ నాయక్, బాబన్‌రావు ఎన్సీపీ మాజీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వీరికి మంచి సంబంధాలున్నాయి. వీరి ద్వారా పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు నేతలు పలువురు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చారని అంటున్నారు. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్నట్టు చెప్తోంది. ఈ 15మంది స్వతంత్రుల్లో 11మంది ఇప్పటికే మద్దతు లేఖలు ఇచ్చారు. ఇక, ఇటీవల చేతులు కలిపిన అజిత్ పవార్ 27 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను తనవెంట తీసుకొచ్చే అవకాశముందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదే జరిగితే 143 నుంచి 146 మంది మద్దతు బీజేపీకి దక్కినట్టు అవుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగే స్పీకర్ ఎన్నికలో తమ నేతను సభాపతిగా ఎన్నుకుంటే.. సగం బలపరీక్ష నెగ్గినట్టేనని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకునేందుకు అటు శరద్ పవార్ కూడా శాయశక్తులా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక, బీజేపీ అజిత్‌పైనే గట్టి నమ్మకమే పెట్టుకుంది. ‘అజిత్ వెంట 27 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముంది. ఎన్నికల్లో పార్టీ రోజువారీ వ్యవహారాలు చూసుకోవడమే కాదు.. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఖర్చులను పూర్తిస్థాయిలో అజితే భరించారు. ఇటు కాంగ్రెస్, సేన ఎమ్మెల్యేలకు కూడా ఆయన సాయం చేశారు. కాబట్టి ఆయన వెంట పెద్దఎత్తున ఎమ్మెల్యేలు కలిసివచ్చే అవకాశముంది’ అని ఒక బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. మొత్తం 29 మంది (16 మంది చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, 13 మంది స్వతంత్రులు)లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతునిస్తున్నారు. వీరిలో చాలామందికి బీజేపీ గట్టిగానే గాలం వేస్తోంది. వీరిలో ఎక్కువమంది బీజేపీలో చేరే అవకాశముందని భావిస్తున్న కమలదళం.. శివసేన ఎమ్మెల్యేల్లో కూడా కొందరిని తనవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేల్లో ఎస్పీ, ఎంఐఎం మినహా మిగతా 19, 20 మంది మద్దతు తనదేనని బీజేపీ ధీమాగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేల డిమాండ్లకు అంగీకరించడమే కాదు.. ఫిరాయింపునకు సిద్ధపడితే మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమంటూ బీజేపీ ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఆపరేషన్ ఆకర్ష ఫలిస్తే బలపరీక్షలో నెగ్గడం చాలా సులభమని కాషాయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. -
మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్ వద్ద కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులు నిరోధించాలంటే వెంటనే బలపరీక్ష జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. 24 గంటల్లోగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వరాదని, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం కనీసం 7రోజుల గడువు ఇవ్వాలని బీజేపీ తరఫు న్యాయవాది కోరగా.. 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం చేయరాదని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ధర్మసనాన్ని అభ్యర్థించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! గవర్నర్ నిర్ణయంలో తప్పేముంది? కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ముందు పొత్తులకు సంబంధించి గవర్నర్‌కు అన్ని విషయాలు తెలుసునని, కూటమి పొత్తుల గురించి కూడా ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతిస్తూ బీజేపీ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదట మూడు పార్టీలను గవర్నర్ ఆహ్వానించారని, ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోవడంతో విధిలేక రాష్ట్రపతి పాలన విధించారని వివరించారు. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చిందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. బీజేపీకి మద్దతునిస్తూ 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అజిత్ పవార్ ఇచ్చారని, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత హోదాలో అజిత్ లెటర్ హెడ్లో ఎమ్మెల్యేలతో సంతకాలతో ఈ లేఖ ఉందని వివరించారు. చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి? బీజేపీ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఈ 170 మంది ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్ద ఉందని వివరించారు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ విచక్షణాధికారాలు ఉంటాయని, గవర్నర్ నిర్ణయంపై న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టుకు లేదని, వెంటనే ఈ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను ఆహ్వానించే హక్కు గవర్నర్‌కు ఉందని, 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చాక దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తప్పేముందని, ప్రశ్నించారు. గవర్నర్ విడివిడిగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేరు కదా అని వ్యాఖ్యానించారు. పార్టీలు సమర్పించిన జాబితానే గవర్నర్ విశ్వసిస్తారని తెలిపారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ ఎవరికీ జవాబుదారీ కాదని పేర్కొన్నారు. ఫిరాయింపులపై ఆలోచించాకే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఆదివారం సెలవురోజు అయినప్పటికీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్‌కు రాసిన లేఖను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ లేఖలను సోలిసిటర్ జనరల్ సోమవారం న్యాయస్థానానికి అందజేశారు. ఈ రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఆదివారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. అయితే, 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆ లేఖలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం ‘24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను గవర్నర్ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్‌కు ఫడ్నవీస్ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం. చదవండి: విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం! -
ఈ ట్విస్ట్‌లు తట్టుకోలేకపోతున్నాం!
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వైపు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటుండగా మరోవైపు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వాశీంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కాలేదని ఓ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించగా మరోవైపు చంద్రాపూర్ జిల్లాలో జహీర్ సయ్యద్ అనే ఉపాధ్యాయుడు సెలవు కోసం రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. ఆయన లేఖను బట్టి రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు రాజకీయ నేతలు కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నది స్పష్టమైంది. ఉదయం లేవగానే రాష్ట్రంలో తారుమారైన పరిస్థితులను చూసి తాను అస్వస్థతకు గురయ్యానని అందుకే తనకు శనివారం ఒక రోజు సెలవు కావాలని తన పై అధికారికి లేఖ రాశాడు. ఈ లేఖలో రాçష్ట్రంలో ఈ రోజు వచ్చిన రాజకీయ భూకంపంతో తాను అస్వస్థతకు గురయ్యానని దీంతో తనకు సెలవు మంజూరు చేయాలని వినతి చేశారు. అయితే ఉపాధ్యాయుడి లీవ్ లెటర్‌ను కాలేజ్ ప్రిన్సిపల్ తిరస్కరించారు. చదవండి: మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు! నాయకుడు సీఎం కాకపోవడంతో.. శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన శివసేన కార్యకర్త రమేష్ జాధవ్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటన వాశీంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి వరకు శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కానున్నారని ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని భావించిన సంగతి తెలిసిందే. అయితే రాత్రికి రాత్రే ఊహించని పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్ వచ్చాయి. తెల్లారేసరికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘మహా’ మహిళ..మూడో కంటికి తెలియదు ఇలాంటి సంఘటనతో అనేక మంది షాక్‌కు గురయ్యారు. వాశీంలో జిల్లా ఉమరీ గ్రామానికి చెందిన రమేష్ జాధవ్ ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన ఆయన జిల్లా హెడ్ క్వార్టర్ వాశీంలో బ్లేడ్‌తో శరీరాన్ని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే రక్తం మడుగులో పడి ఉన్న రమేష్ జాధవన్‌ను గమనించిన ఓ ట్రాఫిక్ పోలీసు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని దిగ్రస్ పోలీసులు తెలిపారు. ఇక తాజా రాజకీయ ట్విస్టుల నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌లతో ఫొటో దిగి పవార్ కుమార్తె సుప్రియా సూలే ట్విటర్లో పెట్టారు. With Aaditya Thackeray (@AUThackeray), Sanjay Raut (@rautsanjay61) Ji and Rohit Pawar (@RohitPawarOffic) pic.twitter.com/M1MQwk9ylz — Supriya Sule (@supriya_sule) November 24, 2019 -
మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న బీజేపీ.. ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను వేర్వేరు హోటళ్లకు తరలించి.. వారు జంప్ కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. అయినా ఆయా పార్టీలను ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి బీజేపీ నిఘా పెట్టినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో తిరుగుతున్న ఇద్దరు పోలీసులను ఎన్సీపీ నేతలు గుర్తించి నిలదీయడం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ సర్కార్ ఉసిగొల్పడంతోనే పోలీసులు ఇలా మాములు చొక్కాలు ధరించి.. తమపై గూఢచర్యం నెరుపుతున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో పోలీసులు కనిపించడంతో అప్రమత్తమైన ఎన్సీపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలను ఆ హోటల్ నుంచి హోటల్ హయత్‌కు ఆదివారం సాయంత్రం మార్చింది. ముంబై పొవైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో ఇద్దరు పోలీసులు కనిపించడంతో వారిని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ నిలదీశారు. పోలీసుల ఐడీ కార్డులు చెక్‌చేసిన ఆయన.. ‘ఉన్నతమైన పదవుల్లో ఉన్న మీరు ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ తిరుగుతున్నారని చెబితే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్లమా?’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ తరఫున పోలీసులు గూఢచర్యం నెరుపుతున్నారని, ఎమ్మెల్యేల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీజేపీకి చెరవేస్తున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సైతం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్లో బీజేపీ కూడా రూమ్‌లు బుక్ చేస్తోందని, తద్వారా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ గాలానికి అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు తరలించారు. అటు శివసేన తన ఎమ్మెల్యేలను గట్టి నిఘా నడుమ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని లలిత హోటల్లో ఉంచింది. -
బ్రేకింగ్ న్యూస్ ఏమో కానీ.. : సుప్రియా సూలే
ముంబై/న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో జరుగుతున్న నాటకీయ పరిణామాలను కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో శరద్ పవార్ వెళ్తున్న కారును వెంబడించిన మీడియా ప్రతినిధులు.. ప్రమాదకర రీతిలో వీడియో చిత్రీకరించారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. వెనకాల ఉన్న వ్యక్తి వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సుప్రియా.. ‘మీరు చేస్తున్నది బ్రేకింగ్ న్యూస్ కోసమని తెలుసు.. కానీ కాస్త జాగ్రత్త తీసుకోండి. నేను ఆ బైక్ డ్రైవర్, కెమెరామెన్ గురించి ఆందోళన పడుతున్నాన’ని పేర్కొన్నారు. బంధుత్వాలు ముఖ్యమని నమ్ముతాను.. అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఉద్దేశించి సుప్రియా తన వాట్సాప్ స్టేటస్‌లో పలు పోస్ట్‌లను ఉంచారు. కుటుంబం, పార్టీలో చీలిక వచ్చిందని పేర్కొన్న ఆమె.. తాను జీవితంలో ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదని అన్నారు. తాము అతన్ని నమ్మినందుకు, ప్రేమించినందుకు.. తిరిగి తమకు ఏమి లభించిందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. ‘అధికారం వస్తుంది.. పోతుంది. కానీ బంధుత్వాలు ముఖ్యమని నేను నమ్ముతాను’, ‘ గుడ్ మార్నింగ్.. విలువలే చివరకు విజయం సాధిస్తాయి. నిజాయితీ, శ్రమ ఎప్పటికీ వృథా కాదు.. ఈ మార్గం చాలా కష్టమైనదైనప్పటికీ దీర్ఘకాలం నిలిచిపోతుంది’ అంటూ కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటీ నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార పంపిణీ విషయంలో శివసేన, బీజేపీల మధ్య పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీతో మంతనాలు జరిపింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ముగియడంతో గవర్నర్.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ క్రమంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా యత్నించింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చింది. శనివారం రోజున గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమైంది. కానీ, బీజేపీ తెరవెనక మంతనాలు జరపడంతో.. రాత్రికి రాత్రే మహా రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీ మద్దతుగా నిలువడంతో.. గవర్నర్ దేవేంద్ర ఫడ్నవిస్‌చే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీచేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
మహాట్విస్ట్ : మోదీకి అజిత్ ట్వీట్
ముంబై: మహారాష్ట్రలో ట్విస్ట్‌కు కారణమైన అజిత్ పవార్‌ను బుజ్జగించేందుకు ఎన్సీపీ చేసిన ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. అజిత్‌తో చర్చలు జరిపేందుకు శరద్ పవార్ దూతగా వెళ్లిన ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్ తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. ఆయనతో చర్చలు జరిపేందుకు అజిత్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను బీజేపీతోనే ఉన్నట్లు అజిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన పాలన అందించేందుకు కృషిచేస్తానంటూ మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ట్విచ్ చేశారు. మరోవైపు బీజేపీ బలపరీక్షలో నెగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను బీజేపీ వలకు చిక్కకుండా హోటళ్లకు తరలించాయి. వారు ఉన్న హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శివసేన ఎమ్మెల్యేలు ఉన్న లలిత్ హోటల్ వద్ద రెండు పోసీస్ స్టేషన్ల సిబ్బంది కాపలా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు రెనోసా హోటల్లో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించినట్టు తెలుస్తోంది. 49 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని ఎన్సీపీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగొస్తారని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం నలుగురు మాత్రమే అజిత్ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్ ఇదివరకే ప్రకటించారు. -
‘మహా’ గవర్నర్ రాజీనామా చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ ఏర్పాటుపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలపై అశోక్ గెహ్లాట్ ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చర్యలు చూస్తుంటే బీజేపీతో చేతులు కలిపినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘మహా’ రాజకీయ అనిశ్చితికి గవర్నరే కారణమని విమర్శించారు. భగత్‌సింగ్ కోశ్వాయరీ పక్షపాతంతో వ్యవహరించారని, నియమ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేనకు మాత్రమే ఉందన్నారు. శనివారం ఉదయం అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కాగా బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిపై సీఎం ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పవార్ వ్యూహం.. అజిత్‌కు ఆహ్వానం!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించడంతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దూకుడు పెంచారు. బలపరీక్షలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు తన వ్యూహాలకు మరింత పదునుపెట్టారు. ఎన్సీపీపై తిరుగుబావుటా ఎగరేసిన అజిత్ పవార్‌ను వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అజిత్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్‌ను దూతగా ప్రయోగించారు. అజిత్‌తో చర్చలు జరిపి వెనక్కి తీసుకురావాలి పాటిల్‌ను ఆదేశించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అజిత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆయన కోసం ఎన్సీపీ తలుపులు తెరిసే ఉంటాయని అన్నారు. అజిత్ వెనక్కి వస్తారన్న నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. (మహా సంక్షోభం: సుప్రీం కీలక ఆదేశాలు) మరోవైపు సుప్రీం విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో హోటల్లో శరద్ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు. కాగా ఫడ్నవిస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు ఆయన ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్ వర్గం ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆదివారం వారంతా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం నలుగురు మాత్రమే అజిత్ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు శివసేన కూడా తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. (అజిత్ పవార్‌కు ఝలక్..!) కాగా సీఎంగా ఫడ్నవిస్‌ను ప్రమాణ స్వీకారం చేయిస్తూ.. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదివారం విచారణ జరిపింది. బల పరీక్షకు అంత తొందరేమీ లేదని, గవర్నర్‌కు ఫడ్నవిస్ ఇచ్చిన లేఖను వెంటనే తమకు అందించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లకు నోటీసులు జారీచేసింది. బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో పఢ్నవిస్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. -
మహా సంక్షోభం: సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ బలం ఉందంటూ ఫడ్నవిస్ గవర్నర్‌కు సమర్పించిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను తమకు అందజేయాలని సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లకు నోటీసులు జారీచేసింది. బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో పఢ్నవిస్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. తదుపరి విచారణను సోమవారం ఉదయం 10:30 గంటలకు వాయిదా వేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషన్, సంజీవ్ కన్నాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సెలువు రోజైనా ఆదివారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. (అజిత్ పవార్‌కు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు) ఎన్సీపీ, శివసేన తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించగా.. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామాలను సిబల్ ధర్మాసనానికి వివరించారు. మెజార్టీ లేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని, గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్ధమని అన్నారు. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం అయ్యిందని, ఆ తరువాత మెజార్టీ గల మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకుండా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన కూటమికి బల నిరూపణకు తక్షణమే అవకాశం ఇవ్వాలని ధర్మాసనానికి విజ్క్షప్తి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని సిబల్ కోరారు. ‘గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ పక్షపాతంతో వ్యవహరించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. బీజేపీకి మెజారిటీ ఉన్నట్లు భావిస్తే.. ఈరోజే (ఆదివారం) అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలి. మెజార్టీ లేని ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలి. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలి’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయం లేకుండా రాష్ట్రపతి పాలనను ఎలా ఎత్తివేస్తారని సిబల్ ప్రశ్నించారు. బీజేపీ తరుఫున ముకుల్ రోహత్గి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. మెజార్టీ గల పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. గవర్నర్ తనకున్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఎన్సీపీలోని తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అయితే ఫడ్నవిస్‌కు మద్దతు తెలిపిన అజిత్ వర్గం ఎమ్మెల్యేలంతా ఆదివారమే శరద్‌తో భేటీ కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గడం సవాలుగా మారింది. -
బీజేపీపై నిప్పులు చెరిగిన సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో కలిసి అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేదని ఆయన తేల్చిచెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 165మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాము త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రౌత్ ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ), పోలీసులు ఇప్పటివరకు బీజేపీ వర్కర్లుగా పనిచేస్తుండగా.. ఇప్పుడు గవర్నర్లు కూడా బీజేపీ వర్కర్లుగా మారిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ తన ఉచ్చులో తాను పడిపోయిందని, ఆ పార్టీ అంతానికి ఇది ఆరంభమని పేర్కొన్నారు. అజిత్ పవర్ తప్పుడు పత్రాలను గవర్నర్‌కు సమర్పించారని, ఆ పత్రాలను నమ్మి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారని అన్నారు. గవర్నర్ అడిగితే ఇప్పటికిప్పుడు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రౌత్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన 45 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందన్నారు. ఈ వయస్సులో శరద్ పవార్‌కు వెన్నుపోటు పొడవడం ద్వారా అజిత్ పవార్ అతిపెద్ద తప్పు చేశారని దుయ్యబట్టారు. -
అజిత్ పవార్‌కు ఝలక్..!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయాల్లో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య పార్టీలయిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాయి. ఎమ్మెల్యేలతో వరస భేటీలతో నేతలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని బలపరీక్షలో నెగ్గించుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు దూతలను ప్రయోగిస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్ పవర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే వారంతా ఆయనకు ఝలక్ ఇచ్చారు. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్ వర్గం ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆదివారం వారంతా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. (అసలు సీనంతా మోదీ, పవార్ భేటీలోనే..!) కేవలం నలుగురు మాత్రమే అజిత్ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు శివసేన కూడా తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శరద్ పవార్త్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలను కాపాడుకునే అంశంపై వారు చర్చించారు. మరోవైపు అసెంబ్లీ బల పరీక్షలో ఫడ్నవిస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. ఇదిలావుండగా దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ శనివారం సాయంత్రం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోర్టును కోరారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టనుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. కానీ శివసేన, ఎన్సీపీ వర్గాల సమాచారం ప్రకారం వారిలో మెజార్టీ సభ్యులు సేనకే మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘శివసేన అత్యాశనే కొంప ముంచింది’
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మహారాష్ట్రలో శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని ఆయన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని శుక్రవారం రాత్రి వరకు అందరు అనుకున్నారు. కానీ, తెల్లారేసరికి ఎవరూ ఊహించని విధంగా ఉదయం ఎనిమిది గంటల లోపే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని పరిణామాలు రాష్ట్రంతోపాటు దేశంలోనే తీవ్ర కలకలం రేకేత్తించేలా చేశాయి. ఈ ఊహించని పరిణామాలపై ముంబైతోపాటు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలంటి నేపథ్యంలో తెలుగు ప్రజల అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.. రాజకీయాల్లో అవకాశవాదులదే ఆధిపత్యం ఓటు ఎవరికి వేసిన అది అవకాశ వాదుల చేతికి ఆయుధంగా మారుతుండటం విషాదకరం. ఓటర్ల మనోభావాలను క్రూరంగా అవహేళన చేస్తూ ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషం. కాని జనాదేశాన్ని కాదని మొదట్లో శివసేన పార్టీ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి, అధికారం కోసం వెంపడ్లాడడం, ఇప్పుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించడం. చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనం మాత్రమే అనిపిస్తోంది. అవకాశవాదులదే ఆధిపత్యం కొనసాగుతోంది. – సంగెవేని రవీంద్ర (మహారాష్ట్ర తెలుగురైటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి) ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఎవరు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తు అయితే బలపరీక్ష నిరూపణ మరో ఎత్తు కానుంది. రాజకీయాల్లో విలువలులేకుండా పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్రలో గత నెల రోజులుగా కొనసాగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దనేది అర్థంకాని పరిస్థితి. అందుకే ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా సరే రాష్ట్రప్రజల హితవు కోసం రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. – మాదిరెడ్డి కొండారెడ్డి (తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి). శివసేన అత్యాశనే కొంప ముంచింది ముఖ్యమంత్రి పీఠంపై పెంచుకున్న అత్యాశనే శివసేన పార్టీ కొంపముంచింది. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై అంతగా ఆశపెంచుకోకుంటే ఇలా జరిగేది కాదు. ఆర్పీఐ నేత రామ్‌దాస్ ఆఠావలే పేర్కొన్నట్టుగానే భారతీయ జనతా పార్టీకి మూడేళ్లు, శివసేన పార్టీకి రెండేళ్లపాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అంగీకరించి ఉండాల్సింది. ఈ విషయంపై చర్చలకు ఇరు పార్టీలు ముందుకు వచ్చినట్టయితే మహారాష్ట్ర రాజకీయాల్లో నేటి పరిస్థితి ఉద్బంవించి ఉండేది కాదు. – పుట్టపాక తిరుపతి (చర్నీ రోడ్డు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు) బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర హితవు కోసం బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది. ఓ వైపు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ రోజు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. మరోవైపు రాష్ట్రపతి పాలన కారణంగా రాష్టంలో రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇతర సమస్యలు పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఎంతో అవసరం. దీంతో బీజేపీ, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకుంది. – కొదురుపాక మహేష్ (కాందివలి) విశ్వాసం పోతోంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే రాజకీయాలతోపాటు రాజకీయ నాయకులపై విశ్వాసం పోతోంది. ఎవరిని నమ్మాలో..? ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. పార్టీ సిద్దాంతాలు లేవు. పదవులకోసం పాకులాటే కని్పస్తోంది. ఈ రోజు ఓ పారీ్టలో ఉన్నవారు రేపు ఏ పారీ్టలో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా పార్టీ నాయకులే కాకుండా రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు, ఎన్నికల తర్వాత మరొకరితో పొత్తు పెట్టుకుంటున్నాయి. మరోవైపు సొంత పారీ్టల ఎమ్మెల్యేలపై విశ్వాసం లేక రహస్య స్థలాల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడటం రాజకీయాల్లో అత్యంత శోచనీయం. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయాలపై సామాన్య ప్రజలకు విశ్వాసం పోతోంది. – పోతు రాజారాం (ఆంధ్ర మహాపభ ట్రస్టీ చైర్మన్) ఇది వెన్ను పోటే మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, అజిత్ పవార్‌తో కలిసి ప్రజాసామ్యానికి వెన్నుపోటు పోడిచారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖారారైన సమయంలో ఇలా చేయడం సబబుకాదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వంలో కూడా అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి లేదా ఇతర కీలక మంత్రి పదవి లభించి ఉండేది. కాని ఆయన వెన్నుపోటు పొడిచారు. – నాయన జగదీశ్ (థానే జిల్లా శివసేన సౌత్ సెల్ కార్యధ్యక్షులు) బల పరీక్షలో పరాజయం ఖాయం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మురిసిపోతుంది. కానీ, అజిత్ పవార్‌కు ఎన్సీపీ మద్దతు లేదు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టం. నవంబరు 30 వ తేదీన బీజేపీ బలపరీక్షలో పరాజయం అయిన తర్వాత మళ్లీ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం. – వాసాల శ్రీహరి (వంశి) (శివసేన) బీజేపీ చేస్తే తప్పా? కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జతకడితే తప్పులేదు. కాని బీజేపీ ఎన్సీపీతో జత కడితే తప్పా..? రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ అజిత్‌పవార్ మద్దతు తీసుకుంది. దీంట్లో బీజేపీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నించింది. కాని బీజేపీని పక్కనబెట్టాలని శివసేన చూసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం అవుతుండడంతో రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇలా ముందుకు వచి్చంది. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. –కోడూరు శ్రీనివాస్ (రాయిగడ్ జిల్లా బీజేపీ సౌత్ సెల్ ప్రధాన కార్యధర్శి) -
అసలు సీనంతా మోదీ, పవార్ భేటీలోనే..!
పెళ్లికి ముహూర్తం కుదిరింది. రాత్రి శుభలేఖలు అచ్చయ్యాయి. ఉదయాన్నే పెళ్లి జరిగింది!!. కాకపోతే పెళ్లి కొడుకు మారిపోయాడు. ఇదీ... మహారాష్ట్ర పదవీ కల్యాణానికి శుభం కార్డు పడిన తీరు!!. బహుశా... దీనికి మించిన అర్ధరాత్రి డ్రామాను చూడలేమేమో!!. ఎందుకంటే శుక్రవారం రాత్రి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఆ వార్తను శనివారం ఉదయం పత్రికల్లో చదువుతుండగానే... బీజేపీ నేత ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్‌పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు టీవీల్లో, మొబైల్ ఫోన్లలో ఫ్లాష్‌లు వెల్లువెత్తాయి. రాత్రికి ఆ ఫ్లాష్ల తీరూ మారింది. శరద్ పవార్ తన పవర్ చూపిస్తారా? మరి ఈ మహా ‘మలుపు’లో ఎవరి భాగమెంత... మహారాష్ట్ర ఎన్నికల తీర్పు స్పష్టంగానే ఉంది. కాకపోతే గెలిచిన బీజేపీ–శివసేన మధ్య ఒప్పందమే అస్పష్టం. ముఖ్యమంత్రి పదవిని సగం–సగం పంచుకుందామని చెప్పిన బీజేపీ... మాట మార్చిందన్నది శివసేన వాదన. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన శివసేన.. బీజేపీకి టాటా చెప్పి ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసింది. ఎన్సీపీ ఓకే. కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక విభేదాలున్న సేనతో కలవడమెలా? అని కొన్నిరోజులు మల్లగుల్లాలు పడింది. అధికారం ముందు ఆ అభ్యంతరాలన్నీ చిన్నబోయాయి. చివరకు పచ్చజెండా ఊపింది. (ఫలించిన మోదీ, షా వ్యూహం!) ‘నైతిక’ ప్రశ్నలకు తావుందా? రాజకీయమంటే అధికారం కోసం!!. బీజేపీని వదిలేటపుడు శివసేన ఇచ్చిన సంకేతమిదే. ఎలాంటి సారూప్యతా లేని సేనతో కలవటానికి కాంగ్రెస్, ఎన్సీపీలు పచ్చజెండా ఊపినప్పుడు కనిపించిందీ ఇదే. ఈ సూత్రాన్ని తనకు తాను అన్వయించుకున్నాడు ఎన్సీపీ నేత అజిత్‌పవార్. వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో బీజేపీని కలిశాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం.. నైతికత అనే ప్రశ్నల్ని లేవనెత్తే అర్హత ఏ పార్టీకీ లేదనే అనుకోవాలి. బహుశా... అందుకేనేమో!! శివసేనతో జట్టుపై కాంగ్రెస్ తేల్చనంతవరకూ బీజేపీ కూడా మౌనంగానే ఉంది. శుక్రవారం రాత్రి సేనతో దోస్తీకి కాంగ్రెస్ సై అనగానే... కాంగ్రెస్ సైద్ధాంతిక పాతివ్రత్యం దెబ్బతిన్నది కనక వేగంగా పావులు కదిపేసింది. కానీ తెల్లవారు జామునే రాష్ట్రపతి పాలన తొలగించి ఫడ్నవిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించి న గవర్నరు పాత్ర ప్రశ్నార్హమే. తగినంత మద్దతుందని వచ్చారు కనక అవకాశమిచ్చాననేది ఆయన మాట. నిజానికి అర్హతలతో పనిలేకుండా తమకు నచ్చినవారిని గవర్నర్లుగా నియమించే సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వాలన్నీ కొనసాగిస్తున్నాయి. కాబట్టి వారి ప్రవర్తన కేంద్రానికి అనుకూలంగా ఉండదని ఆశించటమే పొరపాటు. (బలపరీక్షపై ఉత్కంఠ..!) పవార్ – మోదీ భేటీలోనే...? అసలు శరద్‌పవార్– ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్య ఎందుకు భేటీ అయ్యారు? భేటీ వారిద్దరికే పరిమితం కనక బయటివారు దీన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌తో ఉన్నాను కనక బీజేపీతో కలిస్తే ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించుకున్న మరాఠా వీరుడు, పెద్దమనిషి అనే ట్యాగ్లు పోతాయని పవార్ భయపడి ఉండొచ్చు. కాకపోతే బీజేపీ పని జరిగేలా అజిత్‌పవార్ తిరుగుబాటు చేసే ఆలోచనకు అక్కడే బీజం పడి ఉండొచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. ఇప్పుడు శరద్‌పవార్ తాను పోరాడతాననే చెబుతున్నారు. కానీ ఆ పోరాటం అజిత్‌ను బీజేపీకి దూరంగా ఉంచుతుందని, సేన–కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాత్రం ఆశించలేం. అందుకేనా ఆ ధీమా..? మహారాష్ట్ర అంటే ఇతర రాష్ట్రాల్లాంటిది కాదు. ముంబైతో సహా దేశాన్ని నడిపించే ఆర్థికాధికార కేంద్రాలన్నీ ఉన్నదిక్కడే. అలాంటి రాష్ట్రంలో.. ప్రజాతీర్పు అనుకూలంగా వచ్చినా అధికారం అందకపోతే బీజేపీ ఊరుకుంటుందా? గోవా, కర్ణాటక, హర్యానా లాంటిచోట్ల ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మార్చుకున్న పార్టీ ఇక్కడెందుకు వెనకడుగేస్తుంది? అందుకే తొలి నుంచీ తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ పదేపదే చెబుతూ వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అది చాలదని, మరో 20 మంది కావాలని దానికి తెలియనిదా? ఆ మిగిలిన 20 మందినీ ఎలాగైనా సంపాదిస్తామనే ధీమాను అందులో చూడాలా? మరి అజిత్ పవార్ ఫెయిలయి ఎమ్మెల్యేలంతా శరద్‌పవార్ వెంటే నిలబడితే ఏమవుతుంది? బీజేపీ ఆ అవమాన భారాన్ని భరించగలదా? చూడాల్సిందే!!. -
అజిత్ దాదా పవర్ ఇదీ...
ముంబై: అజిత్ పవార్ తండ్రి అనంత్‌రావ్ పవార్ కొన్నాళ్లపాటు ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం దగ్గర పనిచేశారు. ఆ సినీ వాసనలేమైనా వంటబట్టాయో ఏమో, అజిత్ బాలీవుడ్ థ్రిల్లర్‌ని తలదన్నేలా మహా రాజకీయాన్ని నడిపారు. ఇన్నాళ్లూ చిన్నాన్న శరద్ పవార్ నీడలో నీడలా కలిసిపోయిన పవార్ ఆయనకే రాజకీయంగా గట్టి ఝలక్ ఇచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించు కున్నారు. శరద్ అనే వటవృక్షం నీడ నుంచి తప్పుకోవాలని అజిత్ భావిస్తున్నారని ఎప్పట్నుంచో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజిత్ సొంత పార్టీ పెడతారనీ గతంలో వార్తలొచ్చాయి. మహారాష్ట్ర సీఎం కావాలని అజిత్ పవార్ ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. 2004, 2009లో కాంగెస్, ఎన్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినా ఆయన కల నెరవేరలేదు. అప్పట్నుంచే తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి అజిత్ పవార్ పావులు కదుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. కుటుంబ తగాదాలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరుపై అజిత్‌కు ఎప్పట్నుంచో అసంతృప్తి నెలకొని ఉంది. పవార్ తన కుమార్తె సుప్రియా సూలెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, తన కుమారుడు పార్థ్ పవార్ విషయంలో చాలా అనాసక్తిగా ఉన్నారని అజిత్ లోలోపల రగిలిపోతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవార్ కుమారుడు పార్థ్ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పార్థ్ ఓటమికి తన చిన్నాన్నే కారణమని అజిత్ నిందించినట్టుగా ఎన్సీపీలో పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు చెబుతున్నారు. స్వతంత్రభావాలు, ప్రజాకర్షణ అజిత్‌కు అద్భుతమైన పాలనాదక్షుడు, సర్వ స్వతంత్ర భావాలు కలిగిన నాయకుడిగా పేరుంది. ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పేరున్న అజిత్ పవార్ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. పుణె జిల్లాలో బారామతి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ వరసగా ఏడుసార్లు అక్కడ నుంచే గెలుపొంది రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసున్న అజిత్ పవార్ ఈ సారి ఎన్నికల్లో 1.65 లక్షల మెజార్టీతో నెగ్గి నియోజకవర్గంపై తనకున్న పట్టుని మరోసారి చాటుకున్నారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాల కారణంగా అభిమానులు ఆయనను దాదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. 1959, జులై 22న రైతు కుటుంబంలో పుట్టిన అజిత్ పవార్ విద్యాభ్యాసం అంతా బోంబేలోనే సాగింది. 1982లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ కోపరేటివ్ బోర్డు సభ్యుడయ్యారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే తన చిన్నాన్న కోసం లోక్‌సభ పదవిని వదులుకొని అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రి పదవుల్ని సమర్థంగా నిర్వహించారు. 1991లో తొలిసారిగా సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వ హయాంలో మంత్రి అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ భూ పరిరక్షణ, విద్యుత్, సాగునీరు వంటి శాఖల మంత్రిగా పనిచేశారు. -
ఆ ఎమ్మెల్యేలపై శరద్ పవార్ మండిపాటు
న్యూఢిల్లీ/సాక్షి,ముంబై: అజిత్ పవార్‌తోపాటు అతని వెంట ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. ఎన్సీపీలో అంతర్గత పోరుతోనే అజిత్ బయటకు వెళ్లారన్నది అవాస్తవమన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌తో హడావుడిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని, తక్షణమే శాసనసభను రద్దు పరిచి, బల పరీక్ష జరిపించాలని కోరాయి. ఈ పిటిషన్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రానుంది. మా వాళ్లంతా తిరిగి వస్తారు: పవార్ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై శనివారం ఉదయం ఆయన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార సమయంలో అక్కడున్న 10–11 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ మా వద్దకు వచ్చారు. మిగతా వారూ వస్తారు’ అని శరద్ తెలిపారు. అజిత్ చర్య క్రమశిక్షణారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ‘అజిత్‌తోపాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం ఖాయం. అజిత్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ప్రజలే ఓడిస్తారు’అని అన్నారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో 170 మంది సభ్యుల బలముంది’ అని అన్నారు. బీజేపీవి చీకటి రాజకీయాలు: ఉద్ధవ్ తాజా పరిణామాలపై ఉద్ధవ్ స్పందించారు. ‘శివసేన ఏదైనా బాహాటంగానే చేస్తుంది. చీకటి రాజకీయాలు మేం చేయం. ఇదివరకు బీజేపీ ఈవీఎం వ్యవహారం నడిపించింది. ఇప్పుడు ఇదో కొత్త నాటకం. ఇకపై ఎన్నికలు కూడా అవసరమని నేను అనుకోను. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మాదిరిగానే కేంద్ర కేబినెట్ ఉదయాన్నే తీసుకున్న ఈ నిర్ణయం నకిలీస్టైక్స్(ఫర్జికల్ స్టైక్స్). మహారాష్ట్ర ప్రజలు శిక్షించక తప్పదు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదో చీకటి అధ్యాయం: కాంగ్రెస్ మహారాష్ట్రలో అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని, భారతదేశ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కాంట్రాక్టు పుచ్చుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–శివసేన–ఎన్సీపీ కూటమి బీజేపీని ఓడిస్తుందని పేర్కొంది. ఉదయం సుప్రీం విచారణ ఫడ్నవీస్‌తో సీఎం ప్రమాణం చేయిస్తూ గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎమ్మెల్యే బేరసారాలకు మరింతగా అవకాశం ఇవ్వకుండా వెంటనే శాసనసభలో బల నిరూపణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అజిత్ పవార్‌పై వేటు ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్‌ను ఆ పార్టీ తొలగించింది. ఎన్సీపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపినందున అతన్ని తొలగించినట్లు తెలిపింది. దీంతో విప్జారీచేసే అధికారం అజిత్ కోల్పోయారని తెలిపింది. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎన్నికయ్యే వరకు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ రాజ్యాంగపర హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఈ సమావేశానికి మొత్తం 54 మందికిగానూ 49 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి బలం నిరూపించుకునేందుకు ఈ నెల 30 వరకూ సమయం ఉందని, అందులో బీజేపీని ఓడించి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు. ఫడ్నవీస్, అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్‌భవన్‌లో ఉన్న తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తుదకు శరద్ పవార్ వద్దకు చేరడం గమనార్హం. ఎప్పుడేం జరిగింది ? దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగాæ ప్రమాణం చేయడానికి ముందు రాత్రి నుంచి జరిగిన పరిణామాలివీ... నవంబర్ 22 8:00 (రాత్రి) ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతల భేటీ 8:45–9:00 భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అజిత్ పవార్ 10:00–10:30 ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రెస్మీట్లో వెల్లడించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 11:30–11:50 బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అజిత్ నవంబర్ 23 12:00 (అర్ధరాత్రి): తెల్లవారేసరికి ప్రమాణ స్వీకారం ముగుస్తుందని కీలక వ్యక్తులకు సమాచారమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ 12:15–12:40: ఢిల్లీ వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ. ఉదయం ఆయన ప్రయాణం కావాల్సి ఉంది. 12:30: రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శిని కోరిన కోష్యారీ 2:30–2:45: రాష్ట్రపతి పాలన ఎత్తివేసే పత్రాలు తయారు చేయడానికి రెండు గంటలు పడుతుందని చెప్పిన గవర్నర్ కార్యదర్శి. ఉదయం ఏడున్నర గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సూచన. 5:30: రాజ్‌భవన్ చేరుకున్న అజిత్, ఫడ్నవీస్ 5:47: రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ప్రకటించిన గవర్నర్ 7:50: ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ కోష్యారీ. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం. 8:45: ఫడ్నవీస్, అజిత్ పవార్లను అభినందించిన ప్రధాని మోదీ. 8.50: ప్రమాణస్వీకారం బయటికి తెలియడంతో శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకి చేరుకున్న ఎన్సీపీ నేతలు 9.00: ఉద్దవ్ ఠాక్రే నివాసస్థానం మాతోశ్రీ, శరద్ పవార్ నివాసస్థానం సిల్వర్ ఓక్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు. 10.10: బీజేపీ ఎమ్మెల్యేలందరూ ముంబైకి రావాలని ఆదేశాలు 10.30: శరద్‌తో భేటీ అయిన నవాబ్ మాలిక్ 11:00: హోటల్ మరీన్ ప్లాజాలో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ 12.30: వైబీ చవాన్ సెంటర్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మీడియా సమావేశం 1.50:తాను ఇప్పుడేమీ చెప్పలేనని సరైన సమయంలో అన్ని విషయాలు చెప్తానన్న అజిత్ 2.30: తమ ఎమ్మెల్యేలను సురక్షిత స్థలాలకు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయం సాయంత్రం 5.15: సోదరుడు శ్రీనివాస్ పవార్ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ భేటీ. పటిష్ట భద్రత ఏర్పాటు. 6.20: సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన. రాత్రి 8.00 అజిత్‌పై వేటు వేసిన ఎన్సీపీ నవంబర్ 24 ఉదయం 11.30: పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం -
‘మహా’ ట్విస్ట్: చీకటి రాజకీయాలకు నిలువుటద్దం
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్దంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనుసులు గెలవాలి కానీ అక్రమంగా పదవులు పొందొద్దని హితవు పలికారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సోనియా గాంధీ ప్రతిక్షంలోనే ఉంటామని చెప్పారన్నారు. మిత్ర పక్ష ఎన్సీపీతో చర్చలు జరిపామే తప్ప అధికారం కోసం అర్రులు చాచలేదన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలకు నిలువుటద్దం మహారాష్ట్ర అంశమని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా కలిసి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ అంశాలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 2వేల ఓట్లు వచ్చిన సంగతి మర్చిపోయారా లక్ష్మణ్ అని ఎద్దేవా చేశారు. -
‘మహా ట్విస్ట్’పై మీమ్స్.. నవ్వు ఆపుకోలేరు!
మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది. ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. ఏ అంశం మీదైనా ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒక్కఫోటోతో ఏం జరిగిందో కామెడీగా చెప్పేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ రోజు జరిగిన ‘మహా’ ట్విస్ట్‌పై కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. ఇక శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ రాత్రికిరాత్రే ఎన్నో ఎన్నోమార్పులు జరిగాయి. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయానంతా నెటిజన్లు తమదైన శైలిలో చెప్పేస్తున్నారు. సీఎం అవుతాని భావించిన ఉద్దవ్ ఠాక్రే ఆశలు ఆవిరైపోయాయి. బీజేపీ నేతలు చీటింగ్ చేశారు, మోదీ, అమిత్ షాలు కలిసి గేమ్‌ను ఛేంజ్ చేశారు.. అనే అర్థాలు వచ్చే విధంగా ఉన్న మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవెంటో చూసి మీరూ నవ్వుకోండి. Meanwhile #AdityaThackeray be like #MaharashtraPolitics #UddhavThackeray pic.twitter.com/FGTYhzODOU — Gayatri (@mhaskegayatri) November 23, 2019 2 people can change the game in last over#Motabhai #MaharashtraPolitics #captaincool pic.twitter.com/1WU4tlXpJD — the_meemer_boy (@meemspedia) November 23, 2019 Keep your friends close, but your enemies closer ~ @godfathermovie pic.twitter.com/h6AaX4WJdn — Milind Deora मिलिंद देवरा (@milinddeora) November 23, 2019 🤣🤣 pic.twitter.com/5UgakfcMT9 — Nithin Kumar (@sowmiyan86) November 23, 2019 BJP did Operation Kamala in Karnataka and today it finished Operation NCP.😎💪#MaharashtraPolitics pic.twitter.com/KbqeRxSxRg — @raj_mehariya (@raj_mehariya) November 23, 2019 Sanjay Raut and Uddhav Thackeray right now... #MaharashtraPolitics pic.twitter.com/8r0NRbx1mH — Indrajit Kar (@TheIndrajitKar) November 23, 2019 Amit shah to #संजय_राऊत 😂😂😂😂 #MaharashtraPolitics pic.twitter.com/nKNcOw6Ua4 — हर्ष सौदर्शन-छ.ग. (ہرش ساودارشان)🇮🇳 (@SaffronBeast) November 23, 2019 Gonna tell my kids they were the real characters from game of thrones. #MaharashtraPolitics pic.twitter.com/R7MYSrahWY — Aditya (@patheticiam) November 23, 2019 -
ఫలించిన మోదీ, షా వ్యూహం!
సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్‌కు తెలియకుండా పార్టీని నిలువునా చీల్చి సగం మంది ఎమ్మెల్యేలతో బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామం మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ప్రకటించడం, హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ సేనకు మద్దతు ప్రకటించడం అజిత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలింస్తున్న బీజేపీ.. శివసేనకు చెక్ పెట్టేందుకు ఎన్సీపీ నేతలు తమ వైపుకు తిప్పుకోవాలని ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శరద్ పవార్‌ను చూసి సభ్యులు చాలా నేర్చుకోవాలి అని మోదీ ప్రశంసలు కురిపించడం కూడా దీనిలో భాగంగానే పలువురు వర్ణించారు. (ఎన్సీపీ కీలక నిర్ణయం.. అజిత్‌పై వేటు) మహారాష్ట్రలో బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటిస్తే శరద్ పవార్‌కు రాష్ట్రపతి పదవిని కూడా కేంద్రం ఆఫర్ చేసిందనే పుకారు షికారు చేసింది. కానీ వీటన్నింటినీ పవార్ కొట్టిపారేశారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి చర్చరాలేదని, కేవలం రైతుల ఆత్మహత్యలపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. అయితే వారిద్దరి మధ్య భేటీ సమయంలో మోదీ, పవార్ తప్ప మూడో వ్యక్తి లేకపోవడంతో ఊహాగానాలు మరింత వ్యక్తమయ్యాయి. ఓవైపు శివసేన, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే బీజేపీకి దగ్గరయ్యేందుకు పవార్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం కూడా సాగింది. అయితే వాటిన్నింటికీ సమాధానంగా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవార్.. ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం అభ్యర్థిని స్పష్టం చేశారు. దీనికి మూడు పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, త్వరలోనే ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. శనివారం ఉదయం దాదాపు దేశంలోని అన్ని పత్రికలూ ఇదే వార్తను పతాక శీర్షికలుగా ముద్రించాయి. కానీ తెల్లారే సరికి రాజకీయాలు అనుహ్యంగా మారిపోయాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్ బీజేపీకి మద్దతు తెలిపారు. (ఉత్కంఠగా బలపరీక్ష!) అయితే మోదీ, అమిత్ షా చతురత ఫలితంగానే అజిత్‌ను తమ వైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక, గోవా అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న షా, మోదీ ద్వయం ఇక్కడ కూడా అలాంటి వ్యూహాలనే అమలు చేసింది. సీఎం పీఠంపై బీజేపీతో వైరాన్ని సృష్టించిన శివసేనకు గట్టి బదులివ్వాలనుకున్న షా.. ఆ ప్రయోగాన్ని అజిత్‌పై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు వ్యతిరేకంగా అజిత్ గళం విప్పడంతో పాటు అయనపై ఉన్న ఈడీ కేసులను చూపి షా గాలం వేసినట్లు సమాచారం. కాగా తాజా పరిణామాలు ఎన్సీపీ, శివసేనకు ఎదురుదెబ్బగా ముంబై వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శతాబ్దాల వైరాన్నీ పక్కన పెట్టిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడం సేన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో హిందూ ఓటర్లు సేనకు కొంతదూరమయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) -
ఎన్సీపీ కీలక నిర్ణయం.. అజిత్‌పై వేటు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్ పవార్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఎన్సీపీ పార్టీ ఆఫీసులో హైడ్రామా నెలకొంది. అజిత్‌కు వ్యతిరేకంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. శరద్‌కు అజిత్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా అజిత్ బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సగం మంది ఎమ్మెల్యేతో పార్టీని చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. (ఉత్కంఠగా బలపరీక్ష!) అయితే ప్రస్తుతం ఆయన వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలోనే ఓ అవగహన వచ్చే అవకాశం ఉంది. అజిత్‌పై శరద్ పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా తాజా పరిణామాలపై చర్చించేందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యాఠాక్రే, ఎన్సీపీ నేత సుప్రీయా సూలే వైబీ చవాన్ భవన్‌కు చేరుకున్నారు. -
‘అజిత్‌తో అన్ని బంధాలు తెగిపోయాయి’
ముంబై : అజిత్ పవార్ ఎన్సీపీని మోసం చేసి నమ్మకద్రోహిగా మిగిలిపోయారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజిత్ పవార్ నిర్ణయం పార్టీతో పాటు తమ కుటుంబంలోనూ చీలిక తెచ్చిందని పేర్కొన్నారు. ఇకపై తన తండ్రి అజిత్‌తో కలిసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ‘ఇంకెవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎన్నడూ ఇంతగా మోసపోలేదు. తనకు అండగా నిలబడ్డాను. ప్రేమించాను. కానీ నాకు తిరిగి ఏం లభించిందో చూడండి’ అని తన కజిన్ అజిత్ పవార్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్ పవార్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. (పవార్‌కు అజిత్ వెన్నుపోటు!) ఈ నేపథ్యంలో సుప్రియా సూలే శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్సీపీని వీడి నేతలంతా బీజేపీలో చేరిన సమయంలో తమ కార్యకర్తలంతా పార్టీకి అండగా నిలిచారన్నారు. అయితే అజిత్ పవార్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ముచేస్తూ బీజేపీతో చేతులు కలిపి తమకు షాకిచ్చారని వాపోయారు. ఇకపై ఆయనతో తమకు ఎటువంటి సంబంధాలు ఉండబోవన్నారు. కాగా బారమతి ఎంపీగా గెలుపొందిన సుప్రియ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని... ఇతర పార్టీ నాయకులను భయపెట్టి లొంగదీసుకుంటుందంటూ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం తన కజిన్ అజిత్ ఈ విధంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(మహా ట్విస్ట్: శరద్ పవార్ స్పందన) -
ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?
జైపూర్: మహారాష్ట్ర రాజకీయంలో రాత్రికి రాత్రికే చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మహా సీఎం పీఠం బీజేపీకి చేజారిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో శనివారం తెల్లవారేసరికి పరిస్థితి మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఈ మహా ట్విస్ట్ షాక్ నుంచే తేరుకునేలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు. అటు ఎన్సీపీ కీలక నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ హఠాత్పరిణామాలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ-ఎన్సీపీ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వైనాన్ని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశకు తీసుకువెళుతున్నారంటూ ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. సరియైన సమయంలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెపుతారని ట్వీట్ చేశారు. సీఎం ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ అపరాధ భావనతో ఉన్నారని, తాము మంచి పాలనను అందించగలమనే విశ్వాసమే వారికి లేదని ఆరోపించారు. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా విజయవంతమై సుపరిపాలన ఇస్తారా అనే సందేహం తనకు ఉందని, అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు నష్టపోనున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ఈ నెల 12న అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫడ్నవిస్ ప్రభుత్వ బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ గడువు విధించారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం महाराष्ट्र में जो हुआ वह छिपकर करने की क्या आवश्यकता थी, इस प्रकार अचानक राष्ट्रपति शासन का हटना और इस प्रकार शपथ दिलाना कौनसी नैतिकता है? ये लोग देश में लोकतंत्र को किस दिशा में ले जा रहे हैं? समय आने पर देशवासी इसका जवाब देंगे और बीजेपी को सबक सिखाएंगे। — Ashok Gehlot (@ashokgehlot51) November 23, 2019 -
బలపరీక్షపై ఉత్కంఠ..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్ నేతలతో పాటు శరద్ పవార్‌కు ఊహించిన షాక్ ఇచ్చిన అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్సీపీలోని సగంమంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈనెల 30లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుకోవాలని గవర్నర భగత్‌సింగ్ కోశ్యారీ బీజేపీ సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష ఆసక్తికరంగా మారింది. ఫడ్నవిస్‌కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపకపోతే బలపరీక్షను ఎదుర్కొవడం సవాలే. దీంతో ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ, ఫడ్నవిస్‌ను అడ్డకునేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. (బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ముంబై వర్గాల సమాచారం. కానీ ఎన్సీపీ శాసన సభ్యులంతా తమకు మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీకి ఇక శరద్ పవార్ ఒక్కరే మిగిలి ఉన్నారని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. (పవార్‌కు షాక్.. ఎన్సీపీలో చీలిక!) బల పరీక్షకు వారానికి పైగా గడువు ఉండటంతో విపక్షంలోని రెబల్స్‌పై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అయితే బలపరీక్షలో సరిపడ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్సీపీలో చీలిక తెచ్చి.. ఊహించని షాక్ ఇచ్చిన కాషాయ పార్టీ శివసేనను దెబ్బకొట్టేందుకు మరిన్ని ఎత్తుగడలు వేస్తోంది. ఇదిలావుండగా తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్ నేతలు అలర్టయ్యారు. బీజేపీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. శనివారం వారు గవర్నర్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. -
మహా ట్విస్ట్: శరద్ పవార్ స్పందన
ముంబై : మహారాష్ట్ర తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతునివ్వడం తన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ’ఈ రోజు ఉదయం ఏడు గంటలకే నాకు ఈ విషయం తెలిసింది. అజిత్ పవార్ ఇలా చేస్తాడని నాకు తెలియదు. నేను త్వరలోనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను. ఉద్ధవ్ ఠాక్రే కూడా మీడియాతో మాట్లాడతారు. అప్పుడే అన్ని విషయాలు వివరంగా చెబుతాను’ అని పేర్కొన్నారు. అదే విధంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం అని, దీంతో ఎన్సీపీకి ఎటువంటి సంబంధం లేదని శరద్ పవార్ ట్వీట్ చేశారు. అజిత్ నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదని పేర్కొన్నారు.(చదవండి : బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) కాగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్ పవార్ ప్రకటించిన తరుణంలో అజిత్ పవార్ ఆయనకు ఊహించని షాకిచ్చారు. ఆయనకు 20కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో బీజేపీకి మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి పదవి కోసమే శరద్ పవార్ బీజేపీకి మద్దతు ఇచ్చారంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అజిత్ పవార్ తమకు వెన్నుపోటు పొడిచారని శివసేన ఆరోపించగా, ఎన్సీపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ కాంగ్రెస్ విమర్శించింది.(అమ్మ పవార్.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా? ) Ajit Pawar's decision to support the BJP to form the Maharashtra Government is his personal decision and not that of the Nationalist Congress Party (NCP). We place on record that we do not support or endorse this decision of his. — Sharad Pawar (@PawarSpeaks) November 23, 2019 -
పవార్‌కు షాక్.. ఎన్సీపీలో చీలిక!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలువు తిరిగింది. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో సీఎం పీఠం ఎక్కాలన్న శివసేన ఆశలకు బీజేపీ గండికొట్టింది. తెరవెనక రాజకీయాలు చేసి ఎన్సీపీని తన వైపుకు తిప్పుకుంది. కూటమి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే ఉంటారని శుక్రవారం రాత్రే శరద్ పవార్ ప్రకటించారు. ఈలోపే దేవేంద్ర ఫడ్నవిస్ కేంద్ర పెద్దల సూచనలతో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో రహస్య మంతనాలు చేశారు. తమకు మద్దతు ఇస్తే డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నత పదవులను ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే తొలి నుంచి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న అజిత్ పవార్ బీజేపీ నేతల చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అజిత్ చర్యతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు షాక్‌కి గురయ్యారు. అయితే ఈ వ్యవహారమంతా శరద్ పవార్‌కు తెలియకుండా అజిత్ పవార్ జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వంతంత్ర సభ్యుల మద్దతులో బలనిరూపణ చేస్తారని తెలుస్తోంది. -
అమ్మ పవార్.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా?
ఉద్దవ్ ఠాక్రేను మహారాష్ట్ర సీఎం అని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు రాత్రికిరాత్రే ఏమైందో కానీ ప్లేట్ ఫిరాయించారు. బహిరంగ ప్రకటన ఇచ్చి కనీసం రోజు కూడా మారకముందే తన మనసు, మాట మార్చుకున్నారు. కాంగ్రెస్, శివసేనకు భారీ షాక్ ఇచ్చి అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు పవార్. దీంతో మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉదయం నిద్ర లేచి టీవీలో వస్తున్న వార్తలు చూసి శివసేన, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. పవార్‌కు ఏమైంది? ఎందుకు ఇలా ప్లేట్ ఫిరాయించారు? కాంగ్రెస్‌కు సోనియాకు నమ్మిన బంటైన శరద్ పవార్ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశారు? అనేది మహారాష్ట్రతో పాటు దేశరాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. (బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం) మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి శివసేన ముఖ్య నేతలతో రోజు సమావేశం.. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మూడు సార్లు అధికారిక భేటీ.. అనధికారికంగా అనేకమార్లు. ఇవి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకై జరిపిన సమావేశాలు, చర్చలు. కానీ ఇవన్నీ ఒకే ఒక్క భేటీతో తుడిచిపెట్టుకపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై చాలా మెత్తబడ్డారు. అనంతరం సోనియా అక్షింతలు వేయడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహా సీఎంగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అంటూ సంయుక్తంగా ప్రకటించింది. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వానికి హెడ్ ఉద్దవ్ ఠాక్రే అంటూ స్పష్టం చేసింది. దీంతో శివ సేన సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఠాక్రే కుటుంబ సభ్యులు ఆనందంలో తేలియాడారు. తొలిసారి ఠాక్రే వంశస్థులు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారని. అయితే వారికి తెలియదు కదా ముందున్న ఉపద్రవం గురించి. అయితే శరద్ పవార్‌పై అనుమానమో లేక వేరే కారణాలో తెలియవు కానీ ఆయన చేతనే మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే అని ప్రకటింప చేసేలా చేశారు సోనియా గాంధీ. ఎందుకంటే మాట తప్పిన చరిత్ర పవార్‌పై రుద్దాలనే ఆలోచన కాంగ్రెస్ చీఫ్‌కు ఉన్నట్లుంది. ఇక అంతా అయిపోయింది మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది అనుకున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీతో చేతులు కలిపింది ఎన్సీపీ. ఇప్పుడు అందరి మదిలోనూ కదులుతున్న ప్రశ్నలు అనేకం. అసలు రాత్రిరాత్రికి ఏమైంది? ఉద్దవ్ ఠాక్రే సీఎం అని ప్రకటించిన వెంటనే.. మోదీ, అమిత్ షాలు శరద్ పవార్‌తో మాట్లాడారా? మాట్లాడితే ఏం మాట్లాడారు? రాష్ట్రపతి పదవి ఆఫర్ చేశారా? లేక కేసులపై భయపెట్టారా? శివసేనపై పవార్‌కు నమ్మకం లేదా? వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఎన్సీపీ, శరద్ పవర్ అనూహ్య నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. రాష్ట్రపతి పదవి కోసం పవార్ ఇలా కుటిల రాజకీయాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇక మాట తప్పిన నేతగా మరాఠా రాజకీయ చరిత్రలో నిలిచిపోతారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. కిచిడీ పాలన వైపు కాకుండా సుస్థిర పాలన వైపు ఎన్సీపీ ఆసక్తి చూపడంతోనే తమకు మద్దతు ప్రకటించిందని బీజేపీ పేర్కొంది. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?) -
బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు. అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం రాత్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తెర వెనుక వ్యూహాలు రచించిన బీజేపీ అజిత్ పవార్‌తో రహస్య మంతనాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కోరారు. రాత్రికి రాత్రే అనేక రాజకీయ పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్ సీఎం ప్రమాణం చేశారు. అనంతరం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ ఊహించని షాక్ ఇచ్చింది. ఒకవైపు సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఎన్సీపీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. కాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎన్సీపీలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ వెంట 20కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో బీజేపీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. కాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవిస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్ తెలిపారు. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?) -
ఇంత అవమానమా.. ఇక శాశ్వత ముగింపు!
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో బీజేపీ-శివసేన మధ్య ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పదవుల పంపకాలతో ప్రారంభమైన వీరి మనస్పర్థలు కూటమి విచ్ఛినం వరకూ వెళ్లాయి. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన శివసేన వారి విజ్క్షప్తి మేరకు కేంద్రమంత్రి పదవి కూడా రాజీనామా చేసింది. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లయింది. తాజాగా పార్లమెంట్ సమావేశాలు వారి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. 30 ఏళ్లకు పైగా ఉన్న ప్రయాణానికి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లయింది. సోమవారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో చర్చలో భాగంగా శివసేనకు ప్రతిపక్షం వైపు సీట్లను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆదివారమే ప్రకటించారు. మొన్నటి వరకు అధికారపక్షం వైపు కూర్చున సేన ఎంపీలు.. తాజాగా ప్రతిపక్షంలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కావచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం సామ్నాలో ఎడిటోరియల్ వేదికగా శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమను సంప్రదించకుండానే విపక్ష వైపు తమ స్థానాలను మార్చారని విమర్శించింది. ‘ఎన్డీయే ఏర్పడటానికి ముఖ్య కారణం దివంగత బాలాసాహెబ్ ఠాక్రే. ఆ నాడు హిందుత్వ, జాతీయవాదం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మర్చిపోవడం దారుణం. ఎన్డీయే ఏర్పడిన తొలి నాళ్లలో బీజేపీతో కలసి రావడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. తొలుత బీజేపీతో భాగస్వామ్యం అయిన పార్టీ శివసేన. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ఇంత జరిగాక బీజేపీతో మళ్లీ మేం కలవడంలో అర్థంలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడినా.. బీజేపీతో కలిసేందుకు మేం సిద్ధంగా లేం. బాలా సాహెబ్ వర్థంతి సందర్భంగా యావద్దేశమంతా ఆయకు నివాళి అర్పించింది. కానీ అదే రోజున ఆయన పునాది వేసిన ఎన్డీయే నుంచి శివసేనను బహిష్కరించడం బాధాకరం. అవమానకరం. ఇక నో బీజేపీ, నో ఎన్డీయే’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. కాగా ఎన్నికల ఫలితాలు ఏర్పడి నెల రోజులు కావస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ వెనక్కి తగ్గడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతో సీఎం పీఠం అధిష్టించాలని శివసేన భావించింది. ఈ మేరకు మూడు పార్టీ మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నా.. ముంగింపు దశకు మాత్రం చేరుకోవడంలేదు. రోజుకో ప్రకటన చేస్తూ కాలం గడుపుతున్నారేతప్ప.. ఓ అంగీకారానికి మాత్రం రావడంలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందన్న కారణంతో రాష్ట్రపతి పాలన విధించారు. కానీ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చర్చలు మాత్రం ఓ వైపు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభకావడంతో వారి ప్రయత్నలు మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
శివసేనకు ఎన్సీపీ షాక్..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన వీడినట్లు కనిపించట్లేదు. రోజుకో మలుపు తిరుగుతూ.. ఉత్కఠ పరిణామాలకు దారి తీస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించినా.. మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకటన మాత్రం చేయలేదు. ఇదిలావుండగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించేందుకు పవార్ సోమవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి భేటీకి ముందు జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి పవార్ సమాధానం చెబుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ల రాజకీయాలు వాళ్లు చూసుకుంటారు. శివసేన దారి ఎటు వైపో వారే తేల్చుకోవాలి’ అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పవార్ స్పందిస్తూ.. ఆ వార్తలు నిజమేనంటూ బదులిచ్చారు. దీంతో ఆయన మాటల్లో అర్థమేంటనేది అంతుపట్టలేదు. కాగా శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పూర్తి కాలంపాటు తాము అధికారంలో ఉంటామని పవార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందేహాలను కల్పిస్తున్నాయి. ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో చర్చించిన అనంతరం ఇరు పార్టీలు ఓ ప్రకటన విడుదల చేస్తాయని తెలుస్తోంది. -
సేనకు సీఎం పీఠం ఇవ్వాలి: కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్‌దాస్ అంథ్‌వాలే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చిచేందుకు ఆదివారం ఎన్డీయే పక్షాలు ఢిల్లీలోభేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం అంథ్‌వాలే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేమీలేదని అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందుకు కూటమిగా పోటీచేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టుబట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన పావులు కదుపుతోంది. -
ఎన్డీయే భేటీకి శివసేన దూరం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి శివసేన హాజరు కాబోదని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం రౌత్ ఈ విషయం వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రయ సాగుతోందని, ఈ దిశగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు సంజయ్ రౌత్ ఢిల్లీకి చేరుకున్నారు.మరోవైపు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమైన కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేతల మధ్య ఆదివారం ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది. మహారాష్ట్రలో అధికార పంపకంపై తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలసిందే. -
‘కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు’
ముంబై : తమకు 119 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం దారుణన్నారు. వారి మాటలు నిజమే అయితే గవర్నర్ అడిగినపుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమానికి అంగీకారం తెలిపిన శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేనకు అప్పగించేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్, ఎన్సీపీ స్పీకర్, మండలి చైర్మన్ పదవులను పంచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్... స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తమకు మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సుముఖంగా ఉన్నారని.. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఇది సాధ్యమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై నవాబ్ మాలిక్ స్పందించారు. ‘ బీజేపీ నాయకులు ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. యుద్ధంలో ఓడిపోయిన సైనికుల్లో ధైర్యం నింపే వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మా చేతిలో(ప్రభుత్వ ఏర్పాటు విషయమై) ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తించడం లేదు. అవును వాళ్లకి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ నిజాలను అంగీకరించకతప్పదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో 105 సీట్లు సంపాదించుకున్న బీజేపీకి అయినా, మరే ఇతర పార్టీలకైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం కదా అంటూ ఎద్దేవా చేశారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
ఎన్డీయేకి గుడ్‌బై.. ఇక మాటల్లేవ్!
సాక్షి, ముంబై: ఈనెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్షాలు ఆదివారం సమావేశం కానున్నాయి. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పలు కీలక బిల్లులపై ఈ సమావేశంలో చర్చించన్నారు. భేటీకి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి మొన్నటి వరకు ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఉన్న శివసేన హాజరుకాబోమని తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి హాజరయ్యేది లేదని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఇదివరకు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీయే పక్షాలతో కలసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నందున శివసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే శనివారం మధ్యాహ్నాం లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరుగునున్న విషయం తెలిసింది. ఈ సమావేశానికి మాత్రం హాజరవుతామని ఆయన తెలిపారు. అనంతరం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే యూపీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో కూడా శివసేన పాల్గొనే అవకాశం ఉంది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీ విధించిన షరతు మేరకు కేంద్రమంత్రి పదవిలో ఉన్న అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్డీయే నుంచి శివసేన బయటకు వచ్చినట్లు అయింది. అయితే శివసేన నేతలు అధికారం కోసం యూపీఏ కూటమిలో చేరారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. -
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించి... అంగీకారం తెలిపాయి. ఐదేళ్ల పాటు సీఎం పీఠం శివసేనకు అప్పగించి, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్, మంత్రి పదవులు చెరి సమానంగా పంచుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మూడు పార్టీల నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్ దానికి అంగీకారం తెలిపితే ఆదివారమే శివసేన నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే సీఎం పీఠం సేనదే అని ఖరారైనా.. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. శివసేన నేతలు తొలి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేనే సీఎం అని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. (లైన్ క్లియర్.. శివసేనకే సీఎం పీఠం) కానీ బీజేపీతో తెగదెంపుల అనంతరం రాజకీయ సమీకరణాలు చాలావరకు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరో వ్యక్తిని సీఎంగా నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్యాను సీఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజకీయాలు కొత్త కావడం, కనీస అనుభవం లేకపోవడం దానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం కావడంతో పాటు, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం విపక్ష బీజేపీని సమర్థవంతగా ఎదుర్కోగల శక్తీ, సామర్థ్యాలు ఆదిత్యాకు లేవని ఓ వర్గం నేతల వాదన. అయితే శివసేన సీనియర్ నేతలైన శుభాష్ దేశాయ్, ప్రస్తుత పార్టీ పక్షనేత ఏక్నాథ్ షిండే పేర్లు కూడా ఇరు పార్టీల నేతలు పరిశీలించారు. కానీ వారెవ్వరూ సీఎం పీఠానికి సరిపోరని ఓ అంచనాకి వచ్చినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా బలమైన నేతనే సీఎంగా ఎన్నుకోవాలని కనీస ఉమ్మడి ప్రణాళిక సందర్భంగా భేటీ అయిన మూడు పార్టీల నేతలు చర్చించారు. అంతటి సమర్థవంతమైన శివసేనలో ఒక్క ఉద్ధవ్ ఠాక్రే తప్ప మరెవ్వరూ లేరని సేన అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సీఎం అభ్యర్థి అయితేనే తాము మద్దతు తెలుపుతామని ఎన్సీపీ, కాంగ్రెస్ షరతు విధించినట్లు ఓ నేత వెల్లడించారు. ఐదేళ్ల పాటు ఆయన మాత్రమే ఆ పదవిలో కొనసాగే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు భేటీ వివరాలను తెలిపారు. అలాగే ఆదిత్యాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని కూడా తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం పోటీ చేయని ఉద్ధవ్ నేరుగాసీఎం పీఠాన్ని అధిరోహించనున్నారని సేన వర్గాల సమాచారం. అయితే దీనిపై ఏ పార్టీత నేత కూడా బహిరంగ ప్రకటన చేయలేదు. గవర్నర్‌తో భేటీ అనంతరంమే పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. శనివారం సాయంత్రం సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం గవర్నర్‌తో సమావేశం కానున్నారు. దీని అనంతరం ఉమ్మడిగా కీలక ప్రకటన చేస్తారని సమాచారం.