సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్దంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనుసులు గెలవాలి కానీ అక్రమంగా పదవులు పొందొద్దని హితవు పలికారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సోనియా గాంధీ ప్రతిక్షంలోనే ఉంటామని చెప్పారన్నారు. మిత్ర పక్ష ఎన్సీపీతో చర్చలు జరిపామే తప్ప అధికారం కోసం అర్రులు చాచలేదన్నారు.
బీజేపీ చీకటి రాజకీయాలకు నిలువుటద్దం మహారాష్ట్ర అంశమని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా కలిసి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ అంశాలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 2వేల ఓట్లు వచ్చిన సంగతి మర్చిపోయారా లక్ష్మణ్ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment