సాక్షి,హైదరాబాద్: పార్టీలు,పండగల దావత్‌లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్‌పాకాల జన్వాడ ఫాంహౌజ్ ఘటన మీద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.
‘ఎవరైనా ఫంక్షన్‌లకు దావత్‌లు చేసుకోవచ్చు.కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. ఎక్కువమందితో మందు పార్టీలు చేస్తే ఎక్సైజ్ ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎవరైనా దావత్ చేసుకోవచ్చు.
ప్రజల్లో అపోహలు కలిగించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు.కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో సోదాలకు సీఎం మంత్రులకు ఏం సంబంధం.ఫిర్యాదులు వస్తే అధికారులు వారి పని వారు చేస్తారు.దీన్ని కూడా బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోడం సిగ్గుచేటు’అని పొన్నం మండిపడ్డారు.
ఇదీ చదవండి: రేవ్‌పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్
Comments
Please login to add a commentAdd a comment