సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. గంటా 15 నిమిషాల పాటు ఇరువురి సమావేశం సాగింది. కేసీఆర్‌ని కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరుఫున కేసీఆర్‌ని కలిసి ఆహ్వానించామని తెలిపారు.
తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. భోజన సమయంలో వచ్చారు లంచ్ చేయమంటూ కేసీఆర్ కోరారు. దీంతో ఆయనతో కలిసి భోజనం చేసాము.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల వారీగా ఆహ్వానిస్తున్నాము. అందులో భాగంగా కేసీఆర్‌ని కూడా ఆహ్వానించాము.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేది ఆయన.. పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని కోరుకుంటున్నా. తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయాలు వుండొన్చు.. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలి’’ అని పొన్నం విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment