సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమం కోసం ముంబైలోని శివాజీ మైదానం ముస్తాబవుతోంది. గురువారం సాయంత్రం 6:40 గంటలకు రాష్ట్ర నూతన సీఎంగా ఉద్ధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఠాక్రేతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మహా వికాస్ ఆఘడి నేతలు సమావేశం నిర్వహించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.
దీని అనంతరం మంత్రిమండలి తొలిసారి భేటీ కానున్నట్లు తెలిసింది. దీంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌కు ఠాక్రే మంత్రివర్గంలో చోటు లేనట్లేనని స్పష్టమవుతోంది. డిసెంబర్ 3న తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరుగునుందని సమాచారం. దీని అజిత్‌తో పాటు మరికొందరికి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment