మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కూటమిగా పోటీ చేసిన శివసేన-బీజేపీలు ఎన్నికల ఫలితాల అనంతరం పదవుల పంపకాలపై పోటీకి దిగాయి. దీంతో ఫలితాలు ఏర్పడి 15 రోజులు గడుస్తున్నా చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అడుగులు వేడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం కీలక ప్రకటన చేశారు.