
ముంబై : మహారాష్ట్రలో అధికార పంపకంపై బీజేపీ-శివసేనల మధ్య నెలకొన్న సంవాదం తీవ్రమవడంతో ఆరెస్సెస్ జోక్యం చేసుకుని ప్రతిష్టంభనకు తెరదించాలని శివసేన నేత కోరారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సన్నిహితుడైన కిషోర్ తివారీ లేఖ రాశారు. బీజేపీ సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలని, రాష్ట్ర మంత్రివర్గంలో ఇరు పార్టీలు చెరిసగం ఉండాలంటూ శివసేన ముందుకుతెచ్చిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను కాషాయపార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా నూతన ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ జాప్యం చేస్తోందని, ఆరెస్సెస్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని మోహన్ భగవత్‌కు రాసిన లేఖలో శివసేన నేత తివారీ కోరారు.మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా బీజేపీ నేతృత్వంలోనే తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment