Disgruntled leaders
-
టీడీపీలో టికెట్ మంటలు.. భగ్గుమన్న అసంతృప్తి
సాక్షి, అనంతపురం: టీడీపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు మొండిచేయి చూపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు.. చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని టికెట్లు కేటాయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. రా కదలిరా బహిరంగ సభలో దన్ను దొర పేరు ప్రకటించిన చంద్రబాబు.. చివరి నిమిషంలో సీటు బీజేపీకి కేటాయించారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దన్ను దొర.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నక్సల్స్ కాల్పుల్లో మృతిచెందిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము కుటుంబ సభ్యులకు చంద్రబాబు వెన్నపోటు పొడిచారు. సివేరు సోము కుమారుడు అబ్రహం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కిడారి శ్రవణ్ దూరంగా ఉంటున్నారు. -
BJP: వివాదాస్పదులకు మొండిచేయి
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేశ్ బిదురి, అనంత్‌కుమార్ హెగ్డే వంటి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ! రమేశ్ బిదురి ఈ సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్ నిరాకరించింది. అనంత్‌కుమార్ హెగ్డే కర్ణాటకలో సీనియర్ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది. పర్వేష్ సాహిబ్‌సింగ్ ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టికెట్ వస్తుందా.. కటీఫ్ చెప్పేద్దామా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందస్తుగా విడుదల చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో అసంతృప్త జ్వాల మాత్రం ఆరడం లేదు. జాబితా వెలువడి పది రోజులు గడిచినా టికెట్ ఆశించి భంగపడిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు అసంతృప్త స్వరాన్ని తగ్గించడం లేదు. నియోజకవర్గ ప్రజలు, తమ అనుచరవర్గంతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న అసంతృప్త నేతలు లోలోన తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడేందుకు మరో నెల రోజులకు పైగా వ్యవధి ఉండటంతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశావహ దృక్పథంతో లెక్కలు వేసుకుంటున్నారు. కేటీఆర్ రాక కోసం ఎదురుచూపులు ఒకేసారి 115 మంది అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేయగా, నేటికీ సుమారు డజనుకు పైగా నియోజకవర్గాల్లో అసమ్మతులు మెట్టు దిగడం లేదు. ప్రగతిభవన్ దిశా నిర్దేశం మేరకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కేటీఆర్ అమెరికా పర్యటనను నుంచి తిరిగి వచి్చన తర్వాత ఆయనతో భేటీ అయ్యేందుకు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. జాబితా ప్రకటన తర్వాత బీఆర్ఎస్ అధినేత ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మదింపు చేస్తున్నాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా కొందరు అభ్యర్థులను మార్చక తప్పని సరి పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ ఆశావహులు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరో? ఇక పార్టీ టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర అభ్యర్థులు తమపై పోటీ చేసే ప్రత్యర్థి పారీ్టల అభ్యర్థులపై ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే ఉత్కంఠ మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థులను వెంటాడుతోంది. విపక్ష పార్టీ అభ్యర్థుల బలాబలాలకు అనుగుణంగా తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు సొంత పారీ్టలో అసమ్మతి సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నట్లు బీఆర్ఎస్ గుర్తిస్తోంది. పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతుండటంతో వారిని బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. మరో వారం రోజుల్లో పార్టీ పరంగా కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గాలకు ప్రచార సామగ్రి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రచార సామగ్రిని తరలించే పనిలో ఉంది. నియోజకవర్గాల వారీగా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన ఓటర్లు, గ్రామాలు, పథకాల వారీగా వారి వివరాలను పార్టీ అభ్యర్థులకు అందజేస్తున్నారు. పార్టీ జెండాలు, కండువాలు, టోపీలు, తోరణాలు తదితరాలను తొలి విడతలో తెలంగాణ భవన్ నుంచి చేరవేస్తున్నారు. తమ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించాల్సిందిగా మంత్రి హరీష్‌రావు, కవితపై పార్టీ అభ్యర్థులు ఒత్తిడి తెస్తున్నారు. ఓ వైపు అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆలోగా ఎన్నికల ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీ‹Ùరావు, కవిత ప్రచార షెడ్యూలుపైనా కసరత్తు జరుగుతోంది. -
ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: అసంతృప్త నేతలపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ వేదికపైనే సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్న సంజయ్.. కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ హితవు పలికారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదికపై బండి సంజయ్ మాట్లాడుతూ, మూర్ఖత్వ, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించారు. కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. దీనిపై ప్రశ్నించేందుకు కిషన్ రెడ్డి బాట సింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్, ప్రగతిభవన్‌లో పడుకున్నాడు. సచివాలయం నీళ్లలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. కిషన్ రెడ్డి అధ్యక్షత బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ కదా.. అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. జీవిస్తున్నాడు. ఇవ్వాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్‌తో ప్రచారం చేయిస్తున్నాడు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు ‘‘కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలి. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త నాకు సహకరించారు. చాలా కష్టపడి పనిచేశాననే తృప్తి నాకుంది.. అది చాలు. నయా నిజాం పాలనను అంతమొందించాలి. కార్యకర్తలను కాపాడుకోవాలి. నేను అధ్యక్షుడిని అయ్యాక చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు వారిపై ఉన్నాయి. జైలుకు పంపించారు. వారు నిజమైన హీరోలు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ గురి
-
అడగడమే ఆలస్యం
సాక్షి, అమరావతి: పరాజయాల పరంపరంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు, జావగారిపోతున్న నేతల్ని నిలబెట్టుకునేందుకు శతథా ప్రయత్నిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎడాపెడా పదవుల పందేరాన్ని మార్గంగా ఎంచుకున్నారు. కింది స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో కొత్తగా 48 మందికి చోటు కల్పించగా కొద్దిమంది మినహా నగర స్థాయి నేతలే ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలోనే 219 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాగా కొత్తగా నియమించిన వారితో అది 267కి చేరింది. ప్రస్తుతానికి పార్టీ పదవులిస్తానని, అధికారంలోకి వచ్చాక అందలం ఎక్కిస్తానని అధినేత బుజ్జగిస్తున్నారు. గత్యంతరం లేకనే కొమ్మారెడ్డి పట్టాభిరాం లాంటి నేతలకు అవకాశమిచ్చినట్లు పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. -
కర్ణాటక: తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ ఎస్.బొమ్మైకి అసంతృప్త మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులతో తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి. ఇటీవల ఏర్పాటైన కొత్త కేబినెట్, శాఖల కేటాయింపులపై అసమ్మతి గళాలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం సీఎం బొమ్మై, తాజా మాజీ సీఎం యడియూరప్పతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరగంటపాటు యడియూరప్ప నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు అసమ్మతి అంశంతోపాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు బొమ్మై సన్నిహిత వర్గాలు తెలిపాయి. పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్, మునిసిపల్ పరిపాలన, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రి ఎన్.నాగరాజ్ తమకు కేటాయించిన శాఖలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపనులు, రవాణా శాఖల వంటివి తనకు అప్పగించాలని నాగరాజ్ డిమాండ్ చేస్తుండగా అప్రాధాన్య శాఖను కేటాయించారంటూ అలిగిన ఆనంద్ సింగ్ బళ్లారి జిల్లా హోస్పేటలోని తన కార్యాలయాన్ని మూసివేశారు. మాజీ సీఎం యడియూరప్పతో, అనంతరం సీఎం బొమ్మైతో సమావేశమై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. అనంతరం సీఎం, రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ కలిసి ఆనంద్ సింగ్‌ను బుజ్జగించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ..తనకు సింగ్‌తో ఎలాంటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ, పార్టీ నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ప్రాధాన్యం కలిగిన శాఖను ఆనంద్ సింగ్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించడం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ఏ రామదాస్, ఎమ్మెల్సీ సీపీ యోగీశ్వర కూడా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారు సీఎం బొమ్మైతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి సీల్డ్ కవర్లో ఒక లేఖను అందజేసినట్లు అనంతరం రామదాస్ మీడియాకు తెలిపారు. ‘తీరిక సమయంలో ఆ లేఖను చదవాలని సీఎం బొమ్మైను కోరాను. రాష్ట్రం, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను అందులో వివరించాను’ అని ఆయన వెల్లడించారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ యోగీశ్వర మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రితో రెండుసార్లు సమావేశ మయ్యాను. అయితే, వీటికి కారణాలంటూ ఏమీ లేవు. నాకెలాంటి అసంతృప్తి లేదు. నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా’ అని తెలిపారు. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా రెండు రోజుల అనంతరం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ బలహీనపడింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నాయకులు మరోసారి తమ గళం విప్పారు. గత దశాబ్ద కాలంగా పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త తరం పార్టీకి కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జమ్మూలో శుక్రవారం జీ23 గ్రూపులో నాయకులు బహిరంగంగా ఒకే వేదికపై శాంతి సమ్మేళన్ పేరుతో బల ప్రదర్శనకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులైన గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, భూపీందర్ హూడా, రాజ్ బబ్బర్ వంటి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో ఈ నాయకులంతా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో పార్టీ ప్రక్షాళన, అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వం వంటి అంశాలను ప్రస్తావించారు. పార్టీని ఇలా చూడలేకపోతున్నాం గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా మారిపోయిందని జీ23 నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ అన్నారు. పార్టీ బాగా ఉన్న రోజుల్ని చూసిన తాము ఇలా బలహీనంగా ఉన్న పార్టీని చూడలేకపోతున్నామని అన్నారు. ‘‘మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మాలో ఎవరూ దొడ్డిదారిలో పార్టీలోకి రాలేదు. ప్రధాన ద్వారం వెంబడి నడిచే వచ్చాం. విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాల్లో పాల్గొని ఈ స్థాయికి చేరుకున్నాం. కానీ నేటి తరం పార్టీకి కనెక్ట్ కావడం లేదు’’అని ఆనంద్ శర్మ వాపోయారు. ఆజాద్ అనుభవం అక్కర్లేదా ..? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కి మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కపిల్ సిబల్ మండిపడ్డారు. ఆజాద్ అనుభవం పార్టీకి అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ ఇంజనీర్ వంటి వాడని ఆయన పార్లమెంటులో లేకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రతీ రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితులు ఆజాద్‌కి తెలిసినట్టుగా మరే నాయకుడికి తెలియవని అన్నారు. నిప్పు రాజేసిన నార్త్ వర్సస్ సౌత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా కాలంగా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీలో కీలక పదవుల్ని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పదవుల్ని రాహుల్ తన సన్నిహితులకి ఇస్తున్నారని, పార్టీలో సీనియర్లని విస్మరిస్తున్నారన్న అసంతృప్తిలో ఉన్నారు. అదే సమయంలో కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన నార్త్ వర్సస్ సౌత్ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా నిప్పు రాజేశాయి. ఈ మధ్య రాహుల్ గాంధీ తిరువనంతపురంలో మాట్లాడుతూ ‘‘ఉత్తరాదిన నేను 15 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రాజకీయాలు వేరేగా ఉండేవి. కేరళ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాక చాలా హాయిగా అనిపిస్తోంది. దక్షిణాది ప్రజలకి అన్ని అంశాల్లో ఆసక్తి ఉంది. ఎంతో లోతుగా అన్ని విషయాలు వారు తెలుసుకుంటారు’’అని కితాబునిచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జీ23 నాయకులు సమావేశమయ్యారు. ప్రజలు ఏ ప్రాంతం వారైనా ఒక్కటేనని, వారి తెలివితేటల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కపిల్ వంటి నాయకులు రాహుల్‌పై ఫైర్ అయ్యారు. -
బీజేపీ అధినాయకత్వంపై ఏక్నాథ్ ఖడ్సే కినుక
జల్గావ్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అధినాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ‘అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో నా కుమార్తెతో పాటు మరికొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై ఆధారాలు చూపాను. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కోరాను’అని తెలిపారు. ‘పార్టీని వీడి వెళ్లాలనుకోవడం లేదు. పార్టీలో ఇవే రీతిగా అవమానాలు కొనసాగుతుంటే మరో మార్గం ఆలోచిస్తా’అని తెలిపారు. -
తాడోపేడో!
టీడీపీ అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు అసంతృప్త నేతలు సిద్ధమవుతున్నారు. ఐదేళ్లుగా కష్టపడిన వారికి కాకుండా ఎన్నికల వేళ డబ్బుతో ముడిపెట్టి నిర్ణయాలు తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ మేరకు జిల్లాలో జరిగే ‘ప్రజా గర్జన’కు బుధవారం వస్తున్న అధినేత ముందు తమ ఆవేదన వెళ్లగక్కాలన్న ఆత్రుతతో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షలో బాహాటంగా తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే నిలదీయాలని యోచిస్తున్నారు. డీవీజీ శంకరరావు, బొబ్బిలి చిరంజీవులు, పడాల అరుణ ...ఇలా ఒక్కొక్కరు చెప్పుకుని పోతే చాంతాడంత జాబితా కనిపిస్తోంది. వీరంతా అధినేతకు ఎలాంటి సవాల్ విసురుతారో చూడాలి. సాక్షి ప్రతినిధి, విజయనగరం :అరకు ఎంపీ టిక్కెట్ వస్తుందన్న ఆశతో పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుకు ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి పోటీ చేస్తారని చంద్రబాబు తొలుత ప్రకటించగా, ఆమె కాదనడంతో శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటించాలని, పార్టీ నేతలను కలుసుకోవాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచనప్రాయంగా ఆదేశించారు. దీంతో ఆమె జోరు పెంచారు. ఈ క్రమంలో పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన డీవీజీ శంకరరావు తీవ్ర నిరాశతో ఉన్నారు. రాజధాని వెళ్లి, అధినేతను కలిసి తేల్చుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈలోపే చంద్రబాబు ప్రజాగర్జనలో పాల్గొనేందుకు బుధవారం జిల్లాకు వస్తుండడంతో ఇక్కడే తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ పడిన కష్టానికి ఇదేనా ఫలితం అని ప్రశ్నించాలని యోచిస్తున్నారు. సొమ్ములే కే...చిరంజీవులకు చెక్ ఇదే పరిస్థితిలో పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు ఉన్నారు. డబ్బు ఉన్నోడికే టిక్కెట్ అని తేల్చి చేప్పేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా నిరాశ చెందకుండా పార్టీ కోసం పని చేస్తూ.. వస్తున్నా.. ఆర్థిక బలంతో ముడిపెట్టి పక్కకు నెట్టేయడాన్ని చిరంజీవులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించే అవకాశం ఉంది. అధిష్టానాన్ని శాసించే స్థాయిలో లేకపోయినా ఎన్నికల్లో ప్రభావం చూపగల సత్తా తనకుందని పరోక్షంగా చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవులతో పాటు ఆయన అనుచరులు కూడా అధినేత ముందు గళం విప్పే అవకాశం ఉంది. ఆగ్రహంతో అరుణ మాజీ మంత్రి పడాల అరుణ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీని ముందుకు నడిపించిన అరుణకు ఈసారి మొండిచేయి ఎదురవుతోంది. ఇప్పటికే గజపతినగరం టిక్కెట్‌ను కొండపల్లి అప్పలనాయుడుకి ఇస్తున్నట్టు అధినేత సంకేతాలు ఇచ్చారు. దీంతో కొండపల్లి జోరు పెంచారు. ఈ నిర్ణయం అరుణకు మింగుడు పడడం లేదు. ఐదేళ్లుగా పార్టీ భారం మోసిన తనను కాదని ఇటీవల నియో జకవర్గానికి వచ్చిన నాయకుడికి టిక్కెట్ ఇవ్వడమేమిటన్న ఆవేదనతో ఉన్నారు.హైదరాబాద్ వెళ్లి తన గోడు వ్యక్తం చేయాలని భావించారు. కానీ ఈలోపే చంద్రబాబు జిల్లాకు వస్తుండడంతో ఏదొకటి ఇక్కడే తేల్చుకోవాలనే యోచనలో ఉన్నారు. కొత్తవారికిస్తే మా గతేంటి? ఇదే తరహాలో విజయనగరం నియోజకవర్గ నాయకులు కూడా తమ ఆవేదన వెళ్లగక్కే అవకాశం ఉంది. పార్టీకి వెన్నంటే ఉండి, కష్టనష్టాలు చవి చూసిన తమని కాదని కొత్తగా వచ్చే నేతకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అశోక్‌ను కాదంటే తమను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలని ఇప్పటికే ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు వెంకట నర్సింగరావు తదితరులు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇక, కొత్త నేత రాక నేపథ్యంలో ప్రసాదుల రామకృష్ణ తమ అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. ఆ నేతకు ప్రాధాన్యం ఇస్తే ఏదొక నిర్ణయం తీసుకో వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాంతాండంతా ఆశావహుల జాబితా ఉన్నా తమను కాదని పార్టీలు మారే వ్యక్తిని, వేరొక జిల్లాకు చెందిన నేతను ఆలోచించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సామాజిక వర్గం ఆదారంగా టిక్కెట్ ఇవ్వాలని, అది కూడా పార్టీ కోసం పనిచేసే వారికే కట్టబెట్టాలని పట్టుబట్టే అవకాశం ఉంది. చెప్పాలంటే అధినేత ముందు పెద్ద పంచాయతీయే జరగవచ్చు. అయితే, ఇవన్నీ ముందే తెలిసిన అధినేత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.