
సాక్షి, అమరావతి: పరాజయాల పరంపరంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు, జావగారిపోతున్న నేతల్ని నిలబెట్టుకునేందుకు శతథా ప్రయత్నిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎడాపెడా పదవుల పందేరాన్ని మార్గంగా ఎంచుకున్నారు. కింది స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో కొత్తగా 48 మందికి చోటు కల్పించగా కొద్దిమంది మినహా నగర స్థాయి నేతలే ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
గతంలోనే 219 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాగా కొత్తగా నియమించిన వారితో అది 267కి చేరింది. ప్రస్తుతానికి పార్టీ పదవులిస్తానని, అధికారంలోకి వచ్చాక అందలం ఎక్కిస్తానని అధినేత బుజ్జగిస్తున్నారు. గత్యంతరం లేకనే కొమ్మారెడ్డి పట్టాభిరాం లాంటి నేతలకు అవకాశమిచ్చినట్లు పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment