పాక్ కుట్రలు ఫలించవు
విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని కార్గిల్ సందర్శన
అమర జవాన్లకు ఘనంగా నివాళులు
ద్రాస్ (లద్దాఖ్): కార్గిల్ యుద్ధంలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధాలతో ఇప్పటికీ కవి్వంపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయన లద్దాఖ్‌లో పర్యటించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులరి్పంచారు. వారి కుటుంబీకులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనిక వీరుల శౌర్యం ముందు పాక్ ముష్కరులు మోకరిల్లారు. అయినా ఆ దేశం ఎన్నో వికృత యత్నాలకు పాల్పడింది. అవన్నీ దారుణంగా విఫలవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. పొలిమేరల నుంచి వారికి నేరుగా వినబడేలా హెచ్చరిస్తున్నా.
ఉగ్ర మూకల దన్నుతో పన్నుతున్న ఇలాంటి కుట్రలు సాగవు. ముష్కరులను మన సైనిక దళాలు నలిపేస్తాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం’’ అన్నారు. పాతికేళ్ల కింద కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యునిగా సైనికుల మధ్య గడిపే అదృష్టం తనకు దక్కిందని మోదీ గుర్తు చేసుకున్నారు. భూతల స్వర్గమైన కశీ్మర్‌లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతలు నెలకొంటున్నాయన్నారు.
సైనికులకు ఇవ్వాల్సిన పెన్షన్ నిధులను ఆదా చేసుకునేందుకే అగి్నపథ్ పథకం తెచ్చారన్న విపక్షాల విమర్శలను మోదీ తీవ్రంగా ఖండించారు. అది సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, నిత్యం యువ రక్తం ఉండేలా, సదా యుద్ధ సన్నద్ధంగా ఉండేలా చూసేందుకు తెచి్చన పథకమన్నారు. ‘‘వేల కోట్ల కుంభకోణాలతో సైన్యాన్ని బలహీనపరిచిన వాళ్లే ఇప్పుడిలా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై మతిలేని విమర్శలకు దిగడం సిగ్గుచేటు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తప్పుడు వాగ్దానాలు చేసింది కూడా వారే. మేం విజయవంతంగా అమలు చేస్తున్నాం’’ అన్నారు.
టన్నెల్‌లో మోదీ ‘బ్లాస్ట్’
లేహ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంతో సంబంధాలు కల్పించనున్న షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేసి పనులను ప్రారంభించారు. 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సొరంగంగా నిలవనుంది.
‘విజయ్ దివస్’లో ముర్ము
న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. ‘‘1999లో ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ మంచుకొండల్లోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బ తీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికునికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు కూడా నివాళులరి్పంచారు.
మోదీపై విపక్షాల ధ్వజం
సైన్యం కోరిన మీదటే అగ్నిపథ్ తెచ్చామంటూ మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని విపక్షాలు విమర్శించాయి. విజయ్ దివస్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పి అమర జవాన్లను అవమానించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఏ ప్రధానీ ఇలా దిగజారలేదంటూ ధ్వజమెత్తారు. ఈ పథకం ప్రస్తావనతో ఆశ్చర్యపోయామని నాటి ఆర్మీ చీఫే చెప్పారని కాంగ్రెస్ పేర్కొంది. సైన్యం సామర్థ్యాన్ని పెంచేందుకు, యువ రక్తం నింపేందుకు అగి్నపథ్ పథకం తెచ్చామనడం ద్వారా మన సైనికులను మోదీ ఘోరంగా అవమానించారని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తదితర పారీ్టలు దుయ్యబట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment