Kargil Vijay Diwas
-
PM Narendra Modi: పొలిమేరల నుంచే హెచ్చరిస్తున్నా...
ద్రాస్ (లద్దాఖ్): కార్గిల్ యుద్ధంలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధాలతో ఇప్పటికీ కవి్వంపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయన లద్దాఖ్‌లో పర్యటించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులరి్పంచారు. వారి కుటుంబీకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనిక వీరుల శౌర్యం ముందు పాక్ ముష్కరులు మోకరిల్లారు. అయినా ఆ దేశం ఎన్నో వికృత యత్నాలకు పాల్పడింది. అవన్నీ దారుణంగా విఫలవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. పొలిమేరల నుంచి వారికి నేరుగా వినబడేలా హెచ్చరిస్తున్నా. ఉగ్ర మూకల దన్నుతో పన్నుతున్న ఇలాంటి కుట్రలు సాగవు. ముష్కరులను మన సైనిక దళాలు నలిపేస్తాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం’’ అన్నారు. పాతికేళ్ల కింద కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యునిగా సైనికుల మధ్య గడిపే అదృష్టం తనకు దక్కిందని మోదీ గుర్తు చేసుకున్నారు. భూతల స్వర్గమైన కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతలు నెలకొంటున్నాయన్నారు. సైనికులకు ఇవ్వాల్సిన పెన్షన్ నిధులను ఆదా చేసుకునేందుకే అగి్నపథ్ పథకం తెచ్చారన్న విపక్షాల విమర్శలను మోదీ తీవ్రంగా ఖండించారు. అది సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, నిత్యం యువ రక్తం ఉండేలా, సదా యుద్ధ సన్నద్ధంగా ఉండేలా చూసేందుకు తెచి్చన పథకమన్నారు. ‘‘వేల కోట్ల కుంభకోణాలతో సైన్యాన్ని బలహీనపరిచిన వాళ్లే ఇప్పుడిలా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై మతిలేని విమర్శలకు దిగడం సిగ్గుచేటు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తప్పుడు వాగ్దానాలు చేసింది కూడా వారే. మేం విజయవంతంగా అమలు చేస్తున్నాం’’ అన్నారు. టన్నెల్లో మోదీ ‘బ్లాస్ట్’ లేహ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంతో సంబంధాలు కల్పించనున్న షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేసి పనులను ప్రారంభించారు. 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సొరంగంగా నిలవనుంది.‘విజయ్ దివస్’లో ముర్ము న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. ‘‘1999లో ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ మంచుకొండల్లోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బ తీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికునికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు కూడా నివాళులరి్పంచారు. మోదీపై విపక్షాల ధ్వజం సైన్యం కోరిన మీదటే అగ్నిపథ్ తెచ్చామంటూ మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని విపక్షాలు విమర్శించాయి. విజయ్ దివస్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పి అమర జవాన్లను అవమానించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఏ ప్రధానీ ఇలా దిగజారలేదంటూ ధ్వజమెత్తారు. ఈ పథకం ప్రస్తావనతో ఆశ్చర్యపోయామని నాటి ఆర్మీ చీఫే చెప్పారని కాంగ్రెస్ పేర్కొంది. సైన్యం సామర్థ్యాన్ని పెంచేందుకు, యువ రక్తం నింపేందుకు అగి్నపథ్ పథకం తెచ్చామనడం ద్వారా మన సైనికులను మోదీ ఘోరంగా అవమానించారని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. -
అగ్నిపథ్‌పై విపక్షాల విమర్శలు.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. విపక్షాలపై ధ్వజమెత్తారు.భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భారత సైన్యం ప్రారంభించిన కీలకమైన సంస్కరణలకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.భారత బలగాలకు సంబంధించిన పెన్షన్ సొమ్మును పొదుపు చేయడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విధుల్లో చేరిన ఉద్యోగులకు 30 ఏళ్ల తర్వాత పింఛన్ అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ మేమే ఈ అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, అది తర్వాత వచ్చే ప్రభుత్వాలకే వదిలేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది. మేం 'రాజనీతి' కోసం కాకుండా 'రాష్ట్రనీతి' కోసం పని చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్: పాక్‌కు ప్రధాని మోదీ వార్నింగ్
న్యూఢిల్లీ, సాక్షి: కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధ వీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకాన్ని ఆయన సందర్శించారు. యుద్ధంలో అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు. పాక్‌పై విజయం సాధించే పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా రజత్ జయంతి వర్ష్ పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. On 25th Kargil Vijay Diwas, the nation honours the gallant efforts and sacrifices of our Armed Forces. We stand eternally grateful for their unwavering service.https://t.co/xwYtWB5rCV— Narendra Modi (@narendramodi) July 26, 2024 👉దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం👉ఎంతో మంది జవాన్ల త్యాగంతో కార్గిల్ యుద్ధం గెలిచాం👉సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిపోయాయి👉శ్రీనగర్ లద్ధాక్‌లో అభివృద్ధి చేస్తున్నాం👉ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఉపేక్షించేది లేదు👉జమ్ముకశ్మీర్‌లో జీ-20 సమ్మిట్‌ను నిర్వహించగలిగాం👉పాకిస్తాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు👉నాకు దేశమే ముఖ్యం.. పార్టీ కాదు. 👉కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ఎంతో మంది సైనికులు వీర మరణం పొందారు. 👉దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సెల్యూట్ చేస్తున్నా👉కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నా👉కాశ్మీర్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచాం👉జమ్మూకాశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నారు👉దేశ రక్షణ రంగంలో సంస్కరణలు చేపట్టాం👉వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తప్పుడు ప్రచారం చేశారు.👉కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు 👉కార్గిల్ విజయం దేశానిది.. ఏ ఒక్క పార్టీది కాదు 👉కార్గిల్ యుద్ధంతో సైనిక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పాం👉కార్గిల్ విజయం భారత సైనికుల పరామక్రమానికి నిదర్శనం -
Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు
ముంబై: కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్ చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ వర్షారాయ్ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్ జూలై 19న ప్రారంభమై జూలై 22న ముగిసింది. శ్రీనగర్ నుండి ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ఆమె సగటున రోజుకు 40 కి.మీ. పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అరి్పంచారు. ఆమెతో పాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ వర్షా రాయ్ భర్త కశ్మీర్లో ఆర్మీ అధికారిగా ఉన్నారు. -
26న కార్గిల్‌కు ప్రధాని మోదీ.. భారత విజయ రజితోత్సవాలకు హాజరు
పాకిస్తాన్‌తో 1999లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూలై 26న లధాక్‌లో జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. తాజాగా లధాక్ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా ప్రధాని పర్యటనకు సంబంధించి సాగుతున్న సన్నాహాలను పరిశీలించారు.భారత విజయ రజితోత్సవాల సందర్భంగా కార్గిల్ జిల్లాలోని ద్రాస్‌లో జూలై 24 నుంచి 26 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ జూలై 26న కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శిస్తారని, కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. ద్రాస్ హెలిప్యాడ్ వద్ద భద్రత, స్వాగతం, మోదీ కాన్వాయ్‌కు అవసరమైన ఏర్పాట్లు, స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించే విధానం తదితర కార్యక్రమాల సన్నాహాలపై అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ చర్చించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.జూలై 26 ఉదయం ద్రాస్ బ్రిగేడ్ హెలిప్యాడ్‌లో ప్రధాని దిగుతారని, ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలుకుతారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. కార్గిల్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని, ఆ తర్వాత షహీద్ మార్గ్(వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని ఆయన తెలిపారు. -
Kargil Vijay Diwas: ఘర్ మే ఘుస్ కే...
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. ప్రధాని నివాళులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది. -
'మిస్ యూ భయ్యా'! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!
కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగానే ఈ 'కార్గిల్ విజయ్ దివాస్'ని ప్రతి ఏటా జూలై 26న జరుపుకుంటున్నాం. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. నాటి యుద్ధంలో ఎందరో యువ సైనికులు అశువులు బాశారు. ఈ సందర్భంగా వారందర్నీ స్మరించుకుంటూ గొంతెత్తి మరీ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అసామాన్య ధైర్య సాహాసాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ధీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా గురించి అతని కవల సోదరుడి మాటల్లో తెలుసుకుందాం. నిజానికి కెప్టెన్ విక్రమ్ బాత్రా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి అతని వయసు కేవలం 24 ఏళ్లు. అతని ధైర్య సాహాసాలు గురించి 'యే దిల్ మాంగ్ మోర్' అని అనకుండా ఉండలేం. అతడు సాధించిన విజయాలు, యుద్ధంలో అతడు చూపించిన తెగువ భరతమాత మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అతను ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్ నివాసి. అక్కడ అతడు తన తల్లిదండ్రులు, కవల సోదరడు విశాల్ బాత్రాతో కలిసి ఉండేవాడు. కెప్టెన్ విక్రమ్ బాత్రాలా అతని సోదరుడు విశాల బాత్రా కూడా సైన్యంలోకి చేరాలని కలలు కన్నాడు. కానీ అది జరగలేదు. బహుశా అతను ముందుగా చనిపోవడం అన్నది విధే ఏమో గానీ ఆ బాధ విక్రమ్ కుటుంబ సభ్యులకు ఓ పీడకలలా మిగిలింది. ఈ కార్గిల్ దివాస్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విశాల్ తన సోదరుడుని కోల్పోవడం గురించి ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, అతడిని చూసి యువకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నాడు విశాల్. అతను మన మధ్యే ఉన్నాడు.. విక్రమ్ భౌతికంగా లేకపోవచ్చు గానీ అతను మన మధ్యే ఇంకా ఉన్నాడు. ఎందుకంటే అతని ధైర్య సాహాసాలను చూసిన వారెవ్వరూ ఆ మాట ఒప్పుకోలేరు. భారతదేశానికి అతను కెప్టెన్ బాత్రా కావచ్చు కానీ నాకు మేము ఒకేలా ఉండే కవల సోదరుడు. మమ్మల్ని చిన్నప్పుడూ మా అమ్మ లవ్, కుష్ అని పిలిచేది. కాలం ఎలాంటి బాధకైన మంచి మందు అంటారు కానీ నా విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా. కేవలం 24 సంవత్సరాల వయసులో అతడు దేశం కోసం చేసింది దాని గురించి వింటే అపారమైన గర్వం, గౌరవం కలుగుతున్నాయి. అతడికి సోదరుడిగా ఒకేలా పుట్టినందుకు దేవుడికి ధన్యావాదాలు. అని భావోద్వేగం చెందాడు విశాల్ జూనియర్ అధికారుల వల్లే ఆ గెలుపు జూనియర్ అధికారుల నాయకత్వం వల్లే ఈ కార్గిల్ యుద్ధం గెలిచింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా(పీవీసీ), కెప్టెన్ మనోజ్ పాండే(పీవీసీ), కెప్టన్ అనూజ్ నయ్యర్(ఎంవీసీ) వంటి చాలామంది అధికారుల కేవలం 23, 24, 25 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. వారంతా భారతీయ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారిని చూసే ఆర్మీలో చేరామని చాలా మంది తనకు చెప్పారని విశాల్ చెబుతున్నాడు. "కేవలం ఇలాంటి ప్రత్యేక సందర్భాలలోనే వారిని గుర్తు తెచ్చుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసిన త్యాగానికి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి చదివాం. మరీ ఇలా దేశం కోసం అమరులైన ఈ దైర్యవంతులైన యువకుల గురించి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చకూడదు?. మనకు స్వాతంత్య్రం రావడానికి సహకరించిన స్వాతంత్య్ర సమరయోధులు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో 1999లో మన కీర్తీని పునరుద్ధరించి మన మాతృభూమికోసం పోరాడిన ఈ వ్యక్తుల గురించి విద్యార్థులు తెలుసుకోవడం అంతే ముఖ్యం" అన్నాడు విశాల్ నాయకుడిగా కూడా విక్రమ్ క్రెడిట్ తీసుకోలేదు విక్రమ్ నాయకుడిగా కూడా ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు. ఒకసారి అతను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శిస్తున్నప్పుడూ నువ్వు సాధించి గొప్ప విజయం ఏమిటంటే విజయ్ తాను ఆరుగురి వ్యక్తలతో కొండలపైకి వెళ్లాను అంతే దిగ్విజయంగా తిరిగి వచ్చానని, తన జట్టుకే క్రెడిట్ ఇచ్చేవాడు. నిజానికి అతన సహచరుల చెబుతుంటారు.. కథన రంగంలో తానే మొదట ఉండేవాడని, శత్రువు బుల్లెట్ తానే ముందు తీసుకునేవాడని. అతడే ముందుండి మమ్మల్ని నడిపించేవాడని చెబుతుంటే చాలా బాధగా ఉండేదని విశాల్ పేర్కొన్నాడు. ఇక్కడకు రావడం పుణ్యక్షేతం సందర్శించినట్లే.. ఇక చివరగా విశాల్ బాత్రా తనకు ఇక్కడకు రావడం పుణ్యక్షేత్రానికి రావడంతో సమానమని చెప్పాడు. సుమారు 1700ల నుంచి 17500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను ఎలా అధిరోహించారు, పైగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న ఇక్కడ ఎలా పోరాడారు అని అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా కఠినమైనది కూడా. నాకు అక్కడకు వెళ్లినప్పుడల్లా విక్రమ్ అక్కడ శిఖరాలను కాపలా కాస్తున్నాడని, మనోజ్ పాండే ఇప్పటికి పహారా కాస్తున్నాట్లు భావిస్తాను. అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే విక్రమ్ బాత్రా, అతని సహచర యువకులు ఒక్కొక్కరు అక్కడ కూర్చొన్నట్లు నాకు అనిపిస్తుందని అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు విశాల్. అంతేగాదు ఈ కార్గిల్ యుద్ధం గురించి బాలీవుడ్ మూవీ షెర్షా(2021) చిత్రం తీశారు. ఈ మూవీ కారణంగా విక్రమ్ బాత్రా గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది. అందులో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒదిగిపోయాడు. (చదవండి: పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!) -
పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!
శత్రుదేశం, దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై చేసిన కుటిల ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. వాటన్నింటిని భారత్ తనదైన శైలిలో తిప్పి కొట్టి నేటికి 22 ఏళ్లయ్యాయి. జులై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆ సమయంలో శత్రువులతో పోరాడి అమరులైన వీర సైనికులను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి చేదు ఘటనలు స్మృతి పథంలోకి తెచ్చుకుంటే.. మన రక్తం మరిగిపోతుంది. పాక్‌పై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఇంతకీ నాడు ఏం జరిగింది? ఎందుకు ఈ కార్గిల్ దివాస్ జరుపుకుంటున్నాం అంటే.. పాక్ అరాచక్రీడను తిప్పికొట్టి.. ఉగ్రమూకలతో చేతులు కలపిన పాక్ భారత్‌పై యద్ధానికి కాలు దువ్వింది. అంతేగాదు భారత్‌తో పోరాడుతోంది మేం కాదు కాశ్మీర్ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించే వాళ్లే అని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేసింది. నాటి కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు చావు దెబ్బతింది. ఉగ్రవాదులతో కలిసి కశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించి పాక్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది. ఈ యుద్ధంలో అమరులైన జవాన్ల త్యాగాలను స్మరించుకునేందుకే ఏటా జూలై 26ని విజయ్ దివాస్‌గా జరుపుకుంటున్నాం. సరిగ్గా ఈ జూలై 26న కార్గిల్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ అరాచక క్రీడను తిప్పి కొట్టింది భారత సైన్యం. కాశ్మీర్లో పాగా వేయాలనుకున్న పాక్ కుటిల ప్రయత్నానికి భారత్ జవాన్లు చెక్ పెట్టారు. పాకిస్తాన్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ నాడు భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటున్నాం. 'ఆపరేషన్ విజయ్' పేరుతో.. ఇక దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. ఈ విజయం సామాన్యమైనది కాదు మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. మన జవాన్లు ఆ సమయంలో చూపిన అసామాన్యమైన తెగువ, ధైర్యమే భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాయి. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. భారత సైన్యం కార్గిల్‌లో లడఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' పేరుతో జరిపిన పోరాట పటిమకు పాక్ సైన్యం తోకముడిచింది. పాక్ పాలకుల గుండెల్లో భయం.. 73 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో దాదాపు 527 మంది జవాన్లు దేశం కోస ప్రాణత్యాగం చేశారు. శత్రు సైనికులు పర్వత పైభాగం నుంచి దాడులు చేస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా మన సైనికులు వీరోచితంగా పోరాడారు. పర్వత శిఖరాలపైకి ఎగబాకుతూ మన సైనికులు టైగర్ హిల్, టోలోలిగ్ కొండలను పాక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో 4 వేల మందికి పైగా శత్రు దేశ సైనికులను మట్టుబెట్టారు. భారత సైన్యం విరుచుకుపడుతున్న తీరును చూసి పాక్ సైనికులతోపాటు పాలకుల గుండెల్లోనూ వణుకు పుట్టింది. ఈ యుద్ధంతో దాయాది దేశం ఉగ్ర బుద్దిని ప్రపంచానికి చాటిచెప్పడంలో భారత్ విజయం సాధించింది. అలాగే పాక్ ఆక్రమణలో ఉన్న కార్గిల్, ద్రాస్ సెక్టార్లను చేజిక్కుంచుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసింది. రెండు ఫెటర్ జెట్లు కూలడంతో.. ఈ యుద్ధం జమ్మూ కాశ్మీర్లో 1999 మే -జూల నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. తమ వ్యూహంలో భాగంగా ఎత్తైన కొండ ప్రాంతాలను ఆక్రమించి పాక్ బలగాలు యుద్ధానికి కాలుదువ్వాయి. స్థానిక గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ యుద్ధంలో పాక్ మన దేశానికి చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ ఆగ్రహావేశాలతో రెచ్చిపోయింది. దెబ్బకు పాక్‌లో భయం మొదలైంది. ఇక తమకు ఓటమి తప్పదని భావించి అమెరికాను జోక్యం చేసుకోవాలని కోరింది. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ పాక్ ప్రతిపాదనకు అంగీకరించలేదు సరికదా..నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాక్ బలగాలను వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు. ఇక పాక్ బలగాలు కార్గిల్ నుంచి వెనుదిరగక తప్పలేదు. జూలై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటిని భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. ఇది ఒకరకంగా పాక్ ఆర్మికి కోలుకోలేని దెబ్బ. ఈ చారిత్రాత్మక విజయంలో వీరమరణం పొందిన నాటి సైనికులను స్మరించుకునేందుకే ప్రతి ఏటా ఈ విజయ్ దివాస్‌ను ఘనంగా జరుపుకుంటున్నాం. (చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య) -
కార్గిల్ హీరో లవ్‌స్టోరీ: వేలు కోసుకుని ఆమెకు బొట్టుపెట్టాడు
Vikram Batra Love Story: కార్గిల్ యుద్ధంలో భారత్.. దాయాది దేశం పాకిస్తాన్‌పై విజయం సాధించి నేటితో 22 ఏళ్లు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 1300 మంది గాయపడ్డారు. వీరమరణం పొందిన వారిలో కెప్టెన్ విక్రమ్ బత్రా ఒకరు. యుద్ధ భూమిలో వెన్ను చూపని వీరుడిగానే కాదు.. ప్రేమికుడిగా కూడా ఆయన చిరస్మరణీయుడే. డింపుల్ చీమాతో ఆయన ప్రేమ ప్రయాణం పెళ్లి తీరం చేరకుండానే ముగిసింది. అయినప్పటికి అన్ని అమర ప్రేమల్లాగే వీరి ప్రేమ కూడా అజారమరం. ప్రేమ - యుద్ధం విక్రం- డింపుల్‌లు 1995లో మాస్టర్స్ డిగ్రీ చదవటానికి పంజాబ్ యూనివర్శిటీలో చేరారు. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కాలేజీలోని అన్ని ప్రేమ జంటల్లానే ప్రేమ లోకంలో విహరించింది వీరి జంట. అయితే, 1996లో విక్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి ఎంపిక అవటంతో మాస్టర్స్ డిగ్రీని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత డింపుల్ కూడా చదువుకు స్వప్తి పలికింది. విక్రం ఆర్మీలో ఉన్నా వీరి ప్రేమ అలానే కొనసాగింది. అతడు డెహ్రాడూన్‌నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి డింపుల్‌ను కలిసేవాడు. అప్పుడు ఇద్దరూ గురుద్వారాలోని మానసా దేవి ఆలయానికి వెళ్లేవారు. అక్కడ ఓ రోజు గుడి చుట్టూ ఇద్దరూ కలిసి ప్రదిక్షణ చేసిన తర్వాత ‘‘ శుభాకాంక్షలు మిసెస్ బత్రా. నువ్వు గమనించలేదా మనం ఇలా ప్రదిక్షణ చేయటం ఇది నాలుగో సారి’’ అని అన్నాడు విక్రం. అది విన్న డింపుల్ మాటల్లేని దానిలా నిలబడి పోయింది. విక్రం తమ బంధానికి ఎంత విలువ ఇస్తున్నాడో తెలిసి చాలా సంతోషించింది. ఓ రోజు ఇద్దరూ మానసా దేవి ఆలయంలో ఉండగా పెళ్లి ప్రస్తావన తెచ్చింది డింపుల్. అప్పుడు విక్రం తన వ్యాలెట్‌లోంచి బ్లేడ్ తీసి తన బొటన వేలు కోసుకున్నాడు. ఆ రక్తంతో ఆమె నుదిటిన బొట్టుపెట్టాడు. సినిమా స్లైల్లో జరిగిన ఈ సంఘటన ఆమె మనసులో చెరగని ముద్రవేసుకుంది. షేర్షా చిత్రంలోని ఓ దృశ్యం సంవత్సరాలు గడుస్తున్న కొద్ది డింపుల్ ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెరగసాగింది. ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 1999 జులై 7న కార్గిల్ యుద్ధంలో విక్రం వీరమరణం పొందాడు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ్ వీర చక్రతో గౌరవించింది. విక్రం మరణం తర్వాత డింపుల్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. విక్రం జీవిత కథను బాలీవుడ్లో ‘‘షేర్షా’’ సినిమాగా తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శెబ్బాష్ తాశి: పాక్ ఖేల్ ఖతం
దాయాది దేశం పాకిస్తాన్ కన్ను ఎప్పుడూ కశ్మీర్ మీదే. ఏదో వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అయితే ఈ సారి ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది. పశువులు తినేందుకు పచ్చిక కూడా కనిపించనంతగా హియలయాలపై మంచు దుప్పటి పేరుకుపోయింది. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు తాశి నామ్‌గ్యాల్. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. క్షణం ఆలస్యం చేయలేదు తాశి నామ్‌గ్యాల్. వెంటనే భారత ఆర్మీకి విషయం చేరవేశాడు. ఆ రోజు 1999 మే 2. తీవ్రమైన దాడులు నామ్‌గ్యాల్ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని చంపేశారు. ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదటి తీవ్రంగా నష్టపోయింది. పాక్ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్, కక్సర్, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది. తూటాలు కాచుకుంటూ దొంగచాటుగా పాక్ ఆర్మీ కొండల పైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిసిస్తుండగా.. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. దీంతో 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. మొదటి వారంలోనే రెండు మిగ్ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్లను మన ఆర్మీ నష్టపోయింది. రోజులు గడుస్తున్నా... రణ క్షేత్రంలో భారత దళాలలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తానే అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు. పాక్ హస్తం జూన్ 5వ తేదిన ముగ్గురు పాక్ సైనికులు భారత భద్రతా దళాలకు చిక్కారు. దీంతో ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అప్పటి వరకు కార్గిల్‌లో స్థానికులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారంటూ చెబుతూ వచ్చిన పాక్ నోటికి తాళం పడింది. పొరుగు దేశం కుట్రలు బయట పడటంతో భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అయ్యింది. పాక్ ఆర్మీ, , టెర్రరిస్టుల ఆధీనంలోకి వెళ్లిన భూభాగాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ విజయ్‌ని ప్రకటించింది. టైగర్ హిల్స్ కార్గిల్ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్ట వేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే నేలకొరిగారు. తరిమి కొట్టారు టైగర్ హిల్స్ చేజిక్కిన తర్వాత భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జులై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ముషారఫ్ కుయుక్తి పాకిస్తాన్లో ప్రధానులెక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి చెప్పకుండా అప్పటీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్‌పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుకా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు. చలికాలంలో హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్ ఆదేశాలతో పాక్ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. అమరులు దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి ముకలు సహాకరించినట్టు తేలింది. విజయ్ దివాస్ కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని హోదాలో నరేంద్రమోదీ పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం రివాజు. - సాక్షి , వెబ్‌డెస్క్ -
నేడు 21వ కార్గిల్ విజయ్ దివస్
-
దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్ రంగాలకు మారిపోయిందన్నారు. కార్గిల్ విజయం అందరికీ స్ఫూర్తి ‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్‌నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
నిజమైన వీరులు సైనికులే: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్‌ను కాపాడే నిజమైన వీరులు సైనికులేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో పాల్గొన్న మోదీ కార్గిల్ యుద్ద వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్గిల్ విజయం మన సంకల్ప విజయమని పేర్కొన్నారు. భారత శక్తి, సమర్థతకు కార్గిల్ విజయం నిదర్శనమన్నారు. అమరవీరులు నేలకొరిగిన స్థలాలు పుణ్యక్షేత్రాల కంటే పవిత్రమైనవని అన్నారు. యుద్దాలు ప్రభుత్వాలు చేయవని, దేశమంతా చేస్తుందన్నారు. ప్రతీ భారతీయుడు సైనికులకు వందనం చేస్తున్నాడని మోదీ తెలిపారు. -
ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రపంచదేశాల్లో భారత్ సైన్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పరమ విశిష్ట సేవా పురస్కార గ్రహీత, పూర్వ లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం టీబీఆర్ సంస్థల అధినేత తనబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక జయా గార్డెన్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్–20 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అమర్ జవాన్ స్థూపం వద్ద నివాళులర్పించారు. జాతీయజెండాను పూర్వ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ ఆవిష్కరించగామాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో టీబీఆర్ సంస్థల అధినేత, సైనిక సంక్షే మసంఘ రాష్ట్ర నాయకులు తనబుద్ది భోగేశ్వరరావు, సినీనటి కవిత, సైనిక సంక్షేమ సంఘ నాయకులు పి. మనోహరరాజు, కెవీఎస్ ప్రసాద్, బీజేపీ నాయకులు గట్టిం మాణిక్యాలరావు, టి.పద్మావతి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్గిల్ విజయానికి 20 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచి శుక్రవారానికి 20 ఏళ్లయిన సందర్భంగా రణభూమిలో అమరులైన భారత సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ఘనంగా నివాళుర్పించారు. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు పాక్‌తో జరిగిన యుద్ధంలో చివరకు భారత్ విజయం సాధించింది. దాదాపు 500 మంది భారత సైనికులు ఈ యుద్ధంలో అమరులయ్యారు. ఆర్మీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘జూలై 26 కార్గిల్ విజయదినోత్సవంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ద్రాస్, కక్సర్, బతాలిక్, టుర్టోక్ సెక్టార్లలో మన సైనికులు గొప్పగా పోరాడారు’ అని తెలిపింది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌లు వరుసగా జనరల్ బిపిన్ రావత్, అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్, బీఎస్ ధనోవా ద్రాస్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. నాడు యుద్ధంలో 17 స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా పనిచేసిన ధనోవానే నేడు వాయుసేన చీఫ్‌గా ఉన్నారు. ద్రాస్‌కు వెళ్లలేక పోయిన కోవింద్ ద్రాస్‌లోని యుద్ధ స్మారకం వద్ద జరిగే కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులతోపాటు వారికి అధిపతి అయిన రాష్ట్రపతి కోవింద్ కూడా హాజరై నివాళి అర్పించాలన్నది ప్రణాళిక. అయితే వాతావరణం బాగాలేకపోవడంతో కోవింద్ వెళ్లలేకపోయారు. దీంతో ఆయన కశ్మీర్‌లోని బదామీ బాగ్ కంటోన్మెంట్లో ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. యుద్ధక్షేత్రంలో తన ఫొటోలను పోస్ట్ చేసిన మోదీ అమరవీరులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘భారత సైనికుల కోసం నేను విజయదినోత్సవం రోజున ప్రార్థిస్తున్నాను. మన సైనికులు ధైర్యం, సాహసం, అంకిత భావాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. మాతృభూమిని కాపాడేందుకు సర్వస్వాన్ని అర్పించిన శక్తిమంతమైన యుద్ధ వీరులకు నివాళి’ అని పేర్కొన్నారు. యుద్ధం సమయంలోఅక్కడికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా మోదీ పోస్ట్ చేశారు. పోరుకు దిగే సామర్థ్యం పాక్‌కు లేదు: రాజ్‌నాథ్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ సైనికుల చెక్కుచెదరని ధైర్యం, గొప్ప త్యాగం కారణంగానే నేడు మన దేశం సరిహద్దులు భద్రంగా, పవిత్రంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌తో పూర్తిస్థాయి లేదా పరిమిత కాలపు యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్తాన్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. ‘మన పొరుగుదేశం (పాకిస్తాన్) ఇప్పుడు మనతో నేరుగా యుద్ధం చేయలేక పరోక్ష యుద్ధానికి దిగుతోంది’ అని రాజ్‌నాథ్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్గిల్ అమరవీరులకు నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంపై చర్చ జరగాలని సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు సైనికులు ధైర్య సాహసాలను పొగిడారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు. సభ్యులు లేచి నిల్చొని మౌనం పాటించి అమర సైనికులకు నివాళి అర్పించారు. -
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు!
న్యూఢిల్లీ : భారత్‌తో యుద్ధం చేసే స్థాయి పాకిస్తాన్‌కు ఏమాత్రం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం కార్గిల్ 20వ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని యుద్ధ వీరులకు పార్లమెంటు నివాళులు అర్పించింది. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సభలోనే ఉన్నారు. స్పీకర్ ఓం బిర్లా సహా ఎంపీలంతా యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ...‘ భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధం చేసేంత సీన్ దాయాది దేశానికి లేదు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ, వాళ్లు అక్కడికే పరిమితమవుతారు అని పేర్కొన్నారు. కాగా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధం గురించి చర్చ జరగాల్సిందిగా కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత అధీర్ రంజన్ చౌదరి కోరారు. మరోవైపు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత సైనికుల సేవలను కొనియాడారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వీరులను జాతి ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు. -
మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లేక్కచేయకుండా కార్గిల్ యుద్ధంలో అసువులు బాసి విజయాన్నందించిన జవాన్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘననివాళులు అర్పించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా వారి త్యాగాలను, ధైర్యసాహసాలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ‘దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలి మమ్మల్ని గెలిపించిన అమరజవాన్లకు నివాళులు.. కృతజ్ఞతలు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు’ అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం కార్గిల్‌ను ఆక్రమించుకోవడానికి దాయాదీ పాకిస్తాన్ పన్నిన కుతంత్రాన్ని తిప్పికొడుతూ... మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. నాటి కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. Homage and gratitude to the martyrs of Kargil war who defended the nation and led us to victory. This country will always remember the sacrifice, courage and valor of our brave soldiers. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2019 -
పట్టపగలే పాక్‌కు చుక్కలు చూపించిన భారత్
1999 జూలై 26 భారతీయులెవ్వరు మరచిపోలేని రోజది. సరిగ్గా 20 యేళ్ల క్రితం దేశం మొత్తం జయహో భారత్ అంటూ నినాదాలు చేసిన రోజది. పాక్ ఆర్మీకి పట్టపగలే చుక్కలు చూపించిన సందర్భం.20 యేళ్ల మరుపురాని జ్ఞాపకం కార్గిల్ విజయ దివస్. భారత జాతి ఐక్యతను చాటిన సంఘటనలో కార్గిల్ యుద్ధం ఒకటి. అసలు కార్గిల్‌ను ఆక్రమించుకొవడం వెనుక ఉన్న పాక్ కుతంత్రం ఏమిటి? ఆ యుద్ధంలో మన సైనికులు ఎంత విరోచితంగా పోరాడో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం. -
‘ఏపీ పౌరులు ఈ ఏడాది 5 మొక్కలు నాటండి’
సాక్షి, విజయవాడ : కార్గిల్ విజయ్ దివస్ (జూలై 26) సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రబ హరిచందన్ రాజ్‌భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కార్గిల్ విజయ్ రోజున ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ రోజు చిరస్మరణీయమైనది. కార్గిల్‌ను ఆక్రమించుకున్న పాకిస్తాన్ సేనల్ని భారత సైనికులు తిప్పి కొట్టిన రోజు. మన సైనికుల వీరత్వానికి మనమంతా గర్వించాలి. మన ప్రజలంతా కలిసికట్టుగా ఉండి దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. విజయ్ దివస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పౌరుడు ఈ ఏడాది కాలంలో ఐదు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో, వివిధ పండుగల జరుపుకునే క్రమంలో గుర్తుగా ఒక మొక్కను నాటండి. ఈ చిన్న ప్రయత్నం పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తుంది. చేయి చేయి కలుపుదాం. మొక్కలు నాటి.. మానవజాతిని కాపాడుదాం.. జైహింద్’ అని పేర్కొన్నారు. -
ఆ క్షణాలు మరచిపోలేనివి..
న్యూఢిల్లీ : కార్గిల్ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీటర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. కార్గిల్ యుద్ద సమయంలో వీరోచితంగా పోరాడిన భారత మాత ముద్దు బిడ్డలకు ఆయన వందనాలు సమర్పించారు. ఈ రోజు మన సైనికులు ధైర్య, సాహసాలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. మాతృ భూమిని కాపాడుకోవడం సర్వస్వం అర్పించిన అమరవీరులకు వినయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా కార్గిల్ గొప్ప తనాన్ని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ క్షణాలు మరచిపోలేనివి.. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. 1999లో కార్గిల్ యుద్దం జరుగుతున్న సమయంలో తాను జమ్మూ కశ్మీర్‌తోపాటు, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ (బీజేపీ) కోసం పనిచేస్తున్నట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనకు కార్గిల్ వెళ్లి.. మన వీర సైనికులను కలిసే అవకాశం వచ్చిందని తెలిపారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. During the Kargil War in 1999, I had the opportunity to go to Kargil and show solidarity with our brave soldiers. This was the time when I was working for my Party in J&K as well as Himachal Pradesh. The visit to Kargil and interactions with soldiers are unforgettable. pic.twitter.com/E5QUgHlTDS — Narendra Modi (@narendramodi) July 26, 2019 కాగా, సరిగా ఇరవై ఏళ్ల క్రితం భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముష్కరులకు భారత సైనికులు నిలువరించారు. సాహసోపేతంగా పోరాడి ముష్కరులు తోకముడిచేలా చేశారు. 1999 జూలై 26న ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. -
సిక్కోలు సైనికా.. సలామ్!
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: కార్గిల్ యుద్ధం.. మన దేశ సైనిక శక్తిని, వీరుల పోరాట ప్రతిభను మరోసారి చాటిచెప్పిన యుద్ధం. డిసెంబర్, జనవరి మాసాల్లోని చలి తీవ్రత, మంచు దట్టంగా కురిసే వాతావరణాన్ని ఆసరాగా తీసుకున్న ముష్కరులు.. నియంత్రణ రేఖ దాటి జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్, ద్రాస్ సెక్టార్లో తిష్టవేశారు. వీరికి దాయాది దేశమైన పాకిస్తాన్ పరోక్షంగా, ప్రత్యక్ష అండదండలు అందించింది. వీరిని గుర్తించిన మన దేశ బలగాలు.. తరిమికొట్టేందు ప్రయత్నాలు చేశారు. పాకిస్తాన్ సైనికులు తీవ్రవాదులతో కలిసి ప్రతిఘటించడంతో ఇది యుద్ధంగా మలుపుతీసుకుంది. 1999 మే నుంచి జూలై నెలల మధ్య ఈ యుద్ధంలో ఎత్తయిన పర్వత శిఖరాలు, అత్యంత కఠిన పరిస్థితుల మధ్య చూపిన పోరాట ప్రతిమ, ధైర్యసాహసాలు విశేషమైనవనే చెప్పాలి. మన బలగాల ధాటికి ముష్కర మూకలు, పాక్ సైనికులు తోకలు ముడిచారు. కార్గిల్ పర్వతంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోరులో వీరోచిత పోరాటంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైనికులు సైతం కీలకపాత్ర పోషించారు. వీరికి దేశం యావత్తు సలామ్ చేస్తోంది. జూలై 25 నుంచి 27 వరకు ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ గెలుపు సంబరాలు నిర్వహించేందుకు ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేసింది. నేడు కార్గిల్ దివస్ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆర్మీ ప్రత్యేక సంబరాలు.. కార్గిల్ విజయ్ దివాస్ 20వ వార్షికోత్సవంలో భాగంగా 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు దేశరాజధాని ఢిల్లీ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ద్రాస్ వరకు భారీగా గెలుపు సంబరాలకు భారత్ ఆర్మీ సన్నద్ధమైంది. వాస్తవానికి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం నుంచి ఈ నెల 14న జ్యోతి ప్రజ్వలనతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. కార్గిల్ జ్యోతి దేశంలోని 11 నగరాల్లో కొనసాగి.. ద్రాస్‌లో కలిసి వేడుకలకు ముగింపు పలకనున్నారు. ఎత్తయిన పర్వత శిఖరాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో క్లిష్టమైన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించడం దేశానికే గర్వకారణం. ఆ యుద్ధంలో మన సైనికులు పోరాటం ఊరికే పోలేదు. వారి స్ఫూర్తితో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలకు భారత సైనికులు శ్రీకారం చుట్టారు. దేశ సేవలో సిక్కోలు గడ్డ.. గుండె ధైర్యం, సాహసంతో శత్రువుపై విరుచుపడే తత్వానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ సైన్యం దొంగదెబ్బ తీసిన ఆ యుద్ధంలో భారతీయ సైనికులు శత్రువులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తరిమికొట్టారు. యుద్ధం విజయంలో భారతీయ ఇన్ఫాంట్రీ విభాగం సైనికులే నిజమైన హీరోలుగా గుర్తింపు పొందారు. నాటి యుద్ధంలో 524 మంది భారత సైనికులు అమరులుకాగా.. 1363 మంది గాయపడ్డారు. జిల్లా నుంచి సుమారు 18 మంది వరకు కార్గిల్ యుద్ధ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకరు వీరమరణం.. ఇద్దరికి గాయాలు.. కార్గిల్ యుద్ధంలో శత్రు సైన్యంతో జరిగిన భీకరపోరులో ఎదురొడ్డి నిలిచిన సిక్కోలు సైనికులు ఇప్పటికీ ఆ దృశ్యాలు వారి కళ్లముందే కనిపిస్తున్నాయని గుర్తుచేసుకుంటున్నారు. ఆనాటి భీకర పోరులో జిల్లాకు చెందిన సుబేదార్ చింతాడ మోహనరావు వీరమరణం పొందాడు. ఇతని స్వస్థలం పోలాకి మండలం రామయ్యవలస. కార్గిల్ యుద్ధ సమయంలో తీవ్ర గాయాలపాలైన మోహనరావు 1999 అక్టోబర్ 18న ఆస్పత్రిలో కన్నుమూశారు. పలాస మండలం కేసిపురం గ్రామానికి చెందిన టొంప నీలాచలం (రాష్ట్రీయ రైఫిల్స్) 1999 జూన్ 21న ద్రాస్ సెక్టార్ పైన టైగర్‌హిల్స్ వద్ద ప్రత్యర్ధుల భీకర ఎదురుకాల్పుల్లో కుడిచేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మాత్రం పూర్తిస్థాయిలో అందలేదు. బూర్జ మండలం లక్కుపురం గ్రామానికి చెందిన చిన్ని సింహాచలం 1999 జూన్ 12న పాక్ సైనికులతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో బుల్లెట్ తగిలి గాయాలపాలయ్యారు. ఈయనకు కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం పూర్తిస్థాయిలో రాలేదు. నేడు ప్రత్యేక కార్యక్రమాలు.. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాటం చేసిన శ్రీకాకుళం సైనికుల పోరాట ప్రతిమను ప్రతిఒక్కరూ కొనియాడుతున్నారు. కార్గిల్ దివాస్‌ను గుర్తుచేసుకుంటూ శ్రీకాకుళం నగరంలో గూణపాలెం సమీపంలోని పార్క్ వద్ద కార్గిల్ విజయానికి చిహ్నంగా స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ►నేడు జరిగే కార్గిల్ దివాస్ సందర్భంగా శ్రీకాకుళంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఎన్సీసీకి చెందిన 14వ ఆంధ్రా బెటాలియన్ విద్యార్థులు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రత్యేక పేరేడ్ చేయనున్నారు. అనంతరం ర్యాలీ తీయనున్నారు. ► గూణపాలెం సమీపంలో ఉన్న కార్గిల్ యుద్ధ చిహ్నం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోనున్నారు. ► భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నాయకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమిచ్చినా వారి రుణం తీరదు సైనికుల త్యాగాలు చేయనిదే మనం సరిగ్గా నిద్రించలేం. దేశ రక్షణలో సైనికులే మూలం. ప్రధానం కూడా. సైనికులకు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిది. దేశ సైనికుల రక్షణ కోసం ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. కార్గిల్ వార్ అనేది దేశ సైనికులకు ఒక స్ఫూర్తిదాయకం. ఆర్మీకి వెళ్లే సైనికుల్లో శ్రీకాకుళం జిల్లా వారు ఎక్కువ. జిల్లా నుంచి 6300 మంది మాజీ సైనికులు వరకు ఉన్నారు. ఇందులో 900 మంది వితంతువులు ఉన్నారు. – జి.సత్యానందం, జిల్లా సైనిక సంక్షేమాధికారి దేశానికి సైనికులే బలం దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులు త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి దేశం ప్రశాంతంగా నిద్రించడం కోసం బోర్డర్లో రక్షణ కాస్తున్న సైనికులే దేశానికి సైనికులే బలం. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వాలు ఉదారభావాన్ని కలిగి ఉండాలి. కార్గిల్ యుద్ధ సైనికులకు నా జోహార్లు. – తమ్మినేని కృష్ణారావు, జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు కళ్లముందే ఆ దృశ్యాలు.. 1999 జూన్, జూలై మాసాల్లో కార్గిల్, ద్రాస్ సెక్టార్లలో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొనడం గర్వంగా ఉంది. దేశ రక్షణలో నేను భాగస్వామున్నైనందుకు ఎప్పుడూ గర్వపడుతునే ఉంటాను. రేయింబవళ్లు యుద్ధంలో పాల్గొన్నాం. 1999 జూన్ 21న ప్రత్యర్థుల భీకర ఎదురుకాల్పుల్లో నా చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. చేతికి డామేజ్ జరిగింది. అప్పట్లో నాకు యుద్ధంలో గాయపడినందుకు లక్ష రూపాయలు మాత్రమే అందింది. ప్రస్తుతం పెన్షన్‌గా కొంతమొత్తం వస్తోంది. – టొంప నీలాచలం, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు ఎన్సీసీకి సైనికులే స్ఫూర్తి నేషనల్ క్యాడెట్ కారŠప్స్‌కు సైనికులే స్ఫూర్తి. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎన్సీసీ క్యాడెట్లు వివిధ విన్యాసాలు చేస్తున్నారు. క్యాడెట్లకు యుద్ధ సైనికులే రోల్ మోడల్. ఎన్సీసీ క్యాడెట్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వాలు కనీస చర్యలు చేపట్టాలి. –డాక్టర్ వై.పోలినాయుడు, ఎన్సీసీ అధికారి, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల -
వాళ్లను కచ్చితంగా చంపించేవాడిని: బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, విజయపుర/బెంగుళూరు: ‘నేనే గనుక హోం మంత్రి అయ్యుంటే.. ఈ గాలి పీల్చుతూ.. ఇక్కడి నీరు తాగుతూ.. మనందరం పన్నులు కడుతుంటే హాయిగా అన్ని సదుపాయాలు అనుభవిస్తూ.. భారత ఆర్మీపై విమర్శలు చేస్తున్నవారిని వదిలిపెట్టే వాడిని కాదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మేధావులను, ఉదారవాదులను తుపాకులతో కాల్పించేవాడిని’ అని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యాత్నా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. విజయపురలో గురువారం ఏర్పాటు చేసిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదారవాదులు, మేధావులతో భారత్‌కు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. కాగా, బసనగౌడ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో టెక్ట్స్‌టైల్స్, రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో బీజేపీని వీడి జేడీఎస్‌లో చేరారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మందు మళ్లీ సొంత గూటికి చేరుకున్న బసన్‌గౌడ విజయపుర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షున్ని డిమాండ్ చేశాయి. హిందువులకు మాత్రమే సహాయం చేయండి. ముస్లింలను పట్టించుకోవద్దని స్థానిక నేతలకు పిలుపునిచ్చి ఆయన గతంలోనూ వార్తల్లో నిలిచారు. Intellectuals live in this country&use all facilities for which we pay tax.Then they raise slogans against our Army.India faces grave danger from them.If I was Home Min,I would have issued orders to shoot them:Basanagouda Patil Yatna,Karnataka BJP Leader in Vijayapura (26/7/2018) pic.twitter.com/kxxGUKdSvC — ANI (@ANI) July 27, 2018 -
భారత జవాన్లకు వైఎస్ జగన్ సెల్యూట్
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ అఖండ విజయం సాధించింది. దేశంలోకి చొరబడిన ముష్కరులపై భారత జవాన్లు కార్గిల్ వద్ద గడ్డ కట్టే చలిలో 60 రోజుల పాటు పోరాడి దేశం మీసాన్ని తిప్పారు. ఆ ఘన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్న ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘కార్గిల్‌లో దేశం కోసం పోరాడిన ప్రతి సైనికుడికి వందనం. సైనికుల వీరోచిత ప్రదర్శన, అసమాన ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’ అని వైఎస్ ట్విటర్లో పేర్కొన్నారు. A big salute to each and every brave soldier who fought valiantly for the country in Kargil. Their impeccable display of strength and valour will always be remembered with pride. #KargilVijayDiwas — YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2018 -
అమరవీరుల త్యాగాలు మరవలేనివి: మోదీ
న్యూఢిల్లీ: భారత సైన్యం సామర్థ్యాన్ని, దేశం కోసం చేసిన వారి త్యాగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ పోరులో భారత్ విజయం సాధించగా ఏటా జూలై 26న నిర్వహిస్తున్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని బుధవారం సైనికులకు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం కార్గిల్ పోరులో సైనికులు చూపిన అసమాన ధైర్యసాహసాలను ఆయన వరుస ట్వీట్లలో అభినందించారు. Kargil Vijay Diwas reminds us of India’s military prowess & the great sacrifices our armed forces make while steadfastly keeping India safe. — Narendra Modi (@narendramodi) 26 July 2017 Remembering our brave soldiers who fought gallantly for the pride of our nation & the security of our citizens during the Kargil War. — Narendra Modi (@narendramodi) 26 July 2017 మరోవైపు కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నివాళులర్పించారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి స్తూపం దగ్గర జవాన్లకు అంజలి ఘటించారు. -
బోలో భారత్ మాతాకీ జై
యుద్ధం.. మొదలవుతూనే సైనికుడి ప్రాణాన్ని కోరుతుంది.ముగిసే రోజొచ్చేసరికి శాంతిని కోరుతుంది.ఈ మధ్యన జరిగేదంతా ఒక పోరాటం. శాంతి కోరని ఓ పోరాటం.ఎన్నెన్ని ముగిసిన యుద్ధాలో.. ఎన్నెన్ని ప్రాణాలో.. ఎన్నెన్ని మొదలవ్వని యుద్ధాలో.. ఎన్నెన్ని ఆగిపోని యుద్ధాలో.. ఒక సైనికుడు ఎప్పుడూ నిలబడే ఉన్నాడక్కడ! ఆ సైనికుడికి ఎప్పుడూ కొడుతూనే ఉందామొక సలామ్!!కార్గిల్ విజయ్ దివస్ ఏంటి? 1999లో ఇండియా–పాకిస్థాన్ మధ్యన రెండు నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ చొరబాటుదారుల నుంచి కార్గిల్ ప్రాంతాన్ని భారత దళాలు జూలై 26న పూర్తిగా అదుపులోకి తెచ్చుకొని విజయ పతాకం ఎగరవేశాయి. ఈ యుద్ధంలో 500లకు పైగా భారత జవానులు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. మంచును లెక్క చేయకుండా... నైనితాల్‌కు చెందిన మేజర్ రాజేశ్ సింగ్ అధికారి కార్గిల్ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ టోలోనింగ్లో కీలకపాత్ర పోషించారు. 15000 అడుగుల ఎత్తున ఉన్న కొండపై ఉన్న పాకిస్థాన్ సైన్యాన్ని అంతమొందించే బాధ్యతను రాజేశ్ చేపట్టారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నా, పరిస్థితులను ఎదిరించి మరీ శత్రు సైన్యం ట్యాంకులను ధ్వంసం చేస్తూ వెళ్లారాయన. కాల్పుల్లో గాయపడినా కూడా తన టీమ్‌ను లీడ్ చేస్తూ ముందుకు వెళ్లి ఆ పాయింట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో బుల్లెట్ గాయాల వల్ల ఆయన ఈలోకాన్ని విడిచి వెళ్లారు. ప్రభుత్వం రాజేశ్ సాహసాన్ని గుర్తిస్తూ మహావీర చక్ర అవార్డుతో గౌరవించింది. రాకెట్ లాంచర్‌తో... తమిళనాడు రామేశ్వరంలో పుట్టి పెరిగిన మేజర్ మరియప్పన్ శరవణన్, దేశ సేవ చేయాలన్న ఆలోచనతో ఆర్మీలో చేరారు. కార్గిల్ యుద్ధంలో బాటలిక్ సెక్టార్లో పాకిస్థాన్ సైనికుడు చొరబడ్డ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే బాధ్యతను చేపట్టిన శరవణన్, రాకెట్ లాంచర్‌తో శత్రు సైన్యాన్ని బెదరగొడుతూ ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఇదే సమయంలో ఆయనపై వరుసగా బుల్లెట్ల దాడి జరిగింది. అప్పటికీ పోరాడుతూనే తుదిశ్వాస విడిచారు. ఆయన సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో గౌరవించింది. 19 ఏళ్లకే పరమవీర చక్ర 16ఏళ్ల వయసులోనే దేశం కోసం పోరాడాలన్న సంకల్పంతో ఆర్మీలో చేరారు యోగేంద్ర సింగ్ యాదవ్. ఆయనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో టైగర్ హిల్ ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 16వేల అడుగులున్న కొండను, కాల్పులు ఎదురైనా ఎక్కారాయన. టైగర్ హిల్ వద్దనున్న నలుగురు పాకిస్థాన్ సైనికులను అక్కడికక్కడే కాల్చేశారు. యుద్ధంలో ఆయన చూపిన సాహసానికి గానూ ప్రభుత్వం పరమ వీరచక్ర అవార్డును అందించింది. 19 ఏళ్లకే పరమ వీరచక్ర అవార్డును అందుకున్న యోగేంద్ర సింగ్ యాదవ్, అతిచిన్న వయసులో ఈ గౌరవాన్ని దక్కించుకున్నవారిలో మొదటి స్థానంలో ఉన్నారు. మరణానికి దగ్గరైనా కూడా... ఢిల్లీలో పుట్టి పెరిగిన కెప్టెన్ అనుజ్ నయ్యర్ కుటుంబంలో అంతా చదువుకున్నవారే! దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆర్మీలో చేరారాయన. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం చొరబడిన పాయింట్ 4875ని స్వాధీనం చేసుకునే బాధ్యతను అనుజ్ నయ్యర్‌కు అప్పగించారు. తన ట్రూప్‌తో కలిసి ఆ పాయింట్‌ను చేరుకున్న ఆయన తొమ్మిది మంది శత్రు సైనికులను అంతమొందించడమే కాక, మూడు యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేశారు. ఈ సమయంలోనే ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలపాలై తుది శ్వాస విడిచారు. మరణానికి చేరువైన క్షణంలోనే మరో ట్యాంకర్‌ను ధ్వంసం చేసి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాకే అమరుడయ్యారు. అనుజ్ పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రభుత్వం ఆయనను మహవీర చక్ర అవార్డుతో గౌరవించింది. శ్రత్రు సైన్యాన్ని అంతమొందించి... హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ విక్రమ్ భాట్రా కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్ జమ్మూ కశ్మీర్ సోపోర్ ప్రాంతంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే కార్గిల్ యుద్ధం మొదలైంది. దీంతో ఆయనను యుద్ధంలో బాధ్యతలు నెరవేర్చమని ప్రభుత్వం కార్గిల్‌కు పంపింది. తన ట్రూప్‌తో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, విజయవంతంగా పాకిస్థాన్ క్యాంప్‌లను కొల్లగొట్టిన విక్రమ్, మెషిన్ గన్లతో కాల్పులు ఎదురైనా ఎందరో పాకిస్థాన్ సైనికులను అంతమొందించారు. ఇదే యుద్ధంలో ఆయన అమరుడయ్యారు. ప్రభుత్వం ఆయన సాహస చర్యను స్మరించుకుంటూ పరమ వీర చక్ర అవార్డుతో ఆయనను గౌరవించింది. ఆట నుంచి పోరాటం వైపుకు... ఉత్తర ప్రదేశ్ సీతాపూర్‌లో పుట్టిన కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలుగన్నారు. అయితే కాలం ఆయనను ఆర్మీ వైపుకు అడుగులు వేయించి దేశం కోసం పోరాడేలా చేసింది. కార్గిల్ యుద్ధంలో శత్రు సైన్యంపై తిరగబడి ఎంతోమందిని అంతమొందించిన ఆయన, చివరకు అదే యుద్ధంలో అమరులయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు. కార్గిల్ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ప్రభుత్వం పరమ వీర చక్ర అవార్డుతో గౌరవించింది. ఛాతీలోకి బుల్లెట్లు దిగినా... హిమాచల్ ప్రదేశ్‌లోని కలొల్ బకైన్ ప్రాంతానికి చెందిన రైఫిల్‌మ్యాన్ సంజయ్ కుమార్‌కు ఆర్మీకి పనిచేయాలన్న కలలు కంటూ ఉండేవారు. మూడు సార్లు రిజెక్ట్ అయినా మళ్లీ ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం విజయవంతమై అర్మీలో ఉద్యోగం వచ్చింది. కార్గిల్ యుద్ధంలో ఒక ట్రూప్‌ను లీడ్ చేసే స్థాయికి కూడా వచ్చేశారు. యుద్ధం సమయంలో ఓ కొండపై ఉన్న పాకిస్థాన్ సైనికులను అంతమొందించాలన్న ప్లాన్‌లో భాగంగా పైకి చేరుకుంటున్న సంజయ్ కుమార్ టీమ్‌కు ఎదురుకాల్పులు ఎదురయ్యాయి. పాకిస్థాన్ సైనికులు ట్యాంకర్స్‌తో దాడికి పాల్పడుతూ వచ్చారు. ఇవేవీ లెక్కచేయకుండా కొండ ఎక్కి, శత్రు సైనికులను కాల్చేశారు. అప్పటికే ఆయన ఛాతీలోకి రెండు బుల్లెట్లు దిగినా, ధైర్య సాహసాలతో శత్రు సైనికులను ఎదిరించి ఆ ప్రాంతాన్నంతా స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ కుమార్ సాహసోపేత చర్యను గుర్తిస్తూ ప్రభుత్వం ఆయనకు పరమ వీర చక్ర అవార్డును ప్రదానం చేసింది.