పాకిస్తాన్‌తో 1999లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూలై 26న లధాక్‌లో జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. తాజాగా లధాక్ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా ప్రధాని పర్యటనకు సంబంధించి సాగుతున్న సన్నాహాలను పరిశీలించారు.
భారత విజయ రజితోత్సవాల సందర్భంగా కార్గిల్ జిల్లాలోని ద్రాస్‌లో జూలై 24 నుంచి 26 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ జూలై 26న కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శిస్తారని, కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. ద్రాస్ హెలిప్యాడ్ వద్ద భద్రత, స్వాగతం, మోదీ కాన్వాయ్‌కు అవసరమైన ఏర్పాట్లు, స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించే విధానం తదితర కార్యక్రమాల సన్నాహాలపై అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ చర్చించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.
జూలై 26 ఉదయం ద్రాస్ బ్రిగేడ్ హెలిప్యాడ్‌లో ప్రధాని దిగుతారని, ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలుకుతారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. కార్గిల్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని, ఆ తర్వాత షహీద్ మార్గ్(వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment