శత్రుదేశం, దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై చేసిన కుటిల ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. వాటన్నింటిని భారత్ తనదైన శైలిలో తిప్పి కొట్టి నేటికి 22 ఏళ్లయ్యాయి. జులై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆ సమయంలో శత్రువులతో పోరాడి అమరులైన వీర సైనికులను స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి చేదు ఘటనలు స్మృతి పథంలోకి తెచ్చుకుంటే.. మన రక్తం మరిగిపోతుంది. పాక్‌పై ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఇంతకీ నాడు ఏం జరిగింది? ఎందుకు ఈ కార్గిల్ దివాస్ జరుపుకుంటున్నాం అంటే..
పాక్ అరాచక్రీడను తిప్పికొట్టి..
ఉగ్రమూకలతో చేతులు కలపిన పాక్ భారత్‌పై యద్ధానికి కాలు దువ్వింది. అంతేగాదు భారత్‌తో పోరాడుతోంది మేం కాదు కాశ్మీర్ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించే వాళ్లే అని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేసింది. నాటి కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాకు చావు దెబ్బతింది. ఉగ్రవాదులతో కలిసి కశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించి పాక్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది. ఈ యుద్ధంలో అమరులైన జవాన్ల త్యాగాలను స్మరించుకునేందుకే ఏటా జూలై 26ని విజయ్ దివాస్‌గా జరుపుకుంటున్నాం. సరిగ్గా ఈ జూలై 26న కార్గిల్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ అరాచక క్రీడను తిప్పి కొట్టింది భారత సైన్యం. కాశ్మీర్‌లో పాగా వేయాలనుకున్న పాక్ కుటిల ప్రయత్నానికి భారత్ జవాన్లు చెక్ పెట్టారు. పాకిస్తాన్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ నాడు భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటున్నాం.
'ఆపరేషన్ విజయ్' పేరుతో..
ఇక దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. ఈ విజయం సామాన్యమైనది కాదు మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. మన జవాన్లు ఆ సమయంలో చూపిన అసామాన్యమైన తెగువ, ధైర్యమే భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాయి. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. భారత సైన్యం కార్గిల్‌లో లడఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' పేరుతో జరిపిన పోరాట పటిమకు పాక్ సైన్యం తోకముడిచింది.
పాక్ పాలకుల గుండెల్లో భయం..
73 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో దాదాపు 527 మంది జవాన్లు దేశం కోస ప్రాణత్యాగం చేశారు. శత్రు సైనికులు పర్వత పైభాగం నుంచి దాడులు చేస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా మన సైనికులు వీరోచితంగా పోరాడారు. పర్వత శిఖరాలపైకి ఎగబాకుతూ మన సైనికులు టైగర్ హిల్, టోలోలిగ్ కొండలను పాక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో 4 వేల మందికి పైగా శత్రు దేశ సైనికులను మట్టుబెట్టారు. భారత సైన్యం విరుచుకుపడుతున్న తీరును చూసి పాక్ సైనికులతోపాటు పాలకుల గుండెల్లోనూ వణుకు పుట్టింది. ఈ యుద్ధంతో దాయాది దేశం ఉగ్ర బుద్దిని ప్రపంచానికి చాటిచెప్పడంలో భారత్ విజయం సాధించింది. అలాగే పాక్ ఆక్రమణలో ఉన్న కార్గిల్, ద్రాస్ సెక్టార్లను చేజిక్కుంచుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసింది.
రెండు ఫెటర్ జెట్‌లు కూలడంతో..
ఈ యుద్ధం జమ్మూ కాశ్మీర్‌లో 1999 మే -జూల నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. తమ వ్యూహంలో భాగంగా ఎత్తైన కొండ ప్రాంతాలను ఆక్రమించి పాక్ బలగాలు యుద్ధానికి కాలుదువ్వాయి. స్థానిక గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ యుద్ధంలో పాక్ మన దేశానికి చెందిన రెండు ఫైటర్ జెట్‌లను కూల్చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ ఆగ్రహావేశాలతో రెచ్చిపోయింది. దెబ్బకు పాక్‌లో భయం మొదలైంది. ఇక తమకు ఓటమి తప్పదని భావించి అమెరికాను జోక్యం చేసుకోవాలని కోరింది.
నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ పాక్ ప్రతిపాదనకు అంగీకరించలేదు సరికదా..నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాక్ బలగాలను వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు. ఇక పాక్ బలగాలు కార్గిల్ నుంచి వెనుదిరగక తప్పలేదు. జూలై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటిని భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. ఇది ఒకరకంగా పాక్ ఆర్మికి కోలుకోలేని దెబ్బ. ఈ చారిత్రాత్మక విజయంలో వీరమరణం పొందిన నాటి సైనికులను స్మరించుకునేందుకే ప్రతి ఏటా ఈ విజయ్ దివాస్‌ను ఘనంగా జరుపుకుంటున్నాం.
(చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య)
Comments
Please login to add a commentAdd a comment