కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌: పాక్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌ | PM Modi Pays Tribute To Kargil Heroes At War Memorial On 25th Vijay Diwas | Sakshi
Sakshi News home page

కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌: పాక్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌

Published Fri, Jul 26 2024 10:56 AM | Last Updated on Fri, Jul 26 2024 11:58 AM

PM Modi Pays Tribute To Kargil Heroes At War Memorial On 25th Vijay Diwas

న్యూఢిల్లీ, సాక్షి: కార్గిల్‌ 25వ విజయ్‌ దివస్‌ సందర్భంగా యుద్ధ వీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకాన్ని ఆయన సందర్శించారు. యుద్ధంలో అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు. పాక్‌పై విజయం సాధించే పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా రజత్‌ జయంతి వర్ష్‌ పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

 

 👉దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం

👉ఎంతో మంది జవాన్ల త్యాగంతో కార్గిల్‌ యుద్ధం గెలిచాం

👉సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిపోయాయి

👉శ్రీనగర్‌ లద్ధాక్‌లో అభివృద్ధి చేస్తున్నాం

👉ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఉపేక్షించేది లేదు

👉జమ్ముకశ్మీర్‌లో జీ-20 సమ్మిట్‌ను నిర్వహించగలిగాం

👉పాకిస్తాన్‌ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు

👉నాకు దేశమే ముఖ్యం.. పార్టీ కాదు. 

👉కార్గిల్‌​ యుద్ధంలో దేశం కోసం ఎంతో మంది సైనికులు వీర మరణం పొందారు. 

👉దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సెల్యూట్‌ చేస్తున్నా

👉కార్గిల్‌ యుద్ధ సమయంలో సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నా

👉కాశ్మీర్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచాం

👉జమ్మూకాశ్మీర్‌ ప్రజలు సరికొత్త భవిష్యత్‌ కోసం ఎదురు చూస్తున్నారు

👉దేశ రక్షణ రంగంలో సంస్కరణలు చేపట్టాం

👉వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌పై తప్పుడు ప్రచారం చేశారు.

👉కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు 

👉కార్గిల్‌ విజయం దేశానిది.. ఏ ఒక్క పార్టీది కాదు 

👉కార్గిల్‌ యుద్ధంతో సైనిక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పాం

👉కార్గిల్‌ విజయం భారత సైనికుల పరామక్రమానికి నిదర్శనం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement