న్యూఢిల్లీ : కార్గిల్ అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీటర్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. కార్గిల్ యుద్ద సమయంలో వీరోచితంగా పోరాడిన భారత మాత ముద్దు బిడ్డలకు ఆయన వందనాలు సమర్పించారు. ఈ రోజు మన సైనికులు ధైర్య, సాహసాలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. మాతృ భూమిని కాపాడుకోవడం సర్వస్వం అర్పించిన అమరవీరులకు వినయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాకుండా కార్గిల్ గొప్ప తనాన్ని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
ఆ క్షణాలు మరచిపోలేనివి..
కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. 1999లో కార్గిల్ యుద్దం జరుగుతున్న సమయంలో తాను జమ్మూ కశ్మీర్‌తోపాటు, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ (బీజేపీ) కోసం పనిచేస్తున్నట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనకు కార్గిల్ వెళ్లి.. మన వీర సైనికులను కలిసే అవకాశం వచ్చిందని తెలిపారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
During the Kargil War in 1999, I had the opportunity to go to Kargil and show solidarity with our brave soldiers.
— Narendra Modi (@narendramodi) July 26, 2019
This was the time when I was working for my Party in J&K as well as Himachal Pradesh.
The visit to Kargil and interactions with soldiers are unforgettable. pic.twitter.com/E5QUgHlTDS
కాగా, సరిగా ఇరవై ఏళ్ల క్రితం భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముష్కరులకు భారత సైనికులు నిలువరించారు. సాహసోపేతంగా పోరాడి ముష్కరులు తోకముడిచేలా చేశారు. 1999 జూలై 26న ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment