కెప్టెన్ బాత్రా(ఎడమవైపు), విశాల్ బాత్రా(కుడివైపు)
కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగానే ఈ 'కార్గిల్ విజయ్ దివాస్'ని ప్రతి ఏటా జూలై 26న జరుపుకుంటున్నాం. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. నాటి యుద్ధంలో ఎందరో యువ సైనికులు అశువులు బాశారు. ఈ సందర్భంగా వారందర్నీ స్మరించుకుంటూ గొంతెత్తి మరీ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అసామాన్య ధైర్య సాహాసాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ధీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా గురించి అతని కవల సోదరుడి మాటల్లో తెలుసుకుందాం.
నిజానికి కెప్టెన్ విక్రమ్ బాత్రా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి అతని వయసు కేవలం 24 ఏళ్లు. అతని ధైర్య సాహాసాలు గురించి 'యే దిల్ మాంగ్ మోర్' అని అనకుండా ఉండలేం. అతడు సాధించిన విజయాలు, యుద్ధంలో అతడు చూపించిన తెగువ భరతమాత మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అతను ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్ నివాసి. అక్కడ అతడు తన తల్లిదండ్రులు, కవల సోదరడు విశాల్ బాత్రాతో కలిసి ఉండేవాడు. కెప్టెన్ విక్రమ్ బాత్రాలా అతని సోదరుడు విశాల బాత్రా కూడా సైన్యంలోకి చేరాలని కలలు కన్నాడు. కానీ అది జరగలేదు.
బహుశా అతను ముందుగా చనిపోవడం అన్నది విధే ఏమో గానీ ఆ బాధ విక్రమ్ కుటుంబ సభ్యులకు ఓ పీడకలలా మిగిలింది. ఈ కార్గిల్ దివాస్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విశాల్ తన సోదరుడుని కోల్పోవడం గురించి ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, అతడిని చూసి యువకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నాడు విశాల్.
అతను మన మధ్యే ఉన్నాడు..
విక్రమ్ భౌతికంగా లేకపోవచ్చు గానీ అతను మన మధ్యే ఇంకా ఉన్నాడు. ఎందుకంటే అతని ధైర్య సాహాసాలను చూసిన వారెవ్వరూ ఆ మాట ఒప్పుకోలేరు. భారతదేశానికి అతను కెప్టెన్ బాత్రా కావచ్చు కానీ నాకు మేము ఒకేలా ఉండే కవల సోదరుడు. మమ్మల్ని చిన్నప్పుడూ మా అమ్మ లవ్, కుష్ అని పిలిచేది. కాలం ఎలాంటి బాధకైన మంచి మందు అంటారు కానీ నా విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా. కేవలం 24 సంవత్సరాల వయసులో అతడు దేశం కోసం చేసింది దాని గురించి వింటే అపారమైన గర్వం, గౌరవం కలుగుతున్నాయి. అతడికి సోదరుడిగా ఒకేలా పుట్టినందుకు దేవుడికి ధన్యావాదాలు. అని భావోద్వేగం చెందాడు విశాల్
జూనియర్ అధికారుల వల్లే ఆ గెలుపు
జూనియర్ అధికారుల నాయకత్వం వల్లే ఈ కార్గిల్ యుద్ధం గెలిచింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా(పీవీసీ), కెప్టెన్ మనోజ్ పాండే(పీవీసీ), కెప్టన్ అనూజ్ నయ్యర్(ఎంవీసీ) వంటి చాలామంది అధికారుల కేవలం 23, 24, 25 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. వారంతా భారతీయ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారిని చూసే ఆర్మీలో చేరామని చాలా మంది తనకు చెప్పారని విశాల్ చెబుతున్నాడు. "కేవలం ఇలాంటి ప్రత్యేక సందర్భాలలోనే వారిని గుర్తు తెచ్చుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసిన త్యాగానికి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి చదివాం.
మరీ ఇలా దేశం కోసం అమరులైన ఈ దైర్యవంతులైన యువకుల గురించి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చకూడదు?. మనకు స్వాతంత్య్రం రావడానికి సహకరించిన స్వాతంత్య్ర సమరయోధులు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో 1999లో మన కీర్తీని పునరుద్ధరించి మన మాతృభూమికోసం పోరాడిన ఈ వ్యక్తుల గురించి విద్యార్థులు తెలుసుకోవడం అంతే ముఖ్యం" అన్నాడు విశాల్
నాయకుడిగా కూడా విక్రమ్ క్రెడిట్ తీసుకోలేదు
విక్రమ్ నాయకుడిగా కూడా ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు. ఒకసారి అతను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శిస్తున్నప్పుడూ నువ్వు సాధించి గొప్ప విజయం ఏమిటంటే విజయ్ తాను ఆరుగురి వ్యక్తలతో కొండలపైకి వెళ్లాను అంతే దిగ్విజయంగా తిరిగి వచ్చానని, తన జట్టుకే క్రెడిట్ ఇచ్చేవాడు. నిజానికి అతన సహచరుల చెబుతుంటారు.. కథన రంగంలో తానే మొదట ఉండేవాడని, శత్రువు బుల్లెట్ తానే ముందు తీసుకునేవాడని. అతడే ముందుండి మమ్మల్ని నడిపించేవాడని చెబుతుంటే చాలా బాధగా ఉండేదని విశాల్ పేర్కొన్నాడు.
ఇక్కడకు రావడం పుణ్యక్షేతం సందర్శించినట్లే..
ఇక చివరగా విశాల్ బాత్రా తనకు ఇక్కడకు రావడం పుణ్యక్షేత్రానికి రావడంతో సమానమని చెప్పాడు. సుమారు 1700ల నుంచి 17500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను ఎలా అధిరోహించారు, పైగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న ఇక్కడ ఎలా పోరాడారు అని అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా కఠినమైనది కూడా. నాకు అక్కడకు వెళ్లినప్పుడల్లా విక్రమ్ అక్కడ శిఖరాలను కాపలా కాస్తున్నాడని, మనోజ్ పాండే ఇప్పటికి పహారా కాస్తున్నాట్లు భావిస్తాను.
అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే విక్రమ్ బాత్రా, అతని సహచర యువకులు ఒక్కొక్కరు అక్కడ కూర్చొన్నట్లు నాకు అనిపిస్తుందని అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు విశాల్. అంతేగాదు ఈ కార్గిల్ యుద్ధం గురించి బాలీవుడ్ మూవీ షెర్షా(2021) చిత్రం తీశారు. ఈ మూవీ కారణంగా విక్రమ్ బాత్రా గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది. అందులో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒదిగిపోయాడు.
(చదవండి: పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!)
Comments
Please login to add a commentAdd a comment