kargil heroes
-
'మిస్ యూ భయ్యా'! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!
కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగానే ఈ 'కార్గిల్ విజయ్ దివాస్'ని ప్రతి ఏటా జూలై 26న జరుపుకుంటున్నాం. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. నాటి యుద్ధంలో ఎందరో యువ సైనికులు అశువులు బాశారు. ఈ సందర్భంగా వారందర్నీ స్మరించుకుంటూ గొంతెత్తి మరీ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అసామాన్య ధైర్య సాహాసాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ధీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా గురించి అతని కవల సోదరుడి మాటల్లో తెలుసుకుందాం. నిజానికి కెప్టెన్ విక్రమ్ బాత్రా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి అతని వయసు కేవలం 24 ఏళ్లు. అతని ధైర్య సాహాసాలు గురించి 'యే దిల్ మాంగ్ మోర్' అని అనకుండా ఉండలేం. అతడు సాధించిన విజయాలు, యుద్ధంలో అతడు చూపించిన తెగువ భరతమాత మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అతను ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్ నివాసి. అక్కడ అతడు తన తల్లిదండ్రులు, కవల సోదరడు విశాల్ బాత్రాతో కలిసి ఉండేవాడు. కెప్టెన్ విక్రమ్ బాత్రాలా అతని సోదరుడు విశాల బాత్రా కూడా సైన్యంలోకి చేరాలని కలలు కన్నాడు. కానీ అది జరగలేదు. బహుశా అతను ముందుగా చనిపోవడం అన్నది విధే ఏమో గానీ ఆ బాధ విక్రమ్ కుటుంబ సభ్యులకు ఓ పీడకలలా మిగిలింది. ఈ కార్గిల్ దివాస్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విశాల్ తన సోదరుడుని కోల్పోవడం గురించి ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, అతడిని చూసి యువకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నాడు విశాల్. అతను మన మధ్యే ఉన్నాడు.. విక్రమ్ భౌతికంగా లేకపోవచ్చు గానీ అతను మన మధ్యే ఇంకా ఉన్నాడు. ఎందుకంటే అతని ధైర్య సాహాసాలను చూసిన వారెవ్వరూ ఆ మాట ఒప్పుకోలేరు. భారతదేశానికి అతను కెప్టెన్ బాత్రా కావచ్చు కానీ నాకు మేము ఒకేలా ఉండే కవల సోదరుడు. మమ్మల్ని చిన్నప్పుడూ మా అమ్మ లవ్, కుష్ అని పిలిచేది. కాలం ఎలాంటి బాధకైన మంచి మందు అంటారు కానీ నా విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా. కేవలం 24 సంవత్సరాల వయసులో అతడు దేశం కోసం చేసింది దాని గురించి వింటే అపారమైన గర్వం, గౌరవం కలుగుతున్నాయి. అతడికి సోదరుడిగా ఒకేలా పుట్టినందుకు దేవుడికి ధన్యావాదాలు. అని భావోద్వేగం చెందాడు విశాల్ జూనియర్ అధికారుల వల్లే ఆ గెలుపు జూనియర్ అధికారుల నాయకత్వం వల్లే ఈ కార్గిల్ యుద్ధం గెలిచింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా(పీవీసీ), కెప్టెన్ మనోజ్ పాండే(పీవీసీ), కెప్టన్ అనూజ్ నయ్యర్(ఎంవీసీ) వంటి చాలామంది అధికారుల కేవలం 23, 24, 25 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. వారంతా భారతీయ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారిని చూసే ఆర్మీలో చేరామని చాలా మంది తనకు చెప్పారని విశాల్ చెబుతున్నాడు. "కేవలం ఇలాంటి ప్రత్యేక సందర్భాలలోనే వారిని గుర్తు తెచ్చుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసిన త్యాగానికి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి చదివాం. మరీ ఇలా దేశం కోసం అమరులైన ఈ దైర్యవంతులైన యువకుల గురించి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చకూడదు?. మనకు స్వాతంత్య్రం రావడానికి సహకరించిన స్వాతంత్య్ర సమరయోధులు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో 1999లో మన కీర్తీని పునరుద్ధరించి మన మాతృభూమికోసం పోరాడిన ఈ వ్యక్తుల గురించి విద్యార్థులు తెలుసుకోవడం అంతే ముఖ్యం" అన్నాడు విశాల్ నాయకుడిగా కూడా విక్రమ్ క్రెడిట్ తీసుకోలేదు విక్రమ్ నాయకుడిగా కూడా ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు. ఒకసారి అతను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శిస్తున్నప్పుడూ నువ్వు సాధించి గొప్ప విజయం ఏమిటంటే విజయ్ తాను ఆరుగురి వ్యక్తలతో కొండలపైకి వెళ్లాను అంతే దిగ్విజయంగా తిరిగి వచ్చానని, తన జట్టుకే క్రెడిట్ ఇచ్చేవాడు. నిజానికి అతన సహచరుల చెబుతుంటారు.. కథన రంగంలో తానే మొదట ఉండేవాడని, శత్రువు బుల్లెట్ తానే ముందు తీసుకునేవాడని. అతడే ముందుండి మమ్మల్ని నడిపించేవాడని చెబుతుంటే చాలా బాధగా ఉండేదని విశాల్ పేర్కొన్నాడు. ఇక్కడకు రావడం పుణ్యక్షేతం సందర్శించినట్లే.. ఇక చివరగా విశాల్ బాత్రా తనకు ఇక్కడకు రావడం పుణ్యక్షేత్రానికి రావడంతో సమానమని చెప్పాడు. సుమారు 1700ల నుంచి 17500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను ఎలా అధిరోహించారు, పైగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న ఇక్కడ ఎలా పోరాడారు అని అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా కఠినమైనది కూడా. నాకు అక్కడకు వెళ్లినప్పుడల్లా విక్రమ్ అక్కడ శిఖరాలను కాపలా కాస్తున్నాడని, మనోజ్ పాండే ఇప్పటికి పహారా కాస్తున్నాట్లు భావిస్తాను. అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే విక్రమ్ బాత్రా, అతని సహచర యువకులు ఒక్కొక్కరు అక్కడ కూర్చొన్నట్లు నాకు అనిపిస్తుందని అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు విశాల్. అంతేగాదు ఈ కార్గిల్ యుద్ధం గురించి బాలీవుడ్ మూవీ షెర్షా(2021) చిత్రం తీశారు. ఈ మూవీ కారణంగా విక్రమ్ బాత్రా గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది. అందులో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒదిగిపోయాడు. (చదవండి: పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!) -
కార్గిల్ హీరో లవ్‌స్టోరీ: వేలు కోసుకుని ఆమెకు బొట్టుపెట్టాడు
Vikram Batra Love Story: కార్గిల్ యుద్ధంలో భారత్.. దాయాది దేశం పాకిస్తాన్‌పై విజయం సాధించి నేటితో 22 ఏళ్లు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 1300 మంది గాయపడ్డారు. వీరమరణం పొందిన వారిలో కెప్టెన్ విక్రమ్ బత్రా ఒకరు. యుద్ధ భూమిలో వెన్ను చూపని వీరుడిగానే కాదు.. ప్రేమికుడిగా కూడా ఆయన చిరస్మరణీయుడే. డింపుల్ చీమాతో ఆయన ప్రేమ ప్రయాణం పెళ్లి తీరం చేరకుండానే ముగిసింది. అయినప్పటికి అన్ని అమర ప్రేమల్లాగే వీరి ప్రేమ కూడా అజారమరం. ప్రేమ - యుద్ధం విక్రం- డింపుల్‌లు 1995లో మాస్టర్స్ డిగ్రీ చదవటానికి పంజాబ్ యూనివర్శిటీలో చేరారు. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కాలేజీలోని అన్ని ప్రేమ జంటల్లానే ప్రేమ లోకంలో విహరించింది వీరి జంట. అయితే, 1996లో విక్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి ఎంపిక అవటంతో మాస్టర్స్ డిగ్రీని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత డింపుల్ కూడా చదువుకు స్వప్తి పలికింది. విక్రం ఆర్మీలో ఉన్నా వీరి ప్రేమ అలానే కొనసాగింది. అతడు డెహ్రాడూన్‌నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి డింపుల్‌ను కలిసేవాడు. అప్పుడు ఇద్దరూ గురుద్వారాలోని మానసా దేవి ఆలయానికి వెళ్లేవారు. అక్కడ ఓ రోజు గుడి చుట్టూ ఇద్దరూ కలిసి ప్రదిక్షణ చేసిన తర్వాత ‘‘ శుభాకాంక్షలు మిసెస్ బత్రా. నువ్వు గమనించలేదా మనం ఇలా ప్రదిక్షణ చేయటం ఇది నాలుగో సారి’’ అని అన్నాడు విక్రం. అది విన్న డింపుల్ మాటల్లేని దానిలా నిలబడి పోయింది. విక్రం తమ బంధానికి ఎంత విలువ ఇస్తున్నాడో తెలిసి చాలా సంతోషించింది. ఓ రోజు ఇద్దరూ మానసా దేవి ఆలయంలో ఉండగా పెళ్లి ప్రస్తావన తెచ్చింది డింపుల్. అప్పుడు విక్రం తన వ్యాలెట్‌లోంచి బ్లేడ్ తీసి తన బొటన వేలు కోసుకున్నాడు. ఆ రక్తంతో ఆమె నుదిటిన బొట్టుపెట్టాడు. సినిమా స్లైల్లో జరిగిన ఈ సంఘటన ఆమె మనసులో చెరగని ముద్రవేసుకుంది. షేర్షా చిత్రంలోని ఓ దృశ్యం సంవత్సరాలు గడుస్తున్న కొద్ది డింపుల్ ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెరగసాగింది. ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 1999 జులై 7న కార్గిల్ యుద్ధంలో విక్రం వీరమరణం పొందాడు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ్ వీర చక్రతో గౌరవించింది. విక్రం మరణం తర్వాత డింపుల్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. విక్రం జీవిత కథను బాలీవుడ్లో ‘‘షేర్షా’’ సినిమాగా తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కార్గిల్ యుద్ధ వీరుడికి డబుల్ ప్రమోషన్!
చండీగఢ్: భారతదేశ చరిత్రలో కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకం స్థానం ఉంది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరుడు సత్పాల్ సింగ్ గురించి మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. నాడు యుద్ధంలో సత్పాల్ చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు కూడా ప్రదానం చేసింది. సైన్యం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుతం సత్పాల్ సింగ్ పంజాబ్‌లోని ఓ చిన్న పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సత్పాల్ గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అది కాస్త పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి వెళ్లడం.. ఆయన వెంటనే సత్పాల్కు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. అంతేకాక సత్పాల్ కొడుకు పీజీ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. సత్పాల్ కథనానికి స్పందించిన ఓ విద్యాసంస్థల చైర్మన్, కూల్ డ్రింక్స్ కంపెనీలు సత్పాల్ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి చూపాయి. దీని గురించి ఇప్పటికే సత్పాల్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీంతో సత్పాల్ కొడుకు కూడా త్వరలోనే ఉద్యోగంలో చేరనున్నట్లు తెలుస్తోంది. Glad to report that Punjab CM @capt_amarinder has just announced that Head Constable Satpal Singh, Vir Chakra has immediately been promoted Assistant Sub Inspector.@IndianExpress https://t.co/idpTIuj9H0 — Man Aman Singh Chhina (@manaman_chhina) July 26, 2019 -
‘కార్గిల్’ వీరులకు సెల్యూట్
న్యూఢిల్లీ: ‘విజయ్ దివస్’ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ‘మన సైనిక దళాల అజేయ, అద్భుత ధైర్య సాహసాలు, వారి త్యాగ నిరతిని ఈ విజయ్ దివస్ సందర్భంగా గుర్తు చేసుకుందాం. దేశం ఆ సాహస అమరవీరులకు సెల్యూట్ చేస్తోంది’ అని శనివారం మోడీ ట్వీట్ చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ గెలుపును పురస్కరించుకుని ఏటా జూలై 26వ తేదీని విజయ్ దివస్‌గా జరుపుకుంటారు. ఢిల్లీలో త్వరలో అమరవీరులకు స్మారక స్తూపం: జైట్లీ కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు స్థారక స్తూపాన్ని నిర్మించేందుకు దేశ రాజధానిలో స్థలాన్ని త్వరలో ఖరారు చేస్తామని శనివారం రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా గేట్ సమీపంలోని విశాలమైన ప్రిన్సెస్ పార్క్, ఆ పరిసర ప్రాంతాలే దీనికి అనువైనవని భావిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో త్రివిధ దళాధిపతులతో కలసి ప్రిన్సెస్ పార్క్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్మారక స్తూపంపై అమరవీరుల పేర్లను పొందుపరుస్తామన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. సాయుధ బలగాల ఆధునీకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.