Kargil
-
భారత్‌లోని అత్యంత శీతల ప్రదేశాలు.. తలచుకోగానే వణుకు ఖాయం
దేశంలోని పలుప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన చలి వాతావరణం నెలకొంది. ఈ చలికి తట్టుకోలేక జనం వణికిపోతున్నారు. మనదేశంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయికి పడిపోయే పలు ప్రాంతాలున్నాయి. ఈ అంత్యత శీతల ప్రాంతాల పేరు చెప్పగానే పలువురికి చలితో పాటు వణుకు పుడుతుంది. ఆ ప్రదేశాలపై ఒక లుక్కేద్దాం.సియాచిన్ గ్లేసియర్ (Siachen Glacier)ఇది ఉత్తర కారాకోరం శ్రేణిలో ఉంది. సియాచిన్ భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి మాత్రమే కాదు.. ఇది మొత్తం ధ్రువేతర ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యధిక శ్రేణి హిమపాతం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది దేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో మొట్టమొదటిగా గుర్తింపు పొందింది. వేసవి నెలల్లో కూడా సియాచిన్‌లో ఉష్ణోగ్రత -10 సెంటీగ్రేడ్ డిగ్రీలకు తగ్గుతుంది. విపరీతమైన చలి కారణంగా పలువురు సైనికులు ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు.సెలా పాస్, తవాంగ్(Sela Pass, Tawang)సెలా పాస్.. సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం బౌద్ధ నగరమైన తవాంగ్‌ను తేజ్‌పూర్- గౌహతిలతో కలుపుతుంది. వేసవి కాలంలో ఇక్కడ చలి నుండి కొంత ఉపశమనం దొరుకుతుంది. శీతాకాలంలో చలి అత్యధికస్థాయిలో ఉంటుంది. విపరీతంగా మంచు కురుస్తుంటుంది. సెలా పాస్ హిమాలయాల్లో 4,170 మీటర్ల ఎత్తులో ఉంది. అక్టోబర్, నవంబర్, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఈ నెలల్లో ఇక్కడ మంచు ఎక్కువగా ఉండదు. రోడ్లు కూడా సాధారణంగా ఉంటాయి. సెలా పాస్‌లో ఉష్ణోగ్రత -15 డిగ్రీల వరకు పడిపోతుంది.లేహ్, లడఖ్( Leh, Ladakh)లేహ్ మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ఎంతో గొప్పవి. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతుంటుంది. శీతాకాలంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ఇటువంటి పరిస్థితి చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇక్కడ అనేక ఆలయాలు, సరస్సులు ఉన్నాయి. ఇవి లేహ్‌ను సందర్శించదగిన ప్రదేశాలలో ఒకటిగా మలచాయి. లేహ్ సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఉంది. లడఖ్‌లోని పర్వతాలు సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి.కీలాంగ్(Keylong)కీలాంగ్ ప్రాంతం లేహ్ ప్రధాన రహదారిలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3340 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ విల్లో చెట్లు, నీటి ప్రవాహాలు, మంచుతో కూడిన పర్వతాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత కూడా -2 డిగ్రీలకు పడిపోతుంది. ఈ ప్రదేశం మనాలి, కాజా, లేహ్ తదితర అందమైన పర్యాటక ప్రదేశాలకు అనుసంధానంగా ఉంది.లాచెన్, థంగు వ్యాలీ(Lachen and Thangu Valley)అత్యంత అందమైన మంచుతో కూడిన పర్వత శిఖరాలు ఉత్తర సిక్కింలో కనిపిస్తాయి. ఉత్తర సిక్కింలో లాచెన్, థంగు వ్యాలీలను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. లాచెన్, థంగు వ్యాలీ 2,500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. విపరీతమైన మంచు కూడా కురుస్తుంటుంది.ద్రాస్, కార్గిల్ ( Dras, Kargil)ద్రాస్.. భారతదేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశాన్ని "గేట్‌వే టు లడఖ్" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. కార్గిల్ జిల్లాలో ఉన్న ద్రాస్.. అమర్నాథ్, సియాల్కోట్లకు వెళ్లేవారికి ప్రధాని రహదారిగా ఉంది. సముద్ర మట్టానికి 10,761 అడుగుల (3,280 మీ) ఎత్తులో ద్రాస్ ఉంది. ఇక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు, మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇది కూడా చదవండి: కుంభమేళాకు సుందరంగా ముస్తాబైన ప్రయాగ్‌రాజ్ -
పాక్‌పై విజయానికి పాతికేళ్లు.. కార్గిల్ విజయ్ దివస్న అమరజవాన్లకు ప్రధాని నివాళులు (ఫొటోలు)
-
Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ
ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌లో భాగమైన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక స్థానికంగా పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి. భిన్న ధ్రువాలుగా ఉండే బౌద్ధులు–ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పోరాడుతున్నారు. లేహ్‌లో బౌద్ధులు ఎక్కువ. కార్గిల్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా తమ ప్రయోజనాలను పరిరక్షించాలని, తమ డిమాండ్లకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం కావడంతో.. తమకూ జమ్మూ కశీ్మర్ మాదిరిగా రాజకీయ అవకాశాలు కలి్పంచాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఒకటి. కేంద్రపాలిత ప్రాంతంగా మారాక లేహ్ కేంద్రంగా పనిచేసే సామాజిక, రాజకీయ సంస్థలన్నీ కలసి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)గా ఏర్పడ్డాయి. కార్గిల్ కేంద్రంగా పనిచేసే సామాజిక, మత, రాజకీయపరమైన సంస్థలన్నీ కలసి కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ)గా అవతరించాయి. ఈ రెండూ కొన్నేళ్లుగా డిమాండ్ల సాధనకు కలసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం ఎవరిని వరించేనో? లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఈసారి సిట్టింగ్ ఎంపీ జామ్యంగ్ సేరింగ్ నామ్‌గ్యాల్ బదులు తాషి గ్యాల్సన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఇక్కడ బాగా ఉంది. దాంతో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఈ ప్రయోగం చేసింది. గ్యాల్సన్ లద్దాక్ ఆటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నామ్‌గ్యల్ స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగాలని యోచించినా అధినాయకత్వం జోక్యంతో వెనక్కు తగ్గారు. గ్యాల్సన్కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 2014లోనూ లద్దాఖ్‌లో బీజేపీయే గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుప్స్టాన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గులామ్ రాజాపై నెగ్గారు. చెవాంగ్ 2009 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్; ఉదంపూర్, లద్దాఖ్, జమ్మూల్లో కాంగ్రెస్ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. కానీ కార్గిల్ ఎన్సీ నాయకత్వం అధిష్టానం నిర్ణయంతో విభేదించింది. హాజీ హనీఫా జాన్‌ను లద్దాక్‌లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపింది. కాంగ్రెస్ కూడా సేరింగ్ నామ్గ్యల్ను అభ్యరి్థగా ప్రకటించింది. కానీ కార్గిల్ కాంగ్రెస్ నాయకులు కూడా అనూహ్యంగా హాజీ హనీఫాకే మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇండియా కూటమి తరఫున సేరింగ్ నామ్గ్యల్ను అధికారిక అభ్యర్థిగా రెండు పారీ్టలూ ప్రకటించాయి. అలా బీజేపీ నుంచి గ్యాల్సన్, కాంగ్రెస్–ఎన్సీ ఉమ్మడి అభ్యరి్థగా సేరింగ్ న్యామ్‌గల్, ఆ రెండు పారీ్టల స్థానిక నేతల మద్దతుతో హాజీ హనీఫా పోటీలో ఉన్నారు. వీరిలో హనీఫా ఒక్కరే కార్గిల్ వాసి. మిగతా ఇద్దరూ లేహ్‌కు చెందిన వారు. దీంతో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కార్గిల్, లేహ్ వాసులు ఎప్పటి మాదిరే భిన్నమైన తీర్పు ఇస్తారేమో చూడాలి. ఇదే కారణంతో లద్దాఖ్‌ను కార్గిల్, లేహ్ రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని ఎల్ఏబీ, కేడీఏ డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్లు తక్కువ 1,73,266 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణపరంగా లద్దాఖ్ దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం. కానీ ఓటర్లు మాత్రం కేవలం 1,82,571 మందే! గత మూడు లోక్‌సభ ఎన్నికలుగా ఇక్కడ 71 శాతానికి పైనే ఓటింగ్ నమోదవుతోంది.స్థానికుల డిమాండ్లులద్దాక్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమీషన్, రెండు లోక్‌సభ స్థానాలు స్థానికుల డిమాండ్లు. ఆరో షెడ్యూల్లో చేరుస్తామని బీజేపీ 2019 మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద సాంస్కృతిక, స్థానిక గుర్తింపుల పరిరక్షణకు స్వతంత్ర మండళ్ల ఏర్పాటు కూడా ఒక డిమాండ్. లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్ కేంద్రంగా రెండు స్వతంత్ర మండళ్లు ఇప్పటికే ఉన్నా అవి 1995 చట్టం కింద ఏర్పాటైనవి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
kargil: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సరికొత్త రికార్డు
లడాఖ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌పై సి-130జె విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా నైట్‌ల్యాండింగ్ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్ సి-130ని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్ చేశాం’అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఏఎఫ్ ప్రత్యేక బలగాల యూనిట్ ద గార్డ్స్ శిక్షణను కూడా ఈ ఫీట్లో భాగంగా ఐఏఎఫ్ కలిపి నిర్వహించడం విశేషం. నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్‌లో విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే. గత ఏడాది నవంబర్లోనూ ఐఏఎఫ్ ఉత్తరాఖండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌పై లాక్హిడ్ మార్టిన్‌కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా నైట్ ల్యాడింగ్ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్ పరికరాలను మోసుకెళ్లాయి. ఇదీచదవండి.. ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం -
లఢక్‌లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు
లఢక్: లఢక్‌లోని కార్గిల్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్‌లో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. An earthquake of magnitude 5.5 on the Richter Scale hit Kargil, Ladakh at around 3:48 pm today: National Center for Seismology pic.twitter.com/Z5bBYur7y4 — ANI (@ANI) December 18, 2023 రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదీ చదవండి: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం -
'మిస్ యూ భయ్యా'! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!
కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగానే ఈ 'కార్గిల్ విజయ్ దివాస్'ని ప్రతి ఏటా జూలై 26న జరుపుకుంటున్నాం. 1999లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ భారత సైన్యాన్ని మట్టికరిపించింది. దురాక్రమణకు దిగిన పాకిస్తాన్‌ను కథన రంగంలో మట్టికరిపించి భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. నాటి యుద్ధంలో ఎందరో యువ సైనికులు అశువులు బాశారు. ఈ సందర్భంగా వారందర్నీ స్మరించుకుంటూ గొంతెత్తి మరీ నివాళులర్పిద్దాం. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అసామాన్య ధైర్య సాహాసాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ధీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా గురించి అతని కవల సోదరుడి మాటల్లో తెలుసుకుందాం. నిజానికి కెప్టెన్ విక్రమ్ బాత్రా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి అతని వయసు కేవలం 24 ఏళ్లు. అతని ధైర్య సాహాసాలు గురించి 'యే దిల్ మాంగ్ మోర్' అని అనకుండా ఉండలేం. అతడు సాధించిన విజయాలు, యుద్ధంలో అతడు చూపించిన తెగువ భరతమాత మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అతను ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్ నివాసి. అక్కడ అతడు తన తల్లిదండ్రులు, కవల సోదరడు విశాల్ బాత్రాతో కలిసి ఉండేవాడు. కెప్టెన్ విక్రమ్ బాత్రాలా అతని సోదరుడు విశాల బాత్రా కూడా సైన్యంలోకి చేరాలని కలలు కన్నాడు. కానీ అది జరగలేదు. బహుశా అతను ముందుగా చనిపోవడం అన్నది విధే ఏమో గానీ ఆ బాధ విక్రమ్ కుటుంబ సభ్యులకు ఓ పీడకలలా మిగిలింది. ఈ కార్గిల్ దివాస్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విశాల్ తన సోదరుడుని కోల్పోవడం గురించి ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, అతడిని చూసి యువకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నాడు విశాల్. అతను మన మధ్యే ఉన్నాడు.. విక్రమ్ భౌతికంగా లేకపోవచ్చు గానీ అతను మన మధ్యే ఇంకా ఉన్నాడు. ఎందుకంటే అతని ధైర్య సాహాసాలను చూసిన వారెవ్వరూ ఆ మాట ఒప్పుకోలేరు. భారతదేశానికి అతను కెప్టెన్ బాత్రా కావచ్చు కానీ నాకు మేము ఒకేలా ఉండే కవల సోదరుడు. మమ్మల్ని చిన్నప్పుడూ మా అమ్మ లవ్, కుష్ అని పిలిచేది. కాలం ఎలాంటి బాధకైన మంచి మందు అంటారు కానీ నా విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నా. కేవలం 24 సంవత్సరాల వయసులో అతడు దేశం కోసం చేసింది దాని గురించి వింటే అపారమైన గర్వం, గౌరవం కలుగుతున్నాయి. అతడికి సోదరుడిగా ఒకేలా పుట్టినందుకు దేవుడికి ధన్యావాదాలు. అని భావోద్వేగం చెందాడు విశాల్ జూనియర్ అధికారుల వల్లే ఆ గెలుపు జూనియర్ అధికారుల నాయకత్వం వల్లే ఈ కార్గిల్ యుద్ధం గెలిచింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా(పీవీసీ), కెప్టెన్ మనోజ్ పాండే(పీవీసీ), కెప్టన్ అనూజ్ నయ్యర్(ఎంవీసీ) వంటి చాలామంది అధికారుల కేవలం 23, 24, 25 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. వారంతా భారతీయ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారిని చూసే ఆర్మీలో చేరామని చాలా మంది తనకు చెప్పారని విశాల్ చెబుతున్నాడు. "కేవలం ఇలాంటి ప్రత్యేక సందర్భాలలోనే వారిని గుర్తు తెచ్చుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసిన త్యాగానికి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి చదివాం. మరీ ఇలా దేశం కోసం అమరులైన ఈ దైర్యవంతులైన యువకుల గురించి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చకూడదు?. మనకు స్వాతంత్య్రం రావడానికి సహకరించిన స్వాతంత్య్ర సమరయోధులు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో 1999లో మన కీర్తీని పునరుద్ధరించి మన మాతృభూమికోసం పోరాడిన ఈ వ్యక్తుల గురించి విద్యార్థులు తెలుసుకోవడం అంతే ముఖ్యం" అన్నాడు విశాల్ నాయకుడిగా కూడా విక్రమ్ క్రెడిట్ తీసుకోలేదు విక్రమ్ నాయకుడిగా కూడా ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు. ఒకసారి అతను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శిస్తున్నప్పుడూ నువ్వు సాధించి గొప్ప విజయం ఏమిటంటే విజయ్ తాను ఆరుగురి వ్యక్తలతో కొండలపైకి వెళ్లాను అంతే దిగ్విజయంగా తిరిగి వచ్చానని, తన జట్టుకే క్రెడిట్ ఇచ్చేవాడు. నిజానికి అతన సహచరుల చెబుతుంటారు.. కథన రంగంలో తానే మొదట ఉండేవాడని, శత్రువు బుల్లెట్ తానే ముందు తీసుకునేవాడని. అతడే ముందుండి మమ్మల్ని నడిపించేవాడని చెబుతుంటే చాలా బాధగా ఉండేదని విశాల్ పేర్కొన్నాడు. ఇక్కడకు రావడం పుణ్యక్షేతం సందర్శించినట్లే.. ఇక చివరగా విశాల్ బాత్రా తనకు ఇక్కడకు రావడం పుణ్యక్షేత్రానికి రావడంతో సమానమని చెప్పాడు. సుమారు 1700ల నుంచి 17500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను ఎలా అధిరోహించారు, పైగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న ఇక్కడ ఎలా పోరాడారు అని అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా కఠినమైనది కూడా. నాకు అక్కడకు వెళ్లినప్పుడల్లా విక్రమ్ అక్కడ శిఖరాలను కాపలా కాస్తున్నాడని, మనోజ్ పాండే ఇప్పటికి పహారా కాస్తున్నాట్లు భావిస్తాను. అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే విక్రమ్ బాత్రా, అతని సహచర యువకులు ఒక్కొక్కరు అక్కడ కూర్చొన్నట్లు నాకు అనిపిస్తుందని అని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు విశాల్. అంతేగాదు ఈ కార్గిల్ యుద్ధం గురించి బాలీవుడ్ మూవీ షెర్షా(2021) చిత్రం తీశారు. ఈ మూవీ కారణంగా విక్రమ్ బాత్రా గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది. అందులో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒదిగిపోయాడు. (చదవండి: పాక్ కుటిల ప్రయత్నాలకు..భారత్ చెక్‌పెట్టి నేటికి 22 ఏళ్లు..!) -
కార్గిల్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
కార్గిల్ సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
కార్గిల్ సైనికులతో మోదీ దీపావళి సంబరాలు..
కార్గిల్: దీపావళి పండగను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కార్గిల్ చేరుకున్నారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని స్వీట్లు పంచిపెట్టారు. కార్గిల్‌లో ఆర్మీ సిబ్బందిని ఉద్ధేశించి మోదీ ప్రసంగించారు. ఎంతో కాలంగా జవాన్లు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. సైనికులతో కలిసి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జవాన్ల త్యాగం మరువలేదని అన్నారు. ఇంతకంటే గొప్ప దీపావళిని కోరుకోవడం లేదని తెలిపారు. ఉగ్రవాద ముగింపే దీపావళి పండగని, దాన్ని కార్గిల్ సాధ్యం చేసిందన్నారు. సైనికుల త్యాగాలు దేశం గర్వించేలా ఉన్నాయన్నారు. విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ #WATCH | "For me, all of you have been my family for years now... it's a privilege to celebrate #Diwali amid all of you," says Prime Minister Narendra Modi, while interacting with members of the Armed Forces in Kargil (Source: DD) pic.twitter.com/H47FM8byeE — ANI (@ANI) October 24, 2022 కాగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దేశ సరిహిద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కార్గిల్‌లో సైనికులతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. -
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
'ఆషిఖి' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్
'ఎల్ఏసీ' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. కార్గిల్‌లో ఉన్న వాతావరణం కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే షూటింగ్ నిలిపివేసి రెండు రోజుల క్రితం ముంబైకి వచ్చారు. ఈ విషయాన్ని రాహుల్ రాయ్ సోదరుడు రోమీర్ సేన్ ఆలస్యంగా మీడియాకు తెలిపారు. రాహుల్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడని, అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) రాహుల్ రాయ్.. 'ఆషిఖి' సినిమాతో 22 ఏళ్లకే బాలీవుడ్లో తెరంగ్రేటం చేశారు. మొదటి సినిమాతోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత పలు సినిమాల్లో తన ప్రతిభ చూపించారు. 2006లో హిందీ బిగ్‌బాస్ మొదటి సీజన్ టైటిల్‌ను సైతం ఆయన కైవసం చేసుకున్నారు. పలు టీవీ షోలలోనూ ప్రత్యేక అతిథిగా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన 'ఎల్ఏసీ- లైవ్ ద బాటిల్ ఇన్ కార్గిల్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. (చదవండి: 26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’) -
నేలకొరిగిన సిక్కోలు వీరుడు
యుద్ధభూమిలో సిక్కోలు వీరుడు నేలకొరిగాడు. దేశ రక్షణ కోసం పాటు పడుతూ ప్రాణాలు విడిచాడు. ముష్కరులు పెట్టిన బాంబులు గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో.. ఒక బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడి కన్ను మూశాడు. పదిహేడేళ్ల కిందట ఆర్మీలో చేరిన ఈ అధికారి ఎందరో యువకులకు ప్రేరణగా నిలిచారు. బాంబులు నిరీర్యం చేసే పనిలో బిజీగా ఉన్నానని ఉదయమే భార్యాబిడ్డలకు గర్వంగా చెప్పారు. అలా చెప్పిన కొన్నిగంటలకే ఆ వీరుడి అస్తమయం జరిగింది. శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు (37) వీరమరణం పొందారు. కార్గిల్ సమీపంలోని గల్వా న్కు 100 కిలోమీటర్ల దూరంలో శనివారం బాంబులు నిరీర్యం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలిపోవడంతో ఉమామహేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స ప్రారంభించిన అర్ధగంటలోనే మృతి చెందారు. 1983లో జని్మంచిన ఉమామహేశ్వరరావు 2003, మార్చి నెలలో సైన్యంలో చేరారు. ఇప్పటివరకు 17 ఏళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని మరో రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండగా ప్రమాదంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు, బంధు వులు, స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 20న లాక్డౌన్ ప్రకటించే వారం రోజుల ముందు వరకు ఉమామహేశ్వరరావు సెలవుపై వచ్చి భార్యా పిల్లలతో శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ తర్వాత సైనిక అధికారుల నుంచి పిలుపురావడంతో బయల్దేరి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాంబులను వెతుకుతున్నప్పుడు తీసిన ఫొటోలను కూ డా భార్యాపిల్లలకు వాట్సాప్ ద్వారా పంపించారు. తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం లొకేషన్ కూడా షేర్ చేశారు. పిల్లలు, భార్యతో మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పగా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయంపై ఆదివారం ఉదయం హడ్కో కాలనీలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉమామహేశ్వరరావుకు భార్య నిరూష (32), పదేళ్లు, నాలుగేళ్లు వయసు కలిగిన వైష్ణవి, పరిణితి అనే కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో వీరు కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మృతదేహం నగరానికి చేరుకునే వీలున్నట్టు తెలుస్తోంది. గర్వంగా ఉన్నా... ఆందోళనగా ఉంది తన భర్త దేశ రక్షణ కోసం పోరాడుతూ ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉన్నా చిన్న వయస్సు కలిగిన పిల్లలు ఉండడంతో ఆందోళనగా ఉందని వీరమరణం పొందిన ఉమామహేశ్వరరావు భార్య నిరూష ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలో పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా ఈలోగా ఇలా దురదృష్టకర సంఘటన జరగడం బాధిస్తోందని చెప్పారు. 2003లో తన మేనమామ అయిన ఉమామహేశ్వరరావు ఆరీ్మకి వెళ్తున్నప్పుడు చాలామంది ఆర్మీలో చేరడానికి భయపడుతుండేవారని, తాను వెళ్లిన తర్వాత తమ ప్రాంతం నుంచి ఎందరో యువకులు సైన్యంలో చేరి దేశం కోసం పోరాడుతున్నారన్నారు. వీరిలో సగం మందికి తన భర్త ఉమామహేశ్వరరావు స్ఫూర్తి అని గర్వంగా చెప్పా రు. శనివారం ఉదయం తనతోను, పిల్లలతోను కొద్దిసేపు మాట్లాడి త్వరలోనే వస్తానని చెప్పారని, పిల్లల కోరిక మేరకు విధుల్లో ఉన్న ఫొటోలను కూడా పంపించారని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. -
లోయలో ఇంటర్నెట్ ఎప్పుడు?
శ్రీనగర్: లద్దాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో 145 రోజుల తర్వాత శుక్రవారం మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం కాగా కశ్మీర్ లోయలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మోదీ నేతృత్వంలోని కేంద్రసర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇప్పటికే 145 రోజులవుతోంది. గత నాలుగు నెలల నుంచి కార్గిల్‌లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగనందున అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సేవలను దుర్వినియోగం చేయొద్దని అక్కడి మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం ఆగస్ట్ 5న ఆర్టికల్–370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసినప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్లో గత 145 రోజులుగా డిజిటల్ బ్లాకవుట్ కొనసాగుతుండగా ఇది ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతోందో తెలియదు. సమీప భవిష్యత్తులో సేవలను పునఃప్రారంభించే సూచనలు కూడా కనిపించడం లేదు. -
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వనున్న ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ పదవి ఏర్పాటుకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఓకే చెప్పింది. కార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సీడీఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీడీఎస్‌గా నియమితులయ్యే వారు నాలుగు నక్షత్రాలతో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని, త్రివిధ దళాధిపతులతో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు. సీడీఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు, బాధ్యతలపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికనూ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదించిందని అధికారులు తెలిపారు. తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్? దేశ రక్షణ రంగానికి తలమానికంగా చెప్పుకునే సీడీఎస్ పదవికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 31న రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌కానున్నారు. సీడీఎస్ హోదా త్రివిధ దళాల అధిపతులకు సమానంగా ఉంటుందని, ప్రోటోకాల్ ప్రకారం ఆయన త్రివిధ దళాల కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని అధికారులు వివరించారు. ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం అందుకు తగిన ఏర్పాట్లు చేయడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. రూ. 6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన ఐదేళ్లపాటు ఏడు రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అటల్ భూజల్ (అటల్ జల్) పథకాన్ని రూ. 6 వేల కోట్లతో అమలు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు నిధులు: స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు గాను అదనంగా రూ. 1854.67 కోట్లను మంజూరు చేసేందుకు అంగీకరించింది. దేశాన్ని అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలుగా పర్యాటక మౌలిక వసతుల స్థాపన ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌లో మొత్తం 15 సర్క్యూట్లు ఉన్నాయి. రైల్వేలో సంస్థాగత మార్పులు సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సంస్థాగత పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే విభాగానికి సంబంధించి ఎనిమిది గ్రూప్–ఏ సర్వీసులను ఏకీకృతం చేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్(ఐఆర్ఎంఎస్)గా పరిగణించాలని నిర్ణయించారు. రైల్వే బోర్డును పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇకపై రైల్వే బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసెస్‌ను ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్(ఐఆర్‌హెచ్‌ఎస్)గా మార్చనున్నారు. -
పారదర్శకతకు అసలైన అర్థం
సాక్షి, అమరావతి: ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు పారదర్శకతకు అసలైన అర్థం చెబుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. టెండర్ల విధానంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు (న్యాయపరమైన ముందస్తు పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంపై సీఎం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు ఆమోదం అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగన్నారు. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సరైన సందేశం పంపించామన్నారు. రూ.100 కోట్లు, ఆపై ఏ టెండరైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జికి పంపుతామని, ఆయన ఆదేశాలను తప్పక పాటిస్తామని ఈ ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్గిల్ అమర వీరుల త్యాగాన్ని ఈ దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది కార్గిల్ యుద్ధ అమరవీరులు చేసిన త్యాగానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారి త్యాగాన్ని, ఆ వీరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘భారతదేశ పరిరక్షణలో అమరులై కార్గిల్ యుద్ధంలో ఘన విజయం సాధించిన వీరులకు కృతజ్ఞతాంజలులను ఘటిస్తున్నాను. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ యోధుల త్యాగ నిరతిని, వీరోచిత సాహసాన్ని ఈ దేశం ఎన్నటికీ మరువదు’ అని జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. -
కార్గిల్‌లో అమానవీయ ఘటన
-
వైరల్ : హార్ట్ బ్రేకింగ్ వీడియో..!
న్యూఢిల్లీ : కార్గిల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి జనావాసాల్లోకి చొరబడ్డ ఓ ఎలుగుబంటిపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అది ఓ కొండపై నుంచి నీటి కాలువలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఎలుగు జాడ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. 8 సెకన్ల నిడివి గల ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాలు.. సమీప గ్రామంలో చొరబడ్డ ఓ ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమారు. అది వారి బారినుంచి తప్పించుకుని ఓ నీటి కాలువలోకి చేరింది. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లి గట్టుకు చేరేందుకు కొండనెక్కడం మొదలుపెట్టింది. అయితే, పైనుంచి ఓ అల్లరిమూక దానిపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో పట్టు కోల్పోయిన ఎలుగు అంతెత్తు పైనుంచి కిందపడింది. తీవ్ర గాయాలతో నీటిలో పడి కొట్టుకుపోయింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనను ఖండించారు. నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్గిల్ డిప్యూటీ కిమషనర్ బసీరుల్ హక్ చౌదరీ ఘటనపై విచారణలకు ఆదేశించారు. రాళ్లు విసిరిన వారిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని, ఎలుగు జాడ కనుగొనేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారామిచ్చామని వెల్లడించారు. -
వీరమరణానికి విలువెక్కడ?
-
22న తెరపైకి కార్గిల్
తమిళసినిమా: తమిళ సినిమా కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పవచ్చు. వినూత్న ప్రయోగాల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా ఒక సరికొత్త ప్రయోగాత్మక కథా చిత్రంగా కార్గిల్‌ను రూపొందించినట్లు ఆ చిత్రం శివాని సెంథిల్ పేర్కొన్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 22న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒకే ఒక్క నటుడు నటించిన చిత్రం కార్గిల్ అని చెప్పారు. ఇందులో జిష్ణు అనే నటుడు హీరోగా నటించారని, ఇది ఒక కొత్త ప్రయోగం అని అన్నారు. కార్గిల్ అనగానే దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధమే గుర్తుకొస్తుందని అన్నారు. అయితే మనిషి మానసిక ప్రేమ కూడా ఒక పోరాటమేనని అన్నారు. చెన్నై నుంచి బెంగళూర్‌కు కారులో పయనించే హీరోకు ఆయన ప్రేమకు ఏర్పడే మానసిక పోరాటమే కార్గిల్ చిత్రం అని తెలిపారు. ఒకే ఒక్కరు నటించారు అంటున్నారు, మరి ప్రేయసి అంటున్నారేమిటని అడగొచ్చని, అదే ఈ చిత్రంలో ట్విస్ట్ అని అన్నారు. ప్రేమలో నమ్మకం అనేది చాలా అవసరం అన్నారు. అలాంటి నమ్మకమే ప్రేమను కలుపుతుందని చెప్పే చిత్రంగా కార్గిల్ ఉంటుందన్నారు. ఇది సరికొత్త ప్రయోగం అయినా పూర్తిగా ఎంటర్టెయినర్ చిత్రంగా ఉంటుందన్నారు. సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ సర్టిఫికెట్ ఇచ్చి, కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని ప్రశంసించారని తెలిపారు. సుభ సెంథిల్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ బాయ్ సంగీతాన్ని, గణేశ్ పరమహంస ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. -
ఆధార్ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!
చంఢీఘడ్ : హరియాణలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆధార్ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆధార్ కార్డు అడిగారని, ఆసమయంలో తన దగ్గర లేకపోవడంతో మొబైల్లోని ఆధార్ కార్డు చూపించానని, చికిత్స చేయాలని, ఒక గంటలో తీసుకొస్తానని వేడుకున్నా కూడా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై అమరజవాన్ల కుటుంబ సభ్యులు స్పందించారు. ఆధార్ లేక వైద్యం నిరాకరించడం మమ్మల్ని త్రీవంగా కలిచి వేసిందని, భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. ఆసుపత్రికి చెందని ఓ డాక్టర్ మాట్లాడుతూ.. ‘మేం ఎవ్వరి ట్రీట్మెంట్ను ఆపలేదు. ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరిని ఆసుపత్రికి తీసుకురాలేదు. ఆధార్ లేదని ఇప్పటి వరకు ఎవరికి వైద్యం నిరాకిరించలేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియకు ఆధార్ తప్పనిసరే కానీ చికిత్సకు కాదు. ఇవిన్నీ నిరాధరమైన ఆరోపణలని’ తెలిపారు. -
కార్గిల్ @మైనస్ 15.4 డిగ్రీలు
న్యూఢిల్లీ: ఉత్తర భారత్‌లో చలి గాలుల ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం కార్గిల్‌లో ఉష్ణోగ్రత మైనస్ 15.4 డిగ్రీలు, లేహ్‌లో మైనస్ 12.7 డిగ్రీలుగా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా కీలాంగ్లో మైనస్ 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 7.1కు పడిపోయింది. పంజాబ్‌లోని అదాంపూర్లోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ కనిష్టంగా 3.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హరియాణాలో హిసార్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా ముజఫర్‌నగర్‌లో 3.4 డిగ్రీలుగా నమోదైంది. -
కార్గిల్ ఒక వీరుడి పోరాటం
తమిళసినిమా: వినూత్న ప్రయత్నాలకెప్పుడూ ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ ఉంటుంది. నిజానికి ఏదో కొత్తదనం లేకపోతే సినిమా చూసే వారికి రుచించదు. అందుకే ఒకే ఒక్క పాత్రతో శివానీసెంథిల్ కార్గిల్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈయన కథ, కథనం, మాటలు సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివానీ స్టూడియోస్ పతాకంపై శుభాసెంథిల్ నిర్మించారు. ఇందులోని ఒకే ఒక్క పాత్రను జీష్ణుమీనన్ పోషించారు. గణేశ్ పరమహంస ఛాయాగ్రహణ, విఘ్నేశ్బాయ్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ బుధవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. అంతకు ముందే ప్రముఖ నిర్మాత కలైపులి కార్గిల్ ఆడియోను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కార్గిల్ కథలోనూ ఒకే రాజా ఉంటాడన్నారు. అతను చెన్నై నుంచి కారులో బెంగుళూర్ వెళుతున్న సమయంలో తన ప్రేయసీతో వివాదం కార్గిల్ పోరుగా మారడంతో అందులో రాజా పోరాడి గెలవడమే చిత్ర కథ అన్నారు. తమిళ సినిమాలో ఒకే ఒక్క నటుడు నటించిన వినూత్న కథా చిత్రం కార్గిల్ అని చెప్పారు. చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా ఉంటుందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించి బెంగళూర్‌లోని ఎలక్ట్రానిక్స్ సిటీలో ముగిసేలా తక్కువ రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కార్గిల్ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
మరో కార్గిల్ యుద్ధం రానివ్వం
ద్రాస్: కార్గిల్ లాంటి మరో యుద్ధాన్ని రానివ్వమని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ శనివారం ప్రకటించారు. దేశంలో మరోసారి యుద్ధ వాతావరణం రాకుండా సైన్యం దేశానికి రక్షణగా ఉంటుందని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 16 సంవత్సరాలైన నిర్వహిస్తున్న కార్యక్రమాలలో దల్బీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్యం ఏర్పాటు చేసిన విజయ్ దివస్ ఉత్సవాలు జూలై 20న ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ అమరులైన సైనిక వీరులకు నివాళులర్పించారు. కార్గిల్ విజయానికి గుర్తుగా కార్గిల్ వార్ మెమోరియల్ ను ప్రారంభించనున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు సైన్యం ఏర్పాట్లు చేసింది. ఆదివారం సైనిక అమరవీరులకు ప్రత్యేక సంస్మరణ, నివాళి, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు ఉంటాయి. కార్గిల్ అమర వీరుల కుటుంబాలను కలుస్తారు. అనంతరం వివిధ మత ప్రార్థనలు నిర్వహిస్తారు. సైన్యంలోని వీరనారిలతో ముఖాముఖి ఉంటుంది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య 1999 మే 8న కార్గిల్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. మనదేశంలోని లడఖ్, ఇతర సరిహద్దుల వద్ద ఉన్న వాస్తవాధీన రేఖను దాటి పాకిస్థాన్ సైన్యం మనదేశంలోకి ప్రవేశించింది. సుమారు మూడు నెలలపాటు సాగింది. చివరికి గంటలపాటు సుదీర్ఘ యుద్ధం అనంతరం భారత్ తిరిగి టైగర్‌హిల్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగింది. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జులై 26ను కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీ. ఆనాటి నుంచి ప్రతీ సంవత్సరం జులైలో కార్గిల్, ద్రాస్, జమ్మూకాశ్మీర్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారత సైనికాధికారులకు, సైనికులకు, జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నారు. -
తీవ్రవాదాన్ని పాక్ సమర్థిస్తోంది!
-
'రాజకీయ లబ్ది కోసమే అమరవీరులను ఉపయోగించుకుంటున్నారు'
కులు: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్దంలో మరణించిన అమరవీరులను మోడీ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని సోనియా విమర్శించారు. మోడీ హృదయం కేవలం అధికారం కోసమే పాకులాడుతోందని హిమాచల్ ప్రదేశ్ లోని ఓ ఎన్నికల ర్యాలీలో సోనియా గాంధీ ఆరోపించారు. రాజకీయంగా లబ్ది పొందడానికే కార్గిల్ అమర వీరులను ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి, అభివృద్ది, సంపద పెరిగేందుకు కాంగ్రెస్ పార్టీ వెంట నడువాలని ప్రజలకు సోనియా విజ్క్షప్తి చేశారు. మే 7న జరిగే ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి హిమాచల్ ప్రదేశ్ లో సోనియాగాంధీ పర్యటించారు.