'రాజకీయ లబ్ది కోసమే అమరవీరులను ఉపయోగించుకుంటున్నారు'
కులు: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్దంలో మరణించిన అమరవీరులను మోడీ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని సోనియా విమర్శించారు.
మోడీ హృదయం కేవలం అధికారం కోసమే పాకులాడుతోందని హిమాచల్ ప్రదేశ్ లోని ఓ ఎన్నికల ర్యాలీలో సోనియా గాంధీ ఆరోపించారు. రాజకీయంగా లబ్ది పొందడానికే కార్గిల్ అమర వీరులను ఉపయోగించుకుంటున్నారన్నారు.
ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి, అభివృద్ది, సంపద పెరిగేందుకు కాంగ్రెస్ పార్టీ వెంట నడువాలని ప్రజలకు సోనియా విజ్క్షప్తి చేశారు. మే 7న జరిగే ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి హిమాచల్ ప్రదేశ్ లో సోనియాగాంధీ పర్యటించారు.