నేలకొరిగిన సిక్కోలు వీరుడు  | Srikakulam Army Officer Life End In Kargil | Sakshi
Sakshi News home page

నేలకొరిగిన సిక్కోలు వీరుడు 

Published Mon, Jul 20 2020 11:06 AM | Last Updated on Mon, Jul 20 2020 11:07 AM

Srikakulam Army Officer Life End In Kargil - Sakshi

విధుల్లో ఉన్నప్పుడు- భార్యాపిల్లలతో ఉమామహేశ్వరరావు(ఫైల్‌)

యుద్ధభూమిలో సిక్కోలు వీరుడు నేలకొరిగాడు. దేశ రక్షణ కోసం పాటు పడుతూ ప్రాణాలు విడిచాడు. ముష్కరులు పెట్టిన బాంబులు గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో.. ఒక బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడి కన్ను మూశాడు. పదిహేడేళ్ల కిందట ఆర్మీలో చేరిన ఈ అధికారి ఎందరో యువకులకు ప్రేరణగా నిలిచారు. బాంబులు  నిరీర్యం చేసే పనిలో బిజీగా ఉన్నానని ఉదయమే భార్యాబిడ్డలకు గర్వంగా చెప్పారు. అలా చెప్పిన కొన్నిగంటలకే ఆ వీరుడి  అస్తమయం జరిగింది.  

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు (37) వీరమరణం పొందారు. కార్గిల్‌ సమీపంలోని గల్వా న్‌కు 100 కిలోమీటర్ల దూరంలో శనివారం బాంబులు నిరీర్యం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలిపోవడంతో ఉమామహేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స ప్రారంభించిన అర్ధగంటలోనే మృతి చెందారు. 1983లో జని్మంచిన ఉమామహేశ్వరరావు 2003, మార్చి నెలలో సైన్యంలో చేరారు. ఇప్పటివరకు 17 ఏళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని మరో రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండగా ప్రమాదంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు, బంధు వులు, స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  

మార్చి 20న లాక్‌డౌన్‌ ప్రకటించే వారం రోజుల ముందు వరకు ఉమామహేశ్వరరావు సెలవుపై వచ్చి భార్యా పిల్లలతో శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ తర్వాత సైనిక అధికారుల నుంచి పిలుపురావడంతో బయల్దేరి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాంబులను వెతుకుతున్నప్పుడు తీసిన ఫొటోలను కూ డా భార్యాపిల్లలకు వాట్సాప్‌ ద్వారా పంపించారు. తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం లొకేషన్‌ కూడా షేర్‌ చేశారు. పిల్లలు, భార్యతో మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పగా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయంపై ఆదివారం ఉదయం హడ్కో కాలనీలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉమామహేశ్వరరావుకు భార్య నిరూష (32), పదేళ్లు, నాలుగేళ్లు వయసు కలిగిన వైష్ణవి, పరిణితి అనే కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో వీరు కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మృతదేహం నగరానికి చేరుకునే వీలున్నట్టు తెలుస్తోంది. 

గర్వంగా ఉన్నా... ఆందోళనగా ఉంది 
తన భర్త దేశ రక్షణ కోసం పోరాడుతూ ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉన్నా చిన్న వయస్సు కలిగిన పిల్లలు ఉండడంతో ఆందోళనగా ఉందని వీరమరణం పొందిన ఉమామహేశ్వరరావు భార్య నిరూష ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలో పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా ఈలోగా ఇలా దురదృష్టకర సంఘటన జరగడం బాధిస్తోందని చెప్పారు. 2003లో తన మేనమామ అయిన ఉమామహేశ్వరరావు ఆరీ్మకి వెళ్తున్నప్పుడు చాలామంది ఆర్మీలో చేరడానికి భయపడుతుండేవారని, తాను వెళ్లిన తర్వాత తమ ప్రాంతం నుంచి ఎందరో యువకులు సైన్యంలో చేరి దేశం కోసం పోరాడుతున్నారన్నారు. వీరిలో సగం మందికి తన భర్త ఉమామహేశ్వరరావు స్ఫూర్తి అని గర్వంగా చెప్పా రు. శనివారం ఉదయం తనతోను, పిల్లలతోను కొద్దిసేపు మాట్లాడి త్వరలోనే వస్తానని చెప్పారని, పిల్లల కోరిక మేరకు విధుల్లో ఉన్న ఫొటోలను కూడా పంపించారని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement