army officer died
-
నేలకొరిగిన సిక్కోలు వీరుడు
యుద్ధభూమిలో సిక్కోలు వీరుడు నేలకొరిగాడు. దేశ రక్షణ కోసం పాటు పడుతూ ప్రాణాలు విడిచాడు. ముష్కరులు పెట్టిన బాంబులు గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో.. ఒక బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడి కన్ను మూశాడు. పదిహేడేళ్ల కిందట ఆర్మీలో చేరిన ఈ అధికారి ఎందరో యువకులకు ప్రేరణగా నిలిచారు. బాంబులు నిరీర్యం చేసే పనిలో బిజీగా ఉన్నానని ఉదయమే భార్యాబిడ్డలకు గర్వంగా చెప్పారు. అలా చెప్పిన కొన్నిగంటలకే ఆ వీరుడి అస్తమయం జరిగింది. శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు (37) వీరమరణం పొందారు. కార్గిల్ సమీపంలోని గల్వా న్కు 100 కిలోమీటర్ల దూరంలో శనివారం బాంబులు నిరీర్యం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలిపోవడంతో ఉమామహేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స ప్రారంభించిన అర్ధగంటలోనే మృతి చెందారు. 1983లో జని్మంచిన ఉమామహేశ్వరరావు 2003, మార్చి నెలలో సైన్యంలో చేరారు. ఇప్పటివరకు 17 ఏళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని మరో రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండగా ప్రమాదంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు, బంధు వులు, స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 20న లాక్డౌన్ ప్రకటించే వారం రోజుల ముందు వరకు ఉమామహేశ్వరరావు సెలవుపై వచ్చి భార్యా పిల్లలతో శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ తర్వాత సైనిక అధికారుల నుంచి పిలుపురావడంతో బయల్దేరి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాంబులను వెతుకుతున్నప్పుడు తీసిన ఫొటోలను కూ డా భార్యాపిల్లలకు వాట్సాప్ ద్వారా పంపించారు. తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం లొకేషన్ కూడా షేర్ చేశారు. పిల్లలు, భార్యతో మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పగా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయంపై ఆదివారం ఉదయం హడ్కో కాలనీలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉమామహేశ్వరరావుకు భార్య నిరూష (32), పదేళ్లు, నాలుగేళ్లు వయసు కలిగిన వైష్ణవి, పరిణితి అనే కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో వీరు కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మృతదేహం నగరానికి చేరుకునే వీలున్నట్టు తెలుస్తోంది. గర్వంగా ఉన్నా... ఆందోళనగా ఉంది తన భర్త దేశ రక్షణ కోసం పోరాడుతూ ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉన్నా చిన్న వయస్సు కలిగిన పిల్లలు ఉండడంతో ఆందోళనగా ఉందని వీరమరణం పొందిన ఉమామహేశ్వరరావు భార్య నిరూష ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలో పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా ఈలోగా ఇలా దురదృష్టకర సంఘటన జరగడం బాధిస్తోందని చెప్పారు. 2003లో తన మేనమామ అయిన ఉమామహేశ్వరరావు ఆరీ్మకి వెళ్తున్నప్పుడు చాలామంది ఆర్మీలో చేరడానికి భయపడుతుండేవారని, తాను వెళ్లిన తర్వాత తమ ప్రాంతం నుంచి ఎందరో యువకులు సైన్యంలో చేరి దేశం కోసం పోరాడుతున్నారన్నారు. వీరిలో సగం మందికి తన భర్త ఉమామహేశ్వరరావు స్ఫూర్తి అని గర్వంగా చెప్పా రు. శనివారం ఉదయం తనతోను, పిల్లలతోను కొద్దిసేపు మాట్లాడి త్వరలోనే వస్తానని చెప్పారని, పిల్లల కోరిక మేరకు విధుల్లో ఉన్న ఫొటోలను కూడా పంపించారని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. -
రిటైర్మెంట్తో తిరిగి వస్తానని వెళ్లి...
సాక్షి, మందస : మరో ఏడాదిపాటు మాత్రమే పని చేస్తాను.. ఇక రిటైర్మెంట్ తర్వాత వచ్చి కుటుంబంతో హాయిగా జీవిస్తానని చెప్పి వెళ్లిన రెండ్రోజులకే ఆర్మీ ఉద్యోగి మరణవార్త విన్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దసరాకు వచ్చిన ఈయన విధుల్లో చేరి రెండు రోజులైనా గడవక ముందే అందని లోకాలకు వెళ్లిపోవడంతో మండలంలోని మఖరజోల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బమ్మిడి సురేష్‌కుమార్(36) ఆర్మీ పోలీస్‌గా కోల్‌కత్తాలో పని చేస్తున్నాడు. విజయ దశమికి సెలవుపై వచ్చిన ఈయన తనకు ఏడాది మాత్రమే సర్వీసుందని, వచ్చే ఏడాది స్వగ్రామం వచ్చేస్తానని తల్లిదండ్రులు ఆనందరావు, మోహినిలకు చెప్పి విధులు నిర్వహించడానికి ఈ నెల 7న తిరిగి వెళ్లిపోయాడు. క్షేమంగా చేరానని చెప్పిన రెండు రోజులకే విధి నిర్వహణలో మరణించారని కబురు అందడంతో మృతుని కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు సురేష్ మందస ఎంపీడీవోకు స్వయాన మేనల్లుడు. మృతదేహాన్ని మఖరజోలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబీకులకు మృతదేహాన్ని అందజేయడానికి ఆర్మీ అధికారులు కూడా సహకరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దసరా పండగకు వచ్చి తిరిగి వెళ్లి మూడు రోజులకే విగతజీవిగా వస్తాడని కలలో కూడా ఊహించలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య దీపిక, కుమారుడు జితేంద్ర, కుమార్తె రూప ఉన్నారు. -
విధి ఆటలో ఓడిన కుటుంబం
మందస శ్రీకాకుళం : ఆ కుటుంబంపై విధి పగబట్టింది. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కొడుకుల ప్రాణాలు బలి తీసుకుంది. గాయపడిన చివరి కుమారుడైనా బతుకుతాడని ఆశించిన ఆ కుటుంబం ఆశలను తుంచేసింది. మందస మండలంలోని బహడపల్లి గ్రామానికి చెందిన కర్రి సోమేశ్వరరావు, మురళీ కాశీబుగ్గ నుంచి తిరిగివస్తూ, మాకన్నపల్లి జంక్షన్లో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరికి పలాస ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గాయపడిన రెండోరోజు సోమేశ్వరరావు మరణించాడు. మృత్యువుతో పోరాడిన మురళి.. ఆదివారం కన్నుమూశాడు. ఆయన ఆర్మీలో పని చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు కర్రి దేవరాజ్ సాయుధ పోరాటంలో దళ సభ్యుడిగా ఉంటూ ఎన్కౌంటర్లో మరణించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ మృతదేహాన్ని ప్రైవేటు ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు సోమవారం తీసుకువెళ్లి, పోస్టుమార్టం చేసిన అనంతరం బహడపల్లికి తీసుకువస్తారని బంధువులు చెప్పారు. -
సైనిక శిక్షణలో ప్రమాదం, ఆర్మీ అధికారి మృతి
పొఖ్రాన్: రాజస్థాన్ లోని పొఖ్రాన్ సమీపంలో ఉన్న సైనిక శిక్షణ శిబిరంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ధృవ్ యాదవ్ అనే అధికారి మృతి చెందాడు. స్ల్పింటర్ ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సైనిక శిక్షణలో భాగంగా కవాతు నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.