న్యూఢిల్లీ: ఉత్తర భారత్‌లో చలి గాలుల ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం కార్గిల్‌లో ఉష్ణోగ్రత మైనస్ 15.4 డిగ్రీలు, లేహ్‌లో మైనస్ 12.7 డిగ్రీలుగా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా కీలాంగ్‌లో మైనస్ 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 7.1కు పడిపోయింది. పంజాబ్‌లోని అదాంపూర్‌లోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ కనిష్టంగా 3.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హరియాణాలో హిసార్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా ముజఫర్‌నగర్‌లో 3.4 డిగ్రీలుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment