సాక్షి, అమరావతి: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లేక్కచేయకుండా కార్గిల్ యుద్ధంలో అసువులు బాసి విజయాన్నందించిన జవాన్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘననివాళులు అర్పించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా వారి త్యాగాలను, ధైర్యసాహసాలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.
‘దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలి మమ్మల్ని గెలిపించిన అమరజవాన్లకు నివాళులు.. కృతజ్ఞతలు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు’ అని వైఎస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం కార్గిల్‌ను ఆక్రమించుకోవడానికి దాయాదీ పాకిస్తాన్ పన్నిన కుతంత్రాన్ని తిప్పికొడుతూ... మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. నాటి కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది.
Homage and gratitude to the martyrs of Kargil war who defended the nation and led us to victory. This country will always remember the sacrifice, courage and valor of our brave soldiers.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2019
Comments
Please login to add a commentAdd a comment