
అమరవీరులు నేలకొరిగిన స్థలాలు పుణ్యక్షేత్రాల కంటే పవిత్రమైనవి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్‌ను కాపాడే నిజమైన వీరులు సైనికులేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో పాల్గొన్న మోదీ కార్గిల్ యుద్ద వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్గిల్ విజయం మన సంకల్ప విజయమని పేర్కొన్నారు. భారత శక్తి, సమర్థతకు కార్గిల్ విజయం నిదర్శనమన్నారు. అమరవీరులు నేలకొరిగిన స్థలాలు పుణ్యక్షేత్రాల కంటే పవిత్రమైనవని అన్నారు. యుద్దాలు ప్రభుత్వాలు చేయవని, దేశమంతా చేస్తుందన్నారు. ప్రతీ భారతీయుడు సైనికులకు వందనం చేస్తున్నాడని మోదీ తెలిపారు.