ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ | Celebrates 20th Anniversary Of Kargil Vijay Diwas In West Godavari | Sakshi
Sakshi News home page

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

Published Sat, Jul 27 2019 8:47 AM | Last Updated on Sat, Jul 27 2019 8:51 AM

Celabrates Kargil Vijay Diwas 20th Anniversary In West Godavari - Sakshi

మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజీ కృష్ణను సన్మానిస్తున్న దృశ్యం 

సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రపంచదేశాల్లో  భారత్‌ సైన్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పరమ విశిష్ట సేవా పురస్కార గ్రహీత, పూర్వ లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం టీబీఆర్‌ సంస్థల అధినేత తనబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక జయా గార్డెన్‌లో నిర్వహించిన  కార్గిల్‌ విజయ్‌ దివస్‌–20  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అమర్‌ జవాన్‌ స్థూపం వద్ద నివాళులర్పించారు. జాతీయజెండాను పూర్వ లెఫ్టినెంట్‌ జనరల్‌ కృష్ణ ఆవిష్కరించగామాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో టీబీఆర్‌ సంస్థల అధినేత, సైనిక సంక్షే మసంఘ రాష్ట్ర నాయకులు తనబుద్ది భోగేశ్వరరావు, సినీనటి కవిత, సైనిక సంక్షేమ సంఘ నాయకులు పి. మనోహరరాజు, కెవీఎస్‌ ప్రసాద్, బీజేపీ నాయకులు గట్టిం మాణిక్యాలరావు, టి.పద్మావతి, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement