pentapadu
-
ట్రిపుల్‌ఎఫ్ కర్మాగారంలో భారీ విస్ఫోటనం
పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ట్రిపుల్‌ఎఫ్ కర్మాగారంలో బుధవారం సాయంత్రం భారీ విస్పోటనం సంభవించింది. పరిశ్రమలో మూడంతస్తుల మేర ఉన్న ఎక్సైన్గా పిలిచే సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 9 మంది పనిచేస్తుండగా వారిలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన గుడిగంట మల్లికార్జునరావు అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు. అతడు గల్లంతైనట్టు భావిస్తున్నారు. కాగా మరో ముగ్గురు కార్మికులు తృటిలో తప్పించుకుని పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న ఇద్దరిని రాజమండ్రి తరలించినట్టు ఎస్ఐ జి.సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి విస్ఫోటనంలో దగ్ధమైన యంత్రాలను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఫోన్లో కోరారు. -
జగనన్న కాలనీలు.. ఆనందాల లోగిళ్లు
పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): పల్లెలు నూతన గృహాలతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి.. జగనన్న కాలనీలు ఊళ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. అర్హులందరికీ ఇప్పటికే స్థలాలు అందించగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ సాయం, అధికారుల ప్రోత్సాహంతో నెల రోజులుగా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో జగనన్న కాలనీలు ఆనందాల లోగిళ్లను తలపిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు మరింత ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణాల ప్రగతి భళా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 27 లేఅవుట్లను ఏర్పాటుచేశారు. మొత్తం 2,193 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,340 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే 760 ఇళ్లు పునాది దశ దాటాయి. మిగిలిన లబ్ధిదారులు కూడా నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పెంటపాడు మండలం 55 శాతం ప్రగతితో జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్‌ను రాయితీపై ఇస్తోంది. పెంటపాడు మండలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సాయం, మెటీరియల్ ఖర్చు కింద రూ.15,00,79,366 అందిం చినట్టు గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. సదస్సులతో స్ఫూర్తి గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లతో అవగాహన సదస్సులు నిర్వహించాం. దీని ద్వారా చాలా మంది పేదలు గృహనిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. వారికి గూడు సమకూరుతోంది. – ఓ.శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ, పెంటపాడు జిల్లాలో రెండో స్థానంలో.. పెంటపాడు మండలంలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాం. అవగాహన సదస్సులతో స్ఫూర్తి పొందిన లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. దీనిద్వారా 55 శాతం ప్రగతి సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచాం. – ఎ.ప్రసాద్, హౌసింగ్ డీఈ ఆన్లైన్ కాగానే బిల్లులు జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి దశల వారీగా ఆన్లైన్ కాగానే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. స్టాక్ పాయింట్ల ద్వారా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మెటీరియల్ అందిస్తున్నాం. – జయరాజు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, పెంటపాడు పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన యల్లా బాలాజీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కాగా సొంతిల్లు కలగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో వారికి గృహం మంజూరు కాగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సీఎం జగన్ దయవల్లే తమకు గూడు సమకూరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన గూడూరి పుణ్యవతి చాలా కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్థలం మంజూరు చేయడంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు అధికారులు ఆమెను ప్రోత్సహించారు. దశల వారీగా బిల్లులు మంజూరు చేయడంతో ఆమె ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగారు. సీఎం జగన్ సంకల్పంతోనే తన సొంతింటి కల సాకారమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
వివాహేతర సంబంధం: నడిరోడ్డుపై భార్యను చంపేశాడు
సాక్షి, తూర్పుగోదావరి : పెంటపాడు మండలంలో వివాహితను భర్త దారుణంగా హత్య చేశాడు. మరో వ్యక్తితో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఆమెను శుక్రవారం ఉదయం భర్త అడ్డగించి విచక్షణారహితంగా మెడపై కత్తితో నరికి చంపడం సంచలనం రేకిత్తించింది. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు చంటియ్యకు అదే మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. చదవండి: (నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్‌లో..) కొంతకాలంగా తరచూ గొడవలు పడుతున్న వీరి కుటుంబంలో సోషల్‌మీడియా చిచ్చుపెట్టింది. సోషల్‌మీడియాలో ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొమ్ము జెర్సీతో చంద్రికకు పరిచయం ఏర్పడింది. నాలుగునెలులుగా తన భర్తకు దూరంగా ఉంటున్న చంద్రిక ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో జెర్సీతో కలిసి నివసిస్తోంది. ఈ విషయంపై భార్యా, భర్తల మధ్య మరింత అగాధం ఏర్పడింది. తన భర్తను వదిలి వేరుగా ఉండాలని నిర్ణయించుకుని కుటుంబసభ్యులతో చర్చించి పెద్దల సమక్షంలో విడిపోదామనుకొంది. అదే సమయంలో గొల్లగూడెం నుంచి పెంటపాడు వైపు మోటార్‌సైకిల్‌పై వస్తున్న జెర్సీ, చంద్రికలను భర్త చంటియ్య, మరో ఇద్దరితో కలిసి అడ్డగించి వాగ్వాదానికి దిగారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!) తనతో తెచ్చుకొన్న కత్తితో చంటియ్య తన భార్యను మెడపై నరికాడు. కాగా తీవ్ర గాయాలతో చంద్రిక మృతి చెందింది. భర్తతో పాటు, మరో ఇద్దరు పరారయ్యారు. జెర్సీ పెంటపాడు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై కె. శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇన్చార్జి సీఐ ఆకుల రఘు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కొవ్వూరు ఇన్చార్జ్ డీఎస్పీ లలిత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలం వద్ద చంద్రిక తల్లిదండ్రులు కృష్ణవేణి, శ్రీనివాసరావులు తీవ్రంగా రోధించారు. చంద్రిక మృతదేహాన్ని గూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: (మళ్లీ ప్రేమలో పడ్డా) -
ముఖంపై ముసుగు వేసి.. ఊపిరాడకుండా చేసి
సాక్షి, పెంటపాడు(పశ్చిమగోదావరి) : ప్రత్తిపాడు వద్ద రైల్వే ఫోన్ కేబుల్ లైన్ మరమ్మతుల కోసం వచ్చి తిరిగి వెళుతుండగా ఓ రైల్వే సర్వీసు ఇంజినీర్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ప్రత్తిపాడులోని రైల్వే ట్రాక్, ఏలూరు కాలువ మధ్య దారిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కాళ్లు చేతులు కట్టివేసి, ముఖంపై బ్యాగ్‌ను ముసుగుగా వేసి బిగించి ఊపిరాడకుండా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బిహార్‌కు చెందిన సుజిత్ కుమార్ (42)గా పోలీసులు గుర్తించారు. పదేళ్లుగా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నాడు. మరమ్మతుల కోసం వచ్చి.. ప్రత్తిపాడు రైల్వే సిగ్నల్ వద్ద ఫోన్ కేబుల్ మరమ్మతు చేసేందుకు ఆదివారం రాత్రి సుజిత్‌కుమార్ వచ్చాడు. మరమ్మతులు పూర్తి చేసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఆకుల గోపయ్య ఇంజినీరింగ్ కళాశాల వెనుక, ఏలూరు కాలువ మధ్య దారిలో వస్తుండగా కొందరు దుండగులు అతనిని అటకాయించి అర్ధరాత్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని గడ్డిలో వేసి పరారయ్యారు. సోమవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ద్విచక్రవాహనం స్పార్క్ ప్లగ్ తీసి ఉండటం, మృతుని ఫ్యాంట్ విప్పి దానిని మోకాళ్లకు, పాదాలకు మధ్య కట్టి ఉండటం, తాళ్లతో చేతులను కట్టి ఉండటం గమనించారు. బ్యాగ్‌లో తలను పెట్టి ఊపిరాడకుండా చేసి పాశవికంగా హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. ఏలూరు నుంచి డాగ్ స్వాడ్, వేలిముద్రల కోసం క్లూస్‌టీంను రప్పించారు. డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, గూడెం, రూరల్, టౌన్ సీఐలు రవికుమార్, రఘు, పెంటపాడు ఎస్సై కె.శ్రీనివాసరావు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు డాగ్ సంఘటనా స్థలం నుంచి ప్రత్తిపాడులోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు వెళ్లి తచ్చాడింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పెంటపాడు ఎస్సై కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పోస్టాఫీస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మృతుడు సుజిత్‌కు భార్య పూనం కుమారి, కుమార్తె అనుష్కారాణి, కుమారుడు ఆయుష్మాన్రాజ్ ఉన్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
స్వగ్రామానికి సత్యవేణి మృతదేహం
గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి శనివారం కారు పడిన ప్రమాదంలో మృతిచెందిన పసల సత్యవేణి(57) మృతదేహన్ని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి తరలించారు. సత్యవేణి భర్త సోమశేఖర్ రావు మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తె నాగ ప్రణీత ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి 4 రోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి మరో ఉద్యోగం కోసం వేచి చూస్తోంది. చిన్న కూతురు వాణి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కూతుళ్ల కోసమే సత్యవేణి, సోమశేఖర్ రావు హైదరాబాద్‌కు వచ్చి పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, ఫ్లైఓవర్ ఘటనలో కృష్ణమిలాన్ రావుకు ఓవర్ స్పీడ్‌కు రూ.వెయ్యి చలానా విధించారు. -
ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రపంచదేశాల్లో భారత్ సైన్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పరమ విశిష్ట సేవా పురస్కార గ్రహీత, పూర్వ లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం టీబీఆర్ సంస్థల అధినేత తనబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక జయా గార్డెన్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్–20 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత అమర్ జవాన్ స్థూపం వద్ద నివాళులర్పించారు. జాతీయజెండాను పూర్వ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ ఆవిష్కరించగామాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో టీబీఆర్ సంస్థల అధినేత, సైనిక సంక్షే మసంఘ రాష్ట్ర నాయకులు తనబుద్ది భోగేశ్వరరావు, సినీనటి కవిత, సైనిక సంక్షేమ సంఘ నాయకులు పి. మనోహరరాజు, కెవీఎస్ ప్రసాద్, బీజేపీ నాయకులు గట్టిం మాణిక్యాలరావు, టి.పద్మావతి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పెంటపాడు మండలం పరిమెళ్లలో కోళ్ల పందాలు
-
వందే.. మందేశ్వరా..!
రాష్ట్రంలోనే రెండో శనిక్షేత్రం వల్లూరిపల్లి 103ఏళ్ల చరిత్ర 19న శనిత్రయోదశి ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు నేరుగా స్వామికి తైలాభిషేక అవకాశం శనిదోషాల నివారణకు శనీశ్వరుని పూజించడం ఆనవాయితీ. శనిత్రయోదశి నాడు ఆ స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల నమ్మిక. మన జిల్లాలోనూ వల్లూరిపల్లిలో శనీశ్వరాలయం ఉందని, అది రాష్ట్రంలోనే రెండో క్షేత్రమని మీకు తెలుసా..! ఈ క్షేత్రంలో 19న శనిత్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర మహిమ గురించి ప్రత్యేక కథనం.. పెంటపాడు : రాష్ట్రంలోనే తొలి శనీశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఉంది. రెండో ఆలయం మన జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో ఉంది. ఇక్కడి మందేశ్వరస్వామి(శనీశ్వరుడు) ఆలయానికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంభూ ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో పూజలు చేస్తే శనిదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి లింగాకర రూపంలో ఉండడం విశేషం. 1815లో నిర్మించిన ఈ ఆలయం 103 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి, మందేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, విశ్వేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రతి శనిత్రయోదశి నాడు ఇక్కడ విశేష అభిషేకాలు జరుగుతాయి. 103ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19న శనిత్రయోదశి నాడు భక్తులే స్వామిని అభిషేకించే అవకాశం ఆలయ అధికారులు కల్పిస్తున్నారు. వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు తెలిపారు. శనిదోషాలంటే.. సూర్యుడు నుంచి కేతువు వరకు నవగ్రహాల సంచారం వల్ల కొంతమందికి గ్రహస్థితి సరిగాలేకపోవడం వల్ల విచారం, దిగులు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు సరిగా ఉండవు. వీటినే శనిదోషాలంటారు. వీటి నివారణకు శనీశ్వరుని పూజించాలని పండితులు చెబుతున్నారు. శనిదోష నివారణ పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచిందని, ఇక్కడ పూజలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు. తైలాభిషేక ప్రియుడు శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడని, ఆయనను నూనెతో అభిషేకిస్తే త్వరగా కరుణిస్తాడని పండితులు చెబుతున్నారు. త్రయోదశి నాడు కాలువలో స్నానం చేసి ఆ దుస్తులను అక్కడే వదిలి కొత్త వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనాలని, లింగాకారంలో ఉన్న శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం, ఇతర పూజలు చేస్తే కుటుంబంలో సుఖశాంతులు, అష్టయిశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వివరిస్తున్నారు. ఇక్కడ పూజలు చేయించుకొన్నవారు తిరిగి మొక్కులు తీర్చుకోవడం కూడా ఆనవాయితీగా మారింది. శనిత్రయోదశి నాడు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపత్యంలో అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఆలయవంశపారంపర్య ధర్మకర్త వేదుల వెంకటేశ్, ఈఓ తల్లాప్రగడ విశ్వేశ్వరరావు వీటిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఏకైక ఆలయం జిల్లాలో ఏకైక శనీశ్వర ఆలయంగా వల్లూరిపల్లిక్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారంతో పాటు, శని త్రయోదశి రోజున జిల్లాతోపాటు, రాష్ట్రం నలుమూలల నుండి పలువురు ప్రముఖులు ఈ ఆలయానికి వస్తారు. లింగాకారంలో ఉన్న శనీశ్వరుడు ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం. ఆలయ అర్చకులు పూజ్యం వెంకటసత్యనారాయణ శర్మ ఇటీవల భక్తులు పెరిగారు మా ఊరులో శనీశ్వరుని ఆలయం ఉండడం ఆనందంగా ఉంది. నాచిన్నప్పుడు కన్నా ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరిగింది. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి స్నానాలకు గదులు, వసతికి ప్రత్యేక రూములు నిర్మిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. దెయ్యం వెంకటేశ్వరరావు, వల్లూరిపల్లి గ్రామస్తుడు -
ప్రైవేటు బస్సు, లారీ ఢీ
-
ప్రైవేటు బస్సు, లారీ ఢీ
పశ్చిమగోదావరి: జిల్లాలోని పెంటపాడు మండలంలోని ఆలంపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
పెంటపాడు : స్థానిక ప్రభుత్వ పోస్టు బేసిక్ స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన 62వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. వీరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కాగా ఈ ఎంపిక పోటీల్లో ఓవరాల్ చాంపియన్ గా విశాఖ జట్టు నిలిచినట్టు క్రీడల సమన్వయకర్త, గూడెం డీవైఈవో జి.విలియం తెలిపారు. బాలుర ఫైనల్స్‌లో కర్నూలుపై విశాఖ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో తూర్పు గోదావరిపై విశాఖ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్) తదితరులు షీల్డ్‌లు అందజేశారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు : ఎస్.భార్గవ్ (పశ్చిమ గోదావరి), ఎం.పృధ్వీ నాయక్ (కర్నూలు), ఎం.కుమార్(విశాఖ), జి.ఆనంద్ కిషోర్(కృష్ణా), డి.మనోజ్(ప్రకాశం), డి.శ్రీకాంత్(నెల్లూరు), సీహెచ్ రాజు(తూర్పు గోదావరి), ఎస్.దుర్గారావు(విజయనగరం). బాలికల జట్టు : సి.హెచ్.ఎం.ఎల్.ఎస్ శ్రీజ( పశ్చిమ గోదావరి), ఎం.రాధా ప్రశాంతి(విశాఖ), ఎం.భారతి(విజయనగరం), సీహెచ్ వెంకట దివ్య(గుంటూరు), టి.పుష్పజ్యోతి(తూర్పు గోదావరి), కె.హారికా దేవి(శ్రీకాకుళం), పి.గంగోత్రి(అనంతపురం), డి.సునంద(నెల్లూరు). వీరిని ఎమ్మెల్సీతో పాటు జెడ్పీటీసీ కిలపర్తి వెంకటరావు, క్రీడల కన్వీనర్ జి.విలియం, కార్యదర్శి పద్మ సుజాత, సర్పంచ్, ఉపసర్పంచ్లు తాడేపల్లి సూర్యచంద్రకుమారి, నల్లమిల్లి చినగోపిరెడ్డి, రీజనల్ స్పోర్ట్ కో ఆర్డినేటర్ పి.సుధాకర్ అభినందించారు. డిసెంబర్లో చత్తీస్‌గడ్‌లోని జగదల్పూర్లో జరగనున్న జాతీయ స్థాయి అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించిన జిల్లా రైస్ మిల్లర్స్ సంఘ అధ్యక్షుడు చెరకువాడ శ్రీరంగనాథరాజుకు డీవైఈవో జి.విలియం కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ క్రీడాకారుడు చింతకాయల సత్యనారాయణ, ఈశ్వర్, శ్రీనివాస్ కుమార్, మండల మానవత సంస్థ అధ్యక్షుడు తాడేపల్లి మోహన్‌రావు, గ్రామ కార్యదర్శి బాలకృష్ణ, ఏంఈవో పి.శేషు గాంధీరెడ్డి, దాసరి కృష్ణవేణి, అప్పన్న, సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
18 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
పెంటపాడు :స్థానిక ప్రభుత్వ పోస్టు బేసిక్ స్కూల్లో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు 62వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు క్రీడల కన్వీనర్ డీవైఈవో జి.విలియం స్థానిక స్కూల్లో బుధవారం ఆ వివరాలు వెల్లడించారు. ఈ పోటీలకు గాను 13 జిల్లాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. ఒకేరోజు నాలుగు గేమ్‌లు ఆడేందుకు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. క్రీడా మైదానాన్ని మెరక చేసేందుకు సహకరించి మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్‌ను అభినందించారు. గూడెం ప్రాంతంలో మొదటిసారిగా ఈ రాష్ట్రస్థాయి పోటీలు జరగనుండటం విశేషమన్నారు. ఎంఈవో పి.శేషు పాల్గొన్నారు. -
తడిసిముద్దయిన జిల్లా
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరులో స్వల్ప వర్షపాతం నమోదు కాగా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 48 మండలాల్లో వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తాడేపల్లిగూడెం 132.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తాళ్లపూడిలో 0.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. పెంటపాడులో 117.2 మి.మీ., తణుకులో 94.2, ఉంగుటూరులో 51.6, పెరవలిలో 47.8, ఇరగవరంలో 45.2, ఉండ్రాజవరంలో 41.8, ఆచంటలో 38.0, అత్తిలిలో 37.4, పోడూరులో 35.4, గణపవరంలో 35, ద్వారకాతిరుమలలో 34.2 మి.మీ వర్షం కురిసింది. పెనుగొండలో 31.8, నల్లజర్లలో 29.2, భీమవరంలో 25.8, కామవరపుకోటలో 22.8, ఏలూరులో 22.2, నిడమర్రులో 22.2, టి.నర్సాపురంలో 21.2, మొగల్తూరులో 20.4, దేవరపల్లిలో 18.8, నరసాపురంలో 18.6 మి.మీ వర్షంపాతం నమోదైంది. పాలకోడేరులో 18.2, ఆకివీడులో 18, పెనుమంట్రలో 17.2, వేలేరుపాడులో 15.2, పాలకొల్లులో 14.6, లింగపాలెంలో 13.6, ఉండిలో 13.2, వీరవాసరంలో 13.2, కుకునూరులో 12.2, బుట్టాయగూడెంలో 11.8, గోపాలపురంలో 10.4, జీలుగుమిల్లిలో 9.8, కొయ్యలగూడెంలో 8.2, కాళ్లలో 8 మి.మీ వర్షం కురిసింది. యలమంచిలిలో 7.2, నిడదవోలులో 6.2, పెదవేగిలో 5.4, దెందులూరులో 4.2, జంగారెడ్డిగూడెంలో 3.6, పోలవరంలో 2.6, చింతలపూడిలో 2.6, చాగల్లులో 1.2, పెదపాడులో 1.2, కొవ్వూరులో 1 మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 1172.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తడిసిముద్దయిన జిల్లా
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరులో స్వల్ప వర్షపాతం నమోదు కాగా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 48 మండలాల్లో వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తాడేపల్లిగూడెం 132.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తాళ్లపూడిలో 0.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. పెంటపాడులో 117.2 మి.మీ., తణుకులో 94.2, ఉంగుటూరులో 51.6, పెరవలిలో 47.8, ఇరగవరంలో 45.2, ఉండ్రాజవరంలో 41.8, ఆచంటలో 38.0, అత్తిలిలో 37.4, పోడూరులో 35.4, గణపవరంలో 35, ద్వారకాతిరుమలలో 34.2 మి.మీ వర్షం కురిసింది. పెనుగొండలో 31.8, నల్లజర్లలో 29.2, భీమవరంలో 25.8, కామవరపుకోటలో 22.8, ఏలూరులో 22.2, నిడమర్రులో 22.2, టి.నర్సాపురంలో 21.2, మొగల్తూరులో 20.4, దేవరపల్లిలో 18.8, నరసాపురంలో 18.6 మి.మీ వర్షంపాతం నమోదైంది. పాలకోడేరులో 18.2, ఆకివీడులో 18, పెనుమంట్రలో 17.2, వేలేరుపాడులో 15.2, పాలకొల్లులో 14.6, లింగపాలెంలో 13.6, ఉండిలో 13.2, వీరవాసరంలో 13.2, కుకునూరులో 12.2, బుట్టాయగూడెంలో 11.8, గోపాలపురంలో 10.4, జీలుగుమిల్లిలో 9.8, కొయ్యలగూడెంలో 8.2, కాళ్లలో 8 మి.మీ వర్షం కురిసింది. యలమంచిలిలో 7.2, నిడదవోలులో 6.2, పెదవేగిలో 5.4, దెందులూరులో 4.2, జంగారెడ్డిగూడెంలో 3.6, పోలవరంలో 2.6, చింతలపూడిలో 2.6, చాగల్లులో 1.2, పెదపాడులో 1.2, కొవ్వూరులో 1 మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 1172.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
యువకుడి మృతదేహం లభ్యం
పెంటపాడు: అదృశ్యం కేసు కట్టిన యువకుడి మృతదేహం ఉండి వెంకయ్య వయ్యేరు కాలువలో లభ్యమైనట్టు పెంటపాడు ఎస్సై గుర్రయ్య మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28న మధ్యాహ్నం నుంచి ముదునూరు గ్రామానికి చెందిన మానే సుధీర్ (23) కన్పించడం లేదని అతడి అన్న మహేష్ పెంటపాడు పోలీస్‌స్టే షన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశామని అయితే సుధీర్ మృత దేహం కాలువలో లభించడంతో అనుమానాస్పద మృతిగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం
పెంటపాడు : పెంటపాడు ఎస్టీవీఎన్ స్కూల్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన కలవపూడి పవన్‌కుమార్ (43), మరోవ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. పవన్‌కుమార్ తొడపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పెంటపాడు: పెంటపాడులో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పెంటపాడు పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన బొబ్బిలి బాలగంగాధర్‌తిలక్ (33) స్వగ్రామం కొవ్వూరు. ఎనిమిదేళ్లుగా పెంటపాడులో నివాసముంటూ వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా బాలగంగాధరతిలక్ అప్పుల బాధతో సతమతమవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం భార్యాపిల్లలను కృష్ణా పుష్కరాలకు పంపాడు. రాత్రి ఇంట్లోని గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. సమీపంలో ఉండే అతని మేనత్త తలుపు కొట్టగా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సాయంలో తలుపులు పగులకొట్టారు. మృతదేహానికి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, దుర్గ, మానస అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్సై కె.గుర్రయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
సాగునీటి కోసం గ్రామస్తుల ఆందోళన
పెంటపాడు (పశ్చిమగోదావరి జిల్లా) : పెంటపాడు మండలం మౌంజీపాడు, జెట్లపాలెం గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రహదారిపై రాస్తారోకోకు దిగారు. పంట సాగుకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్నారు. నీళ్లు వదులుతామని హామీ ఇచ్చే వరకు అధికారులను విడిచిపెట్టేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అడిగితే..వంతులవారీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో 3 రోజులు ఆగాల్సి ఉందని అన్నారు. -
ఒకే పెన్షన్ కోసం ఉద్యమిద్దాం
పెంటపాడు :మాజీ సైనికులు, సైనికాధికారులకు ఒకే ర్యాంక్ -ఒకే పింఛన్ సాధించేందుకు రాష్ట్రంలోని మాజీ సైనికుల సంఘం నాయకులంతా ఐక్యంగా ఉద్యమం చేయాలని జాతీయ మాజీ సైనికాధికారుల సమన్వయకమిటీ (ఎన్ఈసీసీ) తీర్మానించింది. ఎన్ఈసీసీ రాష్ట్ర సమన్వయకర్త తనబుద్ధి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో అలంపురంలో పలు జిల్లాల మాజీ సైనికాధికారుల సంఘాల ప్రతినిధుల ప్రథమ సమావేశం ఆదివారం నిర్వహించారు. భోగేశ్వరరావు మట్లాడుతూ ప్రస్తుతం రిటైర్డ అయిన సైనికులలో వ్యత్యాసాలు చూపడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. సైనికులు, సైనికాధికారులు ఏ ర్యాంకులో ఉద్యోగ విరమణ పొందినా దేశంలో అన్ని ప్రదేశాల్లో ఒకే పింఛను ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన జరగుతోందన్నారు. దానికి రాష్ట్ర సంఘం తరఫున పూర్తిమద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రం విభజన నేపథ్యంలో ఎన్ఈసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఏర్పాటు, విజయవాడలో సంఘానికి భవనం, సభ్యత్వ రుసుము తదితర విషయాలను చర్చించారు. సంఘం ప్రధానకార్యదర్శి బి.మనోహర్‌రాజు, ఉపాధ్యక్షులు వి.పట్టాభిరామయ్య, బి.ఆడమ్‌రాజు, గౌరవాధ్యక్షులు కె.నాగరాజు, సహాయకార్యదర్శులు బీఎన్ స్వామి, జి.జానకిరామ్, ఆర్.సాంబశివరావు, కె.బలరామారావు, ఎం.శంకర్రావు, ఎ.శాంతయ్య పాల్గొన్నారు. సైనిక స్థూపం వద్ద నివాళులు ముందుగా వీరు గూడెం మండలం మిలట్రీమాధవరంలోని అమర జవాన్ల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ గ్రామంలో మాజీ సైనికుల సంక్షేమం కోసం భోగేశ్వరరావు రూ. 10 వేలు అందజేశారు. తన కుటుంబం నుంచి దేశ రక్షణ కోసం ఎంతోమంది సైనికులను అందించిన లక్కాకుల ఆదిలక్ష్మిని సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆమెను వారు కొనియాడారు. ఆమె ఆరుగురు కుమారులు దేశరక్షణ కోసం పనిచేశారు. ఆమె మనుమలూ సైన్యంలో ప్రస్తుతం సేవలందిస్తున్నారు. మాధవరం మాజీ సైనికుల సంఘం సభ్యుడు బొల్లం వీరయ్య, పత్తి కృష్ణ, గోపిశెట్టి వెంకటేశ్వరావు, లక్కాకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేటి నుంచి నిట్ ప్రవేశాలు తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌లో ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నారుు. నిట్‌లో సీటు పొందిన విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, అటెస్ట్ చేసిన సర్టిఫికెట్ల ఫోటోస్టాట్ కాపీల సెట్‌ను సమర్పించాలి. 26 వరకు విద్యార్థులు చేరే అవకాశం కల్పించారు. 27న విద్యార్థులు, ఫ్యాకల్టీ పరిచయంతోపాటు తాత్కాలిక క్యాంపస్‌లో సౌకర్యాలు తదితరాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చూపిస్తారు. 28 నుంచి తరగతులు మొదలవుతాయి. పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులు విడుదల కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు ఆదివారం 5,500 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు. ఏలూరు కాలువకు 1,106, ఉండి కాలువకు 884, గోస్తనీ కాలువకి 720, అత్తిలి కాలువకు 468, నరసాపురం కాలువకు 1,774 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ‘జల్లేరు’ మంపు భూముల రికార్డుల పరిశీలన జీలుగుమిల్లి : జల్లేరు జలాశయం ముంపునకు గురవుతున్న భూముల రికార్దులను జలాశయం ప్రత్యేక డీటీ సుబ్రహ్మణ్యం, స్థానిక వీఆర్వో జోగిరిజ పరిశీలిస్తున్నారు. ముంపునకు గురైనా ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్లో తమ భూముల వివరాలు లేని రైతులు తమ రికార్డుల(దస్తావేజులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు తదితరాలు)లను స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని వారు తెలిపారు. -
ప్రమాదమని తెలిసినా.. తీవ్ర నిర్లక్ష్యం!
పెంటపాడు : ప్రమాదాలను తెలిపే సంకేతాలు, హెచ్చరికలు ఉన్నా వేగంగా మారిన మానవజీవన విధానంలో ప్రజలు వాటిని ఖాతరు చేయడం లేదు. దీనివల్ల నిత్యం రహ దారుల్లో ప్రమాదాలు చోటుకుంటున్నాయి. అనుకోకుండా జరిగే ప్రమాదాలు కొన్ని, తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో విచక్షణరహితంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రధానంగా అలంపురం వద్ద హైవేపై రోడ్డు ప్రమాద దృశ్యాలు అత్యధికంగా నమోదవున్నాయి. ఈ ప్రాంతంలో రోడ్డుదాటటం వల్లే పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాచర్ల నుంచి అలంపురం వెళ్లాలన్నా, అలంపురం, ప్రత్తిపాడు నుంచి రాచర్లమీదుగా పెంటపాడు చేరాలన్నా అలంపురం వద్ద హైవే దాటాలి. నేరుగా రోడ్డు దాటుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన అధికారులు రోడ్డు దాటకుండా ఫెన్సింగ్ వేశారు.పాదచారులతో పాటు ద్విచక్ర వాహనదారులు వాటిని లెక్కచేయకుండా రోడ్డు దాటుతూనే ఉన్నారు. ఆటోలు, ట్రాక్టర్లు రోడ్డుకు ఎదురుగా వెళ్లడం వల్ల ఇబ్బంది ఎదురవుతోంది. దీనివల్ల పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. సాధారణంగా రాచర్ల నుంచి తణుకు వెళ్లేందుకు వాహనదారులు ప్రత్తిపాడు వరకు వన్‌వేపై వెళ్లి అక్కడి నుంచి ఎడమవైపు రోడ్డు ఎక్కాలి. అంతదూరం ఎందుకులే అనుకొని ఫెన్సింగ్‌కు ఆనుకొని ఉన్న రోడ్డు డివైడర్ దాటడం వల్ల ప్రమాదం ముంచుకొస్తోంది. విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం రాచర్ల నుంచి అలంపురం హైస్కూలుకు వెళ్లేందుకు, అక్కడి నుంచి జాతీయరహదారి దాటి రాచర్ల వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరం వెళ్లి వన్‌వే దాటి రావాటంటే ఆలస్యం అవుతోందని ప్రయాణికులు అంటున్నారు. దీనిపై ప్రజలు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజలకు ఆటకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
పెంటపాడు :గూడెం-భీమవరం రోడ్డులో మంగళవారం లారీని ఢీకొనడంతో మోటార్ సైకిల్‌పై వెళుతున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలోని కొత్తగూడెంకు చెందిన వర్జిరాజు కుమారులు నవీన్, సన్ని ముదునూరులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. ఆయన భార్య విదేశంలో ఉంటున్నారు. పిల్లలను తీసుకెళ్లేందుకు రాజు తన సోదరుడు రవితో కలిసి మంగళవారం వచ్చాడు. తన అత్తమామలైన సువార్తమ్మ, అద్దంకి చినవెంకటరత్నంలతో గొడవపడి పిల్లలను బలవంతంగా మోటార్ సైకిల్ ఎక్కించుకొని కొత్తగూడెం బయలుదేరారు. గ్రామం నుంచి ఒక ఫర్లాంగు వచ్చేసరికి ముదునూరు శివారు వద్ద ఉన్న ఒక మిల్లులోకి లారీ వెళుతోంది. ఆ లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న రవికి తీవ్ర గాయాలయ్యాయి. రాజు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. నవీన్, సన్ని తలకు, కాళ్లకు, వెన్నెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. గూడెం, తణుకు నుంచి వచ్చిన అంబులెన్సులు క్షతగాత్రులను తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ రవిని అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు ముదునూరు గ్రామంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. పెంటపాడు ఎస్సై గుర్రయ్య ఆధ్వర్యంలో ఏఎస్సై నాగేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ టవర్ ఎక్కిన ఎంపీటీసీ సభ్యురాలు
పెంటపాడు : గ్రామంలో నివాసాల మధ్య ఉన్న మద్యం షాపును తొలగించాలని పెంటపాడులో మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. పెంటపాడు ఊరవు చెరువుగట్టు వద్ద గూడెం-భీమవరం రోడ్డు పక్కన మద్యం షాపు ముందు రాస్తారోకో చేశారు. నిరసనకు నాయకత్వం వహించిన వైఎస్సార్ సీపీ నాయకురాలు, ఎంపీటీసీ సభ్యురాలు పోతంశెట్టి లక్ష్మి స్థానిక గేట్ సెంటర్లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఆమె మట్లాడుతూ తాగునీటి చెరువు పక్కన ఉన్న మద్యం షాపుతో చెరువులో పడి పలువురు తాగుబోతులు మరణించారని చెప్పారు. షాపుకు సమీపంలో సాయి మందిరం, కొద్ది దూరంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుకు ఎలా అనుమతి ఇచ్చార ని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ నుంచి మద్యం షాపు ఎత్తేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు షాపును ఇక్కడినుంచి మార్చాలని తెలిపినా యజమానులు ఖాతరు చేయ లేదన్నారు. దీనిపై పంచాయతీ కూడా తీర్మానం చేసి మద్యం షాపును ఊరికి దూరంగా పంపాలన్నారు. సెల్ టవర్ ఎక్కిన లక్ష్మిని ఆందోళన విరమించాలని గూడెం ఎక్సైజ్ సీఐ సుంకర సాయి స్వరూప్ కోరారు. అధికారులు పుష్కరాల డ్యూటీలో ఉన్నారన్నారు. షాపు యజమాని ఇక్కడి నుంచి షాపును మార్చుకొనేందుకు అంగీకరించారన్నారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఏలూరు ఎక్సైజ్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. లక్ష్మి ఆందోళన విరమించారు. సీపీఐ నాయకులు కళింగ లక్ష్మణరావు పాల్గొన్నారు. -
రావోయి బంగారి మామా...
సుక్కలన్ని కొండ మీద సోకు జేసుకునే వేళ... అలా అని అతడు పాడుతూ ఈ పదాలను గొంతు నుంచి జీరగా జార్చగానే అవతల బరువెక్కిన గుండెతో కూర్చుని ఉన్న వ్యక్తి అప్రయత్నంగా నిట్టూర్పు విడిచాడు. ఆ పాట రాసిందీ, పాడి వినిపించిందీ కొనకళ్ల వెంకటరత్నం. నిట్టూర్పు విడిచింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆ పన్నీటి క్షణాన్ని నమోదు చేసింది చలం. ఆ ముగ్గురితో పాటు ఆ రసవద్ఘట్టంలో పాలు పంచుకున్న మరో కవి శ్రీరంగం నారాయణబాబు. వేదిక: నండూరి సుబ్బారావు ఇల్లు. (విశేషం ఏమిటంటే బంగారిమామా కర్త కొనకళ్ల వెంకటరత్నందీ, ఎంకిపాటల కర్త నండూరి సుబ్బారావుదీ ఒకే ఊరు. ఏలూరు). మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో... పాట కొనకళ్లదే. రావోయి బంగారిమామా... ఆ కమ్మని కలం నుంచి వచ్చినదే. కొనకళ్ల వెంకటరత్నం (1909 - 1971) స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడే అయినా కాకినాడలో చదువు అయ్యాక పోలీసుశాఖలో చేరి ఏలూరుకు బదిలీ అయ్యారు. పదవీ విరమణ వరకూ అక్కడే ఉన్నారు. కుమారుడు కూడా అక్కడే స్థిరపడటంతో చివరి వరకూ ఏలూరుతో బంధం తెగలేదు. ఆయన కుమార్తె వలివేటి నాగచంద్రావతి కథారచయిత. కొనకళ్ల ‘ప్రతోళి’, ‘బంగారిమామ’, ‘పొద్దు తిరుగుడుపూలు’ వంటి గేయకృతులేగాక మంచి కథలూ రాశారు. వాటిలో దాదాపు ఇరవై కథల వరకూ అందుబాటులో ఉన్నాయి. ‘మనిషి’, ‘వేస్ట్’, ’అపస్వరం’, ‘పెళ్లి సన్నాహం’, ‘రోడ్డు రోలరు’ ప్రసిద్ధం. స్వాతంత్య్రపూర్వపు తెలుగు సమాజాన్ని రాసిన కొనకళ్ల ఆ రోజుల క్లబ్ కల్చర్‌ని, ఫ్యాషన్ పిచ్చిని, వస్తు వ్యామోహాన్ని తన కథలలో చూపించారు. కొనకళ్ల గేయాలు కృష్ణశాస్త్రి, చలంకు చాలా ఇష్టమైనవికాగా కథలు తిలక్‌కు ప్రీతిపాత్రమైనవి. అందుకే తిలక్ ఒక చోట- అక్షర లోకంలో మీరు వారగా నిలబడి పూలు పూస్తున్నప్పుడు ఆ పక్క నుంచి వెళుతూ ఆఘ్రాణించి హాయి పొందినవాళ్లలో నేనొకణ్ణి అన్నాడు. కొనకళ్లకు పరిచయాలు, ప్రచార సంబంధాలు తక్కువ కావచ్చు. అందుకనే నండూరి రామకృష్ణమాచార్యులు వంటి వారు ‘ఆయనకు రావలసినంత పేరు రాలేదు’ అని అనుండొచ్చు. కాని ఆ తార ఏదో ఒక సరస హృదయాకాశంలో ఏదో ఒక క్షణాన తటాలున మెరుస్తూనే ఉంటుంది. స్మరణ / కొనకళ్ల వెంకటరత్నం -
తోకలు కట్ చేస్తా
పెంటపాడు, న్యూస్‌లైన్: ‘నేను చెప్పిందే మీరు వినాలి.. కార్యకర్తలు ఇంట్లో పడుకుంటే పార్టీ గెలుస్తుందా.. ఏం చేసైనా పార్టీని బతికించాలి.. త్యాగాలకు సిద్ధంగా ఉండండి.. నా ముందే కుప్పిగంతులు వేస్తారా.. మీ తోకలు కట్ చేస్తా.. ’ అంటూ టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి సీఈవోగా వ్యవహరించానంటూ పదేపదే చెప్పుకున్న చంద్రబాబు వైఖరి ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ అధికారంలోనే కొనసాగుతున్నట్టుగా నేతలు, కార్యకర్తలపై కస్సుబుస్సులాడారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ ప్రజాగర్జన అనంతరం ఆదివారం అర్ధరాత్రి వరకు స్థానిక శశి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశంలో చంద్రబాబు పైవిధంగా మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై సమీక్షించిన ఆయన అడుగడుగునా కార్యకర్తలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాలకొల్లు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల సమీక్ష సందర్భంలో కొందరు కార్యకర్తలు నిలబడి నాయకులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదని, సమైక్యాంధ్ర అంశంపై పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పాలని ప్రజలు అడుగుతున్నారని అధినేతకు నివేదించారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ సంగతి తెలుసు.. నాముం దే కుప్పిగంతులా.. తోకలు కట్‌చేస్తా.. నాతో మైండ్‌గేమ్ ఆడతారా’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీ మేనేజర్లు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిరంతరం పార్టీకోసం కష్టపడుతున్నట్టే ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఖాళీ అయ్యింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆ పార్టీ నుంచి వచ్చేవారిని టీడీపీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే మన ఉనికికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఏలూరు కు చెందిన బడేటి బుజ్జి మాట్లాడుతూ బూత్‌స్థాయి కమిటీల ద్వారా ప్రజలను కలుసుకొని టీడీపీ ప్రచార కార్యక్రమాలు వివరిస్తున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గ ఇన్చార్జి అరిమిల్లి రాధాకృష్ణ పార్టీ పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు వేగవంతం కాలేదని, ప్రజాగర్జన ఏర్పాట్లు చేయడం వల్ల ప్రచారంలో ఆలస్యమైందని చెప్పారు. తాడేపల్లిగూడెం సీటును బాపిరాజుకు ఇస్తున్నట్టు ప్రకటన చేస్తారేమోనని నాయకులు, కార్యకర్తలు ఎదురుచూడగా, బాబు ఆ ప్రస్తావనే చేయకపోవడంతో వారంతా నీరసించారు. ఆచంట, భీమవరం, ఉండి నియోజక వర్గాల నుంచి కార్యకర్తలు ఎంతమంది వచ్చారు చేతులెత్తమని చంద్రబాబు కోరగా, పదుల సంఖ్యలో చేతులెత్తారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు, మేనేజర్లతో తప్ప చంద్రబాబు సామాన్య కార్యకర్తలతో మాట్లాడకపోవడంతో నిరాశ చెందారు. సమీక్షలో రాజ్యసభకు ఎంపికైన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, చింతమనేని ప్రభాకర్, కలవపూడి శివ, టీవీ రామారావు, నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
లాభాల పంట
బీడు భూముల్లోనూ పంటల సాగు పొదుపుగా నీటి వనరుల వినియోగం ఆదర్శప్రాయం మాలీల వ్యవసాయం చింతపల్లి, న్యూస్‌లైన్: కూరగాయల సాగుతో మాలీ తెగ గిరిజనులు ఆర్థికంగా మంచి లాభాలు సాధిస్తున్నారు. ఒడిశాకు చెందిన వీరు కూరగాయలను ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. గతంలో తాము పండించిన కూరగాయలను కావళ్లతో వారపు సంతలకు తీసుకువెళ్లి విక్రయించేవారు. నేడు పెద్ద మొత్తంలో పంటలను సాగు చేసి ప్రత్యేక వాహనాల్లో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ స్థానిక గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒడిశా నుంచి 20 ఏళ్ల కిందట మాలీ గిరిజన తెగకు చెందిన సుమారు 40 కుటుంబాలు మండలంలోని చౌడుపల్లి, పెంటపాడు, జీకే వీధి మండలంలోని రింతాడ, మాలిగూడ గ్రామాలకు వలస వచ్చారు. స్థానిక గిరిజనుల నుంచి నీటి సౌకర్యం ఉన్న భూములను కౌలుకు తీసుకుని కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. క్యాబేజీ, బంగాళాదుంప, అల్లం, పచ్చిమిర్చి, టమోటా, వంగ, బెండ, కొత్తిమెర, తోటకూర, చుక్కకూర , చిలకడ, నాగలి దుంపలను సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను పొదుపుగా వాడుకోవడం వీరి సాగులో ప్రత్యేకత. స్వయం కృషితో బీడు భూములను సైతం సాగులోకి తీసుకువచ్చారు. నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచారు. ఏడాది పొడవున వివిధ రకాల కూరగాయలను పండిస్తూ వసతి గృహాలతో పాటు నర్సీపట్నం, తుని, రాజమండ్రి, అనకాపల్లి, గాజువాక వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కూరగాయలను రవాణా చేసేందుకు ఆయా గ్రామాల్లోని గిరిజనులంతా కలిసి వ్యాన్లు ఏర్పాటు చేసుకున్నారు. చిలకడ, నాగలి (పెండ్లం)దుంపలను విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఐటీడీఏ కూడా కూరగాయల సాగుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తోంది. అమ్మకం బాధ్యత మహిళలదే... స్థానిక గిరిజనుల మాదిరిగా వీరు పండించిన కూరగాయలను వారపు సంతలకు తీసుకువెళ్లి దళారులకు విక్రయించరు. సంతల్లో మహిళలే దుకాణాలు ఏర్పాటు చేసుకుని నేరుగా విక్రయిస్తుంటారు. దీంతో దళారుల చేతిలో మోసపోయే అవకాశం ఉండదని మాలీ తెగ గిరిజనులు చెబుతున్నారు.