రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
Published Sun, Nov 20 2016 10:26 PM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM
పెంటపాడు : స్థానిక ప్రభుత్వ పోస్టు బేసిక్ స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన 62వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. వీరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కాగా ఈ ఎంపిక పోటీల్లో ఓవరాల్ చాంపియన్ గా విశాఖ జట్టు నిలిచినట్టు క్రీడల సమన్వయకర్త, గూడెం డీవైఈవో జి.విలియం తెలిపారు. బాలుర ఫైనల్స్‌లో కర్నూలుపై విశాఖ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో తూర్పు గోదావరిపై విశాఖ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్) తదితరులు షీల్డ్‌లు అందజేశారు.
రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు : ఎస్.భార్గవ్ (పశ్చిమ గోదావరి), ఎం.పృధ్వీ నాయక్ (కర్నూలు), ఎం.కుమార్(విశాఖ), జి.ఆనంద్ కిషోర్(కృష్ణా), డి.మనోజ్(ప్రకాశం), డి.శ్రీకాంత్(నెల్లూరు), సీహెచ్ రాజు(తూర్పు గోదావరి), ఎస్.దుర్గారావు(విజయనగరం).
బాలికల జట్టు : సి.హెచ్.ఎం.ఎల్.ఎస్ శ్రీజ( పశ్చిమ గోదావరి), ఎం.రాధా ప్రశాంతి(విశాఖ), ఎం.భారతి(విజయనగరం), సీహెచ్ వెంకట దివ్య(గుంటూరు), టి.పుష్పజ్యోతి(తూర్పు గోదావరి), కె.హారికా దేవి(శ్రీకాకుళం), పి.గంగోత్రి(అనంతపురం), డి.సునంద(నెల్లూరు). వీరిని ఎమ్మెల్సీతో పాటు జెడ్పీటీసీ కిలపర్తి వెంకటరావు, క్రీడల కన్వీనర్ జి.విలియం, కార్యదర్శి పద్మ సుజాత, సర్పంచ్, ఉపసర్పంచ్‌లు తాడేపల్లి సూర్యచంద్రకుమారి, నల్లమిల్లి చినగోపిరెడ్డి, రీజనల్ స్పోర్ట్ కో ఆర్డినేటర్ పి.సుధాకర్ అభినందించారు. డిసెంబర్‌లో చత్తీస్‌గడ్‌లోని జగదల్‌పూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు. క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించిన జిల్లా రైస్ మిల్లర్స్ సంఘ అధ్యక్షుడు చెరకువాడ శ్రీరంగనాథరాజుకు డీవైఈవో జి.విలియం కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ క్రీడాకారుడు చింతకాయల సత్యనారాయణ, ఈశ్వర్, శ్రీనివాస్ కుమార్, మండల మానవత సంస్థ అధ్యక్షుడు తాడేపల్లి మోహన్‌రావు, గ్రామ కార్యదర్శి బాలకృష్ణ, ఏంఈవో పి.శేషు గాంధీరెడ్డి, దాసరి కృష్ణవేణి, అప్పన్న, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement